World Literacy Day
-
‘అక్షరం’లో అధమం
దశాబ్దకాలంలో అక్షరాస్యత పెంపు అంతంతే దేశంలోనే అట్టడుగున ‘గట్టు’ నామమాత్రంగా అక్షరాస్యత పెంపు కార్యక్రమాలు నేడు 50వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మహబూబ్‌నగర్: జిల్లా ఏ రంగంలో అభివృద్ధి సాధించాలన్నా అక్షరాస్యత ముఖ్యం. పాలమూరు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత కారణంగా వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేక పోతున్నాం. అక్షరాస్యత, నైపుణ్యం కలిగిన యువత లేకపోవడం, మానవవనరుల కొరత జిల్లా అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారింది. నేటికీ అక్షరజ్ఞానం లేని ఎంతో మంది ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఉంది. అక్షరాస్యత పెంచేందుకు జిల్లాలో ప్రవేశపెడుతున్న పథకాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ప్రతి పథకం ఆరంభంలో బాగానే ఉన్నప్పటికీ తర్వాత నీరుగారుతున్న పరిస్థితి. ఫలితంగా ఇప్పటికీ దేశంలో అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా పాలమూరు అపకీర్తిని మోస్తూనే ఉంది. జిల్లాలో గట్టు మండలం 27.73శాతం అక్షరాస్యతతో దేశంలోనే చివరిస్థానంలో ఉంది. అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సాక్షరభారత్ లాంటి పథకాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. లెక్కలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయే గానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 2011లో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న మండలాలు మండలం అక్షరాస్యతశాతం గట్టు 27.73 ధరూర్ 28.19 మల్దకల్ 30.85 దామరగిద్ద 32 దౌల్తాబాద్ 34 మద్దూరు 34 అయిజ 35.95 == 2001, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అక్షరాస్యత శాతం సంవత్సరం అక్షరాస్యత పురుషులు స్త్రీలు 2001 45.83 57.87 32.83 2011 55.04 65.21 44.72 2001 నుంచి 2011 మధ్య కాలంలో జిల్లా అక్షరాస్యత పదిశాతం మాత్రమే పెరిగింది. ప్రస్తుతం మండలాల వారీగా తీసుకుంటే 60.68శాతం ఉత్తీర్ణతకు పెరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అక్షరాస్యత పెంచటం కోసం ప్రభుత్వాలు అధికమొత్తంలో నిధులను ఖర్చు చేసినప్పటికీ అనుకున్నంత లక్ష్యం సాధించలేకపోయింది. సాక్షరభారత్కు నిధుల కొరత సాక్షరభారత్ కార్యక్రమం ప్రస్తుతం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. సాక్షరభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.30కోట్లకు పైగానే ఖర్చు చేశారు. కానీ గతేడాది కాలంగా నిధులే లేకపోవడం వల్ల ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 2,458మంది గ్రామ కో–ఆర్డినేటర్లు, 59మంది మండల కో–ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వయోజన విద్యాకేంద్రం ఉంది. 2010నవంబర్ నుంచి కొనసాగుతున్న సాక్షరభారత్ కేంద్రాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, ఏడాదికాలంగా కో–ఆర్డినేటర్లకు జీతాలు చెల్లించకపోవడం వల్ల కేంద్రాలు అసలు తెరుచుకునే పరిస్థితి లేదు. 2015 సాక్షరభారత్ సర్వే ప్రకారం జిల్లాలో 15,52,774 మంది 15ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు ఉన్నారు. సాక్షరభారత్ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఆరేళ్లలో 6,29,327మందిని అక్షరాస్యులుగా మార్చినట్లు వయోజన విద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా అక్షరాస్యత పెంపు కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే అట్టడుగున గట్టు అక్షరాస్యత పరంగా దేశంలోనే అత్యంత వెనకబడిన మండలంగా గుర్తింపు పొందిన గట్టులో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన అక్షరాస్యతపరంగా అభివృద్ధి సాధించడం లేదు. సుమారు 78వేల మంది జనాభా ఉన్న ఈ మండలంలో అధికశాతం నిరుపేద కుటుంబాలకు చెందినవారే. బడిఈడు పిల్లలను కొందరు పశువులు, గొర్రెలు మేపేందుకు పంపిస్తున్నారు. 2001లో గట్టు అక్షరాస్యత 22.5శాతంగా నమోదైంది. 2011 నాటికి 27.73శాతం అక్షరాస్యత గట్టులో ఉంది. ధరూర్ మండలం 28.19శాతం, మల్దకల్ 30.85, దామరగిద్ద 32శాతం, దౌల్తాబాద్, మద్దూరు 34శాతం, అయిజ 35.95 శాతం అక్షరాస్యతతో జిల్లాలో అట్టడుగున ఉన్నాయి. 6వేలకు పైగా బడిఈడు పిల్లలు బడి బయట ఉన్నారు. ఇప్పటికైనా అక్షరాస్యత పెంపుపై దృష్టిసారిస్తేనే జిల్లా అక్షరాస్యత పరంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. అందరి భాగస్వామ్యంతో అక్షరాస్యత పెంపు కార్యక్రమం.. జిల్లాలో అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వం వినూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పీయూ విద్యార్థులు, డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ యూనిట్లు, శ్రమశక్తి సంఘాలు ద్వారా డీఆర్డీఏ ఆధ్వర్యంలో వయోజనులను అక్షరాస్యులు చేసే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. అదేవిధంగా 8, 9వ తరగతుల విద్యార్థులు వారి అమ్మానాన్నలకు చదువు చెప్పేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో కార్యక్రమం అమలు చేయనున్నాం. – వీరభద్రరావు, డీడీ, వయోజన విద్య -
‘సాక్షరం’ సగమే..!
మోర్తాడ్/బాల్కొండ : సంపూర్న అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. తొలుత అక్షర కిరణం, తర్వాత నిరంతర విద్యా కేంద్రాల ద్వారా వయోజనులకు విద్య తదితర కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత సాక్షర భారత్‌ను ప్రారంభించింది. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ మిషన్ ఐదు విడతలుగా కొనసాగింది. ఆరో విడతపై సందిగ్ధం నెలకొంది. అయితే, సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొనడంతో లక్ష్యానికి అనుగుణంగా అక్షరాస్యత శాతం వృద్ధి చెందడం లేదు. జిల్లాలో ఇప్పటికీ అక్షరాస్యత శాతం 61.25 శాతం మాత్రమే. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయడంతో మైనర్లలో నిరక్షరాస్యత శాతం తగ్గింది. అయితే నిరక్ష్యరాసులలో ఎక్కువ మంది వయోజనులే ఉన్నారు. నిరక్షరాస్యుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండగా, పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో పురుషుల అక్షరాస్యత 71.47 శాతం కాగా, మహిళల్లో 51.54 శాతంగా నమోదైంది. మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటంతో వారిలో అక్షరాస్యతను పెంచడానికి సాక్షరభారత్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతీ గ్రామంలో కేంద్రాలు ఏర్పాటు చేసి, నిరక్షరాస్యత శాతం తగ్గించాలని భావించారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి గ్రామానికి ఇద్దరు కో–ఆర్డినేటర్లను నియమించారు. ప్రతి కో–ఆర్డినేటర్ ఒక్కో దశలో కనీసం 50 మందికి చదువు చెప్పాల్సి ఉంది. కాగా రాత్రిపూట ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోవడం, పొద్దంతా పని చేసి అలసిపోయి ఉండటంతో నిరక్ష్యరాసులు చదువుపై ఆసక్తిని చూపలేక పోతున్నారు. నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి, వారిని చదువుకొనేలా ప్రోత్సహించే ప్రయత్నాలు పెద్దగా కనిపించట్లేదు. దీంతో అక్షరాస్యత శాతం వృద్ధి చెందలేకపోతుంది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు చొరవ తీసుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తే కొంతలో కొంతైనా మార్పు వచ్చే అవకాశముంది. సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశగా ఇకనైనా చకచకా అడుగులు వేయాల్సి ఉంది. మండలాల వారీగా అక్షరాస్యత శాతం.. మండలం పురుషులు మహిళలు మొత్తం ఆర్మూర్ 78.39 57.84 67.87 బాల్కొండ 72.62 51.64 61.61 బాన్సువాడ 70.51 53.13 61.42 భీమ్‌గల్ 72.85 50.16 61.14 భిక్కనూర్ 70.42 47.16 58.47 బిచ్కుంద 63.53 43.29 53.36 బీర్కూర్ 63.02 42.23 52.28 బోధన్ 74.38 60.25 67.31 ధర్పల్లి 68.72 45.29 56.40 డిచ్పల్లి 71.44 49.88 60.29 దోమకొండ 71.86 48.16 59.74 గాంధారి 60.03 37.24 48.66 జక్రాన్‌పల్లి 72.93 48.98 60.49 జుక్కల్ 59.39 41.08 50.40 కామారెడ్డి 82.29 63.20 72.56 కమ్మర్పల్లి 68.12 45.23 56.29 కోటగిరి 65.60 49.02 57.10 లింగంపేట్ 60.92 37.30 48.68 మాచారెడ్డి 63.42 41.11 51.88 మద్నూర్ 65.99 47.48 56.85 మాక్లూర్ 71.81 48.06 59.31 మోర్తాడ్ 70.05 48.64 58.91 నాగిరెడ్డిపేట్ 62.89 38.65 50.16 నందిపేట్ 69.50 46.13 57.21 నవీపేట్ 69.36 49.85 59.38 నిజామాబాద్ 81.54 66.24 73.81 నిజాంసాగర్ 63.48 39.22 50.89 పిట్లం 59.87 40.68 50.09 రెంజల్ 67.64 51.95 59.73 సదాశివనగర్ 69.17 44.13 56.30 సిరికొండ 64.41 43.09 54.27 తాడ్వాయి 63.82 42.29 52.58 వేల్పూర్ 73.26 49.42 60.63 వర్ని 66.23 47.45 56.58 ఎడపల్లి 69.86 52.55 60.91 ఎల్లారెడ్డి 68.87 46.03 57.10 మొత్తం 71.47 51.54 61.25 నిర్వహణ గాలికి.. సాక్షర భారతి కేంద్రాల నిర్వహణ గాలికొదిలేశారు. జిల్లా వ్యాప్తంగా 718 వయోజన కేంద్రాలు ఉన్నాయి. 1436 గ్రామ కో–ఆర్డినేటర్లు, 36 మంది మండల కో–ఆర్డినేటర్లు ఉన్నారు. రెండేళ్లుగా కేంద్రాల నిర్వహణకు చిల్లీ గవ్వ కూడా విదిల్చలేదు. వయోజన కేంద్రాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే క్రమంలో న్యూస్ పేపర్ తప్పకుండా వేయించాలి. అయితే, రెండున్నరేళ్లుగా ప్రభుత్వం పేపర్ బిల్లు చెల్లించట్లేదు. దీంతో చాలాచోట్ల పేపర్ వేయించడమే మానేశారు. మరోవైపు కో–ఆర్డినేటర్లకు గతేడాది అక్టోబర్ నుంచి వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లపైనే కేంద్రాల నిర్వహణ భారం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నింటిలో వినియోగించుకుంటూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాల అమలులో సాక్షర భారతి గ్రామ కో–ఆర్డినేటర్లను వినియోగించుకుంటున్నారు. జీవో నెం.203 ప్రకారం సాక్షర భారతి కో–ఆర్డినేటర్లు పూర్తి స్థాయి కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగులు అని పేర్కొన్నారు. కానీ, వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించేవి ఏవీ కూడా అమలు చేయడం లేదు. హరితాహరంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగానే వీరినే వినియోగించుకున్నారు కానీ ఎలాంటి గుర్తింపు నివ్వలేదు. ‘ఆరో విడత’పై సందిగ్ధం సాక్షర భారతి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఐదు విడతలుగా కార్యక్రమాలు నిర్వహించారు. 6వ విడత కోసం నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేశారు. కానీ పుస్తకాల పంపిణీ కాని, నిర్వహణ కానీ లేకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమవుతుందో.. లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15న నుంచి సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. మండలాల వారీగా తిరుగుతు కో–ఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాక్షరభారతి కేంద్రాల నిర్వహణతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కో–ఆర్డినేటర్ల డిమాండ్ చేస్తున్నారు. 11 నెలల వేతనాలు రాలేదు.. 11 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రామ కో–ఆర్డినేటర్ల కు ఎలాంటి పని చెప్పలేక పోతున్నాం. వెంటనే వేతనాలు మంజూరు చేయాలి. – శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వచ్చినవి విడుదల చేయట్లేదు.. 11 నెలల వేతానల్లో రెండు నెలల వేతనాలు మంజూరయ్యాయి. కానీ ఆ వేతనాలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అసలు చెల్లిస్తారో లేదో కూడా తెలియడం లేదు. – శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించట్లేదు సాక్షర భారతి కో–ఆర్డినేటర్లను పూర్తి స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు. అన్ని పథకాల అమలులో మా సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. – శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు -
చదువుతోనే సంపూర్ణ అక్షరాస్యత
ఆదిలాబాద్ అర్బన్ : అందరూ చదువుకుంటేనే సంపూర్ణ అక్షరాస్యత సాధించవచ్చని కలెక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం సాక్షరభారత్, జన్ శిక్షణ సంస్థాన్(ఎన్జీవో) ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా విద్యార్థులు, అధికారులు సాక్షరభారత్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. వయోజన విద్య ద్వారా, కస్తూరిబా బాలికా విద్యాలయాల ద్వారా డ్రాపౌట్ పిల్లలకు విద్యను అందించుట, సాధారణ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించుట వంటివి చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరిస్తే అక్షరాస్యత సాధనలో మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ చదువు రాని వారికి చదువు చెప్పాలని కోరారు. మహిళల అక్షరాస్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతో ప్రజలందరిలో జాతీయ భావం పెరుగుతుందని అన్నారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, వయోజన విద్య ఉప సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి, జన శిక్షణ సంస్థాన్ కార్యదర్శి సురేందర్, సభ్యులు రాజేశ్వర్, గంగాధర్, అలీబాన్, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల యజమానులు పాల్గొన్నారు. -
సంపూర్ణ అక్షరాస్యత స్వప్నమేనా..!
- వందశాతం చేరేదెన్నడు..! - రాత్రి బడులు తెరిచినా లాభం లేకపాయే - ‘సాక్షర భారత్’ వచ్చినా అందరికీ సదువు రాకపాయే - జిల్లా అక్షరాస్యత శాతంలో మహిళల వెనుకంజ - నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం మోర్తాడ్ :నగరాలు, పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో సరైన సహకారం లేకపోవడంతో సాధ్యం కావడం లేదు. నిరక్ష్యరాస్యతను తగ్గించి అక్షరాస్యుల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 8 నుంచి సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ప్రతిఏడాది సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించడం తప్పా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ఘనతను మాత్రం చాటుకోలేకపోతున్నాం. నిరక్షరాస్యుల్లో మహిళలే అధికం జిల్లాలో 85.88 శాతం అక్షరాస్యులు ఉన్నట్లు అ ధికారుల రికార్డులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నిరక్ష్యరాసుల సంఖ్య తగ్గలేదన్న విష యం స్పష్టమవుతోంది. జిల్లాలో పురుషుల్లో కంటే మహిళల్లోనే నిరక్షరాస్యుల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో మహిళల అక్షరాస్యత 50శాతం లో బడి ఉంది. 13మండలాల్లో మాత్రమే మహిళ లు 50 శాతానికి పైగా అక్షరాస్యత సాధించారు. మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచడానికి సాక్షరభారత్ కేంద్రాలకు అనుబంధంగా బోధకుల ను నియమించారు. అయినా అక్షరాస్యత శాతం పెరగడం లేదు. క్షేత్రస్థాయిలో అక్షరాస్యత కా ర్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయక పో వడంతోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాలేక పోతుంది. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, బాల్కొండ, ఎడపల్లి, బాన్సువాడ, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, మద్నూర్, కోటగిరి, రెంజల్ మండలాల్లో మిహ ళా అక్షరాస్యత 50 శాతంకు పైగా ఉంది. మిగిలిన వేల్పూర్, దోమకొండ, మాక్లూర్, భిక్కనూర్, నవీపేట్, వర్ని, మోర్తాడ్, ఎల్లారెడ్డి, నందిపేట్, కమ్మర్పల్లి, సదాశివ్‌నగర్, ధర్పల్లి, సిరికొండ, బిచ్కుంద, పిట్లం, మాచారెడ్డి, తాడ్వాయి, బీర్కూర్, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట్, జుక్కల్, గాంధారి, లింగంపేట్ మండలాల్లో మహిళా అక్షరాస్యత 50 శాతంకు తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలను పరిశీలిస్తే అతి తక్కువగా లింగంపేట మండలంలో మహిళ అక్షరాస్యత శాతం 37.11 గా ఉంది. ఇదే మండలంలో పురుషుల అక్షరాస్యత శాతం 48.39గా ఉంది. అక్షరాస్యతలో జిల్లాలో నిజామాబాద్ మండలం ముందంజలో ఉండగా లింగంపేట చివరి స్థానంలో ఉంది. వయోజనులే ఎక్కువ వయోజనుల్లోనే నిరక్ష్యరాసులు ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరికోసం సాక్షర భారత్ ద్వారా అక్షరాస్యత కార్యక్రమా న్ని నాలుగేళ్లనుంచి నిర్వహిస్తూనే ఉంది. గ్రా మాల్లో కో-ఆర్డినేటర్లను నియమించి వీరిని అజమాయిషీ చేయడానికి మండల కో-ఆర్డినేటర్, సూపర్వైజర్, అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్, ప్రాజెక్టు డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్లను నియమించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్ర మం అమలు పకడ్బందీగా జరగకపోవడంతో నిరక్ష్యరాసుల సంఖ్య అలాగే ఉండిపోతోంది. పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నారే త ప్పా.. అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పాలకు లు, అధికారులు క్షేత్రస్థాయిలో పథకాలను పకడ్బందీగా అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషిచేయాలని అందరూ కోరుతున్నారు.