yellareddy constituency
-
పోలీసుల లాఠీచార్జి..ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపు
కామారెడ్డి జిల్లా : ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట్లో ప్రమాదవశాత్తు చెరువులో పడి సిద్ధవ్వ(45) అనే మహిళ మృతి చెందారు. దీంతో సిద్ధవ్వ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుల ధర్నా, రాస్తారోకో దిగారు. రాస్తారోకో చేస్తున్న వారిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి నల్లమడుగు సురేందర్ గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం(రేపు) కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. -
ఎల్లారెడ్డి సెంటిమెంట్..
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్ : ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచి ప్రారంభించే ఏ పనైనా విజయవంతం అవుతుందన్న సెంటిమెంట్ ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో రూ. 13.23 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఇటీవల నిర్మించిన 1,043 వ్యవసాయ గిడ్డంగులలో మొట్టమొదటి గిడ్డంగిని ఎల్లారెడ్డిలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రారంభించిన ఏ పథకమైనా విజయవంతం అవుతుందన్న నమ్మకం తమకుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయానికి 9 గంటలపాటు పగటి పూట విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, కోటి ఎకరాలకు నీటిని అందిచాలన్న లక్ష్యంతో సాగుతున్నామన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి వాక్యాన్ని కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల వీణగా మార్చనున్నారన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు హరీశ్‌రావుకు నాగలిని బహూకరించారు. -
ఈ నాయకులు.. మాకొద్దు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈ నాయకులు మాకొద్దంటూ పలువురు ఓటర్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబో) మీట నొక్కారు. నిజామాబాద్ అర్బన్‌లో అతి తక్కువగా ఈ మీటను ఉపయోగించుకోగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా నోటాకు ఓటేశారు. ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. నచ్చిన అభ్యర్థులు ఎవరూ లేనందున తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని సాకులు చెప్పేవారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బ్యాలెట్లో నోటాను చేర్చారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో దీనిని చాలామంది వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 7,766 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 8,264 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 695 మంది, నిజామాబాద్ రూరల్ స్థానంలో 2 వేల మంది, కామారెడ్డిలో 1,479, బాన్సువాడలో 1,313, జుక్కల్‌లో 1,430, బోధన్‌లో 1,397, ఆర్మూర్‌లో 1,435, బాల్కొండలో 1,525, ఎల్లారెడ్డిలో 2,212 మంది నోటాను వినియోగించుకున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 16 వేలపైచిలుకు మంది ఓటర్లు నోటాకు ఓటేసి అభ్యర్థులెవరూ నచ్చలేదని చెప్పడం గమనార్హం. మహిళ మెడలోంచి చైన్ చోరీ నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ మెడలోంచి దొంగలు బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యారు. ఒకటో టౌన్ ఎస్హెచ్ఓ నర్సింగ్ యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన సరిత తన తోటి కోడలుతో కలిసి శనివారం నిజామాబాద్‌లోని ద్వారకానగర్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చూపించుకుని నడుచుకుంటూ వెళ్తుండగా వీరి వద్దకు బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. సరిత మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పారిపోయారు. ఆమె తేరుకుని అరిచేలోపే దొంగలు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్హెచ్ఓ తెలిపారు.