రేషన్ డీలర్ల ఎంపికకు రాత పరీక్ష
హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించే చౌక ధరల దుకాణాల డీలర్లను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్వ్యూల ద్వారా డీలర్లను ఎంపిక చేసే విధానం అమల్లోవుంది. అయితే, ఇక నుంచి జరిగే నియామకాలను రాత పరీక్ష ద్వారానే డీలర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వ్యూ ద్వారా డీలర్లను ఎంపిక చేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.