The young farmer
-
వాట్సాప్ ఐడియా !
ఇంటి వద్దకే పూల సరఫరా రైతు వినూత్న ఆలోచన బొమ్మనహళ్లి : రైతు తాను పండించిన పంటలకు తానే మార్కెట్‌ను సృష్టించుకోవడం వల్ల మంచి లాభా లను పొందవచ్చు అన్నదానికి నిదర్శనం ఈ యువ రైతు. తాను పండించిన బంతిపూలకు మార్కెట్లో సరైన లాభాలు లేక పోవడంతో నిస్సహాయ పడకుండ తన తెలివితో వాట్సాప్ ద్వారా ఆ పూలను అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నాడు రైతు రోషన్. ఇప్పటికే సరాసరి ఒక టన్ను బంతి పూలను కొనుగోలు చేసుకోవడానికి బుక్ చేసుకున్నారు. భాగలకోటకు చెందిన యువ రైతు రోషన్ వైజాపుర తన తెలివి తేటలతో బంతిపూలను వా ట్సాప్ ద్వారా పూలను అవసరమున్నవారికి ఇంటి వద్దకే రవాణా చేస్తున్నాడు. పూల తోటలో సాగు చేసిన పూలను వాట్సాప్ ద్వారా ఫొటోలు తీసి బు కింగ్ ఓపెన్ అని పెట్టి మెసేజ్ పంపిస్తున్నాడు. కేవలం గంట వ్యవధిలోనే 900 కిలోల బంతిపూల కొనుగోలుకు పలువురు ముందుకు వచ్చారు. వినియోగదారులు ఇచ్చిన చిరునామా ఆధారంగా పూలను సకాలంలో అందజేస్తూ వారిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. రోషన్ మాట్లాడుతూ... పండుగ రోజుల్లో కిలో బంతిపూలు రూ. 100పైనే ధర ఉంటుందని, కొన్ని రోజుల క్రితం కిలోకు రూ. 15లు పలికేదని, సాగుచేసినా లాభాలు వచ్చేవి కావని రోషన్ తెలిపాడు. వాట్సాప్ ద్వారా పూలను ఎటువంటి అనవసర వ్యయం లేకుండా ఆర్డర్ ఇచ్చిన వారి ఇంటికే వెళ్లి అందజేస్తున్నట్లు చెప్పాడు. వాట్సాప్ ఐడియా తనకు లాభాలను తెచ్చిపెడుతోందని రోషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
వెల్దుర్తి: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఉప్పులింగాపూర్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బజావత్ చెందు(30) తనకున్న పొలంలో రెండేళ్ల నుంచి పంట సాగు కోసం చేసిన అప్పు పెరిగి రూ. 2లక్షలకు చేరింది. ఏడాది నుండి పంటలు పండక, చేసిన అప్పు భారమైంది. ఆపై సోదరి పెళ్లి ఎలా చేయాలో అర్థం కాక మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బుజ్జి ఇప్పుడు గర్భవతి. ఇద్దరు కూతుళ్లు అంజలి, కావ్యలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.