పెరోల్‌ను రద్దు చేయండి
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పరోల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అఖిల బారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు ఆయన ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగారు. అక్రమంగా ఆయుధాలు సరఫరా చేశాడన్న కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌కు పదేపదే పరోల్ ఇవ్వడం సబబు కాదని మండిపడ్డారు. నెలరోజుల పాటు సంజయ్‌కు ఇచ్చిన పరోల్‌ను రద్దు చేసి పుణేలోని యెరవాడ సెంట్రల్ జైలుకు తరలించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి యదునాథ్ దేశ్‌పాండే డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు పడిన ఓ వ్యక్తికి రెండు నెలల్లో రెండుసార్లు పరోల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. భార్య మన్యతకు ఆరోగ్యం బాగా లేదన్న విషయం ఒప్పించేలా లేదని, ఆమె అర్ధరాత్రి పార్టీలకు హాజరవుతోందని తెలిపారు.
ఇక్కడ ఆందోళన జరుగుతుందన్న విషయం తెలిసిన నగర పోలీసులు దత్ నివాసానికి చేరుకున్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఆశీష్ చౌహన్తో పాటు మరో 15 మంది కార్యకర్తలను అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. వీళ్లు పదేపదే ఆందోళనలు చేస్తుండటంతో ఇంటి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు దత్ ఇష్టపడటం లేదు. ఆనారోగ్యంతో బాధపడుతున్న భార్య మాన్యతను చూసుకునేందుకు నెలరోజులపాటు పరోల్‌పై గత వారంలో దత్ జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.