younger genaration
-
నవ యువ ఇన్వెస్టార్స్
‘ఎంజాయ్ చేద్దాం...దీంతో పాటు పొదుపు కూడా చేద్దాం’ అంటుంది యువతరం. పొదుపు సంగతి పక్కన పెడితే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ లెక్కల ప్రకారం మిలీనియల్స్, జెన్–జెడ్ నుంచి మదుపు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. కోవిడ్ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న టెక్–శావీ యంగర్ జనరేషన్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లపై అధిక ఆసక్తి ప్రదర్శిస్తోంది. దిల్లీకి చెందిన ప్రియాంక భాటియా మంచి ఉద్యోగమే చేస్తోంది. అయితే సహ ఉద్యోగులు సొంత ఇల్లు కొనుక్కున్నారుగానీ తాను మాత్రం కొనలేకపోయింది. దీనికి కారణం ఆ ఉద్యోగులకు ఎక్కువమొత్తంలో పొదుపు చేసే అలవాటు ఉండడం. తానేమో బాగా ఖర్చు చేస్తుంది. ‘ఇలా అయితే ఇక కష్టం’ అనుకున్న ప్రియాంక కొత్త అడుగులు వేసింది. స్టాక్ ఇన్వెస్టర్, ప్రాపర్టీ ఇన్వెస్టర్, బిజినెస్ కోచ్... మొదలైన వారితో మాట్లాడటం, పుస్తకాలు చదవడం, వర్క్‌షాప్‌లకు హాజరు కావడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకోగలిగింది. ఆ తరువాత స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయింది. పొదుపుపై అధికదృష్టి పెట్టింది. ఉద్యోగానికి రాజీనామా చేసి వావ్ (ఉమెన్ ఆన్ వెల్త్) ఫైనాన్షియల్ కోర్స్‌ను రూపొందించి ‘ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్’ పేరుతో శిక్షణ ఇస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రియాంకకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువమంది యువతరమే. ఇండోర్‌కు చెందిన రాజ్ షమని డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు మంచి ఇన్వెస్టర్ కూడా. సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘పొదుపు చేయడం అనేది కూడా ఒక కళ. సరిౖయెన పద్ధతిలో పొదుపు చేయడం ఎలా?’ అనే టాపిక్‌పై రాజ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ‘పర్సనల్ ఫైనాన్స్ నుంచి పాసివ్ ఇన్కమ్ వరకు యువతరం రకరకాల విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. అయితే కేవలం ఆసక్తి మాత్రమే సరిపోదు. స్టాక్‌మార్కెట్ నుంచి క్రిప్టో కరెన్సీ వరకు అవగాహన లేకుండా దిగితే నష్టాలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది.’ అంటున్నారు ఆర్థికనిపుణులు. అయితే యువ ఇన్వెస్టర్లు ‘ఇన్వెస్ట్మెంట్’ను ఆషామాషీగా తీసుకోవడం లేదు. కేవలం ఉత్సాహంతో మాత్రమే ఇన్వెస్టర్ అవతారం ఎత్తడం లేదు. చాలా సీరియస్‌గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్, న్యూస్ ఆర్టికల్స్‌ను చదువుతున్నారు. తమ నిర్ణయాలపై నిపుణుల సలహాలు తీసుకొని వాటిని క్రాస్‌చెక్ చేసుకుంటున్నారు. వాట్సాప్‌లో ‘ఫైనాల్షియల్ ఇన్ఫో’ అనే గ్రూప్‌లో ఇన్వెస్ట్మెంట్, లాస్ గురించి చర్చలు జరుగుతుంటాయి. దీన్ని క్రియేట్ చేసింది ట్వంటీ ప్లస్ యువతరమే. బెంగళూరుకు చెందిన రీతిక ఇంజనీరింగ్ స్టూడెంట్. తన దగ్గర ఉన్న చిన్న పొదుపు మొత్తాలు, క్యాష్గిఫ్ట్లు అన్నీ కలిపి ఇన్వెస్ట్ చేసింది. ‘ఏ కంపెనీ బెటర్? ఏ విధంగా?’ అనే కోణంలో రకరకాలుగా స్టడీ చేసింది రీతిక. చెన్నైకి చెందిన ఇరవై మూడు సంవత్సరాల హర్షితకు పుస్తకాలు చదవడం అంటే బొత్తిగా ఇష్టం ఉండదు. అయితే ఇటీవల కాలంలో ఆమె చేతిలో ఒక పుస్తకం తప్పనిసరిగా కనిపిస్తోంది. అదేమీ టైమ్‌పాస్ పుస్తకం కాదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే తన టైమ్‌ను మార్చివేయగల శక్తివంతమైన పుస్తకం. ఆ పుస్తకం పేరు...ది ఇంటిలిజెంట్ ఇన్వెస్టర్, రచయిత: బెంజిమిన్ గ్రాహమ్. 1949లో ప్రచురితమైన ఈ పుస్తకానికి ఇప్పటికీ గ్లామర్ తగ్గలేదు. అపర కుబేరుడు వారెన్ బఫెట్‌కు బాగా ఇష్టమైన పుస్తకం ఇది. ‘19సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ పుస్తకాన్ని చదివాను. ఇప్పటికీ అది చూపిన దారిలోనే నడుస్తున్నాను’ అంటాడు బఫెట్. ‘తెలివైన ఇన్వెస్టరెప్పుడూ వాస్తవికవాది అయి ఉంటాడు. నిరాశవాదుల నుంచి కొని ఆశావాదులకు అమ్ముతాడు’ ‘ఏ గ్రేట్ కంపెనీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యూ పే టూ మచ్ ఫర్ ది స్టాక్’... బెంజిమిన్ గ్రాహమ్ ప్రవచించిన ఇలాంటి తెలివైన మాటలను ఇష్టపడుతూనే ఇన్వెస్టర్లుగా తమవైన తెలివితేటలను రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది యువతరం. -
కరోనా రోగుల్లో 50 శాతం వారే..
లక్నో : రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, చిన్నారులే అధికంగా కోవిడ్-19 బారినపడతారనే అంచనాలకు విరుద్ధంగా ఉత్తర్ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో బాధపడే రోగుల్లో 50 శాతం మంది 21 నుంచి 40 ఏళ్లలోపు వారేనని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. యూపీలో నమోదైన 7884 కేసుల్లో యువకులు 51.93 శాతం కాగా, వీరిలో రికవరీ రేటు జాతీయ సగటు 52.95 కంటే అధికంగా 60.83 శాతంగా ఉంది. ఇక కరోనా కేసుల్లో 41 నుంచి 60 ఏళ్లలోపు మధ్యవయస్కులు 30 శాతం వరకూ ఉన్నారు. ఆరు శాతం మంది సీనియర్ సిటిజన్లు కరోనా బారినపడిన వారిలో ఉన్నారు. మరోవైపు కరోనా వైరస్ సోకే ముప్పు కేవలం వయసు ఆధారంగానే కాకుండా ఇతర అనారోగ్య కారణాలూ దీనికి దారితీస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇతర తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బంది పడే వృద్ధులకు కరోనా వైరస్ సోకితే వ్యాధి ముదిరే అవకాశం ఉంటుందని పేర్కొంది. కోవిడ్-19 బారినపడే ప్రతి ఐదుగురిలో ఒకరికి తీవ్ర అస్వస్థత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 80 శాతం మంది ఆస్పత్రిలో చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారని పేర్కొంది. చదవండి : కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్టు -
జపాన్ను వణికిస్తున్న ‘జనాభా’
టోక్యో : ఏ దేశాభివృద్ధికైనా కీలకం యువశక్తి. దేశ జనాభాలో యువతరం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్ధికాభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. ప్రసుత్తం ఈ విషయమే జపాన్ దేశంలో తీవ్ర ఆందోళనలు కల్గిస్తోంది. ఎందుకంటే గత 30 ఏళ్లుగా జపాన్ దేశ జనాభాలో యువతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్ అంతర్గ వ్యవహారాలు, సమాచార మంత్రిత్వ శాఖ 2018, ఏప్రిల్ 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది యువతరం జనాభా 1,70,000 తగ్గింది. ఆందోళన కల్గించే మరో అంశం వృద్దుల జనాభా పెరగడం. ప్రస్తుతం జపాన్ దేశ జనాభా 12.6 కోట్లు. కాగా వారిలో యువతరం(12 నుంచి 14 సంవత్సరాలలోపు) జనాభా కేవలం 32 లక్షలు మాత్రమే. అదే అమెరికాలో 18.9 శాతం, చైనాలో 16.8 శాతం, భారత దేశంలో 30.8 శాతం యువతరం జనాభా ఉండగా జపాన్‌లో మాత్రం 12.3 శాతం యువతరం జనాభా ఉన్నది. రోజురోజుకు తగ్గిపోతున్న జనాభాను పెంచడం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలను ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహించడమే కాక నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. ఈ చర్యల ఫలితంగా 2015 వరకూ 1.4 శాతంగా ఉన్న సంతానోత్పత్తి 2025 నాటికి 1.8 శాతానికి పెరుగుతుందని అంచనా. యువతరం - ఆర్థికాంశాలు రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా వల్ల ప్రస్తుతం ఉన్న 12.6 కోట్ల జనాభా, 2060 నాటికి 8.67 కోట్లకు పడిపోనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువతరం జనాభా తగ్గడమే కాక వృద్ధుల సంఖ్య పెరుగుతండటంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనున్నట్లు ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. పనిచేసే వారు తగ్గినప్పుడు పన్నులు కట్టే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఫలితంగా దేశ ఖజానాకు గండి పడుతుంది. పెరుగుతున్న వృద్ధులకు ఆరోగ్య సేవలు, పెన్షన్లు ఇవ్వడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ వలసదారుల విషయంలో జపాన్ వైఖరి మాత్రం మారటంలేదు. ఎక్కువ మొత్తంలో వలసదారులకు అనుమతిచ్చి, జనాభాను పెంచే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. అమెరికాలో మొత్తం జనాభాలో 7 శాతం విదేశీయుల సంతానం ఉండగా జపాన్‌లో మాత్రం వలసదారుల సతానం కేవలం 1.3 శాతం మాత్రమే. అంతేకాక తక్కువ జనాభా కారణంగా ఇక్కడ పనివారి కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇందుకు లింగవివక్ష కూడా మరో కారణం. జపాన్‌లో స్త్రీ, పురుషలకు చెల్లిస్తున్న వేతానాల్లో 25 శాతం వ్యత్యాసం ఉంది. అంతేకాక పిల్లల సంరక్షణ, లైంగిక వేధింపులు, అసమానతలు వంటి అంశాల వల్ల ఇప్పటికి కొన్నిరకాల విధులు నిర్వహించడానికి జపాన్ మహిళలు ముందుకురావడం లేదు. మానవ వనరుల కొరతను తగ్గించుకోవాలంటే 2050 నాటికి జపాన్ తన దేశ జనాభాలో, మూడొంతులు యువతరం ఉండేలా జాగ్రత్త పడాలి. అంతేకాక వేతనాలు పెంచడం, పని ప్రదేశాల్లో మహిళలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రతను పెంచడమే కాక వలసదారులను ఎక్కువ మొత్తంలో అనుమతిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. -
హ్యాపీ..హ్యాపీ సండే
విజయవాడ సెంట్రల్ : ఆటపాటలతో కుర్రకారు స్టెప్పులేశారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద ఒక్కటై కబడ్డీ.. కబడ్డీ.. అంటూ కూతపెట్టారు. రాక్‌బ్యాండ్ డాన్స్, జానపద నృత్యాలతో ఇరగదీశారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే బందరు రోడ్డు రెండున్నర గంటల పాటు యువత కేరింతలతో హోరెత్తింది. యూత్ జోష్.. పెద్దల హుషారు కలగలిసిన హ్యాపీ‘సండే’ సందడిగా సాగింది. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వై స్క్రీన్స్ సహకారంతో డీప్ ట్రస్ట్‌లు హ్యాపీ సండే నిర్వహించాయి. బందరురోడ్డులో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్దకు ఉదయం ఆరు గంటలలోపే పెద్ద ఎత్తున చిన్నారులు, యువత చేరుకున్నారు. కుటుంబ సమేతంగా హాజరై ఎంజాయ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ సతీమణి ఆండాళ్లు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. వీరపాడిండియన్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వాలీబాల్ ఆడారు. స్టెప్ బై స్టెప్ డాన్స్ ఇనిస్టిట్యూట్ కళాకారుల డాన్స్, రాక్ బ్యాండ్ డాన్స్, వివిధ జానపద నృత్యాలు అలరించాయి. పిల్లలు, పెద్దలు వాలీబాల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, స్కేటింగ్, రన్నింగ్, టెన్నికాయిట్, తొక్కుడు బిళ్ల, ఉప్పులకుప్ప..వయ్యారి భామ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన అంబారి సత్యనారాయణ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన స్కిప్పింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులు 2కె రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేటర్ నజీర్ హుస్సేన్, కో–ఆప్షన్ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి, నగరపాలక సంస్థ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎస్వీఎస్ చౌదరి, ఈఈ ధనుంజయ, యూసీడీ పీవో ఎంవీ.సత్యనారాయణ, డీప్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్, పోలీస్ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.