భారంగా నిష్క్రమించిన అజెరెంకా | Dominika Cibulkova defeats Victoria Azarenka in australia open tennis | Sakshi
Sakshi News home page

భారంగా నిష్క్రమించిన అజెరెంకా

Published Mon, Jan 26 2015 10:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

భారంగా నిష్క్రమించిన అజెరెంకా

భారంగా నిష్క్రమించిన అజెరెంకా

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ మ్యాచ్ లో డొమినాకా సిబుల్ కువా చేతిలో 6-2,3-6,6-3 తేడాతో అజెరెంకా ఓటమి చెందింది. తొలి సెట్ ను  కోల్పోయిన అజెరెంకా రెండో సెట్ ను గెలిచి మళ్లీ గాడిలో పడ్డట్లు కనిపించింది. అయితే మూడో గేమ్ లో మాత్రం డొమానికా మళ్లీ తన విజృంభించి  సెట్ ను కైవశం చేసుకోవడంతో అజెరెంకా టోర్నమెంట్ నుంచి భారంగా నిష్క్రమించింది.

 

అంతకుముదు శనివారం జరిగిన మూడో రౌండ్ లో అజెరెంకా 6-4, 6-4 తేడాతో ప్రపంచ 25 వ ర్యాంకర్ జహ్లవోవా స్టిరికోవాపై విజయం సాధించి సునాయాసంగా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే  మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడికి లోనైన అజెరెంకా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement