Young Boy Commits Suicide
-
ప్రేయసికి వివాహం.. ప్రియుడి ఆత్మహత్య
మార్టూరు: ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజుపాలెం తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన బైరపోగు కాసియ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు కిశోర్ (21) బేల్దారి పని చేస్తుంటాడు. అతడు ఏడాది నుంచి అదే కాలనీకి చెందిన ఓ బాలికతో ప్రేమయాణం సాగిస్తున్నాడు. ఇంతలో ఐదు నెలల క్రితం అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పెద్దలు బాలికకు వివాహం జరిపించారు. ఆమె గత వారం భర్తను వదిలి నీతోనే ఉంటానని కిశోర్ ఇంటికి వచ్చింది. ఆమె భర్త తరఫు బంధువుల ఫిర్యాదుతో విషయం పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు కలిసి బాలికకు, కిశోర్‌కు రెండు రోజుల క్రితం పోలీసుస్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి దారిన వారిని పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిశోర్ టవల్‌తో ఇంటి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన బంధువులు అతడిని మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కిశోర్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారించి వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రిలో కిశోర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
పోలీసుల మందలింపుతో యువకుడి ఆత్మహత్య
కోస్గి: పోలీసులు మందలించడంతో ఆందోళనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచకు చెందిన మారుతి (19) డిగ్రీ మధ్యలోనే ఆపి వేసి హైదరాబాద్‌లో పని చేసుకుంటుండేవాడు. అయితే ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడిపి తనకు గర్భం రావడానికి కారణమయ్యాడని అదే గ్రామానికి చెందిన ఓ యువతి (22) తన తల్లితో కలసి ఈనెల 17న పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు రప్పించి ‘అమ్మాయి ని పెళ్లి చేసుకుంటావా.. కేసు పెట్టమంటావా?’అనడంతో భయపడిన మారుతి పెళ్లి చేసుకుంటాన ని అంగీకారపత్రం రాసిచ్చాడు. మరుసటి రోజే సాయిబాబ మందిరంలో పెళ్లి చేసేందుకు ఎస్ఐ నాగరాజు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మారుతి, తాను మైనర్‌నని.. ఆధార్ కార్డులో పుట్టి న తేదీ తప్పుగా నమోదైందని పోలీసులకు తెలిపా డు. దీంతో పాఠశాలలో ఇచ్చిన బోనఫైడ్ సర్టిఫికె ట్ తీసుకురావాలని ఎస్ఐ సూచించడంతో అక్కడినుంచి బయటకు వచ్చిన మారుతి తప్పించుకుని హైదరాబాద్‌కు పారిపోయాడు. ఈ నేపథ్యంలో మారుతిని పోలీసులే వదిలేశారని, ఎలాగైనా అతనితో పెళ్లి చే యాలని యువతి పట్టుబట్టడం తో అతనిపై కేసు నమోదు చేశా రు. ఇది తెలుసుకున్న మారుతి బుధవారం రాత్రి స్వగ్రామాని కి వచ్చి అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. గురువారం ఉదయం అటువైపు వెళ్లిన కొందరు కాలనీవాసులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ వేధింపుల వల్లే బలవన్మరణం ఇదిలా ఉండగా ఎస్ఐ భయపెట్టడం వల్లే మారుతి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి అంజిలయ్య, సోదరుడు రవి ఆరోపించారు.ఎస్ఐ వచ్చే దాకా తీసేదిలేందటూ మృతదేహం వద్దే బైఠాయించారు. దీంతో కోస్గి సీఐ ప్రేమ్‌కుమార్ బాధితులతో మాట్లాడి సమగ్ర విచారణ జరిగిపి బా ధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎస్ఐ నాగ రాజును వివరణ కోరగా, యువతి ఫిర్యాదు మేరకు మారుతిని పిలిపించి విచారించిన మాట వాస్తవమేనన్నారు. అతను మైనర్‌ను కాబట్టి ఏడాది తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోపాటు అమ్మాయి కుటుంబ సభ్యుల ఎదుటే లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడన్నారు. -
ఉసురు తీసిన అప్పు
కాకినాడ క్రైం :అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడమే కాక, దుర్భాషలాడడంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు రుణదాత ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. కాకినాడ జగన్నాథపురం శివారు మహాలక్ష్మినగర్‌కు చెందిన పెరుమాళ్ల కోవెల సూర్యప్రకాష్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం అతడు సమీపంలోని నాగరాజు అనే వ్యాపారి వద్ద చేసిన రుణానికి సంబంధించి వడ్డీతో పాటు చెల్లించినప్పటికీ కొద్దిగా బాకీ ఉండిపోయింది. అది తీర్చాలని ప్రకాష్‌పై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఈ నెల 24న నాగరాజు అతని ఇంటికి వచ్చి ఘర్షణకు దిగాడు. ఆ సమయంలో ఇంటి వద్దే ఉన్న ప్రకాష్ రెండో కుమారుడు ప్రసాద్ (23) సర్దిచెప్పబోగా అతనిపై నాగరాజు విరుచుకుపడి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ అక్కడికి సమీపంలో ఉన్న జిమ్‌లో అతని సేహితుల వద్దకు వచ్చి తాను తాను చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగాడు. దీంతో స్నేహితులు ప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అతన్ని జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నాగరాజు ఇంటివద్ద ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ నాగరాజును వెంటనే అరెస్టు చేయాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న నాగరాజు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.