world tuberculosis day
-
క్షయకు చెక్ పెట్టొచ్చు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్షయ నివారించదగిన వ్యాధే. సరైన చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. వాస్తవంగా 2023 నాటికే క్షయ రహిత సమాజం నిర్మాణం కావాలని ప్రభుత్వాలు భావించినప్పటికీ, క్షయ వ్యాధి గ్రస్తులు చికిత్స పొందడంలో అలసత్వం వహించడంతో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ‘నేను క్షయను నివారించగలను’ అనే నినాదంతో వ్యాధిపై ఈ ఏడాది అవగాహన కలిగిస్తున్నారు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా జరుపుతున్నారు. వ్యాప్తి ఇలా.... క్షయ వ్యాధి గ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి ద్వారా బయటకు వచ్చే వ్యాధి కారక మైక్రో బ్యాక్టీరియా ఇతరులలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. క్షయ వ్యాధి గ్రస్తులు మందులు ప్రారంభించిన రెండు వారాల తర్వాత అతని నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. లక్షణాలివే.. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలిలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. నియంత్రణ సాధ్యమే.. క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్టీఈపీ)లో భాగంగా రోగులకు ఉచితంగా మందులు అందచేస్తోంది. క్షయ రోగులు చికిత్సతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజూ రెండు గుడ్లు, పాలు, ఆకుకూరలు, చిక్కుడు, గోరు చిక్కుడు, నాన్‌వెజ్‌కి సంబంధించి కైమా వంటివి తీసుకుంటే మంచిది. క్షయకు చికిత్స పొందుతున్న వారికి పోషకాహారం కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ. 500లు ఇస్తోంది. నివారించదగిన వ్యాధే క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నివారించవచ్చు. ప్రభుత్వం మంచి మందులు సరఫరా చేస్తోంది. కొందరు రెండు, మూడు నెలలు మందులు వాడి మానేయడంతో మొండి క్షయగా రూపాంతరం చెందుతోంది. ప్రతిరోజూ పల్మనాలజీ ఓపీకి 20 నుంచి 30 మంది క్షయ వ్యాధి లక్షణాలతో రోగులు వస్తున్నారు. వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే తీసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. – డాక్టర్ కె.శిరీష, పల్మనాలజిస్టు, జీజీహెచ్, విజయవాడ -
టీబీ మహమ్మారిని తరిమి కొడదాం!
-
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! టీబీ మహమ్మారిని తరిమి కొడదాం!
ప్రపంచ జనాభాను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో టీబీ మహమ్మారి లేదా క్షయవ్యాధి ఒకటి. కోవిడ్ మహమ్మారి తరువాత టీబీ మరణాలు మరింత పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 4వేలకు పైగా టీబీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే టీబీపై అవగాహన కల్పించడంతోపాటు సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ప్రతీ ఏడాది మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుకుంటాం. గ్లోబల్ హెల్త్ క్యాంపెయిన్ భాగంగా WHO చేపట్టిన 8 ప్రధాన క్యాంపెయిన్లలో వరల్డ్ టీబీ డే కూడా ఒకటి. ప్రతీ ఏడాది మార్చి 24వ తేదీ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహిస్తారు. గ్లోబల్‌గా 2012 సంవత్సరంలో, మొత్తం 8.6 మిలియన్ల మంది టీబీ బారిన పడగా, 1.3 మిలియన్ల మంది మరణించారు. టీబీ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాయి. డాక్టర్ రాబర్ట్ కోచ్ 1882లో TBకి కారణమయ్యే బాసిల్లస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ను కనుగొన్నట్లు ప్రకటించిన తేదీకి గుర్తుగా, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవాన్ని జరుపుకుంటాం అయితే క్షయవ్యాధికి పూర్తి నివారణ ఉన్నప్పటికీ, సరైన అవగాహన, చికిత్స తీసుకోకపోవడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వేధించిన కరోనా తరువాత టీబీ ముప్పు మరింత పెరిగింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈ మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘‘టీబీని అంతం చేయడానికి పెట్టుబడులు పెట్టండి, ప్రాణాలను కాపాడండి’’ అనే థీమ్‌తో 2022 ప్రపంచ టీబీ డే నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. టీబీని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాల ఫలితంగా 2000 సంవత్సరం నుండి సుమారు 66 మిలియన్ల మంది ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే ఈ పోరాటాన్ని, ఇన్నేళ్ల పురోగతిని కోవిడ్-19 మహమ్మారి తారు మారు చేసింది. దశాబ్దంలో తొలిసారిగా, 2020లో టీబీ మరణాలు మళ్లీ పెరిగాయి. ఊపిరితిత్తులకు మాత్రమే టీబీ వస్తుందా? టీబీ వ్యాధి సాధారణంగా ఊపిరితిత్తులను పట్టి పీడించేది అయినప్పటికీ లింఫ్ నోడ్ టీబీ అంటే మెడ చుట్టూ ఉన్న లింఫ్ గ్రంథులకు, వెన్నెముక, మెదడు, గుండెకు, ఎముకలకు, కీళ్లకు ఇలా శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. ఇరుకైన జీవన పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, పారిశుధ్యం లోపం, అవగాహనా లేమి ప్రధానంగా పేదరికం లాంటి కారణాలు టీబీ వ్యాప్తికి కారకాలు. సాధారణంగా కనిపించే లక్షణాలు క్షయవ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అంటే కనీసం 3 వారాల పాటు తీవ్రమైన దగ్గు , దగ్గినపుడు కఫంతోపాటు రక్తం కనిపించడం మరో ప్రధాన లక్షణం. దీంతోపాటు చలితో కూడిన జ్వరం, ఆకలి మంద గించడం, బరువు తగ్గడం ఇతర లక్షణాలున్నపుడు టీబీ వ్యాధిగా అనుమానించి తగిన వైద్య పరీక్షలు చేయించు కోవాలి. అలాగే రాత్రి పూట చెమటలు ఎక్కువగా పట్టడంతోపాటు, ఛాతీ నొప్పిగా ఉంటే అప్రమత్తం కావాలి. సుదీర్ఘ కాలం కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, మూర్ఛలు, తలనొప్పి వేధిస్తున్నా వైద్యడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే 100 శాతం నివారణ సాధ్యం. ఏ రకమైన టీబీ సోకింది అనేదానిపై చికిత్స అధారపడి ఉంటుంది. లేటెంట్ టీబీవేరియంట్కు యాంటీ బయాటిక్స్, యాక్టివ్ TB సోకినవారు దాదాపు తొమ్మిది నెలల పాటు పలు రకాల మందులను వాడాలి. ఒకవేళ డ్రగ్-రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని టీబీ అని తేలితే వారికి ప్రత్యేక చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. -
పాతికేళ్లకే టీబీ
ఒకప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎయిడ్స్ రోగుల్లో మాత్రమే టీబీ లక్షణాలు కన్పించేవి. అయితే ప్రస్తుత వాతావరణ కాలుష్యం.. చిన్న తనంలోనే స్మోకింగ్‌కు అలవాటు పడటం, విటమిన్ డి లోపం తదితర కారణాలతో యుక్తవయసులోనే వెలుగు చూ స్తుండటంపైసర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నెల 24న ప్రపంచటీబీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు నగరాన్ని స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడా స్థానాన్ని ట్యూబరిక్లోసిస్(టీబీ)ఆక్రమించింది. నగరంలో క్షయ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో ఏటా కొత్తగా సుమారు 15 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఎయిడ్స్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, మధుమేహం తర్వాత అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా క్షయను పరిగణిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష మందికి పైగా ఎయిడ్స్ రోగులు ఉండగా, వీరిలో మూడొంతుల మంది టీబీతో బాధపడుతున్నట్లు ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి వైద్యుల సర్వేలో వెల్లడైంది. గతేడాది హైదరాబాద్‌లో 7 వేలు, రంగారెడ్డి జిల్లాలో 6 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉండటం విశేషం. వీరిలో 12 ఏళ్లలోపు వారు 10 శాతం ఉంటే, 25–50 ఏళ్లలోపు వారు 60 శాతం మంది ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 41, రంగారెడ్డిలో 48 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉండగా, వీటిలో చాలా చోట్ల ల్యాబ్ టెక్నిషియన్లు లేరు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఒకరి నుంచి 15 మందికి..: ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా తొమ్మిది మిలియన్ల మంది టీబీ బారిన పడుతుండగా వీరిలో సుమారు 1/3 వంతు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే టీబీ ఎక్కువ ఉన్న దేశం మనదే కావడం గమనార్హం. దేశంలో ప్రతి సెకనుకు ఒకరు టీబీ బారిన పడుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చొప్పున..రోజుకు వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ లెక్కన్న దేశంలో ఏటా మూడు లక్షల మంది టీబీతో మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఒక్కో టీబీ రోగి తను చనిపోయేలోగా మరో 15 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తున్నాడు. సంతానలేమితో బాధపడుతున్న చాలా మందిలో గర్భాశయ టీబీ కనుగొనబడుతుంది. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరి యా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది . ఇలా ఒకసారిగాలిలో కి ప్రవేశించిన బ్యాక్టీరియా 18–20 గంటల పాటు జీవిస్తుంది. ప్రతి వ్యక్తికి టీబీ ఉన్నా, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే అది బయట పడుతుంది. మనిషి శరీరంలో ఎంత కాలమైనా ఇది జీవిస్తుంది. శీతల గదిలో 8–10 రోజులు జీవిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుంది. లక్షణాలు ఇలా గుర్తించవచ్చు ♦ సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం. ♦ ఆకలి, బరువు తగ్గడం, నీరసం,ఆయాసం, ఛాతిలో నొప్పి ఉంటుంది. ♦ తెమడ పరీక్ష ద్వారా వ్యాధినినిర్ధారిస్తారు. ♦ ఆరు మాసాలు విధిగా మందులువాడాలి. ♦ బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. ♦ బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి. ♦ వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పహ కలిగి ఉండాలి.– డాక్టర్ రమణప్రసాద్, కిమ్స్ -
క్షయ నిర్మూలిద్దాం
జిల్లావ్యాప్తంగా 8 టీబీ కేంద్రాలు ఆదిలాబాద్, కాగజ్‌నగర్, జైనూర్, మందమర్రి, జన్నారం, బోథ్, చెన్నూరు, నర్సాపూర్(జి)లలో ఉన్నాయి. ఈ యూనిట్లలో రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందిస్తారు. వీటిల్లో 39 తెమడ పరీక్ష విభాగాలు ఉన్నాయి. తెమడ పరీక్ష కేంద్రాల్లో రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. ఒకవేళ ఈ కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలతో పూర్తిస్థాయిలో రిపోర్ట్ రాకపోతే జిల్లా కేంద్రంలోని క్షయ నివారణ కేంద్రానికి కేసులు పంపిస్తారు. అక్కడ వారికి తగిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. టీబీ అనగా..? క్షయ(టీబీ) ఒక అంటు వ్యాధి. ఇది స్త్రీ పురుషులకు ఏ వయసులోనైనా సోకవచ్చు. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీనినే శ్వాసకోశ క్షయ అంటారు. లక్షణాలు రెండు వారాలకు మించి ఎడతెరపి లేని దగ్గు. సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి తగ్గటం, ఛాతీ నొప్పి, బరువు తగ్గటం, తెమడలో రక్తం పడడం వంటివి జరిగితే అది టీబీ లక్షణంగా గుర్తించవచ్చు. ఎలా సోకుతుంది..? టీబీ సూక్ష్మక్రిముల ద్వారా సంక్రమిస్తుంది. టీబీ వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడు గాని టీబీ క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లుగా వెళ్తాయి. ఈ తుంపర్లు ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వారికి టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ సోకిన వారికి టీబీ వచ్చే అవకాశం ఎక్కువ. నిర్ధారణ ఉదయం, సాయంత్రం రెండుసార్లు తెమడ పరీక్షలు చేయించాలి. ఒకవేళ రెండుసార్లు పరీక్షలు నెగెటివ్ అయితే రోగి ఎక్స్‌రే తీయించుకోవాల్సి ఉంటుంది. నయం చేయవచ్చు ప్రత్యక్ష పర్యవేక్షణ స్వల్పకాలిక చికిత్స(డాట్స్) ద్వారా క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ వ్యాధి నుం చి విముక్తి పొందవచ్చు. ఈ మందులు, చికిత్స సౌకర్యా లు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందవచ్చు. కొత్తగా గుర్తించిన రోగుల చికిత్స కాలం 6 నుంచి 7 మా సాలు ఉంటుంది. సరిగా మందులు వాడకపోతే వ్యాధి ముదిరినవారికి, ఒకసారి నయమై మళ్లీ వ్యాధి సోకిన వారికి 8 నుంచి 9 నెలలు చికిత్స పొందాల్సి ఉంటుంది. టీబీ వచ్చిన వారికి వారానికి మూడు రోజులు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో లేక, మంగళ, గురు, శనివారాల్లో మందులు తప్పనిసరిగా వాడాలి.