y. visweswar reddy
-
బరితెగించిన పయ్యావుల: విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బరితెగించి వ్యవహరిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బోయ సూరయ్య హత్య కేసు నుంచి తన సోదరుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. కేసు ఉపసంహరించుకోనందుకు సూరయ్య కుటుంబీకులపై అక్రమ కేసు బనాచించారని అన్నారు. సూరయ్య హత్యతో పయ్యావుల శీనప్పకు సంబంధం ఉందని సీఐడీ తేల్చిందని చెప్పారు. పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు బోయ సూరయ్య... ఉరవకొండ మండలం వై.రాంపురంలో 2009 ఆగస్టు 24న దారుణ హత్యకు గురయ్యారు. నిందితుల్లో ఒకరైన పయ్యావుల శీనప్ప తన పేరును చార్జిషీటు నుంచి తొలగింపజేసేందుకు శతవిధాలా ప్రయత్ని విఫలమయ్యాడు. సూరయ్య కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో కక్ష సాధింపునకు దిగాడు. -
ఉరవకొండలో విశ్వకు నీరా‘జనం’
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే హోదాలో తొలిసారి పట్టణానికి విచ్చేసిన వై.విశ్వేశ్వరరెడ్డికి శనివారం స్థానిక ప్రజలు నీరాజనం పలికారు. ఆయన రాక కోసం పార్టీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం నుంచే భారీ సంఖ్యలో జనం వేచివున్నారు. బైపాస్ రోడ్డు వద్దకు రాగానే ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు సోదరుడు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మధుసూదన్రెడ్డిలను భుజాలపెకైత్తుకుని ఊరేగించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, మండల, పట్టణ కన్వీనర్లు సుంకన్న, బసవరాజు, జెడ్పీటీసీ సభ్యులు మీనుగ లలిత, సింగాడి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.