Year 2020
-
యూట్యూబ్ ‘ఫన్’- 2020
కరోనాతో యావత్ ప్రపంచం మూగబోయిన వేళ...తమ వీడియోలతో సందడి చేశారు. లాక్డౌన్ బోర్డమ్ను బ్రేక్ చేసి ప్రేక్షకుల్లో హుషారు నింపారు.యూత్‌ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ‘హైయెస్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్–2020’గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన శ్రీమంతుల చిరు పరిచయం... ► తొమ్మిది సంవత్సరాల కోటీశ్వరుడు! చానల్: రెయాన్ వరల్డ్ ఎర్నింగ్స్: 29.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 41.7 మిలియన్ బొమ్మలపై రివ్యూలు ఇచ్చే చానల్స్ తెగచూసే రెయాన్ కాజీ(టెక్సాస్) ఒకరోజు తల్లితో కలిసి సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. అబ్బాయి కోరిక నెరవేర్చడానికి, అతడిలోని టాలెంట్‌ను బయటికి తీసుకురావడానికి ఏకంగా హైస్కూల్లో తాను చేస్తున్న కెమిస్ట్రీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది లోన్ కాజీ. 2015లో మొదలైన ‘రెయాన్ వరల్డ్’ యూట్యూబ్ చానల్‌కు అనూహ్యస్పందన లభించింది. విద్యను వినోదంతో కలిపి మిక్స్ చేసిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. ► హాస్యం, సాహసం సేయరా డింభకా! చానల్: మిస్టర్ బీస్ట్ ఎర్నింగ్స్: 24 మిలియన్ సబ్స్క్రైబర్స్: 47.8 మిలియన్ నార్త్ కరోలిన(యూఎస్)లోని ఒక రెస్టారెంట్. సర్వర్ ఆర్డర్ అడిగింది. ‘రెండు గ్లాసుల మంచినీళ్లు చాలు’ అన్నాడు ఆ యువకుడు. తాగి వెళ్లిపోయాడు. అతడు కూర్చున్న టేబులపై ఒక చీటి ఉంది. ‘కమ్మని మంచినీళ్లు ఇచ్చినందుకు–థ్యాంక్స్’ చీటి పక్కనే టిప్. అంత పెద్ద మొత్తంలో టిప్ చూడడంతో ఆమెకు కళ్లు తిరిగినంత పనైంది. ‘ఎవరీ టిప్పర్?’ అని ఆరాతీస్తే ‘యూట్యూబ్స్టార్ మిస్టర్ బీస్ట్’ అని చెప్పారు. 22 సంవత్సరాల జిమ్మి డొనాల్డ్సన్ ‘మిస్టర్ బీస్ట్’ యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయ్యాడు. 13 సంవత్సరాల వయసు నుంచే యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే సాహసకృత్యాలకు హాస్యం జోడిస్తే...ఆ ఫలితమే మిస్టర్ బీస్ట్. ► ఆడుతా తీయగా హాయిగా! చానల్: ప్రెస్టెన్ ఎర్నింగ్స్: 19 మిలియన్ సబ్స్క్రైబర్స్: 33.4 మిలియన్ తన సమీపబంధువు ఒకరు లండన్‌లో ‘లండన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితో డల్లాస్(యూఎస్)లో సొంతంగా యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాడు ప్రెస్టెన్ అర్స్మెన్. ప్రధాన చానల్‌తో పాటు మరోఅయిదు చానల్స్ ఉన్నాయి. గేమింగ్ వీడియోలు అతడి చానల్స్‌కు ముడిసరుకు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తుంటాడు. ఛాలెంజ్ వీడియోలు, ప్రాంక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు 26 సంవత్సరాల ప్రెస్టెన్. ► చిన్నారి కాదు చిచ్చర పిడుగు చానల్: నస్ట్యా ఎర్నింగ్స్: 18.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 190.6 మిలియన్ టిక్ టాక్ పాప్లర్ కిడ్‌గా ఫేమస్ అయిన రష్యన్ చిన్నారి అనస్టాసియ ‘నస్ట్యా’ చానల్‌కు పిల్లల్లో అనూహ్యమైన ఆదరణ ఉంది. ఊహాత్మకమైన వీడియోలు, విజ్ఞానం, వినోదం మిళితమైన వీడియోలతో ‘నస్ట్యా’తో బ్రహ్మాండమైన పేరు సాధించింది. యూట్యూబ్ సెన్సేషనల్‌గా నిలిచిన ఆరేళ్ల అనస్టాసియ పేరు బ్రాండ్‌గా మారింది. ప్రసిద్ధ కంపెనీలు తమ ఉత్పత్తులు అనస్టాసియ పేరు వాడుకుంటున్నాయి. ‘జాజ్వేర్’ అనే బొమ్మల కంపెనీ ఈ చిన్నారి పేరుతో ఒక బొమ్మను కూడా తయారుచేసింది. ఇన్స్టంట్ ఫీడ్‌బ్యాక్‌లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనల్ని మెచ్చుకునేవాటితో పాటు నొచ్చుకునేలా చేసేవి కూడా ఉంటాయి. ‘ఫీడ్‌బ్యాక్’ను గైడ్లైన్గానే తీసుకోవాలి తప్ప ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు మరింత అతిగా కృంగిపోకూడదు. పనికి ఎంత న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం. –విద్య అయ్యర్ (విద్య వోక్స్ యూట్యూబ్ చానల్) మనవాళ్ల విషయానికి వస్తే భువన్ బామ్ (19.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), ఆశిష్ చంచలని వైన్ (18.7 మిలియన్ సబ్స్క్రైబర్స్) గౌరవ్ –టెక్నికల్ గురూజీ (18.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), విద్య–అయ్యర్ విద్య వోక్స్ (7 మిలియన్ ), సనమ్ పాప్–రాక్ బ్యాండ్(7 మిలియన్ సబ్స్క్రైబర్స్), శృతి అర్జున్ ఆనంద్ (8 మిలియన్ సబ్స్క్రైబర్స్)....మొదలైవారు ప్రేక్షక ఆదరణతో పాటు ఆర్థికవిజయం అందుకుంటున్నారు. కంటెంట్ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాను. యూత్ మా ప్రధాన టార్గెట్. వీడియోలపై కుబుంబసభ్యుల నుంచి స్నేహితుల వరకు అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. మార్పులుచేర్పులు చేస్తుంటాను. ‘నాకు నచ్చితే అందరికీ నచ్చినట్లే’ అనే భావనలో నుంచి బయటికి రావాలి. – శృతి అర్జున్ ఆనంద్, ఫేమస్ యూట్యూబర్ -
చెవి కుట్లు
ఈ 2020లో చెవి కుట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా నెటిజన్లు శోధించిన అంశాల్లో సౌందర్యానికి సంబంధించి చెవికి ఎన్ని పుడకలు, రింగులు లేదా ఎలాంటి ఆభరణాలు వచ్చాయనే అంశాన్ని అధికంగా శోధించినట్టు గూగుల్, పింటరెస్ట్.. వంటివి ఒక వార్తను విడుదల చేశాయి. ఈ శోధనను గమనించిన ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు ఈ తరహా ఆభరణాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి సింగిల్ స్టడ్స్, హూప్స్‌ను డిజైన్ చేస్తున్నాయి. వీటిలో నక్షత్రరాశి రూపాన్ని పోలే ఆభరణాలు ఎక్కువ. ఇలా చెవులకు ఆభరణాలను అలంకరించడానికి ఎక్కువ కుట్లు వేయడం ఆక్యుప్రెజర్లో భాగంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు యువత గుర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేకమైన చెవి ఆక్యుప్రెజర్ పాయింట్ల వద్ద స్టడ్స్ అమర్చుకోవడం వల్ల మైగ్రేన్, ఆందోళన, కొద్దిపాటి ఉదర సమస్యలు తగ్గవచ్చనే భావన వల్ల వీటికి డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. గిరిజన జాతుల్లో చెవి చుట్టూత కుట్లు, వాటికి ఆభరణాల వాడకం మనకు తెలిసిందే. బహుశా ఆ స్టైల్ ఇప్పటి తరానికి బాగా నచ్చుతున్నట్టుగా ఉంది. -
న్యూ ఇయర్ ‘షాక్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈవెంట్ల నిర్వహణ కోసం ఎక్సైజ్ ఫీజు భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరాన్ని స్వాగతిస్తూ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈవెంట్లను నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోన్న తరుణంలో గతంలో ఉన్న ఈవెంట్ల ఫీజును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.9 వేలు ఉన్న ఫీజును రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. పెంచిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్త ర్వులు వచ్చేంతవరకు ఇవి అమల్లో ఉంటా యని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. గతంలో రూ.9 వేలే... వాస్తవానికి గతంలో ఈవెంట్ల నిర్వహణకు చాలా తక్కువగా ఎక్సైజ్ ఫీజు వసూలు చేసేవారు. ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్య, ఇతర అంశాలతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే రూ.9 వేలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.4,500 ఎక్సైజ్ ఫీజు కింద వసూలు చేసేవారు. అంటే ఈవెంట్లలో మద్యం సరఫరా అనుమతికి గాను ఈ ఫీజు తీసుకునేవారు. కానీ, చాలాకాలంగా ఈ ఫీజును సవరించకపోవడం, ఈవెంట్ల నిర్వహణ ఖరీదు కావడంతో ఫీజును పెంచాలని రెండు నెలల క్రితం ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు సాధారణ ఈవెంట్ల నిర్వహణకు గాను జీహెచ్ఎంసీ పరిధిలో.. రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. అదే స్టార్ హోటళ్లలో ఈవెంట్లను నిర్వహిస్తే దాన్ని రూ.9 వేల నుంచి రూ.20 వేలకు పెంచారు. ఇక జీహెచ్ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో.. సాధారణ ఈవెంట్లకు రూ.4,500 నుంచి రూ.9 వేలకు, స్టార్‌హోటళ్లలో అయితే రూ.4,500 నుంచి రూ.12వేలకు ఎక్సైజ్ ఫీజు పెంచారు. వాణిజ్య, క్రీడా ఈవెంట్లకు భారీ వడ్డన... హైదరాబాద్ పరిధిలో న్యూఇయర్‌తో పాటు పలు సందర్భాలను పురస్కరించుకుని నిర్వహించే ఈవెంట్లలో మందు సరఫరా అనుమతికి గాను కట్టాల్సిన ఫీజు కూడా గతంలో రూ.9 వేలే ఉండేది. ఇప్పుడు ఆ ఫీజును ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్య ఆధారంగా ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కనీసం 1000 మంది హాజరయ్యే ఈవెంట్లలో మందు సరఫరా కోసం రూ.50 వేలు, 5 వేల మందిలోపు హాజరయ్యే ఈవెంట్లకు రూ.లక్ష, అంతకన్నా ఎక్కువ మంది హాజరయితే రూ.2.5 లక్షలు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక నుంచి హైదరాబాద్‌లో జరిగే వాణిజ్య ఈవెంట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరనుంది. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే అక్కడ లిక్కర్ సరఫరాకు గాను గతంలో రూ.9 వేలు చెల్లించేవారు. కానీ మారిన నిబంధనల ఇప్పుడు రూ.2.5 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
న్యూ ఇయర్ వేడుకలు; షెడ్యూల్ వివరాలు
నూతన సంవత్సరం అనగానే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనికోసం యువత వినూత్న రీతిలో వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతుంటారు. ముఖ్యంగా నగర యువతీ యువకులు న్యూ ఇయర్ వేడుకలను హోటల్స్, రిసార్ట్స్, పబ్స్ అంటూ రకారకాలుగా ప్లాన్ చేసుకుంటారు. అందుకే రానున్న డిసెంబర్ 31ని నగర యువత వినూత్నంగా జరుపుకునేందుకు.. వేడుకలకు సంబంధించిన వివరాలను ఇక్కడ ఉంచాం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వేడుకలను నిర్వహించే వారిని సంప్రదించి ఈసారి మీ న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. న్యూ ఇయర్ ఈవెంట్స్ షెడ్యూల్, పూర్తి వివరాలు.. న్యూఇయర్ లైవ్ విత్ రాహుల్ సిప్లిగంజ్ తేది : 31 డిసెంబర్ 2019 సమయం : రాత్రి 7గంటల నుంచి స్థలం : సమ్మర్గ్రీన్ రిసార్ట్స్, తూంకుంట, శామీర్‌పేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు : కపుల్ : రూ.999/-, సిల్వర్ టేబుల్: రూ. 20వేలు, గోల్డ్ టేబుల్ : రూ. 40వేలు న్యూ ఇయర్ ఈవ్ : కంట్రీక్లబ్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:30 నుంచి స్థలం: కంట్రీక్లబ్, బేగంపేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ.799 నుంచి మొదలు ప్రత్యేకతలు: బాలీవుడ్ డీజే నైట్, ఫ్యాషన్ షో, మ్యాజిక్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్ న్యూ ఇయర్ ఫ్యామిలీ ఫన్ ఈవెంట్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 7:00 నుంచి స్థలం: శంకర్ పల్లి– హైదరాబాద్ రోడ్, కోకాపేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1000 నుంచి ప్రత్యేకతలు: గ్లో జంప్, న్యూ ఇయర్ కౌంట్‌డౌన్, కేక్ కట్టింగ్ పబ్–జీ 2కె19 తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంతం 6.00 నుంచి అర్థరాత్రి 1:00 వరకు స్థలం: డీ లేక్ వ్యూ రిసార్ట్, అజీజ్‌నగర్, మొయినాబాద్, రంగారెడ్డి ఎంట్రీ ఫీజు: రూ.699 నుంచి ప్రత్యేకతలు: లైవ్ డీజే ఫో, మ్యూజిక్ నైట్, ఫైర్ వర్క్స్ బూమ్రాంగ్ న్యూ ఇయర్ ఈవ్ 2019 తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంతం 6.00 నుంచి అర్థరాత్రి 1:00 వరకు స్థలం: వసంత సిటీ, హపీజ్‌పేట్, హైటెక్ సిటీ, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ.899 ప‹స్ట్ కమ్, రూ. 1299 నుంచి ప్రత్యేకతలు: డ్యాన్స్ షో, గార్లిండ్ స్టేజ్, ఫుడ్, లిక్కర్, మ్యూజిక్ నైట్ నైయ్ 2019ః ప్లే బాయ్ బీర్ గార్డెన్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు స్థలం: ప్లే బాయ్ బీర్ గార్డెన్,జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1499, రూ. 1999 ప్రత్యేకతలు: డీజే నైట్, లైవ్ మ్యూజిక్, ఫైర్ ప్లే న్యూఇయర్ 2019 ఇన్ లియోనియో తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు స్థలం: లియోనియో రిసార్ట్స్, శామీర్‌పేట, రంగారెడ్డి ఎంట్రీ ఫీజు: రూ. 1999, రూ. 2999 ప్రత్యేకతలు: లైవ్ షో విత్ ఎల్వీ రేవంత్, మాలవిక సుందర్, అనురాగ్ కులకర్ణి, లిప్సిక బాష్యమ్, సిమ్రన్ చౌదరి టీవోటీ న్యూయర్ ఈవ్ తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: టీవోటీ, రోడ్ నెంబర్ 10, ఇక్రిశాట్ కాలనీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 2000 ఇద్దరికి ప్రత్యేకతలు: డీజే నైట్ విత్ జస్టిన్ మైలో, శివ్, మైరిస్ న్యూ ఇయర్ ఈవ్ః ప్రిసమ్ క్లబ్ తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: ప్రిసమ్ క్లబ్,ఓల్డ్ ముంబయి హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గౌలిదొడ్డి, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1200 ఇద్దరికి ప్రత్యేకతలు: పాపులర్ డీజే షో, ఫుడ్ అండ్ డ్రింక్స్ స్పాయిల్ న్యూ ఇయర్ బాష్ 2020 తేది: 25 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: డిసెంబర్ 25, రాత్రి 8:00 నుంచి స్థలం: స్పాయిల్, రోడ్ నెంబర్ 1, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1100 ఇద్దరికి ప్రత్యేకతలు: ఇంటర్నేషనల్ డీజే, స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఫన్ ఎక్స్టెండెడ్ 2019ః ట్రైడెంట్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 12.30 వరకు స్థలం: హోటల్ ట్రైడెంట్, మాదాపూర్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 4499, రూ. 7999 ప్రత్యేకతలు: అన్లిమిటెడ్ ఫుడ్, లక్కీడ్రా ఫర్ ట్రిప్ టూ బాలీ, ప్రీమియమ్ బేవరేజెస్ న్యూ ఇయర్ ఈవ్ @ రామోజీ ఫిల్మ్ సిటీ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 1 గంట వరకు స్థలం: రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 4999, రూ. 2999 ప్రత్యేకతలు: స్పెషల్ ఫర్పార్మెన్స్ విత్ సింగర్ ఉషా ఉతుప్, డీజే నైట్ విత్ శివప్రసాద్ న్యూ ఇయర్ ఈవ్ః తాజ్ డెక్కన్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు స్థలం: తాజ్ డెక్కన్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 2999, రూ.4999 ప్రత్యేకతలు: ఫ్యాషన్ షో, మ్యాజిక్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్, సెల్ఫీ ఫెస్టివల్ న్యూ ఇయర్ ఈవ్ @ ఫ్యూజన్ 9 తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం:మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 9:00 వర కు స్థలం: ఫ్యూజన్ 9, ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1499, రూ. 3399 ప్రత్యేకతలు: డీజై లైవ్ షో, రాక్ బాండ్ మ్యూజిక్ మ్యాడ్ ఆన్ 2కె20ః బీస్పోర్టీ తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: సాయంత్రం 6:00 నుంచి 12.30 గంటల వరకు స్థలం: స్పోర్ట్ కాంప్లెక్స్,మెరిడియన్ స్కూల్ రోడ్, మాదాపూర్, హైటెక్‌సిటీ, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1500 ఒక్కరికి, రూ. 2500 ఫర్ కపుల్స్ ప్రత్యేకతలు: 3డీ లేసర్ షో, లైవ్ డ్యాన్స్ షో, డీజే నైట్, రాక్ బాండ్ మ్యాజిక్ న్యూయర్ ఇన్ డెక్కన్ ట్రయల్స్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంత్రం 6:00 నుంచి స్థలం: బేగంపేట హాకీ స్టేడియం,ఉమానగర్,బేగంపేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 500 నుంచి ప్రత్యేకతలు: మ్యూజిక్, ఫుడ్ పెస్టివల్ అనంతగిరి హిల్స్ న్యూ ఇయర్ ప్రీ పార్టీ తేది: 28 డిసెంబర్ నుంచి సమయం: మధ్యాహ్నం 12:30 నుంచి ప్రారంభం స్థలం: వికారాబాద్, రంగారెడ్డి, తెలంగాణ ప్రత్యేకతలు: క్యాంపింగ్, ట్రెక్కింగ్, మ్యూజికల్ నైట్ గేటెబ్ కమ్యూనిటీ న్యూఇయర్ పార్టీ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంత్రం 6:00 నుంచి స్థలం: దివ్యశ్రీ శక్తి, మయూరి నగర్, మియాపూర్, హైదరాబాద్ ప్రత్యేకతలు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విత్ గ్రూఫ్ ఆఫ్ పీపుల్ జోష్ 2020 న్యూయర్ పార్టీ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: శ్రీ కన్వెన్షన్, దూలపల్లి రోడ్, కొంపల్లి , హైదరాబాద్ ప్రత్యేకతలు: లైవ్ షో విత్ డీజే షరోన్ సహస్ర న్యూ ఇయర్ గాథరింగ్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: హైదరాబాద్ ప్రత్యేకతలు: డీజే నైట్, ఫైర్ వర్క్, లైవ్ స్ట్రీమింగ్, లిమిటెడ్ డ్రింకింగ్, ఫుడ్ పెస్టివల్ మైస్టీ 5 నై బ్లాస్ట్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: బేగంపేట హాకీ స్టేడియం,ఉమానగర్,బేగంపేట, హైదరాబాద్ ప్రత్యేకతలు: మ్యూజిక్ విత్ డీజే ఆంద్రా, డీజే సోనాలి కత్యాల్ న్యూ ఇయర్ ఈవ్ ఎట్ తాజ్ బంజార తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: తాజ్ బంజార, రోడ్ నెంబర్ 1,బంజారా హిల్స్, హైదరాబాద్ ప్రత్యేకతలు: డీజే ఫ్లెక్స్, లైవ్ గ్రూఫ్ డ్యాన్స్ షో - ఎస్.వరుణ్ (వెబ్‌డెస్క్)