సొరంగం..@:56.32 కి.మీ...
స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణి పేరు చెప్పగానే తెల్లని వెండికొండలను తలపించే సుందరమైన దృశ్యం మన కళ్ల ముందు కదలాడుతుంది. పర్యాటకంగా సుప్రసిద్ధం. ఈ ఆల్ప్స్ పర్వతాల కింద నుంచి ఓ భారీ టన్నెల్‌ను నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గంగా ఇది గుర్తింపు పొందనుంది. ఏకంగా 56.32 కిలోమీటర్ల మేరకు గుట్టను తొలిచి సొరంగాన్ని నిర్మించారు.
రైల్వే లైను వేశారు. దీని మూలంగా జ్యూరిచ్ - మిలన్ (ఇటలీ)ల మధ్య ప్రయాణం సమయం గంట తగ్గుతుంది. 1996లో దాదాపు 65,000 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ భారీ ప్రాజెక్టు ఇటీవలే పూర్తయింది. అక్టోబర్‌లో ట్రయల్ రన్స్ ఉంటాయి. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది.