‘సూ’ సంస్థపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను లెక్కలు చూపకుండా పన్ను ఎగ్గొడుతున్న ఎస్ఈడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సూ) సంస్థపై శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. గ్రీన్‌ల్యాండ్స్‌లోని సంస్థ కార్యాలయంతో పాటు సంస్థ ఎండీ, డెరైక్టర్ నివాసాలపై తనిఖీలు చేసి కోట్లాది రూపాయలను గుర్తించారు. ముందుగా ఎస్ఈడబ్ల్యూ కంపెనీపై దాడి చేసిన అధికారులు రూ. 155 కోట్ల పైచిలుకు పన్ను ఎగవేత పత్రాలను, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
శ్రీనగర్‌కాలనీలోని సంస్థ ఎండీ వల్లూరిపల్లి రాజశేఖర్ నివాసంలో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను గుర్తించారు. అలాగే సంస్థ డెరైక్టర్లు వై.సూర్యపక్రాశ్రావు, వై.గంగాధర్ నివాసాల్లో కూడా దాడులు నిర్వహించారు.
కావూరి హిల్స్‌లో నివసించే సూర్యప్రకాశ్‌రావు నివాసంలో, జూబ్లీహిల్స్ రోడ్ నం. 15లో నివసించే గంగాధర్ నివాసంలో కూడా దాడులు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి నివాసాల్లోనూ రూ. 5 కోట్ల పైచిలుకు నగదును, బంగారాన్ని గుర్తించారు.