
విషాదం నింపిన ‘రాఖీ’
రాఖీ పండగకు వచ్చిన ఆడపడుచులు అప్పటి వరకు పుట్టింటి వారితో ఉల్లాసంగా గడిపారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టసుఖాల గురించి మాట్లాడుకుంటూ ఆనందంగా ఉన్నారు. కానీ, విధి వారి సంతోషాన్ని ఎంతో సేపు నిలువనీయలేదు. సోదరుడికి రాఖీ కట్టి అక్కడి నుంచి చిన్నాన్న ఇంటికి బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో మాటేసిన మృత్యువు వారి పిల్లలను రోడ్డు ప్రమాదరూపంలో తన ఒడికి చేర్చుకుంది. పిల్లలిద్దరి మృతితో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పండగకని వస్తే ఎంత పని చేశావు దేవుడా అంటూ బాధిత కుటుం బ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది.
యల్లారెడ్డిగూడెం (నార్కట్‌పల్లి) : రాఖీ పౌర్ణమి రోజు ఆనందం వెల్లివిరియాల్సిన ఆ ఇళ్లలో విషాదం నిండుకుంది. పుట్టింట్లో సోదరుడికి రాఖీ కట్టి చిన్నాన్న ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల పిల్లలు ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యా యి. నార్కట్‌పల్లి మండలం యల్లారెడ్డిగూడెం వద్ద జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో పెను విషా దం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. చెర్వుగట్టు గ్రామానికి చెందిన మాదగోని శంకర్‌కు అయిదుగురు అక్కాచెళ్లెల్లు. వీరిలో సూర్యాపేట మండలం బాలెంలకు చెందిన పాడూరు ధనలక్ష్మి తన కుతూరు మౌనికతో కలిసి ఆదివారం ఉదయం సోదరుడికి రాఖీ కట్టడానికి వచ్చింది. కాసేపటికి చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన బొంగు పా ర్వతమ్మ తన కుమారుడు వెంకన్నతో కలిసి పుట్టింటికి వచ్చింది.
సోదరుడు శంకర్‌కు రాఖీ కట్టిన తర్వాత యల్లారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న తమ చిన్నాన శంకరయ్య ఇంటికి రాఖీ కట్టి రావడానికి ధనలక్ష్మి, మౌనిక, వెంకన్న బైక్‌పై బయలుదేరారు. యల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వెళుతున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వెంకన్న (17), మౌనిక (14) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ధనలక్ష్మికి తీవ్రగాయా లు కావడంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలిని సందర్శించా రు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొం డలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రాఘవరావు, ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు.
కారు డ్రైవర్‌కు దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని నార్కట్‌పల్లి తహసీల్దార్ రాములు, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ కొండూరు శంకర్, ఎంపీటీసీ సభ్యురాలు నల్లా అనిత వెంకన్న సందర్శించారు.
గ్రామస్తుల ధర్నా
నార్కట్‌పల్లి - అద్దంకి రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చే యాలని డిమాండ్ చేస్తూ యల్లారెడెం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. సర్వీస్ రోడ్డు లేకపో వడం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. ఎస్‌ఐ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు.
బాలెంలలో విషాదం
బాలెంల (సూర్యాపేటరూరల్) : నార్కట్‌పల్లి మం డలం యల్లారెడ్డిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట మండలం బాలెంలకు చెందిన మౌనిక మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. మౌనిక సూర్యాపేటలోని సిద్ధార్థ స్కూల్‌లో 7వ తరగతి చదువుతుంది. ఆమె మృ తిపట్ల గ్రామ సర్పంచ్ మారెపల్లి ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యుడు బిక్కుసింగ్ సంతాపం తెలిపారు.