షూటర్ అనీశ్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజే భారత షూటర్లు సత్తా చాటారు. జూనియర్ పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన అనీశ్ 579 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. టీమ్ ఈవెంట్లో అన్హద్ జవాండ, అనీశ్, శాంభాజి జంజాన్ పాటిల్‌లతో కూడిన భారత బృందం 1678 పాయింట్లు సాధించి రజతం గెలిచింది.