World XI squad
-
వరల్డ్-11 జట్టు నుంచి పాండ్యా ఔట్
ముంబై : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వరల్డ్ ఎలెవన్ జట్టు నుంచి టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న పాండ్యా స్థానంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేశారు. ఇంగ్లండ్ లెగ్‌స్పిన్నర్ అదిల్ రషీద్‌కు సైతం తుది జట్టులో స్థానం కల్పించారు. గతేడాది హరికేన్ బీభత్సంతో కరేబియన్ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఐసీసీ చారిటీ మ్యాచ్ నిర్వహిస్తోంది. ఇంగ్లండ్, లార్డ్స్ వేదికగా మే 31న జరిగే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడనుంది. ఈ వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌లు అవకాశం కల్పించగా పాండ్యా దూరమయ్యాడు.ఈ టీ20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్ తరపున అఫ్రిది, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్లు ఎంపికయ్యారు. వరల్డ్ ఎలెవన్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, తిసార పెరీరా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, లూక్ రోంచి, మెక్లినగన్, అదిల్ రషీద్, సందీప్ లమిచ్చనే -
వరల్డ్ ఎలెవన్ జట్టులో ఇద్దరు భారత క్రికెటర్లు
దుబాయ్ : ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌లు ఎంపికయ్యారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్‌లోని పలు స్టేడియాలు నేలమట్టమవగా... వాటిని పునర్మించేందు చారిటీ మ్యాచ్ నిర్వహించి విరాళాలు సేకరించాలని ఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ లార్డ్స్ వేదికగా మే 31న వెస్టిండీస్‌తో ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడుతుంది. ఈ ప్రపంచ ఎలెవన్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిదీ, తిసారా పెరీరా(శ్రీలంక), షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ తాజాగా భారత్ నుంచి పాండ్యా, కార్తీక్‌లకు అవకాశం కల్పించింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో గతకొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై కార్తీక్ కళ్లుచెదిరే విజయాన్నందించారు. ఇప్పటికి తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ త్వరలోనే మిగతా ఆటగాళ్లను ఎంపికచేయనుంది. ఇక ప్రపంచ ఎలెవన్ ఢీకొనబోతున్న వెస్టిండీస్ జట్టును ఆదేశ బోర్డు ప్రకటించింది. కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా సామ్యూల్ బద్రీ, క్రిస్‌గేల్‌లతో కూడిన 13 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. వరల్డ్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడంపై ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడల్లా క్రికెట్ కుటుంబం మద్దతుగా నిలుస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్ల మధ్య జరిగే ఈ టీ20 మ్యాచ్ ప్రేక్షకులను రంజింప చేయనుంద’ని మోర్గాన్ తెలిపారు. -
భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్ ఎలెవన్ జట్టా..?
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచ అత్యత్తుమ ఆటగాళ్లైన భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్ ఎలెవన్ జట్టే లేదని మాజీ ఐసీసీ ప్రెసిడెంట్ ఎహ్సాన్ మణి అభిప్రాయపడ్డారు. జట్టులో భారత క్రికెటర్లు లేకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. భారత్ ఆసీసీతో లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడుతుందని తెలుసు కానీ ఈ సిరీస్‌లో ఆడని ప్లేయర్లను వరల్డ్ ఎలెవన్ జట్టులో భాగస్వామ్యులు చేయవచ్చని ఈషాన్ వ్యాఖ్యానించారు. క్రికెట్ దేశాల మధ్య బంధాన్ని బలపరుస్తుందన్నారు. ‘భారత్-పాక్‌లు అంతర్జాతీయ వేదికలపై అనేక మ్యాచ్‌లు ఆడుతాయి కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడవు. ఇరు దేశాల మధ్య వ్యాపారా లావాదేవీలు కూడా జరుగుతాయి. కానీ క్రికెట్ విషయం కొచ్చే సరికి రాజకీయాలు ప్రస్తావిస్తారు. ఇరు దేశాలు క్రికెట్‌ను రాజకీయాలు వాడుకుంటున్నాయి. ఇది చాల తప్పు’ అని ఎహ్సాన్ మణి పేర్కొన్నారు. భద్రతా కారాణాల దృష్ట్యా పాక్‌లో క్రికెట్ ఆడకపోవడం దారుణమని, ప్రమాదాలు అన్ని దేశాల్లో సంభవిస్తాయన్నారు. ఎలాంటి ముప్పు లేకున్నా పాక్, వరల్డ్ ఎలెవన్ జట్టుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిందని, అంత భద్రతా అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే సామర్థ్యం ఉందని ఈ ఐసీసీ మాజీ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు.