world largest aircraft
-
ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం. సౌదీ అరేబియాలోని దమ్మమ్ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు. అంటే ప్యారిస్ నగరం విస్తీర్ణానికి ఎనిమిది రెట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి 37 విమానయాన సంస్థలు తమ విమానాలను నడుపుతున్నాయి. ఇవి తమ ప్రయాణికులను ఇక్కడి నుంచి 43 గమ్యాలకు చేరవేస్తున్నాయి. విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అతిపెద్దదే అయినా, ఇక్కడి నుంచి ఏటా రాకపోకలు జరిపే ప్రయాణికులు మాత్రం దాదాపు కోటి మంది మాత్రమే! దీనికంటే చిన్నదైన లండన్ హిత్రూ విమానాశ్రయం నుంచి ఏటా దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతుంటారు. సౌదీ అరేబియా ఇదివరకటి రాజు ఫాహద్ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్ 28 నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది. గల్ఫ్‌యుద్ధం జరిగినప్పుడు ఇది అమెరికన్ వైమానిక దళాలకు విమాన స్థావరంగా కూడా ఉపయోగపడింది. కళ్లు చెదిరే ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం విలాసవంతమైన వసతులు ఉన్నాయి. ఇందులోని పార్కింగ్ స్పేస్‌లో ఏకకాలంలో ఐదువేల కార్లు నిలిపి ఉంచడానికి తగిన సౌకర్యం ఉంది. విస్తీర్ణంలో అతిపెద్దదే అయినా, ప్రయాణికుల రద్దీలో మాత్రం ఈ విమానాశ్రయం వెనుకబడే ఉండటం గమనార్హం. -
ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. మొదటిసారిగా ఆ నగరానికి!
సాక్షి, బెంగళూరు: అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎమిరేట్స్ ఎయిర్‌బస్–ఏ380 బెంగళూరుకు నేరుగా సేవలను అందించనుంది. అక్టోబర్ 30న దుబాయ్ నుంచి వచ్చి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. 2014 నుంచి ముంబైకి సర్వీసులను అందిస్తోంది. 72.75 మీటర్ల పొడవు, 24.45 మీటర్ల ఎత్తు కలిగిన ఈ విమానంలో గరిష్టంగా 853 మంది ప్రయాణించవచ్చు. ఒకసారి 3 వేల సూట్‌కేసులను తరలించే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజూ బెంగళూరు నుంచి దుబాయ్‌కి విమానం రాకపోకలు సాగిస్తుందని ఎమిరేట్స్ సంస్థ వెల్లడించింది. ఈ విమానంలో మూడు తరగతుల (ఎకానమీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్) ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. బోయింగ్–777తో పోలిస్తే 45 శాతం అధిక మంది ప్రయాణించవచ్చు. ప్రపంచంలోని 30 విమానాశ్రయాలకు ఎయిర్‌బస్–ఏ380 తన సేవలను అందిస్తుంది. చదవండి: Wipro Salary Hikes: విప్రో ఉద్యోగులకు శుభవార్త! -
ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్!
-
ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్!
అది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. 320 అడుగుల పొడవు, రూ. 222 కోట్ల (25మిలియన్ పౌండ్ల) ఖర్చుతో రూపొందిన ఎయిర్‌ల్యాండర్-10 గాలిలోకి ఎగిరిన ఏడురోజులకే క్రాష్ ల్యాండ్ అయింది. 'ఫ్లయింగ్ బమ్' అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానం బుధవారం ల్యాండ్ అయ్యే సమయంలో సమీపంలో ఉన్న ఓ టెలిగ్రాఫ్ స్తంభాన్ని ఢీకొట్టింది. విమానం సవ్యంగా ల్యాండ్ కాకపోవడంతో కాక్‌పిట్ ధ్వంసమైంది. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, విమానం చాలా నెమ్మదిగా దిగుతూ ఉండటం వల్ల క్రాష్‌ల్యాండ్ అయినా పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే, క్రాష్‌ల్యాండ్ అయ్యే సమయంలో భూమి బద్దలైనట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం గత బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరిన సంగతి తెలిసిందే. పదిటన్నుల బరువు మోయగల ఈ అతిపెద్ద విమానాన్ని బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏవీ) రూపొందించింది. ఈ విమానం బ్రిటన్‌లోనే అతిగొప్ప ఆవిష్కరణగా రూపకర్తలు గొప్పలు చెప్పుకొన్నారు. -
ప్రపంచంలోనే అతి పే..ద్ద విమానం గాలిలో..!
లండన్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎట్టకేలకు బుధవారం గాలిలోకి ఎగిరింది. నాలుగురోజుల కిందటే ఈ విమానాన్ని తొలిసారి నడిపేందుకు ప్రయత్నించినా.. సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడలేదు. కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. ప్రపంచంలోని అతిపెద్ద విమానమైన ఎయిర్ ల్యాండర్-10 తొలిసారి ఎగురుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి.. దానిని వీక్షించారు. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్ ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్ షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవున్న ఎయిర్‌ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏవీ) రూపొందించింది.