york shire
-
మైఖేల్ వాన్‌పై నిషేధం..!
Michael Vaughan Dropped From BBC After Racism Allegations: జాత్యాహంకార ఆరోపణల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ వాన్‌పై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ నిషేధం విధించింది. తమ ఛానల్లో ప్రసారమయ్యే "ద టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో" నుంచి వాన్‌ను తప్పిస్తున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. వాన్ బీబీసీలో గత 12 ఏళ్లుగా టెస్ట్ మ్యాచ్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో నాటింగ్హమ్‌తో మ్యాచ్ సందర్భంగా తనతో పాటు జట్టులోని పలువురు సభ్యులపై వాన్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడని యార్క్‌షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీబీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీబీసీ చర్యలను వాన్ పూర్తిగా ఖండించాడు. తనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. 1991 నుంచి 2009 వరకు ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాన్.. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాన్ చాలాసార్లు తన నోటికి పని చెప్పాడు. ఇదిలా ఉంటే, జాతి వివక్షపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. వాన్‌పై ఫిర్యాదు చేసిన రఫీక్ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: యార్క్‌షైర్ కౌంటీపై వేటు -
అరుదైన రింగ్ కు అదిరే ధర!
15 శతాబ్దానికి చెందిన అరుదైన ఉంగరాన్ని ఉత్తర యార్క్ షైర్ కు చెందిన లీ రోస్సిటెర్ అనే వ్యక్తి ఐదంకెల ధరకు అమ్మేశాడు. ఈబే ఈ కామర్స్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన ఓ మెటల్ డిటెక్టర్ తో అరుదైన ట్యూడర్ ఉంగరాన్ని కనుగొన్నట్లు చెప్పాడు. 80శాతం బంగారంతో తయారుచేసిన ఈ ఉంగరంలో రూబీ, ఎమరాల్డ్ రాళ్లు ఉన్నాయని తెలిపాడు. యార్క్ షైర్ లోని గ్రీన్ హామ్మర్ టన్ మెటల్ డిటెక్టర్ క్లబ్ లో ప్రాచీన కాలపు వస్తువుల కోసం వెతుకుతున్న సమయంలో ఈ ఉంగరం లభ్యమైనట్లు వివరించాడు. ఉంగరాన్ని స్నేహితులకు చూపిస్తే ఇది బంగారం కాదని పారేయమని చెప్పారని తెలిపాడు. కానీ ఉంగరం బరువు ఉండటంతో నిపుణుడిని సంప్రదిస్తే మంచిదని భావించినట్లు చెప్పాడు. బ్రిటిష్ మ్యూజియంలో చేయించిన పరీక్షల్లో ఉంగరంలో 80శాతం బంగారం ఉన్నట్లు తేలిందని, అంతేకాకుండా ప్రాచీన కాలానికి చెందిన అత్యంత విలువైన ఉంగరమని చెప్పారని తెలిపాడు. ఆ కాలంలో కేవలం రాజుల కుటుంబాలకు చెందిన వారు మాత్రమే బంగారు ఉంగరాలను ధరించేవారని వెల్లడించాడు. -
ఆలుగడ్డలు బహుఖతర్నాక్
ఆలుగడ్డలతో ఆటలాడొద్దు. అవి బహు ఖతర్నాక్. ఆలుగడ్డలు ఇంగ్లండ్ లోని యార్క్ షైర్ లోని ఓ బిజీ రోడ్డును అయిదు గంటల పాటు పూర్తిగా ఆపేశాయి. శనివారం యార్క్ షైర్ లో ఉడకబెట్టి, చిదిమి ప్యాక్ చేసిన ఆలూ పేస్ట్ ను తీసుకెళ్తున్న ఒక లారీ బోల్తాపడింది. అందులోని ఉడకబెట్టిన ఆలూ పేస్ట్ రోడ్డంతా పడిపోయింది. వాతావరణంలో తేమ, మంచు ల వల్ల ఆ పేస్ట్ నెమ్మదిగా రోడ్డు రోడ్డంతా విస్తరించింది. ఆ తరువాత ఇంకేముంది? ఈ పేస్టులో వాహనాలు స్కిడ్ అయ్యాయి. కార్లు బోల్తాపడ్డాయి. ఇక పాదచారుల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. ఒళ్లంతా పేస్టు పులుముకుపోయింది. కాస్త ఉప్పు, కాసింత కారం వేస్తే కూరగా మారిపోయే పరిస్థితి! చివరికి మంచును తొలగించే పారలు, యంత్రాలు తెచ్చి అయిదు గంటల పాటు శ్రమిస్తే కానీ అలూ పేస్టు వదలలేదు. ఇంగ్లండ్ లో గతంలోనూ ఇలా బంగాళాదుంపలు రహదారుల దుంపతెంచాయి.