worst defeat
-
రాహుల్ రాజీనామాకు సోనియా అంగీకారం!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సోమవారం కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్లను రాహుల్ వద్దకు పంపగా, ఆయన తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తాను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోననీ, ఇందుకోసం మరొకరిని ఎంపిక చేసుకోవాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ తాను తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తానని రాహుల్ చెప్పారు. తొలుత రాహుల్ రాజీనామాకు ఒప్పుకోని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ వెనక్కి తగ్గకపోవడంతో వీరిద్దరూ చివరకు ఆయన రాజీనామాకు అంగీకరించిట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకునేందుకు రాహుల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తా.. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను పార్టీ కోసం పనిచేస్తానని కాంగ్రెస్ దూతలకు రాహుల్ చెప్పినట్లు సమాచారం. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, ప్రియాంకలు సీనియర్ నేతలపై మండిపడినట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. ‘ఈ విషయంలో తప్పుడు కథనాలు, వదంతులకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. నెహ్రూకు నివాళులు.. భారత తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్లు యమునా నదీతీరన ఉన్న శాంతివన్లో సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. కర్ణాటక, రాజస్తాన్‌లో నీలినీడలు పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న వేళ కర్ణాటక, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు రమేశ్ జర్కిహోళీ, డా.సుధాకర్‌లు బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి గల అవకాశాలపై చర్చించారు. మంత్రి పదవులు దక్కక గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం జూన్ 10 వరకే కొనసాగుతుందని కాంగ్రెస్ నేత కేఎన్ రాజన్న బాంబు పేల్చారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ ఘోర ఓటమికి రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లోత్ నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ తప్పుకున్న నేపథ్యంలో పార్టీలో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్, జార్ఖండ్ చీఫ్ అజయ్ కుమార్, అస్సాంలో పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా సహా పలువురు నేతలు తమ అధ్యక్ష పదవులకు రాజీనామాలు సమర్పించారు. -
ఓటమి దిశగా దక్షిణాఫ్రికా
కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆటతీరులో ఎలాంటి మార్పులేదు. లంక స్పిన్నర్ల ధాటికి తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన సఫారీ జట్టు రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. 490 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. డి బ్రుయెన్ (97 బంతుల్లో 45 బ్యాటింగ్; 7 ఫోర్లు), ఎల్గర్ (37) ఫర్వాలేదనిపించారు. మార్క్రమ్ (14), ఆమ్లా (6), డు ప్లెసిస్ (7) విఫలమయ్యారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ, హెరాత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు చేతిలో ఉన్న సఫారీ జట్టు విజయానికి ఇంకా 351 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 151/3తో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక 81 ఓవర్లలో 275/5 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మ్యాథ్యూస్ (71; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. మరోవైపు ఇటీవల తరచుగా జట్టు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బ్యాట్స్‌మన్ ధనుష్క గుణ తిలకపై లంక క్రికెట్‌బోర్డు మూడు ఫార్మాట్లలో కూడా పాల్గొనకుండా నిషేధం విధించింది. -
తిరుగులేని ఆసీస్
-
కాంగ్రెస్ కొంప ముంచిన అంశాలేంటి?
సార్వత్రిక ఎన్నికల్లో ముందుగా చెప్పుకోవాల్సిన ఏకైక పార్టీ.. కాంగ్రెస్. ఈసారి ఎన్నికలకు ఏమాత్రం సంసిద్ధం కాకుండా దారుణమైన ఫలితాలను చవిచూస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందునుంచే ఒకరకంగా తన ఓటమిని కాంగ్రెస్ స్వయంగా అంగీకరించింది. ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతూ వచ్చాయి. వరుసపెట్టి స్కాముల్లో కూరుకుపోవడం, రాష్ట్రాల ఎన్నికల్లో పదే పదే ఓటమి, విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, వృద్ధిరేటు మందగమనం, మరోవైపు ప్రచారపర్వంలో బీజేపీ దూసుకెళ్లడం.. ఇలా అన్నీ కాంగ్రెస్‌కు ప్రతికూలంగానే మారిపోయాయి. 'రాబోయేది మోడీ ప్రభుత్వం', 'కాంగ్రెస్ నుంచి భారతదేశానికి విముక్తి' లాంటి బీజేపీ నినాదాలకు కాంగ్రెస్ పార్టీ వద్ద సమాధానం అన్నదే లేకుండా పోయింది. యూపీఏ ప్రభుత్వంలో తిరుగులేని ఆధిక్యం కనబరిచిన పలువురు మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ లాంటివాళ్లు ఈసారి అసలు ఎన్నికల బరిలోకి దిగకపోవడం కూడా నైతికంగా ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దిగ్విజయ్ సింగ్, ఎన్డీ తివారీ లాంటి సీనియర్ నాయకులు ఎన్నికల సమయంలోనే అనవసర వివాదాల్లో కూరుకుపోవడం ఆ పార్టీ ప్రతిష్ఠను మంటగలిపింది. పార్టీ ప్రచారాన్ని సోనియాగాంధీ ఏ దశలోనూ ముందుకు తీసుకెళ్లలేకపోయారు. పార్టీ పగ్గాలను గానీ, ప్రభుత్వ పగ్గాలను గానీ అందిపుచ్చుకోడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని యువరాజు రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో జనానికి విసుగెత్తించారు. ఏ దశలో కూడా.. ఆయన ప్రసంగాలు ప్రజలకు కాకపోయినా.. సొంత పార్టీ వర్గాలకు కూడా స్ఫూర్తిని ఇవ్వలేకపోయాయి. మరోవైపు ఆయన ప్రత్యర్థి నరేంద్ర మోడీ రోజుకు ఐదు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ కూడా పూర్తిస్థాయి ఎనర్జీని ప్రదర్శించారు. దాంతోపాటు చాయ్ పే చర్చా పేరుతో సామాన్యులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన వేగాన్ని రాహుల్ అందుకోలేకపోయారు. ప్రధాని అభ్యర్థిగా కూడా తనను ప్రకటించవద్దని కోరడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనం. తల్లీకొడుకులు కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారంటూ మోడీ తన ప్రసంగాల్లో చేసిన పదునైన విమర్శలకు అవతలి నుంచి సమాధానం రాలేదు. ఇక కూటమిని కూడగట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. డీఎంకే, టీఎంసీ లాంటి పెద్ద పార్టీలు దూరం కావడం ఆ పార్టీకి గట్టిదెబ్బ అయ్యింది. ఇక తోడుగా ఉంటూనే ఎన్సీపీ మాత్రం శల్యసారథ్యం వహించింది. బీజేపీ మాత్రం చాపకింద నీరులా ఎక్కడికక్కడ మిత్రులను కలుపుకొని పోతూ ఘనవిజయాలు సొంతం చేసుకుంది.