Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Formation Day Celebrations 2025: YS Jagan hoists Party flag1
ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు(YSRCP Formation Day) బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్‌ జగన్‌.. మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. వైఎస్సార్‌సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం.జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారాయన. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. ఇవాళ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.ప్రజాభ్యుదయమే పరమావధిగా ఎదుగుతున్న వైఎస్సార్‌సీపీ(YSRCP).. సవాళ్లనే సోపానాలుగా మార్చుకుంది. ప్రజాసమస్యల పరిష్కారంపై మడమ తిప్పకుండా పోరాటాలు చేస్తోంది. మహానేత వైఎస్సార్‌ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో నైతిక విలువలను చాటిచెప్పిన వైఎస్‌ జగన్‌(YS Jagan) ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ’ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.

Chittoor Gandhi Town Robbery Attempt Check Details2
చిత్తూరు టౌన్‌లో ముగిసిన పోలీస్‌ ఆపరేషన్‌

చిత్తూరు, సాక్షి: పట్టణంలోని గాంధీ రోడ్డులో పోలీసుల ఆపరేషన్‌ ముగిసింది. ఓ బిల్డింగ్‌లోకి ప్రవేశించిన దొంగల ముఠాను పోలీసులు సమర్థవంతంగా నిలువరించగలిగారు. వాళ్లలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్‌లో దొంగలు వాడిన తుపాకులు డమ్మీవేనని తేలడం కొసమెరుపు.అర్ధరాత్రి దాటాక ఓ దొంగల ముఠా గాంధీ రోడ్డులో ఉన్న ఓ భవనంలోకి చొరబడింది. అది గమనించిన ఆ బిల్డింగ్‌ యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను చూసి దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే పోలీసులు చాకచక్యంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఇంకా ఆ భవనంలోనే ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మణికంఠ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు. బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు ధరించి లోపలికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిందితుల దగ్గర తుపాకులు ఉండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదుపులో ఉన్నవాళ్ల దగ్గరి నుంచి 3 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పక్కనే ఉన్న ఓ బ్యాంకులో దోపిడీ కోసమే ఆ దొంగల ముఠా వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

CBN Kutami Prabhutvam Conspiracy to block Posani release3
పోసాని రిలీజ్‌ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్‌!

కర్నూలు, సాక్షి: వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్‌ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్‌ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్‌ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్‌ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్‌ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్‌ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం.

KTR Serious Comments On Revanth Reddy Over Revathi Arrest4
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్‌.. రేవంత్‌పై కేటీఆర్‌ సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సీనియర్‌ జర్నలిస్ట్‌ రేవతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె అరెస్ట్‌ నేపథ్యంలో ప్రభుత్వం తీరును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ తెలంగాణను నియంతల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు.సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. 12 మంది పోలీసులు మఫ్టీలో ఆమె ఇంటికి వెళ్లి రేవతిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. ఇదే సమయంలో రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అయితే, రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక, జర్నలిస్ట్‌ రేవతి అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌..‘రేవతి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. తెల్లవారుజామునే రేవతి గారి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తన పైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాం.రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ అరెస్టు చేయడం దారుణం.ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చిండు. చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా?. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలి. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట. అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలి’ అని ఘాటు విమర్శలు చేశారు. సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఖండిస్తున్నాను. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. @revathitweets పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్‌ను అరెస్టు చేయడం దారుణం. ఒక రైతు… pic.twitter.com/4mXy8LufOo— KTR (@KTRBRS) March 12, 2025మరోవైపు.. జర్నలిస్ట్‌ రేవతి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. ఈ సందర్బంగా కవిత​ ట్విట్టర్‌ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు. జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు..జర్నలిస్టు రేవతి @revathitweets గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 12, 2025

Asian Legends League 2025: Indian Royals Beat Sri Lanka Lions By 46 Runs5
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర​ ధవన్‌ సేన

ఆసియా లెజెండ్స్‌ లీగ్‌ ఆరంభ ఎడిషన్‌లో (2025) శిఖర్‌ ధవన్‌ నేతృత్వంలోని ఇండియన్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఫయాజ్‌ ఫజల్‌ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శిఖర్‌ ధవన్‌ 16, రాహుల్‌ యాదవ్‌ 21, మనోజ్‌ తివారి 3, యోగేశ్‌ నగర్‌ 0, మన్‌ప్రీత్‌ గోని 28, జకాతి 23, అనురీత్‌ సింగ్‌ 2 పరుగులు చేయగా.. రోహన్‌ రతి, మునాఫ్‌ పటేల్‌ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇ‍బ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్‌ 2, అరుల్‌ ప్రగాసమ్‌, ఉపుల్‌ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్‌ తిసారి పెరీరా తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్‌ తివారి, అనురీత్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్‌ లక్షన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మెవన్‌ ఫెర్నాండో (20 నాటౌట్‌), రవీన్‌ సాయర్‌ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్‌ బ్యాటర్‌ తిలకరత్నే దిల్షన్‌ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్‌ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టైగర్స్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ పఠాన్స్‌పై ఆసియా స్టార్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్‌ లయన్స్‌, శ్రీలంక లయన్స్‌, ఆఫ్ఘనిస్తాన్‌ పఠాన్స్‌, ఇండియన్‌ రాయల్స్‌, బంగ్లాదేశ్‌ టైగర్స్‌) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్‌ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్‌ రాయల్స్‌ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, అంబటి రాయుడు, మనోజ్‌ తివారి, మునాఫ్‌ పటేల్‌ తదితర స్టార్లు ఆడుతున్నారు.

Hostages Rescued From Hijacked Jaffar Express train In Pakistan6
పాక్‌ రైలు హైజాక్‌.. రెస్య్కూలో పాకిస్థాన్‌ ఆర్మీ ప్లాన్‌ సక్సెస్‌!

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్‌ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. దీంతో, రంగంలోకి దిగిన పాక్‌ భద్రతా బలగాలు.. 16 మంది ఉగ్రవాదాలను మట్టుబెట్టాయి. పాక్‌ సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగాయి. అనంతరం, 104 మంది ప్రయాణికులను భద్రతా బలగాలను రక్షించాయి. రైలులో మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్‌ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.🚨 TRAIN HIJACK IN PAKISTAN.Jaffar Express from Quetta to Peshawar HIJACKED after IED blast by Baloch rebels pic.twitter.com/d9HWcmP2PO— akhilesh kumar (@akumar92) March 12, 2025ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్‌ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్‌ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.బలూచిస్తాన్‌తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్‌ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్‌ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.#TrainHijack Jaffer Express hijack in Pakistan 🇵🇰 The Train 🚂 was on its way from Quetta to Peshawar when it was attached by the Beloch rebels about 150 passengers & 6 military 🎖️ personnel were made hostages #TrainHijack #TRAIN #Balochistan #PakistanTrainHijack #TrainHijack pic.twitter.com/h4rbGREMQT— X highlight*️⃣ (@Abu_officl) March 12, 2025గ్రేటర్‌ బలోచిస్థాన్‌ ఏర్పాటే లక్ష్యంపాకిస్థాన్‌లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్‌ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్‌ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్‌ యార్‌ ఖాన్‌ స్వతంత్ర బలోచ్‌ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్‌లో సోవియట్‌ యూనియన్‌ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్‌ సైన్యం బలోచ్‌ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్‌ యార్‌ ఖాన్‌ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (బీఎల్‌ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్‌ బలోచిస్థాన్‌ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్‌ నేషనల్‌ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌ బీఎల్‌ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఇలా జరిగింది..దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు బయల్దేరింది. బొలాన్‌ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్‌ టన్నెల్‌ సమీపంలో బీఎల్‌ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్‌పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్‌ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్‌ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్‌ఏలోని మజీద్‌ బ్రిగేడ్‌గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్‌ టాక్టికల్‌ ఆపరేషన్స్‌ స్క్వాడ్, ఫతే స్క్వాడ్‌ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్‌ఏ ప్రకటించింది.

SBI recently faced technical issues disrupted its UPI services along with mobile and internet banking7
ఎస్‌బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లు యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను పొందడంలో మంగళవారం నాలుగు గంటలకు పైగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తింది. సమస్యను పూర్తిగా పరిష్కరించామని బ్యాంక్‌ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది. దీంతో వినియోగదార్లు చాలా మంది తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘ఎస్‌బీఐ యూపీఐ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కరించాం. సాయంత్రం 5 గంటల నుండి ఆటంకం లేకుండా పనిచేస్తోంది’ అని బ్యాంక్‌ వివరించింది.రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులుయూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ఆధారిత డిజిటల్‌ చెల్లింపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి.ఇదీ చదవండి: టాటా గ్రూప్‌ నుంచి మరో ఐపీవోఅగ్రస్థానంలో ఫోన్‌పేయూపీఐ విభాగంలో ఫోన్‌పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్‌పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ యాప్స్, నవీ, గ్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యాప్స్, అమెజాన్‌ పే, భీమ్‌ యాప్స్‌ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి.

Ukraine Agrees To USA Ceasefire Proposal8
జెలెస్కీ గ్రీన్‌సిగ్నల్‌.. పుతిన్‌ ప్లానేంటి?

జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్దానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.అమెరికా, ఉక్రెయిన్‌ మధ్య కాల్పుల విరమణ విషయమై సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించారు. ఈ క్రమంలో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో, సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.ఈ సందర్బంగా అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. ఇది యుద్దం ముగింపునకు కీలక పరిణామం​. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు బంతి పుతిన్‌ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.🚨 BREAKING: Ukraine has agreed to a US proposal for a 30-day ceasefire, contingent on Russia’s acceptance.The US will also resume military aid to Ukraine and lift the pause on intelligence-sharing as part of the agreement.#VMNews pic.twitter.com/FN8QlYlE7C— Virgin Media News (@VirginMediaNews) March 11, 2025రష్యాపైకి ఉక్రెయిన్‌ డ్రోన్లు..మరోవైపు.. ఉక్రెయిన్‌ మంగళవారం రష్యాపైకి అతిపెద్ద డ్రోన్ల దాడికి దిగింది. రష్యాలోని 10 ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలటరీ తెలిపింది. డ్రోన్ల దాడిలో ఒకరు చనిపోగా పదుల సంఖ్యల జనం గాయపడినట్లు రష్యా తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఉక్రెయిన్‌–అమెరికా మధ్య సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం చర్చలు మొదలవడానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా దాడిపై ఉక్రెయిన్‌ స్పందించలేదు. అత్యధికంగా సరిహద్దుల్లోని కస్క్‌ ప్రాంతంలోకి వచ్చిన 126 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మిలటరీ తెలిపింది. రాజధాని మాస్కో దిశగా వచ్చిన మరో 91 డ్రోన్లను ధ్వంసం చేశామంది. ఇంకా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్, బ్రయాన్‌స్‌్క, వొరొనెజ్‌తోపాటు సుదూర ప్రాంతాలైన కలుగ, లిప్‌ట్‌స్‌్క, నిజ్నీ నొవ్‌గొరోడ్, ఒరియోల్, రైజాన్‌లపైకి కూడా ఇవి వచ్చాయని వివరించింది.

Rukshar Dhillon Walks Out Dilruba Pre Release Event9
కోపం తగ్గలే.. హీరోయిన్ ని మళ్లీ పక్కనబెట్టేశారు!

సినిమా సెలబ్రిటీలు పెద్దగా గొడవలు పడటానికి ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు నోరుజారి లేదంటే పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంటోంది. తాజాగా 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఈ తరహా సంఘటనే జరిగింది.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)తెలుగులో కొన్ని సినిమాలు చేసిన రుక్సార్ లేటెస్ట్ మూవీ 'దిల్ రుబా'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం.. మార్చిన 14న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫొటోగ్రాఫర్లతో ఈమెకు చిన్నపాటి వివాదం జరిగింది. తనకు అసౌకర్యమని చెప్పినా సరే ఫొటోలు తీస్తున్నారని చెప్పింది. దీంతో అప్పటినుంచి మూవీ ఈవెంట్స్ కవర్ చేసే ఫొటోగ్రాఫర్స్ ఈమెని సైడ్ చేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లో మంగళవారం రాత్రి 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. చివర్లో టీమ్ అంతా ఫొటోలకు పోజులిచ్చారు. కానీ రుక్సార్ ని మాత్రం సైడ్ అయిపోమని ఫొటోగ్రాఫర్స్ చెప్పారు. దీంతో ఆమె పక్కకు తప్పుకొంది. మరి ఈ వివాదం ఎన్నిరోజులు నడుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Ysrcp Huge rallies will be held up to the collector office10
యువత పోరు నేడే

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.3,500 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న విద్యార్థులు, పుస్తెలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన తల్లుల పక్షాన ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది. డీఎస్సీపై చేసిన మొదటి సంతకమే తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు.. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా నిరుద్యోగులను వంచిస్తున్న తీరుపై కూడా వైఎస్సార్‌సీపీ కదనభేరి మోగించనుంది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో బుధవారం ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయనుంది. అన్నదాతల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 13న రైతు పోరు.. విద్యుత్‌ చార్జీల బాదుడును నిరసిస్తూ డిసెంబర్‌ 27న విద్యుత్‌ పోరును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు రైతు పోరు, విద్యుత్‌ పోరును విఫలం చేయడానికి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. వారి బెదిరింపులు.. నిర్భందాలను రైతులు, అన్ని వర్గాల ప్రజలు లెక్క చేయలేదు. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రైతు పోరులో అన్నదాతలు.. విద్యుత్‌ పోరులో అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా మహిళలు కదంతొక్కారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు రైతు పోరు, విద్యుత్‌ పోరు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు యువత పోరును నియంత్రించాలని ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అయినా రైతు పోరు.. విద్యుత్‌ పోరు కంటే మరింతగా యువత పోరును విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. నమ్మించి నయ వంచన » రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నా­రు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది» నిజానికి గత విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ జగన్‌ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యా­ర్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూట­మి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌­మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమా­సికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి పెట్టింది. » కూటమి సర్కారు ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. అయితే, వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ.. చాలా వరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమ కాకపోవడం గమనార్హం. » ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తామని ఎ­న్ని­క­ల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగు పడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేని వారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.» వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2,500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది. ఇవ్వాల్సింది రూ.7,100 కోట్లు... బడ్జెట్‌లో రూ.2,600 కోట్లేగత ఐదు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. 2024–25కి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం రూ.700 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే గతేడాది పిల్లలకు రూ.3,200 కోట్లు బాకీ పెట్టారు. అంతేకాకుండా 2025–26లో మరో రూ.3,900 కోట్లు విద్యాదీవెన, వసతి దీవెనకు కావాలి. ఈ రెండూ కలిపితే పిల్లలకు రూ.7,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే పిల్లలను చదువులకు దూరం చేసే కుట్ర తేటతెల్లమవుతోంది. ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను నట్టేట ముంచారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. మరోవైపు విద్యా దీవెన ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసివేసే పరిస్థితి వచ్చింది. వసతి దీవెనను పూర్తిగా గాలికి వదిలేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించడంతోపాటు 2025–26 బడ్జెట్‌లో ఈమేరకు తగినన్ని నిధులు కేటాయిస్తూ సవరణ చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.రూ.18,663.44 కోట్లు ఇచ్చిన వైఎస్‌ జగన్‌వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ఏడాదికి రూ.3,900 కోట్లు చొప్పున అందచేసింది. ఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశారు. గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను సైతం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచారు. మొత్తం రూ.18,663.44 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు.» కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వడం దేవు­డెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఊడ­బెరికి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.­10,000 వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి, పీఠం ఎక్కాక 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు. » తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలు­వునా ముంచారు. 16,347 పోస్టు­ల­ను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు.»‘ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లా పారిపోయే బ్యాచ్‌ కాదు నేను..’ అంటూ 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో ప్రగల్భాలు పలికిన లోకేశ్‌.. ఇప్పుడు జాబ్‌ కేలండర్‌ ఊసే మర్చిపోయారు. చంద్రబాబు సైతం ఇదే హామీ పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది.. కానీ జాబ్‌ కేలండర్‌ ప్రకటన లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్‌–1, 2 మెయిన్స్‌ పరీక్షలను పలుసార్లు వాయిదా వేశారు. గత నెలలో గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని 10 లక్షల మందికి పైగా పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో.. శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలా? అని మథనపడుతున్నారు. » చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు, ఏడాదికి రూ.61,200 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూపాయి కూడా కేటాయించలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
రికార్డింగ్‌ డ్యాన్సర్‌కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ

అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్‌పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు.

title
భారత్‌ గెలుపు వేళ అభిమానుల‌పై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష

భోపాల్‌: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం తర్వాత దేశవ్యాప్తంగ

title
నటి రన్యా రావు కేసులో భారీ ట్విస్ట్‌.. తరుణ్‌ రాజు అరెస్ట్‌

బెంగళూరు: కన్నడ సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్‌ కేసు

title
కూతురి స్మగ్లింగ్‌లో డీజీపీ పాత్ర ఉందా?

బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ ని

title
డీఎస్పీ కనకలక్ష్మి అరెస్టు

బనశంకరి: బెంగళూరులో బోవి అభివృద్ధి మండలి అక్రమాల కేసులో నింద

NRI View all
title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement

వీడియోలు

Advertisement