‘పిల్లలూ.. ఉగ్రవాదులకు ఓ లేఖ రాయండి’
లండన్: ‘ఉగ్రవాదులకు ఓ లేఖ రాయండి’ అంటూ బ్రిటన్లో ఇటీవల ముద్రించిన ఓ పుస్తకంలో విద్యార్థులకు ప్రశ్నగా చేర్చారు. ఉగ్రవాదులు ఎందుకు అలాంటి దాడులు చేస్తారో, అందుకుగల కారణాలు ఏమిటో విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశాల్లో ఈ విషయాన్ని చేర్చారు. ఈ పుస్తకం సరిగ్గా మాంచెస్టర్లో ఉగ్రవాద దాడి జరగడానికి వారం ముందే ప్రచురణ జరిగింది. ది నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ క్రుయెల్టీ’ అనే స్వచ్ఛంద సంస్థ తరుపున దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ వాన్లెస్ విషయాసారం అందించగా బ్రిలియంట్ పబ్లికేషన్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రించింది.
ముఖ్యంగా 7 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఈ పుస్తకాన్ని బోధించాలని, ఒక్కో విద్యార్థిని పిలిచి ఉగ్రవాదికి ఓ లేఖ రాయండని కోరాలని, ఉగ్రవాదులను ఆరు ప్రశ్నలు అడగాల్సి వస్తే ఎలాంటి వాళ్లేం చేస్తారో వివరించాలని అందులో కోరాలని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, ఈ పుస్తకంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ పుస్తకం ఉగ్రవాదులపై సానుభూతి కలిగించేలా ఉందని, చిన్నారులను ప్రమాదకరంగా ఆలోచించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.