యుగోఇంపోర్ట్‌తో రిలయన్స్ డిఫెన్స్ ఒప్పందం
సాక్షి బిజినెస్ వెబ్సైట్లో...
♦ మిడ్‌క్యాప్స్ కొంటున్నారా?
♦ జోరు మీదున్న టాటా గ్రూప్ షేర్లు
♦ 11 రోజుల్లో 101 శాతం లాభం
♦ బాగా పెరిగిన ఐదు ఫార్మా షేర్లు
♦ ఈ స్టాకుల్లో ఎంఏసీడీ ర్యాలీ సూచన
♦ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్డేట్స్..
♦ WWW.SAKSHIBUSINESS.COM
న్యూఢిల్లీ: సెర్బియాకు చెందిన యుగోఇంపోర్ట్‌తో అనిల్ అంబానీ గ్రూపులో భాగమైన ‘రిలయన్స్ డిఫెన్స్ అమ్యూనిషన్’ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. మందుగుండు సామగ్రి సహా ఇతర అంశాల్లో రెండు కంపెనీలు కలసి పనిచేయడంతోపాటు వచ్చే పదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం ఈ ఒప్పందంలో భాగమని రిలయన్స్ డిఫెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. మందుగుండు సామగ్రి ఎగుమతికీ అవకాశాలున్నాయని పేర్కొంది.
సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్‌తో అనిల్ అంబానీ భేటీ అయిన మర్నాడే ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. యుగోఇంపోర్ట్ సెర్బియా ప్రభుత్వ రంగ సంస్థ. మందుగుండు తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉంది. భారత ప్రభుత్వం కోసం భారత్‌లో తయారీకి గాను సాంకేతిక సహకారం అందించేందుకు ఈ సంస్థ సంసిద్ధతను తెలియజేసింది. భారత సాయుధ దళాల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు తదుపరి తరం మందుగుండును రెండు సంస్థలు సంయుక్తంగా అబివృద్ధి చేయనున్నట్టు రిలయన్స్ డిఫెన్స్ తెలిపింది. ప్రస్తుతం మన దేశ మందుగుండు అవసరాల్లో రూ. 10,000 కోట్ల (50 శాతం) మేర దిగుమతి చేసుకుంటున్నారు.