Victoria Azarenka
-
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్‌లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్‌లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
నమో నయోమి
ఏ లక్ష్యంతో న్యూయార్క్‌లో అడుగుపెట్టిందో ఆలక్ష్యాన్ని అందుకుంది జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడంతోపాటు అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి లేదా జాతి వివక్ష కారణంగా తమ ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయులకు ఒసాకా తన విజయంతో ఘనమైన నివాళులు అర్పించింది. పోలీసుల చేతుల్లో లేదంటే జాతి వివక్ష కారణంగా మరణించిన పలువురు నల్లజాతీయుల్లో ఏడుగురిని (ఏడు రౌండ్లలో గెలిస్తే విజేత అవుతారు) ఎంచుకున్న ఒసాకా ఆ ఏడుగురి పేర్లు రాసి ఉన్న మాస్క్‌లను ధరించి యూఎస్ ఓపెన్‌లో ఆడతానని... ఆ ఏడుగురికీ నివాళులు ఇవ్వాలంటే టైటిల్ గెలవాల్సి ఉంటుందని టోర్నీ ప్రారంభానికి ముందు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే ప్రతి మ్యాచ్‌లో ఒక్కో బాధితుడి పేరు రాసి ఉన్న మాస్క్‌ను ధరించి ఆడింది. ఆఖరికి తన వద్ద ఉన్న చివరిదైన ఏడో మాస్క్‌ను ధరించి ఆడి విజేతగా నిలిచింది. తాను అనుకున్న రెండు లక్ష్యాలనూ సాధించి ఒసాకా ఔరా అనిపించింది. మరో వైపు యూఎస్ ఓపెన్ ఫైనల్లో మూడో సారి ఓడిన అజరెంకా తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. న్యూయార్క్: ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదల కోల్పోకుండా ఆడిన జపాన్ యువతార నయోమి ఒసాకా తన కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగో సీడ్ ఒసాకా చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 22 ఏళ్ల ఒసాకా గంటా 53 నిమిషాల్లో 1–6, 6–3, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 27వ ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై విజయం సాధించింది. ఒసాకా కెరీర్లో ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఆమె 2018లోనూ చాంపియన్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ అజరెంకాకు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి సెట్ కోల్పోయినా... 26 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6–1తో నెగ్గిన అజరెంకా ఆ తర్వాత రెండో సెట్లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అజరెంకా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఉంటే సెట్‌తోపాటు, మ్యాచ్‌నూ సొంతం చేసుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడేది. కానీ ఒసాకా అలా జరగనీయలేదు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో 0–2తో వెనుకబడి... మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌లో 30–40తో గేమ్‌ను కోల్పోయే దశ నుంచి ఒసాకా కోలుకుంది. గేమ్ కోల్పోయే స్థితి నుంచి తేరుకున్న ఒసాకా మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–2తో స్కోరును సమం చేసింది. అనంతరం అదే జోరులో ఒసాకా రెండో సెట్‌ను 41 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్ నాలుగో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జపాన్ అమ్మాయి తన సర్వీస్‌ను కాపాడుకొని 4–1తో ముందంజ వేసింది. అయితే అజరెంకా కూడా తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. ఏడో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అజరెంకా ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. అయితే ఒసాకా వెంటనే ఎనిమిదో గేమ్‌లోనే అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఒసాకా తన సర్వీస్‌నూ కాపాడుకొని 46 నిమిషాల్లో మూడో సెట్‌ను కైవసం చేసుకొని చాంపియన్‌గా నిలిచింది. ఆ ఏడుగురు... అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న వివక్ష పట్ల ఓ క్రీడాకారిణిగా నయోమి యూఎస్ ఓపెన్‌లో అద్భుత రీతిలో స్పందించింది. కొన్నేళ్లుగా పోలీసుల చేతుల్లో బలైన నల్ల జాతీయుల్లో ఏడుగురిని ఎంచుకొని వారి పేర్లను తన మాస్క్‌పై రాసుకొని మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత వాటిని ధరించి సంఘీభావం తెలిపింది. తొలి రౌండ్లో బ్రెనా టేలర్... రెండో రౌండ్లో ఎలిజా మెక్లెయిన్... మూడో రౌండ్లో జార్జి ఫ్లాయిడ్... నాలుగో రౌండ్లో అహెమౌద్ ఆర్బెరీ... క్వార్టర్ ఫైనల్లో ట్రెవన్ మార్టిన్... సెమీఫైనల్లో ఫిలాండో క్యాజిల్ బాధితుల పేర్లు రాసి ఉన్న మాస్క్‌లు ధరించిన ఒసాకా... ఫైనల్లో మాత్రం 2014లో క్లీవ్‌లాండ్‌లో పోలీసుల చేతుల్లో చనిపోయిన 12 ఏళ్ల బాలుడు తామిర్ రైస్‌కు నివాళిగా మాస్క్‌ను ధరించింది. తమను వీడి వెళ్లిపోయిన వారిని ఒసాకా మరోసారి గుర్తు చేసిందని ఈ సందర్భంగా ఆయా బాధితుల తల్లిదండ్రులు జపాన్ క్రీడాకారిణిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. నయోమి ఒసాకా తల్లి తమాకి జపాన్ దేశస్థురాలు కాగా తండ్రి లెనార్డ్ ఫ్రాన్సువా హైతీ దేశానికి చెందిన వ్యక్తి. ఒసాకా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలో నివాసం ఉంటున్నా నయోమి జపాన్ పౌరసత్వం కలిగి ఉంది. తనను అమెరికన్‌గా కాకుండా జపనీయురాలిగానే గుర్తించాలని నయోమి కోరుకుంటోంది. ‘గొప్ప క్రీడాకారులందరూ ఫైనల్లో గెలిచిన వెంటనే కోర్టులో పడిపోయి ఆకాశంవైపు ఎందుకు చూసేవారో ఆలోచించేదాన్ని. వాళ్లకేమి కనిపించేదో తెలుసుకోవాలని గెలిచిన వెంటనే నేనూ అలాగే చేశాను. ఈ టోర్నీ కోసం చాలా కష్టపడ్డాను. శ్రమకు తగ్గ ఫలితం ఎందుకు రాకూడదో ప్రయత్నించి సఫలమయ్యాను. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో వెనుకబడిన దశలో ఆందోళన చెందకుండా ఒక్కో పాయింట్ గురించి ఆలోచించాను. నేనిక్కడ ఒక లక్ష్యంతో వచ్చాను. ఫైనల్‌కు వచ్చినందుకు 1–6, 0–6తో ఓడిపోయి ఇంటికి వెళ్లకూడదని అనుకున్నాను.’ – నయోమి ఒసాకా ► 3 ఆసియా నుంచి మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్ (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) నయోమి ఒసాకా. నా లీ (చైనా) రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గింది. ► 1 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1975లో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక టాప్–20 క్రీడాకారిణులను ఎదుర్కోకుండా యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణి ఒసాకానే. ► 5 తమ కెరీర్లో ఫైనల్ చేరుకున్న తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ గెలిచిన ఐదో క్రీడాకారిణి ఒసాకా. మోనికా సెలెస్ అయితే వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. ► 3 యూఎస్ ఓపెన్ ఫైనల్లో అత్యధికంగా మూడుసార్లు ఓడిపోయిన రెండో క్రీడాకారిణి అజరెంకా. ఇవాన్ గూలాగాంగ్ (ఆస్ట్రేలియా) అత్యధికంగా నాలుగు యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయింది. -
ఎలా గెలిచిందో.. అలానే ఓడింది!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా జపాన్ క్రీడాకారిణి, నాల్గో సీడ్ నయామి ఒసాకా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. తొలి సెట్‌ను ఒసాకా కోల్పోయినప్పటికీ మిగతా రెండు సెట్లలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను సాధించింది. ఇది ఒసాకాకు రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. 2018లో యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా.. ఏడాది గ్యాప్లోమరోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీని సొంతం చేసుకుంది. ఆమెకు ఇది ఓవరాల్‌గా మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఆమె గెలుచుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: సూపర్ జ్వెరెవ్) ఈ రోజు జరిగిన తుదిపోరులో ఒసాకా తొలి సెట్‌ను భారీ తేడాతో కోల్పోయింది. ఆమె 1-6 తేడాతో సెట్‌ను చేజార్చుకుంది. అయితే ఆ తర్వాత అజరెంకాకు చుక్కలు చూపించింది. ఎక్కడ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరసగా గేమ్‌లను కైవసం చేసుకుంటూ ఒసాకా ముందుకు సాగింది. ఈ క్రమంలోనే రెండో సెట్‌ను సాధించిన ఒసాకా.. అదే ఊపును నిర్ణయాత్మక మూడో సెట్లో కూడా ప్రదర్శించింది. ఫలితంగా ఆమె ఖాతాలో మరో యూఎస్ ఓపెన్ టైటిల్ చేరింది. కాగా, ఈ మ్యాచ్‌లో అజరెంకా ఓడిన తీరు ఆమె ఆడిన సెమీఫైనల్‌ను గుర్తు చేసింది. సెరెనా విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో అజరెంకా ఇలానే గెలిచి ఫైనల్‌కు చేరింది. తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయిన అజరెంకా.. మిగతా రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఇప్పుడు అదే అనుభవం అజరెంకాకు ఎదురుకావడం గమనార్హం. -
సెరెనాకు ఊహించని షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో నల్ల కలువ సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనాకు ప్రపంచ మహిళల టెన్నిస్ వరల్డ్ మాజీ నంబర్‌వన్, బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో అజరెంకా అదరగొట్టింది. మూడు సెట్ల పోరులో అజరెంకా రెండు గెలుచుకుని ఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా సెరెనా కథ సెమీస్‌లోనే ముగిసింది. తల్లి అయ్యాక గ్రాండ్ స్లామ్ గెలుద్దామని భావించిన సెరెనాకు అజరెంకా అడ్డుకట్టవేసింది. ఈ రోజు జరిగిన సెమీస్‌లో అజరెంకా 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. దాంతో ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్ రేసులోకి వచ్చేసింది. తొలిసెట్‌ను అజరెంకా భారీ తేడాతో కోల్పోయినా, మిగతా రెండు సెట్లలో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని తుదిపోరుకు సిద్ధమైంది. ప్రధాన టోర్నీల్లో సెరెనా తొలి సెట్‌ను గెలిచిన తర్వాత మ్యాచ్‌లో ఓడిపోవడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2014 వింబుల్డన్‌లో అలెజ్ కార్నెట్ చేతిలో సెరెనా ఇదే తరహాలో ఓటమి పాలయ్యారు. అప్పుడు తొలి సెట్‌ను గెలిచి మిగతా రెండు సెట్లను సెరెనా కోల్పోయారు.(చదవండి: ‘మ్యాట్’పై విహారి సాధన... ) ఏడేళ్ల విరామం తర్వాత ఫైనల్లో.. యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరెనా ఓడించడం ద్వారా ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఏడేళ్ల తర్వాత అజరెంకా ఫైనల్‌కు చేరింది. చివరిసారి 2013లో ఓ గ్రాండ్ స్లామ్లో ఫైనల్‌కు చేరిన అజరెంకా.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. కాగా, యూఎస్ ఓపెన్‌లో సెరెనాపై గెలవడం అజరెంకాకు ఇదే తొలిసారి. 2012, 2013లలో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకొని రెండుసార్లూ సెరెనా చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న అజరెంకా... ఈసారి ట్రోఫీని ముద్దాడటానికి అడుగుదూరంలో నిలిచింది. అదే సమయంలో వరుసగా 11వ మ్యాచ్‌లో అజరెంకా విజయం సాధించినట్లయ్యింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ అజరెంకా, సెరెనా మధ్య 22 సార్లు ముఖాముఖి పోరు జరిగింది. 18 సార్లు సెరెనా... నాలుగుసార్లు అజరెంకా విజయం సాధించారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వీరిద్దరు 10 సార్లు తలపడగా... పదికి పది మ్యాచ్‌ల్లో సెరెనానే గెలుపొందారు. కాగా, గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 11వ ప్రయత్నంలో అజరెంకా విజయం సాధించడమే కాకుండా టైటిల్ వేటకు సిద్ధమయ్యారు. ఒసాకాతో పోరుకు సై శనివారం జరుగనున్న ఫైనల్లో జపాన్ స్టార్ క్రీడాకారిణి, నాల్గో సీడ్ నయామి ఒసాకాతో అజరెంకా అమీతుమీ తేల్చుకోనున్నారు. మరో సెమీ ఫైనల్లో ఒసాకా 7-6(7/1), 3-6, 6-3 తేడాతో అమెరికా క్రీడాకారిణి జెన్నిఫర్ బ్రాడీపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను ఒసాకా గెలుచుకోగా, రెండో సెట్‌ను కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ఒసాకా తిరుగులేని తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరారు.(చదవండి: అజేయ విజేత నైట్‌రైడర్స్ ) -
అజరెంకా అదరహో
న్యూయార్క్: ఏడేళ్ల విరామం తర్వాత ప్రపంచ మహిళల టెన్నిస్ వరల్డ్ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. యూఎస్ ఓపెన్ టోర్నీలో ఈ బెలారస్ ‘మమ్మీ’ క్వార్టర్ ఫైనల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. 16వ సీడ్ ఎలీసె మెర్టెన్స్ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్ అజరెంకా కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి తన ప్రత్యర్థిని 6–1, 6–0తో చిత్తుగా ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెర్టెన్స్ తన సర్వీస్‌ను ఒక్కసారీ నిలబెట్టుకోలేకపోయింది. ఆమె సాధించిన ఒక్క గేమ్ కూడా తొలి సెట్లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారానే రావడం గమనార్హం. మ్యాచ్ మొత్తంలో అజరెంకా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు సాధించింది. కేవలం 11 అనవసర తప్పిదాలు చేసిన ఆమె 21 విన్నర్స్ కొట్టింది. పునరాగమనం... 2016 డిసెంబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఏడు నెలలపాటు ఆటకు విరామం ఇచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్ టోర్నీ ద్వారా గ్రాండ్‌స్లామ్‌లలో పునరాగమనం చేసింది. ఆ తర్వాత ఆమె మరో ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొన్నా మూడో రౌండ్‌ను దాటలేకపోయింది. సెరెనాను దాటితేనే.... 2012, 2013లలో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకొని రెండుసార్లూ సెరెనా చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న అజరెంకా... ఈసారి ట్రోఫీని ముద్దాడాలంటే... ముందుగా శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత, ఆరుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్, తన చిరకాల ప్రత్యర్థి సెరెనా విలియమ్స్ (అమెరికా) అడ్డంకిని దాటాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అజరెంకా, సెరెనా మధ్య 22 సార్లు ముఖాముఖి పోరు జరిగింది. 18 సార్లు సెరెనా... నాలుగుసార్లు అజరెంకా విజయం సాధించారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వీరిద్దరు 10 సార్లు తలపడగా... పదికి పది మ్యాచ్‌ల్లో సెరెనానే గెలుపొందడం విశేషం. ఈసారి యూఎస్ ఓపెన్‌లో సెరెనా మూడో రౌండ్, ప్రిక్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్లో మూడు సెట్లలో తన ప్రత్యర్థులను ఓడించి తనకు 38 ఏళ్లు వచ్చినా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తోంది. థీమ్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ యూఎస్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ థీమ్ 6–1, 6–2, 6–4తో 21వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచాడు. తద్వారా యూఎస్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ గుర్తింపు పొందాడు. ఫైనల్లో స్థానం కోసం మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)తో థీమ్ తలపడతాడు. ముఖాముఖి పోరులో థీమ్ 2–1తో ఆధిక్యంలో ఉన్నాడు. థీమ్ తన కెరీర్లో మూడుసార్లు (2018, 2019–ఫ్రెంచ్ ఓపెన్; 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్) గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ చేరి మూడుసార్లూ ఓడి రన్నరప్‌గా నిలిచాడు. మెద్వెదేవ్ తన కెరీర్లో ఒకసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో (2019 యూఎస్ ఓపెన్) ఫైనల్ చేరి ఓడిపోయాడు. మెద్వెదేవ్... అదే జోరు... మరో క్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ 7–6 (8/6), 6–3, 7–6 (7/5)తో తన దేశానికే చెందిన పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న మెద్వెదేవ్ ఈ మ్యాచ్‌లో 16 ఏస్‌లు సంధించాడు. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మెద్వెదేవ్ రెండో సెట్లో ఒకసారి రుబ్లెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. తన సర్వీస్‌లో ఒక్కసారీ తన ప్రత్యర్థికి బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. సెమీఫైనల్ చేరే క్రమంలో మెద్వెదేవ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా ఇవ్వకపోవడం విశేషం. మరో సెమీఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), కరెనో బుస్టా (స్పెయిన్) తలపడతారు. ముఖాముఖి పోరులో జ్వెరెవ్ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. వీరిలో ఎవరు గెలిచినా తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుతారు. -
ఒసాకా శ్రమించి...
పారిస్: వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. గతేడాది యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఒసాకా 4–6, 7–5, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా ఆరు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఆమె తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి సెట్ చేజార్చుకున్న ఒసాకా రెండో సెట్లో కోలుకుంది. కీలకదశలో తప్పిదాలు చేయకుండా సంయమనంతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. 2005లో లిండ్సే డావెన్‌పోర్ట్ (అమెరికా) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తొలి సెట్‌ను కోల్పోయాక విజయం సాధించిన రెండో టాప్ సీడ్ ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది. మూడో రౌండ్లో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో ఒసాకా ఆడుతుంది. రెండో రౌండ్లో సినియకోవా 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 7–6 (7/5), 6–7 (8/10), 6–4తో మరియా సకారి (గ్రీస్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో 17 ఏళ్ల అమెరికా అమ్మాయి అమండా అనిసిమోవా 6–4, 6–2తో 11వ సీడ్ ఆర్యాన సబలెంక (బెలారస్)పై సంచలన విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–2తో కురుమి నారా (జపాన్)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 4–6, 6–4, 6–4తో సీగ్మండ్ (జర్మనీ)పై గెలిచారు. జొకోవిచ్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో థీమ్ 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, జొకోవిచ్ 6–1, 6–4, 6–3తో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్)పై, జ్వెరెవ్ 6–1, 6–3, 7–6 (7/3)తో వైమెర్ (స్వీడన్)పై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–అయోయామ (జపాన్) ద్వయం 3–6, 6–2, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది. -
తల్లి కాబోతున్న టెన్నిస్ బ్యూటీ!
బెలారస్ టెన్నిస్ బ్యూటీ, ప్రపంచ ఆరో ర్యాంకు క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా గుర్తుంది కదా.. 2012, 2013 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుపొందిన ఈ సుందరి మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో పాల్గొనలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈ సుందరికి వైద్యులు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ప్రియుడితో సహాజీవనం చేస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని అజరెంకా తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. ‘రోలాండ్ గ్యారోస్‌లో అయిన మోకాలి గాయం నుంచి ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మా వైద్యుడు ఓ వార్త తెలిపారు. నేను- నా బాయ్ప్రెంఢ్ త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాం’ అని అజరెంకా తెలిపింది. ఈ నేపథ్యంలో తానే ఎంతగానో ప్రేమించే టెన్నిస్‌కు కొంతకాలం దూరమయ్యే అవకాశముందని పేర్కొంది. అయితే, గతంలో ఎంతోమంది మహిళా ఆథ్లెట్లు పిల్లల్ని కన్న తర్వాత మళ్లీ క్రీడల్లోకి ప్రవేశించి సత్తా చాటారని, వారి నుంచి స్ఫూర్తి పొంది తాను అదే చేయాలనుకుంటున్నానని అజరెంక తెలిపింది. -
అజరెంకాదే టైటిల్
బ్రిస్బేన్: మాజీ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో భాగంగా శనివారం జరిగిన తుదిపోరులో అజరెంకా విజేతగా నిలిచింది. ఆద్యంత ఆకట్టుకున్న అజరెంకా 6-3, 6-1 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ బోల్తాకొట్టించి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఒక గంటా 13 నిమిషాలపాటు జరిగిన అంతిమ పోరులో అజరెంకా వరుస సెట్లను గెలిచి కెర్బర్ పై మరోసారి పైచేయి సాధించింది. అంతకుముందు వీరిద్దరూ తలపడిన ఐదు సార్లు అజరెంకానే విజయం సాధించింది. ఇదిలా ఉండగా 2013 ఆగస్టు తరువాత అజరెంకాకు ఇదే తొలి టైటిల్. 2014 లో గాయం కారణంగా కేవలం తొమ్మిది టోర్నమెంట్లలోనే అజరెంకా పాల్గొంది. ఆ తరువాత 2015 లో తొడ కండరాల గాయం కారణంగా పలు టోర్నీల్లో వైఫల్యం చెందడంతో ఆమె ర్యాంకింగ్స్ లో గణనీయంగా కిందికి పడిపోయింది. 2016 సీజన్ ను టైటిల్ తో శుభారంభం చేసిన అజరెంకా.. త్వరలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అగ్రశ్రేణి క్రీడాకారిణులు సవాల్ గా మారే అవకాశం ఉంది. -
సెరెనా అరుదైన రికార్డు
శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 3-6, 6-4, 6-2తో మాజీ నంబర్‌వన్, 27వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో సెరెనా అరుదైన రికార్డును సృష్టిం చింది. ఓపెన్ శకంలో (1969 తర్వాత) ప్రతి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్లో కనీసం 50 మ్యాచ్‌ల్లో నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గతంలో మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, స్టెఫీ గ్రాఫ్ మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 68, ఫ్రెంచ్ ఓపెన్‌లో 50, వింబుల్డన్‌లో 72, యూఎస్ ఓపెన్‌లో 79 మ్యాచ్‌ల్లో గెలిచింది. అజరెంకాతో జరిగినమ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 2-4తో వెనుకబడిన సెరెనా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా నాలుగు గేమ్‌లు సాధించి రెండో సెట్‌ను 6-4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో సెరెనా దూకుడుగా ఆడి అజరెంకా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 10 ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 41 విన్నర్స్ కొట్టిన ఈ అమెరికా స్టార్ 21 అనవసర తప్పిదాలు చేసింది. ఓవరాల్‌గా అజరెంకాపై సెరెనాకిది 16వ గెలుపుకాగా... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ సెరెనానే విజయం వరించింది. -
ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ తొమ్మిదో నంబర్ క్రీడాకారుడు డేవిడ్ ఫెర్రర్ ఓటమి చెందాడు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఫెర్రర్ 6-3, 6-3, 6-3 తేడాతో కియో నిషీ కోరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ నిషీ కోరీకి పోటీనివ్వని ఫెర్రర్ వరుస సెట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అంతకుముందు జరిగిన నాల్గో రౌండ్ లో సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ కు చేరగా,విక్టోరియా అజెరెంకా మాత్రం ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వెనుదిరిగింది. -
భారంగా నిష్క్రమించిన అజెరెంకా
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ మ్యాచ్ లో డొమినాకా సిబుల్ కువా చేతిలో 6-2,3-6,6-3 తేడాతో అజెరెంకా ఓటమి చెందింది. తొలి సెట్ ను కోల్పోయిన అజెరెంకా రెండో సెట్ ను గెలిచి మళ్లీ గాడిలో పడ్డట్లు కనిపించింది. అయితే మూడో గేమ్ లో మాత్రం డొమానికా మళ్లీ తన విజృంభించి సెట్ ను కైవశం చేసుకోవడంతో అజెరెంకా టోర్నమెంట్ నుంచి భారంగా నిష్క్రమించింది. అంతకుముదు శనివారం జరిగిన మూడో రౌండ్ లో అజెరెంకా 6-4, 6-4 తేడాతో ప్రపంచ 25 వ ర్యాంకర్ జహ్లవోవా స్టిరికోవాపై విజయం సాధించి సునాయాసంగా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడికి లోనైన అజెరెంకా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. -
అదరగొట్టిన అజెరెంకా
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ లో అజెరెంకా 6-4, 6-4 తేడాతో ప్రపంచ 25 వ ర్యాంకర్ జహ్లవోవా స్టిరికోవాపై విజయం సాధించి నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ అడ్డంకిని సునాయాసంగా దాటిన అజెరెంకా.. రెండో గేమ్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన అనుభవాన్ని ఉపయోగించిన అజెరెంకా రెండో సెట్ ను కూడా కైవశం చేసుకుని నాల్గో రౌండ్ కు చేరుకుంది. ఇదిలా ఉండగా మరో మూడో రౌండ్ లో ప్రపంచ 6 ర్యాంకర్ రద్వాన్ ష్కా6-0, 7-5 తేడాతో 30 వ ర్యాంకర్ లెప్చెన్కో పై విజయం సాధించింది. ప్రపంచ 18 నంబర్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 4-6, 7-6, 6-1 తేడాతో జియార్జిపై విజయం సాధించగా, నాల్గో నంబర్ క్రీడాకారిణి వావ్రింకా 6-4,6-2, 6-4 నిమినన్ పై గెలిచింది. -
కెవ్... ‘కేక’!
రాకెట్ ప్రయోగించినప్పుడు... విమానం టేకాఫ్ అయినప్పుడు... డిస్కోథెక్ లేదా లౌడ్ మ్యూజిక్ (స్పీకర్) విన్నప్పుడు... టపాసులు పేలినప్పుడు... సబ్వే నుంచి రైలు వెళ్లినప్పుడు... సిటీలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు... ఇలా పలు సందర్భాల్లో వెలువడే శబ్దాలను విన్నప్పుడు చెవులు చిల్లులు పడ్డాయేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సరదాగా టెన్నిస్ చూద్దామని వెళితే ఇలాంటి శబ్దాలు వినిపిస్తే..? కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇవే కేకలు, అరుపులను ఒక ఆయుధంగా టెన్నిస్ క్రీడాకారులు ఉపయోగించుకుంటున్నారు. దీనిని ‘గ్రంటింగ్’గా వ్యవహరిస్తారు. ఒకరిని మించి మరొకరు ‘కేక’ల్లో రికార్డులు బద్దలు కొడుతున్నారు. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు టెన్నిస్ క్వీన్.. అరుపులో నంబర్ వన్... మరియా షరపోవా.. ఆటతో పాటు అందంతోనూ అభిమానులను కట్టిపడేస్తుంది. అయితే ఈ రష్యా అందాల భామ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెవుల్లో దూది పెట్టుకుని మరీ మ్యాచ్‌లు చూడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే షరపోవా అరుపు అలా ఉంటుంది మరి. టెన్నిస్ క్వీన్‌గా పేరొందిన షరపోవా అరుపులోనూ క్వీన్ అనిపించుకుంటోంది. ఈమె మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆమె అరుపు గరిష్టంగా 101.2 డెసిబుల్స్(శబ్దాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు)గా నమోదైంది. జెట్ టేకాఫ్ అయినప్పుడు (120 డెసిబుల్స్) సింహం గర్జించినప్పుడు (110 డెసిబుల్స్), లౌడ్ స్పీకర్ విన్నప్పుడు(110 డెసిబుల్స్) ఎలా ఉంటుందో షరపోవా మ్యాచ్‌లు ఆడేప్పుడు అరిచే అరుపు దాదాపుగా అలాగే ఉంటుందట. ఇక పోర్చుగల్‌కు చెందిన 21 ఏళ్ల మిచెల్లీ లార్చర్ డి బ్రిటో అయితే అనధికారికంగా షరపోవాను అధిగమించేసింది. ఓ టోర్నీలో మ్యాచ్ ఆడుతూ బ్రిటో 109 డెసిబుల్స్ శబ్దంతో కేక పెట్టింది. బ్రిటో అరుపు భరించలేక కొందరు అభిమానులు నిర్వాహకులకు ఫిర్యాదు చేశారట..ఇక టెన్నిస్ స్టార్లలో విక్టోరియా అజరెంకా (బెలారూస్), సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ (అమెరికా), ఎలెనా బొవినా, అన్నా కోర్నికోవా, ఎలెనా దెమెంతియేవా (రష్యా), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) తమ అరుపులతో ప్రత్యర్థులకు, అభిమానులకు దడ పుట్టించారు. అయితే మొట్టమొదటి మహిళా గ్రంట్ ప్లేయర్ మోనికా సెలెస్.. తన అరుపుతో అప్పట్లో బాగా గుర్తింపు పొందింది. ప్రత్యర్థులను దెబ్బతీసే ఆయుధం..! ఏదైనా మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ప్రతిభతో పాటు మానసికంగా పైచేయి సాధించడం కూడా ముఖ్యమే. క్రికెట్ లాంటి కొన్ని క్రీడల్లో స్లెడ్జింగ్‌తో ప్రత్యర్థులను రెచ్చగొడతారు. తద్వారా ఎదుటివాళ్లు చేసే పొరపాట్లను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. టెన్నిస్ లాంటి కొన్ని క్రీడల్లో అది సాధ్యం కాదు కాబట్టి కొందరు ప్లేయర్లు కోర్టులో అరుపు అనే ఆయుధాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటు న్నారు. గట్టిగా అరుస్తూ ప్రత్యర్థికి చికాకు పుట్టేలా చేస్తున్నారు. . ఇటీవలి కాలంలో కొందరు ప్లేయర్లు కావాలనే ఎదుటివారి ఏకాగ్రతను దెబ్బతీసేలా అరుస్తున్నారని వింబుల్డన్ మాజీ మ్యాచ్ రిఫరీ అలెన్ మిల్స్ వెల్లడించారు. ‘ఈ మధ్య గట్టిగా అరవడం ప్లేయర్లకు బాగా అలవాటైంది. ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించేందుకు గట్టిగా అరుస్తూ చికాకు పెట్టిస్తున్నారు’అని అలెన్ మిల్స్ అనే అంపైర్ చెప్పారు. కోచింగ్‌లో అరుపు ‘ఫ్రీ’ టెన్నిస్ కోచింగ్‌లో ఇప్పుడు ఆటలో మెళకువలతో పాటు ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ఎలా అరవాలో కూడా నేర్పిస్తున్నారట.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.. ప్రపంచ వ్యాప్తంగా కొందరు కోచ్‌లు తమ కోచింగ్‌లో అరుపులను కూడా భాగం చేస్తున్నారట. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు అరుపులను ఆయుధాలుగా చేసుకుంటున్నప్పటికీ.. ఆటలో నైపుణ్యం ఉన్న ప్లేయర్లపై అరుపు ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు సైకాలజిస్టుల పరిశోధనలో తేలింది. గాడ్ ఫాదర్... జిమ్మీ కానర్స్.. అమెరికా టెన్నిస్ దిగ్గజం, ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ఏడుసార్లు రన్నరప్‌గా నిలిచిన జిమ్మీ కానర్స్ టెన్నిస్‌లో అరుపులకు ఆద్యుడుగా చెబుతారు. 70, 80 దశకాల్లో టెన్నిస్ కోర్టులో తన ఆటతోనే కాదు.. అరుపుతోనూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించాడు. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో కార్లోస్ బెరాక్, రఫెల్ నాదల్, డేవిడ్ ఫై తమ అరుపులతో ప్రత్యర్థులకు, అభిమానులకు దడ పుట్టిస్తున్నారు. వీళ్లని ఆపేదెలా... టెన్నిస్ కోర్టులో అరుపులపై అటు ప్లేయర్ల నుంచి, ఇటు అభిమానుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మహిళల టెన్నిస్ సంఘం స్పందించింది. టెన్నిస్ కోర్టులో అరుపులపై ధ్వని పరీక్షలు మొదలు పెట్టింది. ఇన్డోర్, అవుట్డోర్, గ్రాస్ కోర్టులు, క్లే కోర్టులు, హార్డ్ కోర్టులు, సింథటిక్ కోర్టులు ఇలా విభిన్నమైన వేదికలు, పరిసరాల్లో ఆటగాళ్ల అరుపులు ఎలా ఉంటున్నాయో పరీక్షిస్తోంది. ఇక 2012 వింబుల్డన్‌లో ప్లేయర్ల అరుపులను నిరోధించేందుకు ప్రయత్నించారు. అంపైర్లకు గ్రంటో మీటర్లను కూడా ఇచ్చారు. అయితే దీనిపై అరిచే ప్లేయర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. చివరికి అరుపులను తేలిగ్గా తీసుకోవాల్సి వచ్చింది. -
అజరెంకా అవుట్
మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ సీడ్ విక్టోరియా అజరెంకాకు క్వార్టర్ ఫైనల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఐదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-1, 5-7, 6-0తో అజరెంకా (బెలారస్)ను కంగుతినిపించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 6-0తో 11వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)ను ఓడించింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో అజరెంకా
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిపెడింగ్ చాంపియన్ విక్టోరియా అజరెంకా రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో జరిగిన పోరులో స్వీడన్‌కు చెందిన ప్రపంచ 91 ర్యాంక్ క్రీడాకారిణి జోహన్నా లార్సన్ను 7-6, 6-2తో అజరెంకా ఓడించింది. మొదటి రౌండ్లో 5-6తో వెనుకబడిన అజరెంకా ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. గంటా 46 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. గతేడాది విజేత ‘బెలారస్ భామ’ అజరెంకా ఈసారీ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. అజరెంకా గెలిస్తే 1996లో మార్టినా హింగిస్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ సాధించిన మరో క్రీడాకారిణిగా నిలుస్తుంది. -
సెరెనాకు 58వ టైటిల్
బ్రిస్బేన్: కొత్త ఏడాదిలో విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. బ్రిస్బేన్ ఓపెన్‌లో చెల్లెలు సెరెనా చాంపియన్‌గా నిలువగా... ఆక్లాండ్ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో అక్క వీనస్, సెర్బియా బ్యూటీ అనా ఇవనోవిచ్ చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో నంబర్‌వన్ సెరెనా 6-4, 7-5తో రెండో ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించి తన కెరీర్లో 58వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో ఈనెల 13న ఆరంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతానని సెరెనా పేర్కొంది. విజేతగా నిలిచిన సెరెనాకు 1,96,670 డాలర్ల (రూ. కోటీ 22 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మూడేళ్ల తర్వాత... ఇద్దరు మాజీ నంబర్వన్ల మధ్య న్యూజిలాండ్‌లో జరిగిన ఆక్లాండ్ ఓపెన్ ఫైనల్లో ఇవనోవిచ్ 6-2, 5-7, 6-4తో వీనస్ విలియమ్స్‌పై గెలిచింది. 2011లో బాలి ఓపెన్ టైటిల్ తర్వాత ఇవనోవిచ్ ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా 2008 తర్వాత వీనస్‌ను ఇవనోవిచ్ ఓడించడం ఇదే తొలిసారి. విజేతగా నిలిచిన ఇవనోవిచ్‌కు 43 వేల డాలర్లు (రూ. 26 లక్షల 76 వేలు) దక్కాయి. -
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో గత ఏడాది ఫైనల్ మ్యాచ్ ఈసారీ పునరావృతం కానుంది. వరుసగా రెండో ఏడాది టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకా యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. కెరీర్లో 17వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై సెరెనా గురిపెట్టగా... గత ఏడాది సెరెనా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాలని అజరెంకా పట్టుదలతో ఉంది. న్యూయార్క్: కొత్త చరిత్ర సృష్టించేందుకు సెరెనా విలియమ్స్ మరో విజయం దూరంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందుతుంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)తో సెరెనా తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-0, 6-3తో ఐదో సీడ్ నా లీ (చైనా)పై; అజరెంకా 6-4, 6-2తో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)పై గెలిచారు. ముఖాముఖి రికార్డులో 31 ఏళ్ల సెరెనా 12-3తో 24 ఏళ్ల అజరెంకాపై ఆధిక్యంలో ఉంది. అయితే యూఎస్ ఓపెన్‌కు ముందు జరిగిన సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో సెరెనాపై అజరెంకా గెలిచింది. ఏకపక్షంగా ఈ సీజన్లో ఏకంగా ఎనిమిది టైటిల్స్ సాధించి భీకరమైన ఫామ్‌లో ఉన్న సెరెనా సొంతగడ్డపై ఎదురులేని ఆటతీరుతో దూసుకుపోతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఈ నల్లకలువ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. 1988లో 128 మంది క్రీడాకారిణులతో కూడిన ‘డ్రా’ మొదలైన తర్వాత మేరీ పియర్స్ (1994 ఫ్రెంచ్ ఓపెన్; 10 గేమ్‌లు), స్టెఫీ గ్రాఫ్ (1988 యూఎస్ ఓపెన్; 13 గేమ్‌లు) అనంతరం తక్కువ గేమ్‌లు కోల్పోయి ఫైనల్‌కు చేరిన మూడో క్రీడాకారిణిగా సెరెనా నిలిచింది. ప్రస్తుత యూఎస్ ఓపెన్‌లో సెరెనా కేవలం 16 గేమ్‌లను మాత్రమే చేజార్చుకుంది. ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న సెరెనాకు సెమీస్‌లోనూ ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి సెట్లో నా లీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు రెండో సెట్లో కాస్త పోటీ ఎదురైంది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సెరెనా వెంటనే తేరుకొని నా లీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 77 నిమిషాల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పెనెట్టా జోరుకు బ్రేక్ ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన అన్‌సీడెడ్ ఫ్లావియా పెనెట్టా జోరుకు అజరెంకా బ్రేక్ వేసింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 18 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ అజరెంకా కీలకదశలో బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌ను వశం చేసుకుంది. తొలి సెట్లో ఈ ఇద్దరూ తడబడ్డారు. స్థిరమైన ఆటతీరును కనబర్చడంలో విఫలమయ్యారు. తొలి సెట్లోని తొలి పది గేముల్లో ఏకంగా ఏడు బ్రేక్ పాయింట్లు వచ్చాయి. అయితే 10 నిమిషాలపాటు జరిగిన పదో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 52 నిమిషాల్లో దక్కించుకుంది. రెండో సెట్లోనూ అజరెంకా తన ఆధిపత్యాన్ని చాటుకొని కెరీర్లో నాలుగోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో స్థానాన్ని సంపాదించింది. పురుషుల డబుల్స్ ఫైనల్ పేస్, స్టెపానెక్ x పెయా, సోరెస్ రాత్రి గం. 10.00 నుంచి మహిళల సింగిల్స్ ఫైనల్ సెరెనా x అజరెంకా అర్ధరాత్రి గం. 2.00 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో గత ఏడాది ఫైనల్ మ్యాచ్ ఈసారీ పునరావృతం కానుంది. వరుసగా రెండో ఏడాది టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకా యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. కెరీర్లో 17వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై సెరెనా గురిపెట్టగా... గత ఏడాది సెరెనా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాలని అజరెంకా పట్టుదలతో ఉంది. న్యూయార్క్: కొత్త చరిత్ర సృష్టించేందుకు సెరెనా విలియమ్స్ మరో విజయం దూరంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందుతుంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)తో సెరెనా తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-0, 6-3తో ఐదో సీడ్ నా లీ (చైనా)పై; అజరెంకా 6-4, 6-2తో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)పై గెలిచారు. ముఖాముఖి రికార్డులో 31 ఏళ్ల సెరెనా 12-3తో 24 ఏళ్ల అజరెంకాపై ఆధిక్యంలో ఉంది. అయితే యూఎస్ ఓపెన్‌కు ముందు జరిగిన సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో సెరెనాపై అజరెంకా గెలిచింది. ఏకపక్షంగా ఈ సీజన్లో ఏకంగా ఎనిమిది టైటిల్స్ సాధించి భీకరమైన ఫామ్‌లో ఉన్న సెరెనా సొంతగడ్డపై ఎదురులేని ఆటతీరుతో దూసుకుపోతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఈ నల్లకలువ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. 1988లో 128 మంది క్రీడాకారిణులతో కూడిన ‘డ్రా’ మొదలైన తర్వాత మేరీ పియర్స్ (1994 ఫ్రెంచ్ ఓపెన్; 10 గేమ్‌లు), స్టెఫీ గ్రాఫ్ (1988 యూఎస్ ఓపెన్; 13 గేమ్‌లు) అనంతరం తక్కువ గేమ్‌లు కోల్పోయి ఫైనల్‌కు చేరిన మూడో క్రీడాకారిణిగా సెరెనా నిలిచింది. ప్రస్తుత యూఎస్ ఓపెన్‌లో సెరెనా కేవలం 16 గేమ్‌లను మాత్రమే చేజార్చుకుంది. ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న సెరెనాకు సెమీస్‌లోనూ ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి సెట్లో నా లీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు రెండో సెట్లో కాస్త పోటీ ఎదురైంది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సెరెనా వెంటనే తేరుకొని నా లీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 77 నిమిషాల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పెనెట్టా జోరుకు బ్రేక్ ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన అన్‌సీడెడ్ ఫ్లావియా పెనెట్టా జోరుకు అజరెంకా బ్రేక్ వేసింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 18 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ అజరెంకా కీలకదశలో బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌ను వశం చేసుకుంది. తొలి సెట్లో ఈ ఇద్దరూ తడబడ్డారు. స్థిరమైన ఆటతీరును కనబర్చడంలో విఫలమయ్యారు. తొలి సెట్లోని తొలి పది గేముల్లో ఏకంగా ఏడు బ్రేక్ పాయింట్లు వచ్చాయి. అయితే 10 నిమిషాలపాటు జరిగిన పదో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 52 నిమిషాల్లో దక్కించుకుంది. రెండో సెట్లోనూ అజరెంకా తన ఆధిపత్యాన్ని చాటుకొని కెరీర్లో నాలుగోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో స్థానాన్ని సంపాదించింది. పురుషుల డబుల్స్ ఫైనల్ పేస్, స్టెపానెక్ x పెయా, సోరెస్ రాత్రి గం. 10.00 నుంచి మహిళల సింగిల్స్ ఫైనల్ సెరెనా x అజరెంకా అర్ధరాత్రి గం. 2.00 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్ ఫైనల్లో అజరెంకా
న్యూయార్క్: గత ఏడాది రన్నరప్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అజరెంకా 4-6, 6-3, 6-4తో 13వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించి హంతుచోవాతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హంతుచోవా (స్లొవేకియా) 6-3, 5-7, 6-2తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, పెనెట్టా (ఇటలీ) 6-2, 7-6 (7/3)తో 21వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)పై నెగ్గారు. ఎదురులేని నాదల్ పురుషుల సింగిల్స్ విభాగంలో తన జోరు కొనసాగిస్తూ రెండో సీడ్ రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-7 (4/7), 6-4, 6-3, 6-1తో 22వ సీడ్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై గెలిచాడు. మరోవైపు రొబ్రెడో చేతిలో ఫెడరర్ ఓడిపోవడంతో యూఎస్ ఓపెన్‌లో నాదల్, ఫెడరర్‌ల మధ్య తొలిసారి ముఖాముఖి పోరు చూడాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఫెడరర్, నాదల్ ఇప్పటిదాకా కెరీర్లో 31 సార్లు తలపడ్డారు. యాదృచ్ఛికంగా వీరిద్దరికీ ఒక్కసారి కూడా యూఎస్ ఓపెన్‌లో ఎదురెదురుగా ఆడే పరిస్థితి రాలేదు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-6 (7/2), 3-6, 7-5, 7-6(7/3)తో టిప్సరెవిచ్ (సెర్బియా)పై; రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-7 (4/7), 7-6 (7/4), 2-6, 6-7 (9/11), 7-5తో రావ్‌నిక్ (కెనడా)పై గెలిచారు. ఇక్కడా మూడో రౌండ్‌లోపే స్వదేశంలో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోని పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా నుంచి ఒక్కరు కూడా కనీసం నాలుగో రౌండ్‌కు చేరుకోలేకపోయారు. బరిలో నిలిచిన చివరి క్రీడాకారుడు టిమ్ స్మీజెక్ (అమెరికా) మూడో రౌండ్లో 4-6, 6-4, 6-0, 3-6, 5-7తో గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడిపోవడంతో అమెరికా కథ ముగిసింది. ఫలితంగా ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా నుంచి ఒక్కరు కూడా నాలుగో రౌండ్‌కు చేరుకోలేకపోయారు. దివిజ్ జోడి ఓటమి పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)-యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) జోడి మూడో రౌండ్లో ఓడిపోయింది. ఐదో సీడ్ ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) -రోజర్ (నెదర్లాండ్స్) ద్వయం 7-6 (10/8), 3-6, 6-3తో దివిజ్- సున్ లూ జంటపై నెగ్గింది. -
ఇద్దరికీ తొలిసారి...
ఒహియో (అమెరికా): వచ్చే సోమవారం మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌కు ముందు... ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారులు రాఫెల్ నాదల్ (స్పెయిన్), అజరెంకా (బెలారస్) కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో వీరిద్దరూ పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో చాంపియన్స్‌గా నిలిచారు. యాదృచ్ఛికంగా ఈ ఇద్దరూ సిన్సినాటి టోర్నీని గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్స్‌లో నాదల్ 7-6 (10/8), 7-6 (7/3)తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలుపొందగా... అజరెంకా 2-6, 6-2, 7-6 (8/6)తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. విజేతగా నిలిచిన నాదల్కు 5,83,800 డాలర్లు (రూ. 3 కోట్ల 68 లక్షలు), అజరెంకాకు 4,26,00 డాలర్లు (రూ. 2 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో నాదల్ 1990 తర్వాత తొలిసారి ఒకే సీజన్లో అత్యధికంగా ఐదు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గాడు. ఈ క్రమంలో జొకోవిచ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు