Yellareddyguda
-
సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..
సాక్షి, హైదరాబాద్: రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గొర్రెలు, బర్రెల్ని అడ్డదారిలో సొంతం చేసుకుని, వాటిని మార్కెట్లో అమ్మేసి వచ్చిన లాభాలు పంచుకుందామంటూ ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యక్తి నుంచి కొందరు రూ.75 లక్షలు తీసుకున్నారు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీలో నివసించే బాధితుడికి సనత్‌నగర్‌లో నివసించే కె.అర్వింద్‌కుమార్‌తో పదేళ్లుగా పరిచయం ఉంది. గతేడాది ఫిబ్రవరి 15న అర్వింద్ ద్వారా చౌదరిగూడకు చెందిన ఎస్.శ్రీనివాస్‌రావుతో బాధితుడిని పరిచయమైంది. శ్రీనివాస్ ఘట్కేసర్లోని ప్రభుత్వ పశువైద్యశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. తెలంగాణ వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడిగానూ ఉన్న శ్రీనివాస్‌కు మంచి పలుకుబడి ఉందంటూ అర్వింద్ బాధితుడితో చెప్పాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో శ్రీనివాస్‌కు రూ.కోటి అవసరం ఉందని చెప్పాడు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీపై బర్రెలు, గొర్రెలు అందించే పథకం మార్చ్ 31తో ముగుస్తుందని చెప్పాడు. చదవండి: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్ అయితే అనేక గ్రామాల్లోని రైతులు మార్జిన్ మనీ కట్టలేకపోయారని, వారి తరఫున మనమే కడదామంటూ ఎర వేశాడు. ఆ స్కీమ్‌లో వచ్చిన బర్రెలు, గొర్రెల్ని మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుందామన్నారు. అలా వచ్చిన లాభాలను పంచుకుందామంటూ ఎర వేశారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య లక్ష్మికి రూ.58 లక్షలు నగదు రూపంలో ఇచ్చాడు. మరో రూ.17 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా లక్ష్మి ఖాతాకు బలీ చేశాడు. ఆ సందర్భంలో శ్రీనివాస్ ఏడు చెక్కులతో పాటు బాండ్ పేపర్ అందించాడు. అప్పట్లో నిందితులు చెప్పిన దాని ప్రకారం గతేడాది ఏప్రిల్‌లోనే అసలు, లాభాలు బాధితుడుకి ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి డబ్బు ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో ఇటీవల బాధితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లగా తాళం వేసుంది. అతడి వివరాలు చెప్పాలంటూ అనిల్‌ను కోరగా బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనివాస్, అర్వింద్, లక్ష్మీ తదితరులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మొక్కలకు నీరు పడుతుండగా దూసుకొచ్చిన మృత్యువు -
కన్న తల్లిని కర్రతో కొట్టి చంపిన కొడుకు
-
'అత్తింటి వాళ్లే కలసి చంపేశారు'
-
తన భర్తే వ్యభిచారం చేయమన్నాడని..
-
వ్యభిచారం చేయమన్నాడని... ఆత్మహత్య చేసుకుంది
హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందనే కారణంగా భార్యను పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని... లేకుంటే వ్యభిచారం చేసి సంపాదించాలని భర్తతోపాటు అత్తమామలు వేధింపులు తాళ లేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన నగరంలోని ఎల్లారెడ్డిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న సదరు గృహణికి ఇటీవల ఆడపిల్ల జన్మించింది. దీంతో పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామల నుంచి వేధింపులు మొదలైయ్యాయి. అందుకు ససేమీరా అనడంతో వ్యభిచారం చేసి సొమ్ము సంపాదించి పెట్టాలని వారు గృహణిని వేధించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా భర్తతోపాటు అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
విషాదం నింపిన ‘రాఖీ’
రాఖీ పండగకు వచ్చిన ఆడపడుచులు అప్పటి వరకు పుట్టింటి వారితో ఉల్లాసంగా గడిపారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టసుఖాల గురించి మాట్లాడుకుంటూ ఆనందంగా ఉన్నారు. కానీ, విధి వారి సంతోషాన్ని ఎంతో సేపు నిలువనీయలేదు. సోదరుడికి రాఖీ కట్టి అక్కడి నుంచి చిన్నాన్న ఇంటికి బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో మాటేసిన మృత్యువు వారి పిల్లలను రోడ్డు ప్రమాదరూపంలో తన ఒడికి చేర్చుకుంది. పిల్లలిద్దరి మృతితో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పండగకని వస్తే ఎంత పని చేశావు దేవుడా అంటూ బాధిత కుటుం బ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. యల్లారెడ్డిగూడెం (నార్కట్‌పల్లి) : రాఖీ పౌర్ణమి రోజు ఆనందం వెల్లివిరియాల్సిన ఆ ఇళ్లలో విషాదం నిండుకుంది. పుట్టింట్లో సోదరుడికి రాఖీ కట్టి చిన్నాన్న ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల పిల్లలు ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యా యి. నార్కట్‌పల్లి మండలం యల్లారెడ్డిగూడెం వద్ద జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో పెను విషా దం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. చెర్వుగట్టు గ్రామానికి చెందిన మాదగోని శంకర్‌కు అయిదుగురు అక్కాచెళ్లెల్లు. వీరిలో సూర్యాపేట మండలం బాలెంలకు చెందిన పాడూరు ధనలక్ష్మి తన కుతూరు మౌనికతో కలిసి ఆదివారం ఉదయం సోదరుడికి రాఖీ కట్టడానికి వచ్చింది. కాసేపటికి చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన బొంగు పా ర్వతమ్మ తన కుమారుడు వెంకన్నతో కలిసి పుట్టింటికి వచ్చింది. సోదరుడు శంకర్‌కు రాఖీ కట్టిన తర్వాత యల్లారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న తమ చిన్నాన శంకరయ్య ఇంటికి రాఖీ కట్టి రావడానికి ధనలక్ష్మి, మౌనిక, వెంకన్న బైక్‌పై బయలుదేరారు. యల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వెళుతున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వెంకన్న (17), మౌనిక (14) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ధనలక్ష్మికి తీవ్రగాయా లు కావడంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలిని సందర్శించా రు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొం డలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రాఘవరావు, ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. కారు డ్రైవర్‌కు దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని నార్కట్‌పల్లి తహసీల్దార్ రాములు, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ కొండూరు శంకర్, ఎంపీటీసీ సభ్యురాలు నల్లా అనిత వెంకన్న సందర్శించారు. గ్రామస్తుల ధర్నా నార్కట్‌పల్లి - అద్దంకి రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చే యాలని డిమాండ్ చేస్తూ యల్లారెడెం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. సర్వీస్ రోడ్డు లేకపో వడం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. ఎస్ఐ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. బాలెంలలో విషాదం బాలెంల (సూర్యాపేటరూరల్) : నార్కట్‌పల్లి మం డలం యల్లారెడ్డిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట మండలం బాలెంలకు చెందిన మౌనిక మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. మౌనిక సూర్యాపేటలోని సిద్ధార్థ స్కూల్లో 7వ తరగతి చదువుతుంది. ఆమె మృ తిపట్ల గ్రామ సర్పంచ్ మారెపల్లి ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యుడు బిక్కుసింగ్ సంతాపం తెలిపారు. -
ఇంకా ఆచూకీ దొరకని చిట్టీల రాణి
-
లారీలో పారిపోయిన చిట్టీలరాణి
-
సామాన్లతో సహా.. లారీలో పారిపోయిన చిట్టీలరాణి
హైదరాబాద్: టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచిన బత్తుల విజయరాణి తన ఇంటి సామాన్లను సైతం సర్ధుకుని లారీలో పారిపోయినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. ఎల్లారెడ్డిగూడలో ఉన్న అద్దె ఇంటిని ఈ నెల 10వ తేదీనే ఖాళీ చేసిందని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఇంటి యజమాని తెలిపారు. సామాన్లను తరలించిన లారీ ఎక్కడ నుంచి తెచ్చారో కనిపెడితే ఆమె చిక్కినట్లేనని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మరో నిందితురాలు మధులత కుమారుడు శ్రీను ఆమె వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆమె దగ్గరి కుటుంబ సభ్యులు అందరి ఇళ్లను పోలీసులు గాలించినా అందరి ఇళ్లకు తాళాలు కనిపించాయి. పథకం ప్రకారమే కొడుకు, కోడలుతో పాటు చెల్లెలు, ఇతర బంధువులను ఇతర ప్రాంతాలకు తరలించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే ఆమె పథక రచన చేసినట్లు తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్ కాలనీ, అమీర్‌పేటలో ఆమె నిర్వహిస్తున్న మూడు మెస్‌లను కూడా ఖాళీ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. -
విజయరాణిపై కేసు నమోదు చేస్తాం