World Wildlife Fund
-
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
-
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
World Wildlife Day Special: ‘‘మా బతుకు మేం బతుకుతున్నాం. మా సరిహద్దుల్లోకి వచ్చేది మీరు. అనవసరంగా మమ్మల్ని బలిగొనేదీ మీరే. మా కుటుంబం ప్రకోపాన్ని చూపిస్తే తట్టుకోగలరా మీరు?. కానీ, అలా చేయం. ఎందుకంటే.. మాకంటూ అడవి ధర్మం ఉంది. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అంతరించిపోతున్న మా జాతుల్ని వీలైతే పరిరక్షించి పుణ్యం మూటగట్టుకోండి’’ మూగ జీవాలకు మాటొస్తే.. కచ్చితంగా మనుషులతో ఇలాగే మొరపెట్టుకుంటాయేమో. భూమ్మీద వృక్షజాలం, జంతుజాలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదే. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకే ఒక రోజు ఉంది. ఇవాళ(మార్చి 3వ తేదీ) వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే. వైల్డ్‌లైఫ్ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా అవగాహన కల్పించే రోజు. అంతేకాదు అందమైన వాటి ప్రపంచం గురించి ప్రస్తావించుకునే రోజు కూడా. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వనజీవుల సంరక్షణ కోసం చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కొత్తగా అర్టిషిషియల్ టెక్నాలజీ (AI) ద్వారా అంతరించిపోతున్న దశలో ఉన్న జంతువుల్ని గుర్తించడం, తద్వారా వాటి పరిరక్షణకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని భావిస్తున్నారు. 1973లో సైట్స్ (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఆ తేదీని World Wildlife Dayగా పరిగణించాలని డిసెంబర్ 20, 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తీర్మానించింది. వైల్డ్‌లైఫ్ డే సందర్భంలో మన గడ్డ మీద ఉండి.. అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరు జాతుల గురించి చర్చించుకుందాం. ఏషియాటిక్ లయన్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండో జాతి ఇది. రాజసం ఉట్టిపడే సింహాలకు.. గుజరాత్ ‘గిర్’ శాంక్చురీ దీనికి అడ్డా. కానీ, చాలా ఏళ్ల కిందట భారత్‌లోని ఉత్తర, మధ్య తూర్పు ప్రాంతాల్లోనూ వీటి సంఖ్య ఎక్కువగా ఉం డేది. అంతరించిపోతున్న క్రమంలో వీటి పరిరక్షణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీలగిరి మార్టెన్ దక్షిణ భారత దేశంలో.. అందునా నీలగిరి కొండల్లో కనిపించే అరుదైన మార్టెన్ జాతి ఇది. తమిళనాడు, అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనూ వీటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్య వెయ్యి లోపే ఉంది. అందుకే ఐయూసీఎన్ (International Union for Conservation of Nature) ఈ జాతిని రెడ్ లిస్ట్‌లో చేర్చింది. మంచు చిరుత ఔన్స్ అని ముద్దుగా పిల్చుకునే ఈ జాతి.. అరుదైన జీవుల్లో ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ నేషనల్ పార్క్‌లో, ఉత్తరాఖండ్ నందా దేవి నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. శరవేగంగా వీటి జనాభా క్షీణించి పోగా.. ప్రస్తుతం మొత్తంగా పది వేల లోపే మంచు చిరుతలు ఉంటాయని అధికారులు లెక్కలు వేశారు. సంగై అనిమిలీయా కుటుంబంలోని దుప్పి జాతి సంగై (Brow-antlered Deer). మణిపూర్ లోక్టక్ సరస్సును ఆనుకుని ఉన్న కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడో ప్రత్యేకత ఏంటంటే.. సంగై ఆ రాష్ట్ర జంతువు. డ్యాన్సింగ్ డీర్ పేరుతో వీటి మీద జానపద కథలు సైతం ప్రచారంలో ఉన్నాయి. సింహపు తోక మకాక్ వాండెరూ.. సింహపు తోక మకాక్(కోతులు). ప్రపంచంలోనే అతి పురాతనమైన, అరుదైన జాతిగా వీటిని చెప్తుంటారు రీసెర్చర్లు. కేరళ షెండూర్నీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో ఇవి కనిపిస్తాయి. ఒంటికొమ్ము రైనో వేట, కొమ్ముల అక్రమ రవాణాతో క్షీణించే దశకు చేరుకున్న జాతి ఇది. కజిరంగ నేషనల్ పార్క్ (అస్సాం), దుద్వా టైగర్ రిజర్వ్(యూపీ), పోబిటోరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ(అస్సాం)లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను రక్షించడం అనే థీమ్‌తో ఈ ఏడాది వరల్డ్ వైల్డ్‌లైఫ్ డేని నిర్వహిస్తున్నారు. There are over 22,000 endangered & critically endangered species on the IUCN Red List. Continued species loss is a threat to people and planet. For #WWD2022, let us all support conservation of vulnerable plants and animals. Learn more: https://t.co/hW7VtdeXHK #RecoverKeySpecies pic.twitter.com/AtjMmtVCio — World Wildlife Day (@WildlifeDay) February 22, 2022 పరుగు, పుట్రా, మొక్కలే కాదు.. పరిమాణంలో పెద్ద జంతువులు సైతం మనిషి నిర్లక్ష్యానికి బలై అంతరించే దశకు చేరుకోగా.. ఇప్పటికే కొన్ని అంతరించిపోయాయి కూడా. -సాక్షి, వెబ్ స్పెషల్ -
చైనా నిర్ణయంపై హర్షం
బీజింగ్: చైనా 2017 చివరి నాటికి ఏనుగు దంతాల వ్యాపారాన్ని పూర్తిగా నిలిపేయనుంది. అంతరించే ముప్పు ఎదుర్కొంటున్న ఆఫ్రికా ఏనుగులకు ఇది ఎంతో మేలుచేసే నిర్ణయమని పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఏనుగు దంతాల మార్కెట్‌కు కేంద్రంగా ఎదిగిన ఆ దేశం మార్చిలో వాటి ఎగుమతులపై మూడేళ్ల నిషేధం విధించింది. అటవీ జంతువులు, మొక్కల అక్రమ వాణిజ్య కట్టడికే ఈ నిర్ణయం తీసుకుంది.‘ చైనా క్రమంగా ఏనుగు దంతాల వాణిజ్య శుద్ధి, అమ్మకాలను 2017 చివరినాటికి అపుతుంది’ అని ప్రభుత్వ మీడియా జిన్హువా వెల్లడించింది. ఈ నిర్ణయం అమలైతే చైనాలో 34 ఏనుగు దంతా శుద్ధి కేంద్రాలు, 143 మార్కెట్లు మూతపడతాయని తెలిపింది. అయితే ఆలోపు ఇలాంటి వ్యాపారాల్లో జరుగుతున్న అక్రమాలపై చట్ట అమలు సంస్థల ఉక్కుపాదం కొనసాగుతుందని పేర్కొంది. చైనా, హాంకాంగ్ మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా ఏటా వందల కొలది ఆఫ్రికా ఏనుగులను వేటగాళ్లు వధిస్తున్నారు. ఏడేళ్లలో ఏనుగుల జనాభా 30 శాతం పడిపోయింది. చైనాలో కిలో దంతాల వెల 1100 డాలర్లు పలుకుతుంది. చైనా నిర్ణయం చారిత్రక ప్రకటన అని పర్యావరణ సంస్థ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభివర్ణించింది. ఆఫ్రికాలో ఏనుగుల అక్రమ వేటను నిలువరించడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది. -
వన్యప్రాణుల మరణ వేదన!
ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు మునుపెన్నడూ లేనంత వేగంగా అంతర్థానమవుతున్నాయి! మానవ చర్యల కారణంగా మూడింట రెండు వంతుల వన్యప్రాణులు 2020 నాటికి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో దాదాపు సగం వన్యప్రాణులు అంతర్థాన దశలో ఉన్నాయని తన ద్వైవార్షిక నివేదిక ‘ది లివింగ్ ప్లానెట్ రిపోర్ట్–2016’లో తేటతెల్లం చేసింది! – సాక్షి సెంట్రల్ డెస్క్ మానవ చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970–2020 మధ్య సగటున 67 శాతం తగ్గిపోనుందని నివేదిక అంచనా వేసింది. 1970–2012 మధ్య పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, చేపలు, సరీసృపాల సంఖ్య 58 శాతం క్షీణించిందని పేర్కొంది. దీన్ని బట్టి 2020 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య మూడింట రెండు వంతులు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరోవైపు పర్యావరణంపై మానవుల ప్రభావాన్ని నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ఆవాసాల విధ్వంసం, అటవీ విస్తీర్ణం తగ్గడం, వన్యప్రాణులను వధించడం కొన్ని కారణాలుగా పేర్కొంది. మన ఆహార, ఇంధన వినియోగ మార్గాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆవాసాల విధ్వంసం... ప్రపంచ మొత్తం జీవజాలంలో సగం వాటా బ్రెజిల్, చైనా, యూఎస్, రష్యా, భారత్ దేశాలదే. ‘గ్లోబల్ బయోకెపాసిటీ హబ్్స’గా ఉన్న ఈ దేశాలు ఇతర దేశాలకు వనరులను ఎగుమతి చేసే ప్రాథమిక దేశాలుగా కూడా ఉన్నాయి. ఫలితంగా ఈ దేశాల్లోని జీవ వ్యవస్థలపై అధిక భారం పడుతోంది. ఇది ఆ జీవులు ఆవాసాలు కోల్పోవడానికి కారణమవుతోందని నివేదిక వెల్లడించింది. ఆవాసాల విధ్వంసం, వన్యప్రాణుల దోపిడీకి ఆహార ఉత్పత్తే ప్రాథమిక కారణమని తెలిపింది. జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రవిసింగ్ పేర్కొన్నారు. పర్యావరణ మార్పులు ► ఏడాదికి 1.30 మి.మీ. చొప్పున పెరుగుతున్న సముద్ర మట్టంతో భారత్ ప్రపంచంలో అత్యంత విపత్కర ప్రాంతంగా నిలవనుంది. ► ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లో గత 40 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ► 2100 నాటికి సముద్ర మట్టం మీటరు పెరిగితే దేశంలో 14 వేల చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ► వరదలు, కరువు, వేడిగాలులు వంటి విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో 2000–15 మధ్య కాలంలో ఐదువేల మందికి పైగా మరణించారు. భూతాపం ప్రభావం కారణంగా 2080–2100 నాటికి ఆహార ఉత్పత్తి 10–40 శాతం తగ్గుతుందని అంచనా. -
క్లిక్ చేయండి.. నగరాన్ని గెలిపించండి!
సాక్షి, హైదరాబాద్: మెరుగైన రవాణా వ్యవస్థ, ఐటీ రంగ అభివృద్ధి, హరిత భవనాల నిర్మాణాలు.. వంటి అనేక అంశాలు ఏ నగరంలో మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ దేశాల్లో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) ఆన్లైన్లో ఓ పోటీని నిర్వహిస్తోంది. 14 దేశాల్లోని మొత్తం 34 నగరాలు ఎంపికైన ఈ పోటీలో మన దేశం నుంచి కేవలం 3 నగరాలు మాత్రమే పోటీలు నిలబడ్డాయి. ఇందులో హైదరాబాద్‌కూ చోటు దక్కించుకుంది. మిగిలిన రెండు నగరాలు.. కొచ్చి, కోయంబత్తూర్ నగరాలు. ఈ పోటీ విశేషాలివిగో.. నైపుణ్యం గల ఉద్యోగులు లభించటం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నివసించటానికి అనుకూలమైన వాతావరణం, పెరుగుతున్న హరిత భవనాలు, నష్టభయం పెద్దగా లేకపోవటం, విద్యుత్, రోడ్ల అభివృద్ధి, పన్ను రాయితీలు, మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాట్లు తదితర కారణాల వల్ల హైదరాబాద్ ఈ పోటీలో నిలిచింది. అంతేకాకుండా దేశంలోనే తొలిసారిగా నగరంలో నిర్మించిన ‘జీవవైవిధ్య సూచి’ హైదరాబాద్‌ను ప్రపంచ దేశాల్లో తలమానికంగా నిలుపుతోంది. ఐటీ పెట్టుబడులు పెరగటం, పునరుత్పాదక శక్తి వినియోగంలో ముందంజలో ఉండటం వల్ల కోయంబత్తూర్.. హరిత భవన నిర్మాణాలుండటం, వాతావరణంలో కార్బన్ శాతం తక్కువగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో కొచ్చి నగరాలు ఈ పోటీలో నిలిచాయి. విజేతల ఎంపిక ఇలా.. రవాణా వ్యవస్థ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, మౌలిక వసతులు, పార్కులు, విశాలమైన ప్రదేశాలు, విద్యుత్, నీటి వినియోగం వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించి ఉత్తమ నగరాన్ని ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ఓట్ల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. మార్చి 27న కెనడాలో జరిగే కార్యక్రమంలో ‘నేషనల్ ఎర్త్ అవర్ క్యాపిటల్ అవార్డు’ను అందిస్తారు.