Worse conditions
-
ఒమన్ పొమ్మంటోంది!
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికులకు అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించిన ఒమన్ దేశం.. ఇప్పుడు వారిని వదిలించుకుంటోంది. స్వదే శీయులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బయటవారిని సాగనంపుతోంది. దీంతో వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టా డుతోంది. దీంతో అక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి, వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని ఒమన్ నిర్ణయించింది. ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో ఒమనీయులకు పెద్దపీట వేశారు. అలాగే, చిన్న, మధ్య తరహా వాహనాల డ్రైవింగ్‌లోనూ తమ ప్రజలకు అవకాశం కల్పిస్తూ, విదేశీ డ్రైవర్ల లైసెన్స్‌ల రెన్యూవల్‌ను నిలిపి వేశారు. దీనికి తోడు ప్రైవేటు రంగంలోనూ ఒమన్ పౌరులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణ కార్మికులకు పెద్ద దెబ్బ.. ఒమన్ నిర్ణయం తెలంగాణ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒమన్‌లో ఇప్పటివరకు ఉపాధి పొందిన విదేశీ వలస కార్మికులలో భారత్‌కు చెందిన వలసదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండగా, ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 1.25 లక్షల మంది ఉంటారని అంచనా. తాజా నిర్ణయంతో 80 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని అంచనా. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం .ఒమన్‌లో కొన్ని నెలల నుంచి భారతీయులే కాకుండా ఇతర దేశాల వ్యాపారులు, ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులకు కష్టకాలం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఒమన్‌లో బతకడం కష్టమే. –నరేంద్ర పన్నీరు, ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఇక్కట్లు – పరిహారాలు
ఉపశమనం ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కడం కష్టంగా ఉంటుంది. కాలం పగబట్టిందేమో అనేంతగా గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా అర్హతలకు, అనుభవానికి తగిన అవకాశాలు దక్కవు. దొరికిన అవకాశాలు తగిన ఆదాయాన్ని ఇచ్చేవిగా ఉండవు. అసంతృప్తి, నిస్పృహ మనసును కుదురుగా ఉండనివ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాలను పాటించండి. ► కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ఇంట్లోని బీరువాలు, నగలు వంటి విలువైన వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఖాళీగా ఉంచకండి. వాటిలో ఉంచడానికి ఏమీ లేనట్లయితే, కనీసం నాలుగు బాదం గింజలైనా వేసి ఉంచండి. ► ఎలాంటి ప్రలోభాలు ఎదురైనా అనైతిక కార్యకలాపాలకు, అవినీతికి దూరంగా ఉండండి. జూదానికి, స్పెక్యులేటివ్ లావాదేవీలకు దూరంగా ఉండండి. ►కుంకుమపువ్వును, కస్తూరిని కలిపి తిలకంగా ధరించండి. నిత్యపూజలో భాగంగా లక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించండి. తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి. ►ప్రవహిస్తున్న నీటిలో చిన్నబెల్లం ముక్కను, అక్షతలను విడిచిపెట్టండి. కనీసం ఆరు ఆదివారాలు నిరుపేద అంధులకు అన్నదానం చేయండి. ►వెదురుబొంగులో పంచదార నింపి, నిర్జన ప్రదేశంలో దానిని పాతిపెట్టండి. మర్రిచెట్టు మొదట్లో పాలు, కొబ్బరినీరు పోయండి. ► శనివారం పూర్తిగా మద్యమాంసాలకు దూరంగా ఉండండి. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం జరిపించండి. రుద్రాభిషేకం జరిపించడం వల్ల కూడా దోషనివారణ జరుగుతుంది. – పన్యాల జగన్నాథ దాసు