ఎల్లారెడ్డి సెంటిమెంట్.. | yellareddy sentiment | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి సెంటిమెంట్..

Published Sun, Apr 10 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

yellareddy sentiment

ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్ : ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచి ప్రారంభించే ఏ పనైనా విజయవంతం అవుతుందన్న సెంటిమెంట్ ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో రూ. 13.23 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఇటీవల నిర్మించిన 1,043 వ్యవసాయ గిడ్డంగులలో మొట్టమొదటి గిడ్డంగిని ఎల్లారెడ్డిలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రారంభించిన ఏ పథకమైనా విజయవంతం అవుతుందన్న నమ్మకం తమకుందన్నారు.

రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయానికి 9 గంటలపాటు పగటి పూట విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, కోటి ఎకరాలకు నీటిని అందిచాలన్న లక్ష్యంతో సాగుతున్నామన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి వాక్యాన్ని కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల వీణగా మార్చనున్నారన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు హరీశ్‌రావుకు నాగలిని బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement