world wonders
-
షార్ట్‌కట్ అని 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'నే కూల్చేశారు
బీజింగ్: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొట్టతొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు. గ్రేట్ వాల్ అయితే ఏంటి? చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో, యూయు కౌంటీ సమీపంలోని యాంగ్‌క్యాన్హె టౌన్షిప్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇక్కడికి సమీపంలో ఒక నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు అడ్డంకిగా నిలవడంతో పాటు యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి తరలించడానికి గ్రేట్ వాల్ అడ్డుగా ఉంది. దీనివలన వారు పని చేసుకునే చోటికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారిద్దరు కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను కొంతవరకు కూల్చేశారు. షార్ట్‌కట్ అని.. ఆగస్టు 24న స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చేసిన గోడను చూసి విభ్రాంతికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందన్న ఒకేఒక్క కారణంతో నిందితులు చైనా ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన భారీ గోడ సమగ్రతకు సుస్థిరతకు తీవ్రనష్టం కలిగించారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. చారిత్రాత్మకం.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడున్న కట్టడాన్ని నిర్మించింది మాత్రం మింగ్ వంశీయులే. క్రీస్తుశకం 1368-1644 సమయంలో దీని నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కట్టడమైన ఈ గోడను యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నేటికీ ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు. 🚜 In the Chinese province of Shanxi, locals destroyed a section of the Great Wall of China with an excavator, — Sohu During interrogation, the man and woman admitted that they worked at a construction site nearby, and thus wanted to shorten the way to work. The ruined section… pic.twitter.com/2enLL69y7H — UNEWS (@UNEWSworld) September 4, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత.. -
హాబీగా ఎంచుకున్న కళతో ఇప్పుడు రికార్డులు
తనను తాను అంకితం చేసుకున్నప్పుడే ఎంచుకున్న పని అయినా, అభిరుచి అయినా విజయవంతం అవుతుంది. కీర్తిని కట్టబెడుతుంది. అందుకు ఉదాహరణ 40 ఏళ్ల జిస్నా నాగిరిషా. ప్రపంచంలోని ఏడు అద్భుత కట్టడాల నమూనాలను గాజు బాటిళ్లపైన చిత్రించిన జిస్నా నాగిరిషాకు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ప్రవేశం లభించింది. జిస్నాకు పెయింటింగ్ అంటే చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ చేస్తూ ఉండేది. ఆరేళ్ల క్రితం బాటిల్ ఆర్ట్ నేర్చుకుంది. అలా చిత్రించిన బాటిల్ ఆర్ట్‌ను ఆప్తులకు కానుకలుగా ఇచ్చేది. కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉంటున్న జిస్నా హాబీగా ఎంచుకున్న కళ ఇప్పుడు ఆమెకు రికార్డులు తెచ్చిపెడుతోంది. ‘ఆరేళ్లుగా బాటిల్ ఆర్ట్ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం దీంట్లో ఏదో ప్రత్యేకత సాధించడమెలా అని ఆలోచించాను. అప్పుడే న్యూ సెవన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనే ఆలోచన వచ్చింది’ అని ఈ సందర్భంగా అనందంగా చెబుతారు జిస్నా. ఆమె దీని గురించి మరింతగా వివరిస్తూ ‘స్మారక చిహ్నాల ఫొటోలను ఒక్కోటి పరిశీలిస్తూ చాలా ఆశ్చర్యపోయాను వాటి అందానికి. వాటిని యధాతథంగా సీసాలపై నిలపాలనుకున్నాను’ అని తన అభిరుచి గురించి తెలిపారు. అనుకున్నట్టుగానే రెండేళ్లలో ప్రపంచ అద్బుత కట్టడాలను బాటిళ్లపై చిత్రించి, ఇండియా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. జిస్నా బాటిల్ ఆర్ట్ గిఫ్ట్ ఐటమ్స్గానూ చేస్తుంది. డిజైన్ బట్టి ఒక్కో బాటిల్ గిఫ్ట్ ఐటమ్ రూ.1000 నుండి అమ్ముడవుతున్నాయి. ఏషియన్ రికార్డ్ నుంచి ప్రపంచ రికార్డ్ సాధించాలనే తపనలో ఉంది జిస్నా. -
విడ్డూరం: వింతలు.. విశేషాలు
తెలివి తెల్లారినట్టే ఉంది! జపాన్‌కి చెందిన కేసుకి జినుషీ అనే ఫొటోగ్రాఫర్, గాళ్‌ఫ్రెండ్ లేదని బాధపడే కుర్రాళ్లకు ఆ బెంగను తీరుస్తానంటూ ఓ ప్రకటన చేశాడు. క్యూ కట్టిన కుర్రాళ్లకు అతడు చూపిన పరిష్కారం ఏమిటో తెలుసా! కుడి చేతి మీది వెంట్రుకలన్నీ షేవ్ చేసేశాడు. మాయిశ్చరయిజర్ రాసి నునుపుగా చేశాడు. గోళ్లకు నెయిల్ పాలిష్ వేశాడు. తినమంటూ ఓ బిస్కట్ను ఆ చేతిలో పెట్టి, తింటుంటే ఫొటో తీశాడు. దాన్ని చూపించి... ‘చూడండి, మీ గాళ్‌ఫ్రెండ్ మీకు తినిపిస్తున్నట్టే’ లేదూ, ఈ చేత్తో మీకు నచ్చినవి చేసి మీరే ఫొటోలు తీసుకోండి, మీ గాళ్‌ఫ్రెండే చేసినట్టు ఫీలవండి’ అని సలహా కూడా ఇచ్చాడు. ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి యువకులు ఎగబడుతున్నారు. ఇదేం ఆనందమో ఏమో! నమ్మకమే అతడి ఆదాయం! గతంలో అమెరికాకు చెందిన ఓ డాక్టర్ చేతి గీతల్ని మారుస్తున్నాడని చదివాం. కానీ చైనాకు చెందిన మియాన్ ఏకంగా ముఖాల్నే మార్చేస్తున్నాడు. కనుబొమలు లావుగా ఉంటే ఆర్థికంగా కలసిరాదని నమ్ముతారు కాబట్టి వాటిని సన్నగా చేస్తున్నాడు. పలుచగా ఉంటే అదృష్టం అంతంత మాత్రమే అంటారు కాబట్టి అవి లేనివారికి మొలిపించేస్తున్నాడు. ముక్కు సూటిగా ఉంటే అదృష్టం కాబట్టి ముక్కును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చెక్కేస్తున్నాడు. బండ పెదవులు అదృష్టాన్ని దూరం చేస్తాయి కాబట్టి సర్జరీతో చిన్నవిగా చేసేస్తున్నాడు. పుట్టుమచ్చలు పెట్టేస్తున్నాడు. ఉన్న మచ్చలు తీసేస్తున్నాడు. ఇలా ఈ ప్లాస్టిక్ సర్జన్గారు ముఖాలని ఇష్టం వచ్చినట్టు మార్చి పారేస్తున్నాడు. అందుకోసం భారీగానే వసూలు చేస్తున్నాడు. ఇచ్చేవాళ్లుంటే తీసుకోవడానికేంలెండి! లాభం కావాలంటే... డైపర్ వేయాలి! లాభాలను పెంచుకోవడానికి ఏవేవో ప్లాన్లు వేస్తుంటారు కంపెనీ యజమానులు. ఉద్యోగులతో ఓవర్ టైమ్ చేయిస్తారు. టైమింగ్స్ మార్చేస్తుంటారు. లీవులు క్యాన్సిల్ చేస్తారు. లంచ్, టిఫిన్ సమయాల్లో కోత విధిస్తారు. ఇవన్నీ చాలామంది చేసేవే. కానీ కొరియాలోని ఓ కంపెనీ మాత్రం విచిత్రమైన పని చేసింది. హోండురాస్ ప్రాంతంలో ఉన్న యూంగ్షిన్ ఎలక్ట్రికల్ కంపెనీలో దాదాపు మూడువేల ఐదు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరినీ ఆఫీసులకు డైపర్లు వేసుకు రావాలని ఈ మధ్య హుకుం జారీ చేసింది యాజమాన్యం. దాంతో అందరూ షాక్ తిని, ఇదేం రూలంటూ నిలదీశారు. బాత్రూములకంటూ అటూ ఇటూ తిరుగుతుంటే టైమ్ వేస్టవుతోంది, ఆ టైమును కూడా మిగుల్చుకుంటే ఉత్పత్తి పెరుగుతుంది అంటూ విచిత్రమైన లాజిక్ చెప్పింది. ఉద్యోగులకు తిక్క రేగి లేబర్ మినిస్టర్‌కి కంప్లయింట్ చేశారు. ప్రస్తుతం ఎంక్వయిరీ జరుగుతోంది. ఎంత లాభాలు ఆర్జించాలంటే మాత్రం ఇలా హక్కుల్ని కాలరాయడమేంటంటూ పలువురు తిడుతున్నారు. తిట్టకేం చేస్తారు... ఇలాంటి తింగరి రూల్స్ పెడితే! ఒళ్లు చీరేసే పండుగ పండ గను ఎలా చేసుకుంటారు? కొత్త బట్టలు వేసుకుంటారు. పిండి వంటలు చేసుకు తింటారు. విందులు వినోదాల్లో మునిగి తేలుతారు. కానీ, ఇండోనేసియా వారు రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు. వింతగా ఉన్నా ఇది నిజం. ఇండోనేసియాలో మొరెల్లా, మమలా అనే రెండు గ్రామాలున్నాయి. ఈ రెండు ఊళ్ల వారికీ ఎంతో ముఖ్యమైన పండుగ... పుకుల్ సపు. రంజాన్ నెల చివరి రోజున చేసుకుంటారు దీన్ని. ఆ రోజున స్నానాలు చేసి, ఊళ్లోవాళ్లంతా ఓ విశాల ప్రదేశానికి చేరుకుంటారు. యువకులంతా ఇద్దరిద్దరిగా విడిపోయి, వెదురు పుల్లలతో ఒకరినొకరు కొట్టుకోవడం మొదలెడతారు. ఊరి పెద్దలు వరుసగా కూచుని... ఎవరికీ పెద్ద పెద్ద గాయాలు కాకూడదని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందరూ నీరసించిపోయే వరకూ అలా కొట్టుకుంటూనే ఉంటారు. తర్వాత పెద్దలు వారి శరీరాలకి నూనెను పూస్తారు. ఆ నూనె యాలను మాన్పడమే కాక, విరిగిన ఎముకలను కూడా అతికిస్తుందని అంటారు వారు. ఎన్నో యేళ్లుగా అక్కడ ఈ ఆచారం కొనసాగుతుంది. ఇలా చేస్తే ఊరి అరిష్టాలన్నీ తొలగిపోతాయని, అందరూ సుఖశాంతులతో ఉంటారని వారి నమ్మకమట. ఎంత నమ్మకమున్నా ఇలా ఒళ్లు చీరుకోవడమేంటో... తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడవడంలా!