Zahlavova Strycova
-
ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ తొమ్మిదో నంబర్ క్రీడాకారుడు డేవిడ్ ఫెర్రర్ ఓటమి చెందాడు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఫెర్రర్ 6-3, 6-3, 6-3 తేడాతో కియో నిషీ కోరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ నిషీ కోరీకి పోటీనివ్వని ఫెర్రర్ వరుస సెట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అంతకుముందు జరిగిన నాల్గో రౌండ్ లో సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ కు చేరగా,విక్టోరియా అజెరెంకా మాత్రం ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వెనుదిరిగింది. -
భారంగా నిష్క్రమించిన అజెరెంకా
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ మ్యాచ్ లో డొమినాకా సిబుల్ కువా చేతిలో 6-2,3-6,6-3 తేడాతో అజెరెంకా ఓటమి చెందింది. తొలి సెట్ ను కోల్పోయిన అజెరెంకా రెండో సెట్ ను గెలిచి మళ్లీ గాడిలో పడ్డట్లు కనిపించింది. అయితే మూడో గేమ్ లో మాత్రం డొమానికా మళ్లీ తన విజృంభించి సెట్ ను కైవశం చేసుకోవడంతో అజెరెంకా టోర్నమెంట్ నుంచి భారంగా నిష్క్రమించింది. అంతకుముదు శనివారం జరిగిన మూడో రౌండ్ లో అజెరెంకా 6-4, 6-4 తేడాతో ప్రపంచ 25 వ ర్యాంకర్ జహ్లవోవా స్టిరికోవాపై విజయం సాధించి సునాయాసంగా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడికి లోనైన అజెరెంకా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. -
అదరగొట్టిన అజెరెంకా
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ లో అజెరెంకా 6-4, 6-4 తేడాతో ప్రపంచ 25 వ ర్యాంకర్ జహ్లవోవా స్టిరికోవాపై విజయం సాధించి నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ అడ్డంకిని సునాయాసంగా దాటిన అజెరెంకా.. రెండో గేమ్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన అనుభవాన్ని ఉపయోగించిన అజెరెంకా రెండో సెట్ ను కూడా కైవశం చేసుకుని నాల్గో రౌండ్ కు చేరుకుంది. ఇదిలా ఉండగా మరో మూడో రౌండ్ లో ప్రపంచ 6 ర్యాంకర్ రద్వాన్ ష్కా6-0, 7-5 తేడాతో 30 వ ర్యాంకర్ లెప్చెన్కో పై విజయం సాధించింది. ప్రపంచ 18 నంబర్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 4-6, 7-6, 6-1 తేడాతో జియార్జిపై విజయం సాధించగా, నాల్గో నంబర్ క్రీడాకారిణి వావ్రింకా 6-4,6-2, 6-4 నిమినన్ పై గెలిచింది.