ఫేవరెట్ భారత్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సిరీస్‌లో తొలి వన్డే నేడు (ఆదివారం) స్థానిక వైఎస్‌ఆర్ - ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతుంది. 21న రెండో వన్డే, 23న చివరి వన్డే ఇక్కడే జరుగుతాయి. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టుకు మిథాలీ రాజ్, శ్రీలంక జట్టుకు శశికళ సిరివర్దనే నాయకత్వం వహిస్తున్నారు.
ఇరు జట్లు శనివారం తమ ప్రాక్టీస్‌ను కొనసాగించాయి. ఫీల్డింగ్ కోచ్‌ను ఏర్పాటు చేసుకోవడంతో భారత క్రీడాకారిణుల ఫిట్‌నెస్ మెరుగైందని మిథాలీ రాజ్ పేర్కొంది. బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుని ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇక స్పిన్ ప్రధాన ఆయుధంగా లంక... ఆతిథ్య జట్టుకు సవాల్ విసిరేందుకు ఎదురుచూస్తోంది. మరోవైపు ఈనెల 25, 26న తొలి రెండు టి20 మ్యాచ్‌లు విజయనగరంలో, 28న చివరిదైన మూడో టి20 విశాఖలో జరుగుతుంది.