YSR-ACA VDCA stadium
-
తొలి టెస్టు: అందరి చూపు రోహిత్‌వైపే
సాక్షి, విశాఖపట్నం: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్ నేడు స్థానిక వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విశాఖ పిచ్ ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సారథి కోహ్లి ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. ఇక రోహిత్ శర్మ తొలి సారి టెస్టుల్లో ఓపెనర్‌గా వస్తుండటంతో అందరి చూపు అతడి వైపే ఉంది. మరోవైపు స్థానిక కుర్రాడు హనుమ విహారిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. గత వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొట్టిన విహారి.. విశాఖ టెస్టులోనూ రాణించి అభిమానులను అలరించాలని కోరుకుంటున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు ప్రకటించిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. విశాఖ పిచ్ స్పిన్నర్లుకు అనుకూలించే అవకాశం ఉండటంతో దక్షిణాఫ్రికా ఏకంగా ముగ్గురు స్పిన్నర్లకు జట్టులోకి తీసుకుంది. ఇద్దరు పేసర్లు, ఓ ఆల్‌రౌండర్‌తో జట్టు కూర్పును సిద్ధం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా టెస్టు చాంపియన్ షిప్‌ను ప్రారంభించనుంది. ఇక వెస్టిండీస్ సిరీస్‌తో టెస్టు చాంపియన్ షిప్‌ను ఘనంగా ఆరంభించిన కోహ్లి సేన.. స్వదేశంలో సఫారీ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక టీమిండియాతో పోలిస్తే అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా ఏ మాత్రం పోటీనుస్తుందో వేచి చూడాలి. టెస్టు జరిగే రోజుల్లో వాన పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడు అంతరాయం కలగడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. తుది జట్లు: భారత్ : కోహ్లి (సారథి), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, సాహా, అశి్వన్, జడేజా, ఇషాంత్, షమీ. దక్షిణాఫ్రికా : డుప్లెసిస్ (సారథి), మార్క్రమ్, ఎల్గర్, బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, కేశవ్, రబడ, ముత్తుస్వామి, పీట్.. -
భారత్‌దే సిరీస్
విశాఖపట్నం,న్యూస్‌లైన్: శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు సత్తా చూపించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. వైఎస్ఆర్-ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఏడు వికెట్లతో శ్రీలంక మహిళల జట్టును చిత్తు చేసింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... శ్రీలంక 47.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ యశోద మెండిస్ (56) అర్ధసెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి గౌహర్ సుల్తానా (4/15) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు తీసింది. తర్వాత భారత జట్టు 39.3 ఓవర్లలో 143 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మందన (51) అర్ధసెంచరీ సాధించింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (38) రాణించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. -
ఫేవరెట్ భారత్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సిరీస్‌లో తొలి వన్డే నేడు (ఆదివారం) స్థానిక వైఎస్ఆర్ - ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతుంది. 21న రెండో వన్డే, 23న చివరి వన్డే ఇక్కడే జరుగుతాయి. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టుకు మిథాలీ రాజ్, శ్రీలంక జట్టుకు శశికళ సిరివర్దనే నాయకత్వం వహిస్తున్నారు. ఇరు జట్లు శనివారం తమ ప్రాక్టీస్‌ను కొనసాగించాయి. ఫీల్డింగ్ కోచ్‌ను ఏర్పాటు చేసుకోవడంతో భారత క్రీడాకారిణుల ఫిట్నెస్ మెరుగైందని మిథాలీ రాజ్ పేర్కొంది. బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుని ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇక స్పిన్ ప్రధాన ఆయుధంగా లంక... ఆతిథ్య జట్టుకు సవాల్ విసిరేందుకు ఎదురుచూస్తోంది. మరోవైపు ఈనెల 25, 26న తొలి రెండు టి20 మ్యాచ్‌లు విజయనగరంలో, 28న చివరిదైన మూడో టి20 విశాఖలో జరుగుతుంది.