Top Stories
ప్రధాన వార్తలు

వీరమల్లు సైద్ధాంతిక విన్యాసం!
సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. పిఠాపురంలో నిన్న ఆ వేడుక వైభవంగానే జరిగింది. తాను అసెంబ్లీ గేటు తాకడానికి అవకాశం కల్పించిన పిఠాపురాన్ని ఈ రకంగా పవన్ గౌరవించారు. అసెంబ్లీ గేటును తాకే క్రమంలో పనిలో పనిగా కొన్ని తొడలు విరగ్గొట్టినట్టుగా కూడా ఆయన చెప్పారు. వీరమల్లు కదా, ఆ మాత్రం ఎలివేషన్ అవసరమే! పుష్కర సభ అంగరంగ వైభవంగా జరిగిందనీ, లక్షలాది జనసందోహంతో పొంగిపొరలిందనీ యెల్లో మీడియా వేనోళ్ల పొగిడింది.యెల్లో మీడియా సాధారణంగా చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ మాత్రమే పరిమితం చేసే ప్రచార గౌరవాన్ని పవన్ సభకు కూడా కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నది. అందులో ఒక పత్రిక సభలో జనగణన కూడా చేసింది. సభలో జనం కూర్చోవడానికి 14 ఎకరాలు కేటాయించారనీ, ఆ స్థలంలో లక్షలాదిమంది కిక్కి రిసిపోయారని రాసింది. జనం కిక్కిరిసి కూర్చుంటే ఎకరాకు ఐదు వేల మందిని లెక్కవేయడం ఆనవాయితీ. అంతకంటే ఐదు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువగా కిక్కిరిశారని యెల్లో మీడియా చెబుతున్నది. ఏమో గుర్రం ఎగరావచ్చు! ఎవరికీ అభ్యంతరం లేదు. జనం కూర్చోవడానికి కేటాయించిన స్థలం 14 ఎకరాలు కాదని, తొమ్మిదెకరాలు మాత్రమేనని స్థానికుల సమాచారం. ఆ స్థానికులు గిట్టనివారు కావచ్చు. యెల్లో మీడియా రాసిందే అక్షర సత్యం కావచ్చు. సభ విజయవంతమైనందుకు పవన్ కల్యాణ్‌కు సనాతనాభివందనాలు!ఇప్పుడు పవన్ కల్యాణ్ అధికారంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఎన్నికల హామీల అమలు గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించో మాట్లాడుతారని జనం ఆశించడం సహజం. కానీ, అటువంటి ఆశలకు ఆయన అవకాశం ఇవ్వలేదు. కాలు వల కింద కూడా ఎండిపోతున్న పంటల గురించి ఆయన మాట్లాడలేదు. చెమటోడ్చి తెచ్చిన పంటలకు పడిపోతున్న ధరల గురించీ ఆయన మాట్లాడలేదు. అవసరమైన ఔషధా లతో, అందుబాటులో వైద్యులతో తొమ్మిది నెలల కిందటి దాకా ధైర్యం నింపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు వెలవెల బోతున్న వైనం కూడా ఆయన ప్రసంగంలో చోటు చేసుకోలేదు.అధోముఖయానం చేస్తున్న జీఎస్టీ వసూళ్ల సాక్షిగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం గురించిన ప్రస్తావనే రాలేదు. పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిన విద్యా విప్లవానికి ఎందుకు కళ్లెం వేశారన్నదానిపై వివరణే వినిపించ లేదు. డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఇంటర్ విద్యార్థుల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం నెల తిరక్కుండానే పరమ నాసిరకంగా ఎందుకు దిగజారిందో ఆయన చెప్పలేదు. ఆర్బీకే సెంటర్లలో అందుబాటులో లేకుండా ఎరువులూ, విత్తనాలూ ఎందుకు అదృశ్యమయ్యాయో, ఇల్లిల్లూ తిరిగి సేవలందించిన వలంటీర్లు ఏమయ్యారో అనే విషయాల గురించి పవన్ మాట్లాడలేదు.ఎమ్మెల్యేలూ, నాయకులూ జనం మీద పడి దోచుకుతింటున్నారని యెల్లో మీడియానే కోడై కూస్తున్నది. పంపకాల్లో తేడా లతో కూటమి నాయకులు కాట్లాడుకుంటున్నారని కూడా పచ్చ కోడి గూడెక్కి కూస్తున్నది. అధికారులు కలెక్షన్ కౌంటర్లు తెరిచి అక్కడ వారి సతీమణుల్ని కూర్చోబెడుతున్నారని కూడా ఆరోప ణలు చేస్తున్నది. ఇటువంటి కీలక విషయాల జోలికి ఆయన వెళ్లలేదు. లౌకిక విషయాల గురించి ఆయన మాట్లాడ దలుచు కోలేదు. ఆయన ప్రసంగమంతా అలౌకిక పారవశ్యమే!ఈ సభ ద్వారా ఆయన మూడు అంశాలను చెప్పదలుచు కున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ ఆయన రాజకీయ ప్రయాణమంతా సిద్ధాంతబద్ధంగానే సాగిందని జనం నమ్మాలనేది ఆయన మొదటి పాయింట్. బాల్యం నుంచే తాను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం, తద్వారా ఆ శ్రేణుల్లో అగ్రభాగాన నిలబడాలని కోరుకోవడం రెండో పాయింటు. కొందరు విశ్లేషకులు, మరికొందరు మీడియా వ్యక్తులు ఊహిస్తున్నట్టు కూటమిలో విభేదాలేమీ ఉండబోవనీ, అక్కడ మోదీకీ – ఇక్కడ బాబుకూ విధేయుడనే అనే సందేశాన్ని శ్రేణులకు పంపించడం మూడో పాయింటు.లెఫ్ట్ నుంచీ సెంటర్‌కూ, అక్కడి నుంచి రైట్‌కూ తన సిద్ధాంత విధేయత మారిందని మీడియాలో వస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. చేగువేరాను తాను అభిమానించడానికి కారణం అతను కమ్యూనిస్టు కావడం కాదట! వైద్యవృత్తిని వదిలేసి విప్లవకారుడుగా మారినందు వల్లనే అభిమానించానని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ భాషణపై సీపీఎం అగ్రనాయకుడు బీవీ రాఘవులు వ్యంగ్యంగా స్పందించారు. చేగువేరా మెడిసిన్ చదివిన మాట నిజమే కానీ, ఆయన వైద్యవృత్తిలో ఎప్పుడున్నారో నాకైతే తెలియదన్నారు. నిజంగానే వైద్యుడిగా చే ప్రాక్టీస్ చేసిందేమీ లేదు. అంతర్జాతీయ విప్లవ కారుడుగానే ఆయన ప్రసిద్ధుడు. చేగువేరా మీద అభిమానానికి పవన్ చెప్పిన కారణమే నిజమైతే, విప్లవాలు – యుద్ధాల వీధి గుమ్మాల్లో నిలబడి వైద్యసేవలందించిన డాక్టర్ నార్మన్ బెథూన్, డాక్టర్ ద్వారకానాద్ కోట్నిస్‌ల అభిమానిగా ఆయన మారి ఉండాలి. అసలు ప్రాక్టీసే చేయని చేగువేరాను విప్లవకర వైద్యుని కోటాలో అభిమానించడం అనే కథ సరిగ్గా అతకలేదు.తాను బాల్యం నుంచే సనాతనవాదినని పవన్ ఈ సభలో చెప్పుకున్నారు. సనాతన ధర్మం తన రక్తంలోనే వుందని చెప్పారు. పధ్నాలుగేళ్ల వయసు నుంచే దీక్షలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. తనపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువని కూడా పవన్ అంగీకరించారు. సినిమాలు, కథలు, నవలలతో బాగా ప్రభావితమయ్యే వ్యక్తులు కొందరు వాటిలోని పాత్రలతో తమను పోల్చుకోవడం అనే ఫ్యాంటసీలో మునిగి తేలుతుంటారు. చేగువేరా ప్రభావం బాగా ఉన్న రోజులో తమ తండ్రి గారు కమ్యూనిస్టని పవన్ చెప్పేవారు. అంతటితో ఆగకుండా, నానమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో నాన్నగారు సిగరెట్ కాల్చుకునేవారని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఇంతకన్నా అవగాహనా రాహిత్యం ఇంకొకటి ఉండదు. కమ్యూనిస్టు లంటే దైవదూషకులనే అర్థం ఇందులో స్ఫురిస్తున్నది. కమ్యూనిస్టు అయినంత మాత్రాన నాస్తికుడై ఉండాలనేదేమీ లేదు. నాస్తికుడైనంత మాత్రాన దైవదూషణ చేస్తారనీ, అవమానిస్తా రనీ అర్థం కాదు. వారి వారి విశ్వాసాలకు, నమ్మకాలకు కట్టుబడి ఉంటారంతే! దైవదూషణ వంటి పనులకు విశ్వాసాలతో సంబంధం లేదు. అది వ్యక్తిగతం. పూజా పునస్కారాలు చేసే సంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన నిగమశర్మ వంటి వారి కథలు కూడా మనం విన్నాము.ఇప్పుడాయన సనాతన ధర్మ ప్రభావానికి లోనైన తర్వాత కుటుంబ కథలో కొంత మార్పు చేశారు. కేవలం ఇరవయ్యేళ్ల వయసులోనే నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండే వారని, ఆ తర్వాత రామభక్తుడిగా మారారని పిఠాపురం సభలో పవన్ చెప్పారు. తన చిన్నతనం నుంచే ఇంట్లో రామనామ జపం వినిపించేదని ఆయన అన్నారు. తన సనాతనధర్మ నిబద్ధతపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని మరోసారి ఆవేశం ప్రదర్శించారు. ఇదంతా ఎందుకంటే, తాను చిన్నతనం నుంచీ సిద్ధాంత నిబ ద్ధతతోనే ఉన్నాననీ, ఆ సిద్ధాంతం సనాతన ధర్మమేననీ ఇప్పు డాయన సవరణ చేయదలుచుకున్నారు.చేగువేరా కమ్యూనిస్టని కాదు... మంచి వైద్యుడూ, విప్లవ కారుడైనందువల్ల అభిమానించారు. మరి శ్రీశ్రీ, దాశరథి,శేషేంద్ర వంటి వారి సంగతేంది? అవకాశం దొరికిన ప్రతిసారీ వారి కవితా పంక్తుల్ని వల్లెవేయడం పవన్‌కు అలవాటు. వారు సనాతనవాదులా? సామ్యవాదులా? పిఠాపురం సభలో కూడా దాశరథినీ, శ్రీశ్రీని ఆయన తలచుకున్నారు. ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’’ అనే దాశరథి గేయం సామ్యవాద గీతమా? సనాతనవాద గీతమా?. ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘అవతారం’ కవితను ఆసాంతం చదివి వినిపించారు. ‘‘యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖణేల్‌మన్నాయి / నరకలోకపు జాగిల మ్ములు / గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి / ఉదయ సూర్యుని సప్త హయములు / నురుగులెత్తే పరుగు పెట్టేయి / కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది...’’ ... ఇలా పురాణ ప్రతీకలతో సాగిపోతుందా కవిత.ఇంతకాలం ఈ ప్రతీకలన్నీ ప్రభవించబోయే విప్లవానికి సూచికలుగా భావించారంతా! మరి సనాతన ధర్మ పరిరక్షణా యాత్రికునికి ఈ కమ్యూనిస్టు విప్లవ ప్రతీకలెందుకో! ఆయన విడమరిచి చెబితే తప్ప సామాన్యులకు అర్థం కాదు. ఆయన ప్రసంగంలో ఒకపక్క చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తు తూనే మోదీ తరఫున వకాల్తా పుచ్చుకొని తమిళనాడులోని డీఎమ్‌కే పార్టీ మీద దాడి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేయబోతున్నదనీ, దీనిపై ఐక్యంగా పోరాడదామనీ ఆ పార్టీ వాళ్లు వాళ్ల ప్రయత్నమేదో చేస్తున్నారు. బీజేపీ దీర్ఘకాల లక్ష్యాలకు ఇటువంటి చిన్నచిన్న ప్రయత్నాలు కూడా విఘాతం కలిగిస్తా యని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. వారి మనసెరిగి పవన్ ప్రసంగించారు. అప్పుడెప్పుడో చిన్నతనంలో ఆయన మద్రా స్లో ఉన్నప్పుడు తమిళుడెవరో ‘గొల్టీ’ అని గిచ్చాడట! దాన్ని ప్పుడు గుర్తుచేసుకున్నారు.పవన్ సభ ప్రారంభానికి ముందే చంద్రబాబు, లోకేశ్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యెల్లో మీడియా ఆ సభకు పూర్ణకుంభ స్వాగతం పలికింది. ఈ మూడు పార్టీల కూటమిలో లుకలుకలున్నాయనీ, విడిపోతాయనీ, బీజేపీ – జన సేన కలిసి ఒక కూటమిగా ఏర్పడుతాయనీ ఊహిస్తున్న విశ్లేష కులు ఇప్పటికైనా తమ ఆలోచనల్ని సరిదిద్దుకోవాలి. విభేదా లేమీ లేవు. ముగ్గురూ కలిసి పనిచేస్తారు. బీజేపీ–సంఘ్ పరి వార్ల దీర్ఘకాలిక లక్ష్యానికి సహకరిస్తూనే మిగిలిన ఇద్దరు ఎవరి ఇంటిని వాళ్లు చక్కదిద్దుకుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్‌ను సీఎం కుర్చీలో త్వరగా కూర్చోబెట్టాలనే ఒత్తిడి బాబు మీద పెరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో డిప్యూటీగా ఉండటం పవన్‌కు ఇబ్బంది కనుక ఆయన కేంద్రానికి వెళతారనీ, వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిన బీజేపీ తరఫున సనాతన ప్రచారానికి ఆయనను నియోగిస్తారని తెలుస్తున్నది. పవన్ స్థానంలో నాగబాబు రాష్ట్ర కేబినెట్లోకి రావచ్చు. జనసేన కార్య కర్తలు ఇంతకంటే పెద్ద దృశ్యాన్ని ఆశిస్తే నిరాశ తప్పకపోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ఓర్పు, నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వేడుకలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. నలుపు, లేత నీలం రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.వృషభం...అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ఆత్మీయులు మరింత చేయూతనందిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఆప్తుల నుండి సమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, . విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మిథునం..రాబడి ఆశాజకనంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఒక పాత సంఘటన గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం..పనులో ్లప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ కార్యదీక్షకు కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు, అనారోగ్యం, ప్రయాణాలు వాయిదా పడతాయి. నీలం, నేరేడు రంగులు, . గణేశ్‌స్తోత్రాలు పఠించండి.సింహం...అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు. విష్ణుధ్యానం చేయండి.కన్య....ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు, దేవీస్తుతి మంచిది.తుల.....చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు. బంధువులు లేదా స్నేహితుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు, రియల్ ఎస్టేట్ల వారికి శుభవార్తలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, ఆంజనేయస్వామి దండకం పఠించండి.వృశ్చికం...రాబడి ఆశాజనకమే. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ధనవ్యయం. స్వల్ప వివాదాలు. లేత ఎరుపు, నేరేడు రంగులు, . దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.ధనుస్సు....వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కార్యజయం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, లేత ఆకుపచ్చరంగులు, లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.మకరం.....పనులు సజావుగా పూర్తి కాగలవు. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మనస్సాక్షికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చే వారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మనళ్ళాంతి లోపిస్తుంది. ఒత్తిడులు అధికం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు, గణేశాష్టకం పఠించండి.కుంభం.....కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమిస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కార్యక్రమాలు కొన్ని సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, తల్లి తరఫు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో వృ«థా ఖర్చులు. మానసిక సంఘర్షణ. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.మీనం...అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో కొంత శ్రమ పడాల్సివస్తుంది. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మీకు మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారుల యత్నాలలో కదలికలు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. నీలం, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.

హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 20 మంది మృతి
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆదేశాల దరిమిలా యెమెన్ రాజధానిపై జరిగిన దాడుల్లో 20 మంది పౌరులు మృతిచెందారని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. హౌతీ ఆరోగ్య, పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో అమెరికా దాడుల్లో 20 మంది పౌరులు మరణించారని , మరో తొమ్మిది మంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపింది.యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదులపై శక్తివంతమైన సైనిక చర్యను ప్రారంభించాలని తాను అమెరికా సైన్యాన్ని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీ ఉగ్రవాదులు(Houthi Rebels) అమెరికాతో పాటు ఇతర నౌకలు, విమానాలు, డ్రోన్లపై దాడులకు ప్రేరేపించే విధంగా నిరంతర ప్రచారాన్ని నిర్వహించారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా తాము జిబౌటి ఓడరేవు నుండి బయలుదేరిన మూడు అమెరికన్ సైనిక సరఫరా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్ హౌతీ గ్రూప్ పేర్కొంది. హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా మాట్లాడుతూ రెండు అమెరికన్ డిస్ట్రాయర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు టెహ్రాన్ ఆర్థిక వనరులు, ఆయుధ మద్దతు, సైనిక శిక్షణను అందిస్తోందనే అమెరికా ఆరోపణను ఐక్యరాజ్యసమితికి ఇరాన్ శాశ్వత మిషన్ తోసిపుచ్చింది.ఇది కూడా చదవండి: Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’

హ్యాట్సాఫ్ హర్మన్
డబ్ల్యూపీఎల్‌లో 2023 టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ గత ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 5 పరుగుల తేడాతో ఓడి నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్ క్రీజ్‌లో ఉన్నంత వరకు జట్టు గెలుపు దిశగానే వెళ్లినా...ఆమె వెనుదిరిగాక ఇతర బ్యాటర్లు 12 బంతుల్లో 16 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇది హర్మన్‌ను తీవ్రంగా బాధించింది. 2025 సీజన్‌కు ముందు జట్టు కోచ్ దేవిక పల్షికర్తో కలిసి హర్మన్ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చించింది. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడి పెంచుకోవడంకంటే తొలి బంతినుంచే హర్మన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాలనేది ప్రణాళిక. ఇందులో తొందరగా అవుటయ్యే ప్రమాదం ఉన్నా... ఇది సరైందిగా వారు భావించారు. ఈసారి టీమ్ విజయంలో బ్యాటర్‌గా హర్మన్ కీలక పాత్ర పోషించింది. ఏకంగా 154.87 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించి తన విలువను చాటింది. టోర్నీలో 11 సిక్స్‌లు బాదిన తీరు ఆమె ఆధిక్యాన్ని చూపించింది. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో ఆమె దాదాపు చివరి వరకు నిలిచి పని పూర్తయ్యేలా చూసింది. 10 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధసెంచరీలతో 523 పరుగులు చేసిన నాట్ సివర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. పరుగుల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్ (307) జట్టుకు అదనపు బలంగా మారింది. బౌలింగ్‌లో అమేలియా కెర్ (18 వికెట్లు), హేలీ మాథ్యూస్ (18), నాట్ సివర్ (12) ప్రత్యర్థులను పడగొట్టడంలో సఫలమయ్యారు. మరో ప్రధాన పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోయినా... ఆ ప్రభావం జట్టుపై పడకుండా ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. ఫైనల్లో మాత్రం షబ్నమ్ తన స్థాయి ప్రదర్శనను చూపించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయంతో ముంబై టోర్నీ మొదలైంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో జట్టు కోలుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ చేతిలోనే పరాజయం. ఈ సారి హర్మన్, సివర్ ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ ఖాయమైనా... టాప్ స్థానం కోసం జట్టు గట్టిగానే పోరాడింది. అయితే బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప్రదర్శనపై సందేహాలు వచ్చాయి. అయితే సంపూర్ణ ఆధిక్యంతో విజయం సాధించిన ముంబై అలవోకగా ఫైనల్ చేరింది. గత రెండు లీగ్ మ్యాచ్ తరహాలో ఈ సారి కూడా ఢిల్లీపై ఆరంభంలో తడబాటు కనిపించింది. కానీ మళ్లీ హర్మన్, సివర్ భాగస్వామ్యమే జట్టును నడిపించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరిద్దరు పట్టుదలగా ఆడటంతో జట్టు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత స్కోరును సాధించగలిగింది. ఫైనల్ సహా ఇదే వేదికపై వరుసగా నాలుగో మ్యాచ్ ఆడటం కూడా జట్టుకు కలిసొచ్చింది. టోర్నీలో ఢిల్లీ ఫామ్ చూస్తే 150 పరుగుల ఛేదన పెద్ద కష్టం కాదనిపించినా... ముంబై బౌలర్లంతా సమష్టిగా చెలరేగి మూడేళ్ల వ్యవధిలో రెండో టైటిల్‌ను అందించడం విశేషం.

సీమ హక్కులు 'కృష్ణా'ర్పణం
రాయలసీమకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాలను వాడుకునే విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ యథేచ్ఛగా అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతున్నా, ఇంకా అదనంగా దండుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... ఏమాత్రం అడ్డు చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. మాకు కేటాయించిన నీటిని మేము తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఎలా తప్పవుతుందని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఎదుట గట్టిగా నోరు విప్పి వాదించలేదు. ఎవరి మేలు కోసం.. ఎందుకీ ఈ బేలతనం? ‘సీమ’పై కోపమా? లేక వైఎస్ జగన్‌కు పేరొస్తుందని కుళ్లా..?సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీరు.. చెన్నై తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవితవ్యం కూటమి సర్కారు తీరుతో ప్రశ్నార్థకంగా మారింది. పది నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని వాదించలేకపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పటి నుంచే పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తున్నా, 800 అడుగుల నుంచే ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటున్నా.. కొత్తగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నా అడ్డుచెప్పలేక పోతోంది. 880 అడుగులకు నీళ్లొచ్చినప్పుడు మాత్రమే మనం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గరిష్టంగా హక్కుగా దక్కిన 44 వేల క్యూసెక్కులు తరలించాలంటే ఎన్ని రోజులు ఆగాలని, ఆ మేరకు వరద ఎన్ని రోజులు ఉంటుందని.. ఇలాగైతే ఆ మేరకు నీటిని తరలించడం ఎలా సాధ్యమని గట్టిగా వాదించలేదు. కోటా మేరకు నీటిని వాడుకునేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నోరు విప్పి చెప్పలేదు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని కూడా వాదించలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం.. చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని గత నెల 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై ఆ రోజు ఈఏసీ 25వ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చర్చించింది. ఆ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పేర్కొన్న విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడం వల్లే రాయలసీమ ఎత్తిపోతలకు శరాఘాతంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలను తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కొనసాగిస్తూ.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను హరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014–19 మధ్య నాటి చంద్రబాబు సర్కార్ రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ, ఓటుకు నోటు కేసుతో వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడూ వ్యవహరిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. తాగునీటి పనులకూ బ్రేక్చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. పది నెలలుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడం ద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించలేదు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడినట్లయింది. ‘బనకచర్ల’ ప్రాజెక్టుపైనా డ్రామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టుపైనా నాటకాలాడుతున్నారని స్పష్టమవుతోంది. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని ఓవైపు చెబుతూనే.. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం. కేవలం ప్రచారం కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారని ఇట్టే అర్థమవుతోంది. నిర్విఘ్నంగా పాలమూరు– రంగారెడ్డి పనులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. మన రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టులపై అప్పటి చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ని ఆశ్రయించారు. ఈ కేసులో రైతులతో నాటి వైఎస్సార్సీపీ సర్కార్ జత కలిసింది. ఆ రెండు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే లేవని.. వాటి వల్ల శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని వాదించింది. దీంతో ఏకీభవించిన ఎన్జీటీ తక్షణమే పనులు నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తుండటంతో 2022 డిసెంబర్ 22న తెలంగాణ సర్కార్‌కు రూ.920.85 కోట్ల జరిమానా సైతం విధించింది. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా పనులు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల⇒ ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.

హోలీ డ్యాన్స్ చేస్తావా.. సస్పెండ్ చేయించమంటావా?
పాట్న: హోలీ వేడుకల సమయంలో డ్యాన్స్ చేస్తావా లేక సస్పెండ్ చేయించమంటావా అంటూ ఒక పోలీసును ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ బెదిరించడం వివాదం రేపుతోంది. మాజీ సీఎంలు లాలు ప్రసాద్, రబ్డీదేవీల పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ అధికార నివాసం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి లాలు మాదిరిగానే హోలీ వేడుక సమయంలో పండగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మద్దతు దారుల చొక్కాలను తేజ్ ప్రతాప్ చించివేశారు. అనంతరం స్కూటర్‌పై ‘పిల్లిమొగ్గల చిన్నాన్నకు హోలీ శుభాకాంక్షలు’అని పరోక్షంగా సీఎం నితీశ్‌కుమార్‌ను ఉద్దేశించి తన నివాసం చుట్టుపక్కల వీధుల్లో కేకలు వేస్తూ తిరిగారు. అదేవిధంగా, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికపై సోఫాలో కూర్చుని.. ‘ఏయ్ పోలీస్.. దీపక్..ఇప్పుడు మేమొక పాట వేస్తాం. డ్యాన్స్ చేయాలి. లేదంటే నువ్వు సస్పెండ్ అవుతావ్. ఏమనుకోకు, ఇది హోలీ పండగ’ అని అక్కడే ఉన్న దీపక్ అనే కానిస్టేబుల్నుద్దేశించి అంటున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో, ఆ కానిస్టేబుల్ అక్కడి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. ‘తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా. అప్పట్లో సీఎంగా లాలు చట్టాన్ని డ్యాన్స్ చేయించాడు. బిహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చాడు. ఇప్పుడు కుమారుడు అధికారంలో లేకున్నా, చట్టాన్ని, రక్షకులను డ్యాన్స్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వారికి అధికారం ఇవ్వరాదు’ అని పేర్కొంది. VIDEO | A policeman was seen dancing on the instruction of RJD leader Tej Pratap Yadav during Holi celebration at his residence in Patna. #tejpratapyadav #Holi #Patna pic.twitter.com/oCIP0kL03r— Press Trust of India (@PTI_News) March 15, 2025

ఈనాడు ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: అందరికీ నిత్యం ఉదయాన్నే నీతులు చెప్పే ఈనాడు (ఉషోదయ ఎంటర్ప్రైజెస్) దౌర్జన్యం కొనసాగుతోంది. తమ పత్రిక ద్వారా జనాలకు నీతులు మాత్రమే చెబుతామని, వాటిని తాము మాత్రం ఆచరించమని ఈనాడు మరోమారు నిరూపించింది. గతంలో విశాఖపట్నం ఈనాడు కార్యాలయం స్థలం విషయంలో దాని యజమాని ఆదిత్య వర్మను ముప్పుతిప్పలు పెట్టిన ఈనాడు యాజమాన్యం, ఇప్పుడు విజయవాడలో ఉన్న కార్యాలయ స్థలం విషయంలో కూడా దాని యజమాని ముసునూరు అప్పారావును సైతం అలాగే ముప్పుతిప్పలు పెడుతోంది. ఈనాడు పత్రిక కోసం తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసినా.. దాన్ని అప్పారావుకు అప్పగించకుండా చుక్కలు చూపిస్తోంది. చివరకు అప్పారావు కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అక్కడ కూడా అప్పారావుకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేసింది. కోర్టుకెళ్లి అప్పారావు విజయం సాధించినా.. న్యాయస్థానం ఆదేశాలను సైతం ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో కోర్టు ఈనాడు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. స్థల యజమానిని వేధించడానికే ఆ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా.. బాధితుడు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఈనాడు యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనాడు ఆస్తుల జప్తునకు న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు ఆస్తులను బదలాయించడం, తాకట్టు పెట్టడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం చేయరాదని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ ఆస్తులను ఎవరూ కొనడం, బహుమతిగా తీసుకోవడం చేయరాదంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈనాడు సీఎండీ కిరణ్‌ను ఆదేశించింది. అసలు కథ ఏమిటంటే.. ఈనాడు యజమాని రామోజీరావు 1975లో విజయవాడ పటమటలంకలో ముసునూరి అప్పారావుకు చెందిన 92 సెంట్ల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.725 అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పక్కనే అప్పారావు సమీప బంధువైన వల్లూరు వెంకటేశ్వరరావుకు చెందిన ఎకరా 47 సెంట్ల భూమిని కూడా రామోజీరావు లీజుకు తీసుకున్నారు. లీజు గడువు 30.04.2008న ముగిసింది. దీంతో మరో 33 ఏళ్ల పాటు లీజు పొడిగించాలని స్థల యజమాని అప్పారావును రామోజీరావు కోరారు. రామోజీ సంగతి బాగా తెలిసిన అప్పారావు లీజు పొడిగింపునకు నిరాకరించారు. 6 నెలల్లో స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వాలని రామోజీరావుకు తేల్చిచెప్పారు. 6 నెలల గడువు 2008 అక్టోబర్‌తో ముగిసింది. అయినా రామోజీరావు ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. ఇదే సమయంలో మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగించేలా అప్పారావును ఆదేశించాలంటూ విజయవాడ జిల్లా కోర్టులో రామోజీరావు సూట్ దాఖలు చేశారు. దానిని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 2013లో కొట్టేసింది. అప్పారావుకు చెందిన స్థలంపై ఈనాడుకు ఎలాంటి హక్కు లేదని తేల్చిoది. అంతేకాక ఈనాడు ఆ స్థలంలో ఉండటం అక్రమమేనని స్పష్టం చేసింది. దీనిపై ఈనాడు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను సైతం కోర్టు కొట్టేసింది. సీనియర్ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని స్పష్టం చేసింది. అప్పారావును వేధించడానికి ఈ అప్పీల్‌ను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని జిల్లా కోర్టు 2017లో తీర్పునిచ్చింది. పరిహారంగా రూ.5.20 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించినా..2015లో ముసునూరి అప్పారావు తన స్థలం నుంచి ఈనాడును ఖాళీ చేయించాలని కోరుతూ విజయవాడ కోర్టులో సూట్ దా3ఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పారావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాదాపు 60 పేజీల తీర్పు వెలువరించింది. 2012–15 వరకు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6శాతం వార్షిక వడ్డీతో పరిహారంగా చెల్లించాలని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. మిగిలిన కాలానికి పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును అప్పారావుకు ఇస్తూ 2024 అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. అయితే.. ఈ తీర్పును ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో తీర్పు అమలుకు అప్పారావు కింది కోర్టులో ఈపీ దాఖలు చేశారు. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని జప్తు చేయాలని అందులో కోరారు. దానిపై విచారణ జరిపిన కోర్టు తాము ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.5.20 కోట్ల పరిహారం చెల్లించడంలో ఈనాడు విఫలమైందని తేల్చింది. ఇందుకు గాను ఈనాడు ఆస్తుల జప్తునకు ఆదేశిస్తున్నట్టు ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఎండీ కిరణ్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఆదిత్య వర్మను వేధించిన ఈనాడు రామోజీరావు ఈనాడు పత్రిక కోసం విశాఖపట్నం సీతమ్మధారలో మంతెన ఆదిత్య వర్మకు చెందిన 2.7 ఎకరాల భూమిని 1974లో 33 ఏళ్ల గడువుతో లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.2,500 అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వర్మ నుంచి లీజుకు తీసుకున్న భూమిని రామోజీరావు సొంత భూమిగా చూపుకుని ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. రామోజీరావు లీజుకు తీసుకున్న 2.7 ఎకరాల భూమిలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు నిమిత్తం 618 గజాల భూమిని తీసుకుంది. ఇందుకు గాను సీతమ్మధారలో 872 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి ఈ స్థలం ఆదిత్య వర్మకు చెందాలి. కానీ.. రామోజీరావు మోసపూరితంగా ఆ భూమిని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించారు. ఇందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆదిత్యవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామోజీ పలుకుబడి ముందు పోలీసులు ఏం చేయలేకపోయారు. దీంతో వర్మ న్యాయపోరాటం చేపట్టారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగగా.. ఆ భూమికి సంబంధించి 2007లో 33 ఏళ్ల లీజు ముగిసింది. అయినా రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. లీజును మరో 33 ఏళ్ల పాటు పొడిగించాలని కోరారు. రామోజీ దుర్బుద్ధి తెలిసిన వర్మ అందుకు అంగీకరించలేదు. దీంతో తనది కాని స్థలం విషయంలో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. వర్మ కూడా రామోజీరావును దీటుగా ఎదుర్కొన్నారు. చివరకు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఎక్కడా పప్పులు ఉడకకపోవడంతో రామోజీరావు చివరకు వర్మ స్థలాన్ని ఖాళీ చేశారు. వర్మకు చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా పూర్తిగా చెల్లించకుండా కొంత చెల్లించి రామోజీ రాజీ చేసుకున్నారు.

రన్యారావు సంచలన ఆరోపణలు
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావు తాజాగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు మార్చి ఆరో తేదీన హర్షవర్థిని రన్యా పేరిట ఆమె రాసిన లేఖ తాజాగా బహిర్గతమైంది.పరప్పన అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా ఆమె ఈ లేఖను డీఆర్ఐకు పంపించారు. దుబాయ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు తాను బంగారాన్ని తీసుకురాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కస్టడీలో ఉన్న సమయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పలుమార్లు చెంప దెబ్బ కొట్టారని, తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పారు.‘‘ఈ అంశంలో నేను నిరపరాధినని వివరించేందుకు ఎంత ప్రయత్నించినా అధికారులు నా మాటల్ని వినిపించుకోలేదు. ఎయిర్పోర్ట్ బయటకాకుండా విమానంలోనే నన్ను అరెస్ట్‌చేశారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు వరకు అధికారులు మొత్తంగా 10, 15 సార్లు చెంపదెబ్బ కొట్టారు. కొట్టినా, చెంపదెబ్బ తిన్నాసరే వాళ్లు టైప్‌చేసిన పేజీలపై సంతకాలు చేయబోనని చెప్పా. దీంతో అన్యాయంగా మా తండ్రి పేరును ఈ కేసులోకి లాగి పరువు తీస్తామని బెదిరించారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా వాళ్లు చెప్పినపనిచేశా. దాదాపు 60 టైప్‌చేసిన పేజీలపై, 40 తెల్లకాగితాలపై సంతకాలు చేశా’’అని అన్నారు.రన్యా రావు సవతి తండ్రి కె.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీసుల గృహ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ‘‘మూడో తారీఖు సాయంత్రం అరెస్టయితే నాలుగో తేదీ రాత్రి కోర్టులో హాజరుపరిచేదాకా నన్ను నిద్రపోనివ్వలేదు, తిండి పెట్టలేదు. ఆరోజు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల్లా నటించిన కొందరు వ్యక్తులు ఆ విమానంలోని కొందరు ప్రయాణికులను రక్షించేందుకు నన్ను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు.జడ్జి ఎదుట హాజరుపరిచేందుకు కారులో తీసుకెళ్లేటప్పుడూ అధికారులు బెదిరించారు. కొట్టిన విషయం చెప్తే నాన్న సంగతి, నా సంగతి చూస్తామని బెదిరించారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నకాలంలో బలవంతంగా తీసుకున్న నా వాంగ్మూలాలకు విలువ ఇవ్వకండి’’అని డీఆర్ఐకు లేఖలో విజ్ఞప్తి చేశారు. కస్టడీలో ఉన్న కాలంలో కళ్ల కింద నల్లని చారలతో, నిస్సత్తువగా ఉన్న రన్యా రావు ఫొటో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెల్సిందే.మూడ్రోజులు రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీలో ఉన్న ఆమెను ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గతంలో రన్యా రావు భిన్న వాదనలు చేశారు. అరెస్ట్‌సమయంలో తన నుంచి పోలీసులు 17 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారని ఏడోతేదీన వాంగ్మూలంలో ఒప్పకున్నారు. అధికారులు ఇష్టమొచ్చినట్లు తిట్టారని పదో తేదీన కోర్టులో ఆమె చెప్పారు. అయితే కొట్టలేదని ఒప్పుకున్నారు. మరోవైపు, రన్యారావు సవతి తండ్రి రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం తాజాగా సెలవుపై పంపించింది. ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకుంది.

అనగనగా ఒక కథ
తెలుగు సినిమాల కలెక్షన్స్ స్పీడ్‌గా ముందుకెళుతున్నాయి. కానీ తెలుగు సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. అరవై – డెబ్బై ఏళ్ల క్రితం నాటి కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు తెలుగు హీరోలు పాత కాలం కథలను ఓకే చేస్తున్నారు. ఇలా ‘కట్ చేస్తే... అనగనగా ఒక కథ’ అంటూ కొందరు స్టార్ హీరోలు చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్స్ గురించి తెలుసుకుందాం...అడవిలో అడ్వెంచర్మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా సాగే పీరియాడికల్ ఫిల్మ్ అని సమాచారం. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రకథను, రచయిత విజయేంద్రప్రసాద్ రెడీ చేశారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకాచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027ప్రారంభంలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.సైనికుడి స్టోరీప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా 1940 నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. మరోవైపు ప్రభాస్ చేస్తున్న హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘రాజా సాబ్’. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ కూడా పీరియాడికల్ చిత్రమే. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ ఈ మూవీలో హీరోయిన్స్‌గా చేస్తున్నారు.టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని గతంలో యూనిట్ ప్రకటించింది. కానీ ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కావడం లేదని, త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారని తెలిసింది.డ్రాగన్ వార్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌పై 1969 అని కనిపిస్తోంది. సో... ఈ ‘డ్రాగన్’ పీరియాడికల్ యాక్షన్ మూవీ అని ఆల్మోస్ట్ ఖరారైపోయినట్లే. కథ ప్రధానంగా కోల్కత్తా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఓ పెద్ద డ్రగ్స్ మాఫియా ఈ సినిమాలోని మరో ముఖ్య అంశమని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2026 జనవరి 9న ‘డ్రాగన్’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటగాడు‘క్రికెట్, కుస్తీ, కబడ్డీ’... ఈ మూడు స్పోర్ట్స్ ఆడుతున్నారట రామ్‌చరణ్. మరి... మల్టీస్పోర్ట్స్ పర్సన్‌గా రామ్‌చరణ్ ఎందుకు మారారు? అనేది ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో చూడాలి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1970–1980 నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో క్రికెట్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కానీ ఈ చిత్రకథలో... కుస్తీ, కబడ్డీ.. ఖోఖో ఆటల ప్రస్తావన కూడా ఉంటుందట. అయితే మెయిన్ స్పోర్ట్‌గా కబడ్డీ ఉంటుందట. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘పెద్ది’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఆ రోజున ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని, ఆ సమయంలోనే ఈ మూవీ రిలీజ్‌పై కూడా ఓ స్పష్టత వస్తుందని సమాచారం.విలేజ్‌లో యాక్షన్విలేజ్లో యాక్షన్‌కు సై అన్నారు శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ రూరల్ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ 1960 నేపథ్యంలో సాగుతుంది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ పెద్ద సెట్‌ను క్రియేట్ చేశారు.అలాగే శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర డైరెక్షన్లో ఓ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా మూడు తరాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలోని మేజర్ సీన్స్ 1990లో ఉంటాయని తెలిసింది. విక్రమ్ సమర్పణలో వంశీ – ప్రమోద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో శర్వానంద్ ఓ బైక్ రేసర్‌గా నటిస్తున్నారు.కింగ్డమ్హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ‘కింగ్డమ్’. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ మూవీని మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు రవికిరణ్ కోలా డైరెక్షన్లో ‘రౌడీ జనార్ధన’ అనే మూవీ చేయనున్నారు విజయ్ దేవరకొండ. ఈ రూరల్ యాక్షన్ డ్రామా కూడా పీరియాడికల్ చిత్రమే అని తెలిసింది. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది.మాస్ సంబరాలుసాయిదుర్గా తేజ్ కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల యేటిగట్టు’. రూ. 125 కోట్ల బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల, సంజయ్ దత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘సంబరాల యేటిగట్టు’ మూవీ సెప్టెంబరు 25న విడుదల కానుంది.చాంపియన్బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓ యువ ఫుట్‌బాల్ ఆటగాడి జీవితం ఏ విధంగా సాగిందనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘ఛాంపియన్’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేస్తున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ఇటీవల తెలిపారు. ఇలా పీరియాడికల్ ఫిల్మ్స్ చేస్తున్న మరికొంతమంది హీరోలు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

జత కలవాలంటే జాతకాలు కలవాల్సిందేనా!
‘ఏనాడు ఏ జంటకో రాసి ఉంటాడు విధి ఎప్పుడో’ అన్నాడు మనసుకవి ఆత్రేయ.‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని నానుడి. విధి నిర్ణయం ముందే జరిగి ఉంటుందనేది తరతరాల విశ్వాసం. ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుందనేది నమ్మకం.అంతమాత్రాన పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోలేం. జీవితంలోని నానా పరిణామాల్లాగానే పెళ్లిళ్లు కూడా బ్రహ్మలిఖితమేనంటారు.విధి విధానాన్ని మార్చడం మానవమాత్రులకు శక్యంకాదని అందరికీ తెలుసు.విధిపై నమ్మకమెలా ఉన్నా, భవిష్యత్తును తెలుసుకోవాలనే కుతూహలం మానవ సహజం. అందుకే పెళ్లిళ్లకు ముందు వధూవరులకు జత కలిసేదీ లేనిదీ తెలుసుకోవాలనుకుంటారు. జత కట్టడానికి... జాతకాలు కలవడానికి సంబంధమేమిటో... తెలుసుకుందాం.సంప్రదాయబద్ధంగా జరిగే చాలా పెళ్లిళ్లలో పెళ్లికి ముందు వధూవరుల తల్లిదండ్రులు కట్న కానుకలు, లాంఛనాలు తదితర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లెక్కలు మాట్లాడుకుంటారు. ఇదంతా పెళ్లిచూపుల సమయంలో జరిగే వ్యవహారం. పెద్దల ద్వారానో, తెలిసిన మధ్యవర్తుల ద్వారానో పెళ్లి సంబంధం ప్రస్తావన వస్తే, పెళ్లిచూపులకు ముందే జరిగే తతంగం ఇంకొకటి ఉంది. అదే వధూవరుల జాతక పరిశీలన, నిపుణులైన జ్యోతిష సిద్ధాంతుల ద్వారా వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు. వధూవరులకు జత కలవాలంటే, వారిద్దరి జాతకాలూ కలవాల్సిందేనని చాలామంది నమ్ముతారు. అందుకే, వధూవరులు ఇద్దరి జాతకాలూ సరిపోతాయని సిద్ధాంతులు నిర్ధారించిన తర్వాత మాత్రమే పెళ్లిచూపుల వరకు వెళతారు. జాతకాలలో ఏవైనా దోషాలు ఉన్నట్లు చెబితే, పెళ్లికి ముందు పరిహారాలు చేయించుకుంటారు. జాతకాలు ఏమాత్రం సరిపోవని సిద్ధాంతులు తేల్చేస్తే, పెళ్లిచూపుల వరకు వెళ్లకుండానే విరమించుకుంటారు.పెళ్లి సంబంధాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలామంది మొదటగా వధూవరుల జాతకాలను పరిశీలన కోసం జ్యోతిష సిద్ధాంతులను సంప్రదిస్తారు. వారి సలహాలు, సూచనల మేరకే తర్వాతి కార్యక్రమాల కోసం సన్నాహాలు చేసుకుంటారు. పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించే సంప్రదాయం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అలాగని, ఇది కేవలం మన భారతదేశానికి మాత్రమే పరిమితమైన సంప్రదాయం కాదు, పలు ఇతర దేశాల్లోనూ ఉంది. వేర్వేరు దేశాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులు ఉన్నాయి. ఆయా దేశాల వారు తమ తమ జ్యోతిష పద్ధతుల ఆధారంగా పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి, ఆ తర్వాత పెళ్లిళ్లకు సిద్ధపడతారు. పెళ్లిళ్ల కోసం జాతకాల పరిశీలన చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.జాతకాల్లో ఏమేం పరిశీలిస్తారు?వధూవరుల జాతకాలు పరస్పరం పొంతన సరిపోయేదీ లేనిదీ నిర్ధారించేందుకు మన దేశంలోని జ్యోతిషులు ‘అష్టకూట గుణ మేళనం’ అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో వధూవరుల జాతకాలలోని నాడీ కూటమి, భకూటమి, గణ కూటమి, మైత్రీ కూటమి,యోని కూటమి, తారా కూటమి, వశ్య కూటమి, వర్ణ కూటమి అనే ఎనిమిది అంశాల పొంతనను పరిశీలిస్తారు. ఈ అంశాలకు మొత్తం 36 గుణాలను కేటాయిస్తారు. వధూవరుల జాతకాలు రెండింటినీ పరిశీలించినప్పుడు ఈ ఎనిమిది అంశాల్లో కనీసం 18 గుణాలు వచ్చినట్లయితేనే, వధూవరుల జాతకాల్లో పొంతన కుదిరినట్లు చెబుతారు. వధూవరుల జాతకాల గుణమేళనంలో 18–25 గుణాలు మధ్య వచ్చినట్లయితే సామాన్యమైన పొంతనగా, 25 గుణాల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఉత్తమమైన పొంతనగా చెబుతారు. ఉత్తర భారతదేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తారు.దక్షిణ భారతదేశంలో మరో నాలుగు అంశాలను కూడా పరిశీలిస్తారు. అవి: మహేంద్ర కూటమి, స్త్రీ దీర్ఘకూటమి, రజ్జు కూటమి, వేధ కూటమి. వధూవరుల జాతకాల పరిశీలనలో గుణ మేళనం కీలకమే అయినా, దీనితో పాటు గ్రహమైత్రి తదితర మరికొన్ని అంశాలను కూడా జ్యోతిషులు పరిశీలిస్తారు. కుజ దోషం, కాలసర్పదోషం, పితృదోషం వంటి దోషాలు ఉన్నట్లయితే, తగిన పరిహారాలను సూచిస్తారు. వివాహానికి ముందే దోష పరిహారాలు చేయించుకున్నట్లయితే, ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. అన్నీ కుదిరి, వధూవరుల ఉభయ కుటుంబాలవారు వివాహానికి నిశ్చయించుకుంటే, నిశ్చితార్థం మొదలుకొని వివాహ క్రతువు పూర్తయ్యేంత వరకు వివిధ ఘట్టాలకు తగిన ముహూర్తాలను జ్యోతిషులు నిర్ణయిస్తారు. అందుకే, పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిష సిద్ధాంతులకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంటుంది.శరవేగంగా జ్యోతిష వ్యాపారంఆ ధునికత పెరిగే కొద్ది జ్యోతిషంపై జనాల్లో నమ్మకం అంతకు మించి పెరుగుతూ వస్తోంది. మన దేశంలోని జ్యోతిషులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా జ్యోతిషానికి సంబంధించిన రకరకాల సేవలను అందిస్తున్నారు. కొందరు జ్యోతిషులు టీవీ చానెళ్లు, పత్రికల్లో విరివిగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. ఇంకొందరు టీవీ చానెళ్లు, పత్రికల్లో రాశిఫలాలను చెప్పడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ నివేదిక ప్రకారం 2023 నాటికి మన దేశంలో జ్యోతిషుల వ్యాపారం 3.22 బిలియన్ డాలర్ల మేరకు (దాదాపు రూ.28 వేల కోట్లు) జరిగింది. ఈ వ్యాపారం 2032 నాటికి 23.87 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.07 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. మన దేశంలోని జ్యోతిష వ్యాపారం 24.93 శాతం సగటు వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్నట్లు ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ చెబుతోంది. ఐటీరంగం నమోదు చేసుకుంటున్న వార్షిక వృద్ధి రేటు కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం విశేషం.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, జ్యోతిష వ్యాపారం విలువ 2024 నాటికి 14.30 బిలియన్ డాలర్లుగా (రూ.1.24 లక్షల కోట్లు) నమోదైంది. ఇది 2034 నాటికి 25.61 బిలియన్ డాలర్లకు (రూ.2.23 లక్షల కోట్లు) చేరుకోగలదని ‘మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్’ అంచనా వేస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిషులకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వధూవరుల గుణమేళన కోసం జాతకాల పరిశీలనకు మన దేశంలో జ్యోతిషులు సగటున రెండువేల నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లోని జ్యోతిషులైతే, ఈ పనికి ఐదువందల రూపాయలతో సరిపెట్టుకుంటుంటే, పెద్ద నగరాల్లోని పేరుమోసిన జ్యోతిషుల్లో కొందరు పదివేల రూపాయలకు పైబడి రుసుము వసూలు చేస్తున్నారు. వివాహ ముహూర్త నిర్ణయం, దోష పరిహార సలహాలు, పూజలు వంటి వాటికి రుసుము అదనంగా ఉంటుంది. కొందరు జ్యోతిషులు ఈ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తుంటే, చాలామంది ముఖాముఖిగా అందిస్తున్నారు.ఆసియా దేశాల్లో..భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, పలు ఆసియా దేశాల్లోనూ జ్యోతిషంపై ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిళ్లలో జాతకాల పరిశీలనను ఆ దేశాల్లోని ప్రజలు కూడా కీలకంగా భావిస్తారు. మయాన్మార్, చైనా, మంగోలియా, టిబెట్, తైవాన్, కంబోడియా, జపాన్ తదితర దేశాల్లోని ప్రజలు స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పురాతన చైనీస్ జ్యోతిష పద్ధతిని అనుసరిస్తారు. మన జ్యోతిషంలో పన్నెండు రాశులకు పన్నెండు చిహ్నాలు ఉన్నట్లే, చైనీస్ జ్యోతిషంలోనూ పన్నెండు చిహ్నాలు ఉంటాయి. మన దేశంలో జ్యోతిషులు చాంద్రమానాన్ని, సౌరమానాన్ని అనుసరిస్తుంటారు. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి తిథి నక్షత్రాలను లెక్కిస్తారు. చైనీస్ జ్యోతిష విధానంలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో చిహ్నం ఉంటుంది. చైనీస్ నూతన సంవత్సరం రోజు నుంచి వారికి సంవత్సరం మొదలవుతుంది. చైనీస్ పద్ధతిలో ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడిపుంజు, కుక్క, పంది ఒక్కో సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతి పన్నెండేళ్లకు ఇవి పునరావృతమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ ఏడాది 2025 చైనాకు ‘పాము’ సంవత్సరం. చైనీస్ జ్యోతిషం ప్రకారం ఈ సంవత్సరం పుట్టిన వారికి ‘ఎద్దు’, ‘కోడిపుంజు’ సంవత్సరాలలో పుట్టినవారితో వివాహం అనుకూలంగా ఉంటుంది. ‘పులి’, ‘గుర్రం’, ‘పంది’ సంవత్సరాలలో పుట్టిన వారితో వివాహం వీరికి అంతగా పొసగదు.జపాన్‌లో ‘అస్జిక్కన్ జునిషి’ అనే సంప్రదాయ జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వీరు కూడా చైనా కేలండర్ మాదిరిగా పన్నెండు చిహ్నాలను ఉపయోగిస్తారు. పన్నెండు చిహ్నాలతో కూడిన రాశి చక్రాన్ని ‘జునిషి’ అని పిలుస్తారు. చైనా పద్ధతిలో మేక ఉంటే, జపాన్ పద్ధతిలో గొర్రెను; చైనా పద్ధతిలో పంది ఉంటే, జపాన్ పద్ధతిలో ముళ్లపందిని ఉపయోగిస్తారు. వివాహ పొంతనకు దాదాపు చైనా పద్ధతినే అనుసరిస్తారు. చైనా సంప్రదాయంలో చాంద్రమానం ఆధారంగా కేలండర్‌ను రూపొందించుకుంటారు. జపాన్‌లో గ్రెగేరియన్ కేలండర్‌ను ఉపయోగిస్తారు. జపాన్ సమాజంలో జ్యోతిషంపై పెద్దగా పట్టింపులు లేకున్నా, పెళ్లిళ్లకు ముందు ప్రేమజంటలు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు.మయాన్మార్లో మరోరకమైన జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వారంలోని ఏడు రోజులకు ఏడు జంతువుల పేరుతో గుర్తిస్తారు. వాటి ఆధారంగా ఎవరితో ఎవరికి పెళ్లి జరిగితే అనుకూలమో నిర్ణయిస్తారు. బర్మీస్ ప్రాచీన జ్యోతిష పద్ధతి ప్రకారం ఆదివారం– గరుడపక్షి, సోమవారం– పులి, మంగళవారం– సింహం, బుధవారం– ఏనుగు, గురువారం– ఎలుక, శుక్రవారం– గినీపంది, శనివారం– డ్రాగన్‌గా గుర్తిస్తారు. వీటితో పాటు భారతీయ జ్యోతిషంలో మాదిరిగానే పన్నెండు రాశులను, ఇరవై ఏడు నక్షత్రాలను, నవగ్రహాలను అనుసరించి జాతక చక్రాలు వేస్తారు. అన్ని అంశాలనూ తమ శాస్త్రం ప్రకారం పరిశీలించి, వధూవరులకు జాతక పొంతన బాగున్నదీ లేనిదీ నిర్ణయిస్తారు. పెళ్లిళ్లకు ముందు జ్యోతిషులను సంప్రదించే సంప్రదాయాన్ని మయాన్మార్లో ఇప్పటికీ పాటిస్తారు.పాశ్చాత్య దేశాల్లో.. ఆ సియా దేశాలతో పోల్చుకుంటే పాశ్చాత్య దేశాల్లో జ్యోతిషాన్ని నమ్మేవారి సంఖ్య కొంత తక్కువే అయినా, ఇప్పటికీ జ్యోతిషాన్ని నమ్మేవారు లేకపోలేదు. ప్రస్తుతం లండన్ సహా పలు యూరోపియన్ నగరాల్లో రకరకాల సేవలు అందిస్తున్న జ్యోతిషులు ఉన్నారు. వెబ్సైట్లు, యాప్‌లు వంటి అధునాతన సాధనాల ద్వారా వీరు తమ సేవలను వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలు తక్కువే అయినా, పెళ్లికి ముందు చాలామంది ప్రేమికులు తమ అన్యోన్యతను గురించి ముందుగానే తెలుసుకోవడానికి జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. మెసపటేమియన్ నాగరికత కాలంలో అభివృద్ధి చెందిన జ్యోతిష విధానం కాలక్రమంలో పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ విస్తరించింది. మధ్యయుగాల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచంలో జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మత గురువుల ఆంక్షల వల్ల ఆ దేశాల్లో జ్యోతిషానికి ప్రాభవం సన్నగిల్లింది. ప్రాచీన రోమన్ శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో రాసిన ‘టెట్రాబిబ్లోస్’ పాశ్చత్య ప్రపంచంలోని తొలి జ్యోతిష గ్రంథం. పాశ్చాత్య జ్యోతిషంలోనూ మన మాదిరిగానే పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పద్ధతిలో సౌర గమనం ప్రకారం రాశులను గణిస్తారు.కుజ, శుక్ర గ్రహాల స్థానాలు, జన్మరాశుల ఆధారంగా వధూవరుల జాతకాల పొంతనను నిర్ణయిస్తారు.ఆఫ్రికా దేశాల్లో.. ఆ ఫ్రికా దేశాల్లో స్థానిక తెగల ప్రజలు రకరకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులను పాటిస్తారు. వలస పాలనల ప్రభావంతో ఆఫ్రికాలో పాశ్చాత్య జ్యోతిషానికి, భారతీయ జ్యోతిషానికి ఆదరణ పెరిగింది. అయితే, ‘అయోదెజి ఒగున్నయికె’, ‘ఇఫా’ అనేవి ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న స్థానిక సంప్రదాయ జ్యోతిష పద్ధతులు. ‘అయోదెజి ఒగున్నయికె’ అనేది ఒకరకమైన ‘భూ భవిష్యవాణి’. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాల చలనాన్ని కాకుండా, భూమిపై నిత్యం కనిపించే నేల, కొండలు, చెట్లు చేమలు, జీవరాశులు వంటివాటిని శకునాలుగా పరిగణించి, వాటి ఆధారంగా భవిష్యవాణి చెబుతారు. ఈ పద్ధతిలో ప్రధానంగా పదహారు చిహ్నాల పట్టికను ఉపయోగిస్తారు. శిశువు పుట్టినప్పుడు కనిపించే వాటి ఆధారంగా ఈ చిహ్నాలతో జాతక చక్రాన్ని రూపొందిస్తారు. ‘ఇఫా’ జ్యోతిష పద్ధతి పశ్చిమాఫ్రికా దేశాలలో వ్యాప్తిలో ఉంది. ఈ పద్ధతిలో 256 సంప్రదాయ సంకేతాల పట్టిక ఆధారంగా, జ్యోతిషం చెబుతారు. ఇందులో నేల మీద గవ్వలు వేసినట్లుగా, నేల మీద లేదా పళ్లెంలో పరిచిన పిండిలో పోకలను వేసి, వాటి సంఖ్య ఆధారంగా పట్టికలోని సంకేతాలను గుర్తించి, జ్యోతిషం చెబుతారు. సంప్రదాయ వివాహాల్లో వధూవరుల మధ్య పొంతనను తెలుసుకునేందుకు ఆఫ్రికన్ స్థానిక తెగల ప్రజలు ఈ జ్యోతిషులను సంప్రదించి, వారి సలహాలను పాటిస్తారు.
Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
యువ కథ: కనురెప్పలే సాక్షిగా
రైస్ ఫూలింగ్
సునీత దిగొస్తే.. కల్పన మళ్లీ పుట్టినట్లే!
రేసింగ్‌కు టీవీఎస్, పెట్రోనాస్ జట్టు
జత కలవాలంటే జాతకాలు కలవాల్సిందేనా!
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
నా పక్కన హీరోయిన్గా నటించలేమన్నారు: సప్తగిరి
ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు
ఒక్కసారే రీచార్జ్.. ఏడాదంతా వ్యాలిడిటీ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.. సంఘంలో ఆదరణ
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
మన పార్టీ వాళ్లను ఏ పార్టీ వాళ్లు చేర్చుకోరు... అది మన పార్టీ అదృష్టం!!
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
త్వరలో పాక్‌లో మరో ఐసీసీ టోర్నీ.. షెడ్యూల్ విడుదల
మెగా బ్రదర్స్ అత్యుత్సాహం..
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర వీరుడు!
Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
యువ కథ: కనురెప్పలే సాక్షిగా
రైస్ ఫూలింగ్
సునీత దిగొస్తే.. కల్పన మళ్లీ పుట్టినట్లే!
రేసింగ్‌కు టీవీఎస్, పెట్రోనాస్ జట్టు
జత కలవాలంటే జాతకాలు కలవాల్సిందేనా!
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
నా పక్కన హీరోయిన్గా నటించలేమన్నారు: సప్తగిరి
ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు
ఒక్కసారే రీచార్జ్.. ఏడాదంతా వ్యాలిడిటీ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.. సంఘంలో ఆదరణ
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
మన పార్టీ వాళ్లను ఏ పార్టీ వాళ్లు చేర్చుకోరు... అది మన పార్టీ అదృష్టం!!
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
త్వరలో పాక్‌లో మరో ఐసీసీ టోర్నీ.. షెడ్యూల్ విడుదల
మెగా బ్రదర్స్ అత్యుత్సాహం..
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర వీరుడు!
సినిమా

మీడియాలో హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ అని..: అన్నపూర్ణమ్మ
సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గోల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లు, లేడీ యాక్టర్స్ పలువురు ఈ విషయమై ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నారు. గతంలో పలువురు దర్శకనిర్మాతలు తమని వేధించారని బయటపెడుతున్నారు. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం మీటూ పేరుతో ఓ ఉద్యమం కూడా నడిచింది.(ఇదీ చదవండి: ఆస్తులు కోల్పోయి మంచాన పడ్డ నటి.. 118 నుంచి 38 కిలోలకు..)ఈ కమిట్మెంట్స్ గురించి పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించారు. కానీ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా మాట్లాడుకొచ్చారు.'మీడియాలో హైలైట్ కావడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారు. ఆ రోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్స్ ఉండేది. నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పనిచేశాను కాబట్టి నన్ను ఆ ఉద్దేశంతో ఎవరూ అడగలేదు. కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం అయితే చేయరు' అని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'బ్రహ్మానందం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

సమంత కొత్త జర్నీ.. 'బంగారం' కంటే 'శుభం' ముందు
చాన్నాళ్ల నుంచి సమంత తెలుగు సినిమాలు చేయట్లేదు. చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో నటించిన సామ్.. ఆ తర్వాత 'సిటాడెల్' వెబ్ సిరీస్ చేసింది. అది తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయలేదు. దీంతో సమంత ఇక కొత్త చిత్రాలకు స్వస్తి చెప్పేసిందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు 'శుభం'తో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ మేరకు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))ఇప్పటివరకు సమంత అంటే మనకు తెలిసింది హీరోయిన్ మాత్రమే. కానీ ఇకపై నిర్మాతగానూ వరస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉంది. ఈ క్రమంలోనే తొలి ప్రాజెక్టుగా 'శుభం' ప్రకటించింది. పలువురు యువ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.సమంత.. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో గతంలోనే 'నా ఇంటి బంగారం' అని ఓ మూవీ ప్రకటించింది. కానీ అది ఇప్పుడు ఏ దశలో ఉందో.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే 'శుభం' షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఆస్తులు కోల్పోయి మంచాన పడ్డ నటి.. 118 నుంచి 38 కిలోలకు..
దాదాపు మూడు వందల సినిమాల్లో నటించిన బిందు ఘోష్ (Bindu Ghosh) ఇప్పుడు దీన స్థితిలో ఉంది. తమిళ, తెలుగు భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆమె మంచాన పడింది. మూడు నెలలుగా కాలేయం, బీపీ సంబంధింత సమస్యలతో బాధపడుతోంది.క్షీణించిన ఆరోగ్యం..తల్లి అనారోగ్య పరిస్థితి గురించి తనయుడు, కొరియోగ్రాఫర్ శివాజీ మాట్లాడుతూ.. అమ్మకు 76 ఏళ్లు. ఒకప్పుడు 118 కిలోల బరువుండేది. అనారోగ్యం వల్ల ఏకంగా 38 కిలోలకు తగ్గిపోయింది. ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అమ్మ సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోయింది. తెలుగులో ఏయే సినిమాలు?అందుకే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ మధ్యే తమిళనాడు ప్రభుత్వం స్పందించి అమ్మకు చికిత్స అందిస్తోంది అని పేర్కొన్నాడు. బిందు ఘోష్.. కృష్ణగారి అబ్బాయి, దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, చిత్రం భళారే చిత్రం వంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించింది. తమిళంలో నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గానూ రాణించింది.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల

కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ)
ప్రేక్షకులు ఇప్పుడు చాలావరకు భారీ బడ్జెట్ సినిమాలంటే థియేటర్లకు వెళ్తున్నారు. మిగతా చిన్న చితకా మూవీస్ ని ఓటీటీల్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా పరభాషా చిత్రాల్ని డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా కొన్నిరోజుల క్రితం జీ5లోకి వచ్చిన మూవీ 'కుడుంబస్థాన్'. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: భార్యని కూడా రేసులోకి దింపిన చైతూ)కథేంటి?నవీన్ (మణికందన్) ఓ యాడ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వెన్నెల (శాన్వి మేఘన) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్లిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కులాల వేరు కావడంతో పెద్దల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. అయినా సరే నవీన్.. వెన్నెలని ఇంటికి తీసుకెళ్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు నవీన్ ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఈ విషయం ఇంట్లో చెబితే ఇబ్బంది అవుతుందని దాన్ని దాచేందుకు చాలా ఇబ్బందులు పడతాడు. మోసానికి కూడా గురవుతాడు. మరి నవీన్ గురించి ఇంట్లో తెలిసిపోయిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఇండస్ట్రీలో కథల కొరత ఉందని చాలామంది అంటూ ఉంటారు. కానీ తరచి చూస్తే మన చుట్టుపక్కలా బోలెడన్ని స్టోరీలు తారసపడతాయి. అలా ఓ మధ్య తరగతి కుర్రాడి జీవితంతో తీసిన సినిమానే 'కుడుంబస్థాన్'.నవీన్-వెన్నెల లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది. భార్యని ఇంట్లోకి తీసుకొస్తే.. తక్కువ కులం అమ్మాయి అని తల్లి సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తుంది. మరోవైపు తీర్థయాత్రల కోసం తల్లి.. కొడుకుని డబ్బులు అడుగుతుంది. తండ్రేమో ఇంటి బాగుచేయమని గోల చేస్తుంటారు. కొన్నాళ్లకు భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఉద్యోగం పోతుంది. తర్వాత జరిగే పరిణామాలే సినిమా.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)మీరు 'కుడుంబస్థాన్' చూస్తున్నంతసేపు నవ్వుతారు, భయపడతారు, ఆలోచిస్తారు. ఎందుకంటే నవీన్ పాత్రకు చాలామంది మధ్య తరగతి యువకులు రిలేట్ అవుతారు. డబ్బులు సంపాదించకపోతే తల్లి-భార్య-తండ్రి.. ఇలా ఏ ఒక్కరు గౌరవం ఇవ్వరు అనే విషయాన్ని చూపించిన విధానం మనసుకు గుచ్చుకుంటుంది.నవీన్ కి నసపెట్టే బావ ఒకడు ఉంటాడు. ఆ పాత్ర చూస్తున్నంతసేపు ఇలాంటివాడు మన ఇంట్లో ఒకడు ఉంటే అంతే సంగతిరా బాబు అనిపిస్తుంది. మరోవైపు హీరో కాస్త డబ్బులు సంపాదిద్దామని బేకరీ పెడతాడు. కొన్నాళ్లు బాగానే ఉంటుంది కానీ హీరో షాప్ ఎదురుగా మరో బేకరీ ఓపెన్ అవుతుంది. హీరో కష్టాలు మళ్లీ మొదటకొస్తాయి. సరేలే అని రియల్ ఎస్టేట్ విషయంలో ఒక కోటీశ్వరుడికి సాయం చేస్తే వాడేమో చెప్పిన దానికంటే తక్కువ డబ్బులిస్తాడు. ఇలా ప్రతిదగ్గర తన అహం వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు. చివరకు తన అహాన్ని తీసి పక్కనబెట్టాడా లేదా అనేదే మూవీ.ఎవరెలా చేశారు?తమిళంలో మణికందన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మధ్య తరగతి కుర్రాడిగా భలే సెట్ అవుతాడు. ఇందులోనూ నవీన్ పాత్రలో జీవించేశాడు. వెన్నెల పాత్ర చేసిన తెలుగమ్మాయి శాన్వి మేఘన కూడా సరిగ్గా సెట్ అయిపోయింది. ఇక హీరో తల్లిదండ్రులు, అక్క-బావ, ఫ్రెండ్ పాత్రధారులు తమకిచ్చిన పనికి పూర్తి న్యాయం చేశారు. సింపుల్ గా ఉంటూ నచ్చేసే ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ చూడాలంటే 'కుడుంబస్థాన్' ట్రై చేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)
న్యూస్ పాడ్‌కాస్ట్

బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు

భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ

కేసీఆర్‌ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్‌కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు

వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం

ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ద్రోహం... స్త్రీనిధి సంస్థ నిధులకు ఎసరు

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై రాజీలేని పోరాటం కొనసాగించాలి... రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి... వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
క్రీడలు

జై ముంబై
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో సారి జయకేతనం ఎగురవేసింది. రెండేళ్ల క్రితం టోర్నీ తొలి విజేతగా నిలిచిన జట్టు ఇప్పుడు మళ్లీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఢిల్లీతో తుది పోరులో తక్కువ స్కోరుకే పరిమితమైనా... పట్టుదల, సమష్టితత్వంతో ఆడిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆల్‌రౌండర్ నాట్ సివర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ ఆఖరి పోరులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ బృందం విషాదంలో మునిగిపోయింది. వరుసగా మూడు సీజన్ల పాటు గ్రూప్‌లో టాపర్... వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్‌లు... మూడింటిలోనూ పరాజయాలు. ఛేదనలో 17 పరుగులకే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత పోరాడినా లాభం లేకపోయింది. ముంబై: డబ్ల్యూపీఎల్ సీజన్–3లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించగా, నికీ ప్రసాద్ (23 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. 523 పరుగులు చేసి 12 వికెట్లు తీసిన నాట్ సివర్ బ్రంట్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.మరిజాన్ కాప్ తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (3), యస్తిక భాటియా (3)లను వెనక్కి పంపడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అయితే సివర్, హర్మన్ కలిసి దూకుడుగా ఆడారు. సదర్లాండ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన హర్మన్...జొనాసెన్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదింది. 33 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తయింది. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత ముంబై తడపడింది. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఛేదనలో ఢిల్లీ అవకాశాలన్నీ ఓపెనింగ్ భాగస్వామ్యంపైనే ఉన్నాయి. అయితే ఫామ్‌లో ఉన్న లానింగ్ (13), షఫాలీ (4) రెండు పరుగుల తేడాతో వెనుదిరగడంతో జట్టు స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. మధ్యలో జెమీమా కొంత జోరుగా ఆడే ప్రయత్నం చేసినా చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయి చేయిదాటిపోయింది. మరిజాన్ కాప్ ప్రయత్నం కూడా వృథా అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జెమీమా (బి) కాప్ 8; హేలీ (బి) కాప్ 3; నాట్సివర్ (సి) మణి (బి) చరణి 30; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) సదర్లాండ్ 66; కెర్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 2; సజన (ఎల్బీ) (బి) జొనాసెన్ 0; కమలిని (స్టంప్డ్) బ్రైస్ (బి) చరణి 10; అమన్‌జోత్ (నాటౌట్) 14; సంస్కృతి (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–103, 4–112, 5–112, 6–118, 7–132. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–11–2, శిఖా పాండే 4–0–29–0, అనాబెల్ సదర్లాండ్ 4–0–29–1, జొనాసెన్ 3–0–26–2, శ్రీ చరణి 4–0–43–2, మిన్ను మణి 1–0–10–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) సివర్ 13; షఫాలీ (ఎల్బీ) (బి) షబ్నమ్ 4; జెస్ జాన్సన్ (సి) యస్తిక (బి) కెర్ 13; జెమీమా (సి అండ్ బి) కెర్ 30; అనాబెల్ (స్టంప్డ్) యస్తిక (బి) సైకా 2; మరిజాన్ కాప్ (సి) హేలీ (బి) సివర్ 40; సారా (రనౌట్) 5; నికీ (నాటౌట్)25; శిఖ (బి) సివర్ 0; మిన్ను మణి (సి) సజన (బి) హేలీ 4; శ్రీ చరణి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–15, 2–17, 3–37, 4–44, 5–66, 6–83, 7–123, 8–123, 9–128. బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–15–1; నాట్సివర్ బ్రంట్ 4–0–30–3; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–25–2; సైకా 4–0–33–1.

హ్యాట్సాఫ్ హర్మన్
డబ్ల్యూపీఎల్‌లో 2023 టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ గత ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 5 పరుగుల తేడాతో ఓడి నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్ క్రీజ్‌లో ఉన్నంత వరకు జట్టు గెలుపు దిశగానే వెళ్లినా...ఆమె వెనుదిరిగాక ఇతర బ్యాటర్లు 12 బంతుల్లో 16 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇది హర్మన్‌ను తీవ్రంగా బాధించింది. 2025 సీజన్‌కు ముందు జట్టు కోచ్ దేవిక పల్షికర్తో కలిసి హర్మన్ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చించింది. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడి పెంచుకోవడంకంటే తొలి బంతినుంచే హర్మన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాలనేది ప్రణాళిక. ఇందులో తొందరగా అవుటయ్యే ప్రమాదం ఉన్నా... ఇది సరైందిగా వారు భావించారు. ఈసారి టీమ్ విజయంలో బ్యాటర్‌గా హర్మన్ కీలక పాత్ర పోషించింది. ఏకంగా 154.87 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించి తన విలువను చాటింది. టోర్నీలో 11 సిక్స్‌లు బాదిన తీరు ఆమె ఆధిక్యాన్ని చూపించింది. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో ఆమె దాదాపు చివరి వరకు నిలిచి పని పూర్తయ్యేలా చూసింది. 10 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధసెంచరీలతో 523 పరుగులు చేసిన నాట్ సివర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. పరుగుల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్ (307) జట్టుకు అదనపు బలంగా మారింది. బౌలింగ్‌లో అమేలియా కెర్ (18 వికెట్లు), హేలీ మాథ్యూస్ (18), నాట్ సివర్ (12) ప్రత్యర్థులను పడగొట్టడంలో సఫలమయ్యారు. మరో ప్రధాన పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోయినా... ఆ ప్రభావం జట్టుపై పడకుండా ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. ఫైనల్లో మాత్రం షబ్నమ్ తన స్థాయి ప్రదర్శనను చూపించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయంతో ముంబై టోర్నీ మొదలైంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో జట్టు కోలుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ చేతిలోనే పరాజయం. ఈ సారి హర్మన్, సివర్ ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ ఖాయమైనా... టాప్ స్థానం కోసం జట్టు గట్టిగానే పోరాడింది. అయితే బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప్రదర్శనపై సందేహాలు వచ్చాయి. అయితే సంపూర్ణ ఆధిక్యంతో విజయం సాధించిన ముంబై అలవోకగా ఫైనల్ చేరింది. గత రెండు లీగ్ మ్యాచ్ తరహాలో ఈ సారి కూడా ఢిల్లీపై ఆరంభంలో తడబాటు కనిపించింది. కానీ మళ్లీ హర్మన్, సివర్ భాగస్వామ్యమే జట్టును నడిపించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరిద్దరు పట్టుదలగా ఆడటంతో జట్టు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత స్కోరును సాధించగలిగింది. ఫైనల్ సహా ఇదే వేదికపై వరుసగా నాలుగో మ్యాచ్ ఆడటం కూడా జట్టుకు కలిసొచ్చింది. టోర్నీలో ఢిల్లీ ఫామ్ చూస్తే 150 పరుగుల ఛేదన పెద్ద కష్టం కాదనిపించినా... ముంబై బౌలర్లంతా సమష్టిగా చెలరేగి మూడేళ్ల వ్యవధిలో రెండో టైటిల్‌ను అందించడం విశేషం.

WPL-2025: డబ్ల్యూపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ వెనుక పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌కి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రెండోసారి ముంబై జట్టు టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్ స్కోరర్‌గా నిలిచారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్ స్కోరర్‌గా నిలిచారు.ఆమెతో పాటు నాట్ స్కివర్(30) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జానెసన్, చరణి, కాప్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్ ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణిచదవండి: IPL 2025: ఇషాన్ కిషన్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ! వీడియో వైరల్
బిజినెస్

EPFO: ఫ్రీగా రూ.7 లక్షల ఇన్సూరెన్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ .75 ఛార్జీ ఉంటుంది. ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర లేదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తాయి.ఈడీఎల్ఐ స్కీమ్ ప్రత్యేకతలుఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే, అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస రూ .2.5 లక్షలు, గరిష్టంగా రూ .7 లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు.ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐ పథకానికి అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5 శాతంగా లెక్కిస్తారు. ముఖ్యంగా, ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది.గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా రూ.6 లక్షల బీమా చెల్లింపు ఉండేది. అయితే 2024 ఏప్రిల్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ మొత్తాన్ని సవరించి, కనీస చెల్లింపును రూ .2.5 లక్షలకు, గరిష్టంగా రూ .7 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం.క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్‌తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి.

రైళ్లలో ఫుడ్.. రైల్వే కీలక చర్యలు
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని వేల రైళ్లు నడుస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైళ్లలో అత్యంత ప్రధాన సమస్య ఆహారం. రైళ్లలో లభించే ఆహారం నాణ్యత లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం వంటి వాటితో ప్రయాణికులు ఇబ్బందులు పడతుంటారు. ఈ సమస్యలు నివారించేందుకు రైల్వే శాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది.పారదర్శకతను పెంపొందించడానికి, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యలో భారతీయ రైల్వే అన్ని రైళ్లలో ఆహార ధరలతోపాటు మెనూలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ చొరవ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఆహార ఎంపికలు, వాటి ధరల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించేలా చేస్తుంది.రైల్వే శాఖ ముఖ్యమైన చర్యలు ఇవే..ప్రింటెడ్ మెనూ కార్డులు: ప్రయాణికులు ఇప్పుడు ఆన్ బోర్డ్ వెయిటింగ్ స్టాఫ్ నుండి ప్రింటెడ్ మెనూ కార్డులను కోరవచ్చు. ఈ కార్డులు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను, వాటి ధరలను తెలియజేస్తాయి.డిజిటల్ యాక్సెస్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ మెనూలను తన అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆహార ఎంపికలు, ధరలను సమీక్షించవచ్చు.ఎస్ఎంఎస్ అలర్ట్స్: పారదర్శకతను మరింత పెంచడానికి భారతీయ రైల్వే ఆహార మెనూ, టారిఫ్ వివరాలకు సంబంధించిన లింక్‌లను ప్రయాణికులకు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల రూపంలో అందిస్తోంది.ప్యాంట్రీ కార్ డిస్ప్లేలు: రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో రేట్ లిస్ట్ లు ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఇది ప్రయాణికులకు ధరలను సరిపోల్చుకోవడం సులభం చేస్తుంది.ఆధునిక బేస్ కిచెన్లు: ప్రామాణిక ఆహార తయారీ ప్రక్రియలను నిర్ధారించడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన నిర్దేశిత బేస్ కిచెన్లలో భోజనాన్ని తయారు చేస్తారు.సీసీటీవీ మానిటరింగ్: ఆహార తయారీని రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి, భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా చూడటానికి బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.బ్రాండెడ్ పదార్థాలు: స్థిరమైన ఆహార నాణ్యతను నిర్వహించడానికి వంట నూనె, పిండి, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పనీర్, పాల ఉత్పత్తులు వంటివాటికి సంబంధించి బ్రాండెడ్ ముడి పదార్థాలను ఉపయోగించడాన్ని రైల్వే తప్పనిసరి చేస్తుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు: క్వాలిఫైడ్ ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు బేస్ కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రతా పద్ధతులను పర్యవేక్షిస్తారు.అదనపు చర్యలురవాణా సమయంలో ఆహార నాణ్యతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి, భారతీయ రైల్వే పలు వినూత్న చర్యలను ప్రవేశపెట్టింది.ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్స్: ఆహార ప్యాకెట్లలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ తయారైంది.. ప్యాకేజింగ్ తేదీ వంటి వివరాలను ప్రదర్శిస్తాయి.రెగ్యులర్ ఆడిట్లు, తనిఖీలు: ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్ ల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మదింపు చేయడానికి రొటీన్ ఫుడ్ శాంప్లింగ్, థర్డ్ పార్టీ ఆడిట్ లు నిర్వహిస్తారు.ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్: అన్ని క్యాటరింగ్ యూనిట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు కట్టుబడి ఉండేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది.

ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లే కావాలి!
ఇంటి డిజైన్ల విషయంలో టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. ఇంటీరియర్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న ఇల్లు ఉండాలనే ఆశలతో ఉన్నవారు కరోనా తర్వాతి నుంచి విశాలంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలస్యమైనా సరే.. కాస్త స్పేస్ ఎక్కువ ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరోనగరం మధ్యలో ఇరుకు ఇళ్లలో ఉండేకంటే శివారు ప్రాంతాలు, పచ్చదనం ఉండే ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్లలో అయితే డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. 15 శాతం వృద్ధిగతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. త్రీ బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.

ఇండస్ఇండ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి?
ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్‌లో బయటపడిన అవకతవకలు.. వాటి చుట్టూ అల్లుకున్న ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పందించింది. ప్రస్తుతం ఆ బ్యాంకు పరిస్థితి ఏంటి..? డిపాజిటర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అనే దానిపై ఆర్బీఐ తాజాగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.భయపడాల్సిన పని లేదుఇండస్ ఇండ్ బ్యాంక్ పరిస్థితి గురించి భయపడాల్సిన పని లేదంటూ ఆర్బీఐ డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది. స్పెక్యులేటివ్ రిపోర్టులపై స్పందించవద్దని సెంట్రల్ బ్యాంక్ కోరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ మంచి క్యాపిటలైజేషన్ కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపింది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ఆడిటర్ సమీక్షించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. బ్యాంక్ సౌకర్యవంతమైన క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.46 శాతం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20 శాతంగా ఉంది. 2025 మార్చి 9 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సిఆర్) 113 శాతంగా ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ తన ప్రస్తుత వ్యవస్థలను సమీక్షించడానికి, అకౌంటింగ్ తప్పిదం వాస్తవ ప్రభావాన్ని త్వరగా అంచనా వేయడానికి, లెక్కించడానికి ఇప్పటికే ఒక బాహ్య ఆడిట్ బృందాన్ని నియమించింది. వాటాదారులందరికీ అవసరమైన వివరాలను వెల్లడించిన తర్వాత ప్రస్తుత త్రైమాసికంలో అంటే 2025 ఆర్థిక సంవత్సరం క్యూ4 నాటికి నివారణ చర్యలను పూర్తి చేయాలని బ్యాంకు బోర్డు, యాజమాన్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తప్పిదంఇండస్ఇండ్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోలోని ఆస్తులు, అప్పుల ఖాతాలకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్షలో కొన్ని "లోపాలు" కనిపించాయని మార్చి 2025 మార్చి 10న వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువలో ఈ లోపం ప్రతికూల ప్రభావం సుమారు 2.35% ఉంటుందని అంతర్గత సమీక్ష అంచనా వేసింది. పన్ను అనంతరం దాదాపు రూ.1,600 కోట్లు, పన్నుకు ముందు రూ.2,100 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని అంచనా.
ఫ్యామిలీ

పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్ వీడియో
మనుషులైనా, జంతువులైనా మనసుంటుంది. అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయి. అపురూపమైన ఆ అనుబంధం (Friendship) తెగిపోతే.. కలకాలం తోడునీడగా ఉన్న ఆత్మీయ నేస్తం.. అందనంత దూరం వెళ్లిపోతే.. మనుషులైతే గుండె పగిలేలా రోదిస్తారు. మరి మూగజీవి ఏం చేస్తుంది. మూగగానే రోదిస్తుంది. ఈ మాటలకు అక్షర సత్యం అనేలా ఒక వీడియో నెట్టింట పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. అసలేంటీ కథ.. తెలుసుకుందాం..పాతికేళ్ల బంధాన్ని వీడిన శాశ్వతంగా కన్నుమూసిన తన భాగస్వామిని ఒక ఏనుగు (elephant) చలించి పోయింది. ఎలాగైనా దాన్ని తట్టి లేపాలని ప్రయత్నించింది. తొండంతో గుండెలకు హత్తుకోవాలని తపించిపోయింది. కానీ తనవన్నీ వృధా ప్రయత్నాలనీ, ఇకలాభం లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ సమయంలో పశువైద్యులను దగ్గరకు రానీయలేదు.బాజా వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జెన్నీ, మాగ్డా అనే ఏనుగులు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో ఉండేవి. 25 సంవత్సరాలకు ఇవి రెండూ పార్టనర్స్‌గా ఉండేవి. వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. వయసుమీద పడటంతో సర్కస్ వర్క్‌నుంచి విముక్తి లభించింది. ఈ వారం జెన్నీ కన్నుమూసింది. దీంతో తన నేస్తం అలా నిర్జీవంగా పడి ఉండటం మాగ్డా తట్టుకోలేకపోయింది. దాన్ని లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. గంటల తరబడి దాని చుట్టూ తిరిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆఖరికి వెటర్నరీ వైద్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. చివరికి జెన్నీకి కన్నీటి వీడ్కోలు(Mourns) పలికింది. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. వారు దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు హృదయాలను తాకింది. ఏనుగు దుఃఖం చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు.😢💔 An elephant mourns her deceased friendIn occupied Crimea, the famous elephant Jenny passed away due to illness.Her companion, Magda, refused to let people approach for hours, hugging Jenny and staying by her side for a long time. pic.twitter.com/nY5FRJueHp— Based & Viral (@ViralBased) March 14, 2025

Sunday Special: నాటుకోడి కూర, ఫిష్ ఫ్రై, బగారా రైస్
సండే వచ్చిందంటే.. మాంచి ఫుడ్ ఉండాల్సిందే.. ఇష్టమైన కూర అదీ అదిరిపోయే రుచి ఉంటే.. ఆ ఆనందమే వేరు. టమ్మీ ఫుల్.. దిల్ ఖుష్. మరి అలాంటి ఆదివారం ఆనందాన్ని పొందాలనుకుంటే.. బగారా రైస్ పచ్చిపులుసు, చేప వేపుడు, నాటుకోటి కూర.. దిల్ఫుల్గా ఇంట్రస్టింగ్ రెసిపీస్ మీకోసం...పచ్చిపులుసుకావల్సినవి: చింతపండు – నిమ్మకాయ పరిమాణం (వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీయాలి); ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పచ్చిమిర్చి – 4; జీలకర్ర – టీ స్పూన్; కొత్తిమీర – టేబుల్‌స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉల్లిపాయ – 1; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి – 4 రెబ్బలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – రెమ్మ; ధనియాల పొడి – అర టీ స్పూన్.తయారీ: ∙ చింతపండు గుజ్జులో నీళ్లు కలపాలి. ∙రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పసుపు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పొడి వేసి, వేయించి ఈ పోపు మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. తీపి కావాలనుకున్న వారు టీ స్పూన్ పంచదార / బెల్లం కలుపుకోవచ్చు. ఉల్లిపాయ తరుగు పైన వేసి, అన్నంలోకి వడ్డించాలి.నాటు కోడి కూరకావల్సినవి: నాటు కోడి ముక్కలు-అరకేజీ; పచ్చిమిర్చి-4, టొమాటోలు - 2(తరగాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్-2 టీ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు)-2 టీ స్పూన్లు; ఉల్లిపాయలు-2, ఎండుమిర్చి -2; పసుపు-అర టీ స్పూన్; ఉప్పు-తగినంత; కారం - టీ స్పూన్; ఎండుకొబ్బరి- 2 టీ స్పూన్లు; నూనె-3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు-2 టేబుల్ స్పూన్లుతయారీ: ∙నాటుకోడి ముక్కలలో కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం– వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కనుంచాలి. మందపాటి గిన్నె/కుకర్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, కలపాలి. అల్లం–వెల్లుల్లి ముద్ద వేసి, వేగాక కలిపి ఉంచిన చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. టొమాటో వేసి మగ్గనివ్వాలి. 2 కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, ఎండుకొబ్బరి వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కుకర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. దించే ముందు సిద్దం చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర వేయాలి. రోటీలు, అన్నంలోకి ఈ కూరను వడ్డించాలిచేప వేపుడుకావల్సినవి: చేప ముక్కలు- 6; కారం -అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; ఉప్పు -తగినంత; నిమ్మరసం- అర టీ స్పూన్; గుడ్డు-1; నూనె – తగినంత; ధనియాల పొడి-టీ స్పూన్; గరం మసాలా- అర టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి పేస్ట్ -టీ స్పూన్; కొత్తి మీర – టీ స్పూన్; నూనె – 3 టేబుల్ స్పూన్లు (తగినంత).తయారీ: గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి. కడాయిలో నూనె వేసి అందులో చేప ముక్కలు వేసి, వేయించాలి. చేప ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలను అలంకరించి చేప ముక్కలను అన్నంలోకి సైడ్ డిష్‌గా వడ్డించాలి. ఇవి స్నాక్స్‌గానూ బాగుంటాయి.చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?బగారా రైస్ కావల్సినవి: బాస్మతి బియ్యం/బియ్యం - 2 కప్పులు+ ఉల్లిపాయలు 3 (సన్నగా నిలువుగా తరగాలి); బిర్యానీ ఆకు3; పచ్చి మిర్చి7 (సన్నగా తరగాలి); కొత్తిమీర -2 టేబుల్ స్పూన్లు ; పుదీనా ఆకులు -గుప్పెడు; అల్లం - వెల్లుల్లి పేస్ట్ -2 టీ స్పూన్లు; ఉప్పు-తగినంత; నెయ్యి / నూనె -అర కప్పు; నీళ్లు-5 కప్పులు; లవంగాలు-10; యాలకులు -7; కరివేపాకు.తయారీ: గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివే΄ాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ∙దీంట్లో బియ్యం వేసి 2 నిమిషాలు వేయించాలి. ఉప్పు కూడా వేసి మరో మారు కలిపి, 5 కప్పుల నీళ్లుపోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర, వేయించిన ఉల్లి తరుగు చల్లి దించాలి.చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!నోట్: పోపులో పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి కూడా బగారా రైస్ చేసుకోవచ్చు. దీనిలోకి మాంసాహార వంటకాలే కాదు బంగాళదుంప కూర, గుత్తి వంకాయ కూర, పప్పు వంటి శాకాహార రుచులను కూడా వడ్డించవచ్చు.

Yoga శక్తికీ, ఆత్మస్థైర్య సిద్ధికి చక్కటి ఆసనాలు
యోగా సాధన వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవితం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుంది. మనోధైర్యాన్నిస్తుంది. ప్రతికూలతలను దూరం చేసి, మనసును ప్రశాంతంగా, ఆత్మస్థైర్యంతో మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకోవడానికి సహకరించే ఐదు ఆసనాలు...తాడాసనం: ఇది పర్వతాన్ని పోలి ఉంటుంది. అందుకే మౌంటెయిన్ పోజ్ అని కూడా అంటారు. చేతులను, కాళ్లను కదల్చకుండా స్థిరంగా, నిటారుగా నిల్చోవడం అలవాట వుతుంది. చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!బాలాసన: చంటి పిల్లలు మోకాళ్లపై బోర్లాపడుకొని ఉన్న భంగిమ ఇది. ఈ ఆసనంలో మ్యాట్‌పైన మోకాళ్లపైన కూర్చుంటూ, ముందుకు వంగి, నుదుటిని నేలకు ఆనించాలి. తలమీదుగా రెండువైపులా చేతులను ముందుకు తీసుకుంటూ, అరచేతులను నేలమీద ఉంచాలి. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?వీరభద్రాసన: దీనిని వారియర్ పోజ్ అని కూడా అంటారు. నేలపైన నిల్చొని కుడిపాదాన్ని ముందుకు ఉంచాలి. రెండు చేతులను విశాలంగా భుజాలకు ఇరువైపులా చాపాలి. ఈ సమయంలో తల నిటారుగా ఉండాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదలాలి. దీనివల్ల మిమ్మల్ని మీరు శక్తిమంతులుగా భావిస్తారు. ఆత్మగౌరవం, స్వీయ ప్రేమ మెరుగుపడుతుంది. అధోముఖస్వానాసన: మ్యాట్‌పైన బోర్లా పడుకొని, చేతులు, కాలివేళ్ల మీదుగా శరీరాన్ని ఉంచుతూ, హిప్ భాగాన్ని పైకి లేపాలి. దీనిని డాగ్ పోజ్ అని కూడా అంటారు. సాధన ప్రారంభంలో ఈ ఆసనం శరీరాన్ని వామప్ చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇది భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది.ఉష్ట్రాసన: మ్యాట్‌పైన మోకాళ్లను నేలకు ఆనిస్తూ కూర్చొని, రెండు చేతులతో కాలి మడమలను పట్టుకుంటూ, వెన్నెముకను వంపుగా,తలను వెనక్కి వంచాలి. దీంతో పొత్తికడుపు స్ట్రెచ్ అవుతుంది. ఈ ఆసనం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది.

ఎక్కువ ఆయుర్దాయం కావాలా? జపనీయుల టాప్ సీక్రెట్స్ ఇవే!
జపనీయుల దీర్ఘాయువు వెనక... స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల అనుకున్నంత కాలం జీవించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జపాన్? ప్రజలు మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయంతో ఎక్కువకాలం పాటు జీవిస్తున్నారు. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.. మనం కూడా వారిని అనుసరిద్దాం.డబ్ల్యుహెచ్. ఓ. అంచనాల మేరకు... జపాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.7 సంవత్సరాలు (మహిళలకు 86.8 సంవత్సరాలు పురుషులకు 80.5 సంవత్సరాలు)గా ఉంది. జపాన్ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సంస్కృతి, జెనెటిక్స్? దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇకిగై (సంతోషంతో జీవించడం): జపనీయులు ‘ఇకిగై’ అనే సిద్ధాంతంతో సంతోషంగా జీవిస్తారు. ఆనందంతో జీవించాలని ఈ పురాతన తత్వశాస్త్రం బోధిస్తుంది. అంతేకాక, ఎందుకు జీవిస్తున్నామనే దానిపై స్పష్టతతో జీవితానికి లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమతో కలిసి ఉండటం వంటి అంశాలు వారి ఆయుష్షును పెంచుతాయి. హరా హాచ్ బన్ మి. ఇది జపాన్‌లో ఒక సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలని అర్థం. కడుపులో 80 శాతం నిండినంత వరకు మాత్రమే తింటే దీర్ఘాయువు కలిగి ఉంటామని జపనీయుల నమ్మకం. అంతేకాదు, పెద్ద పళ్లెంలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లలో లేదా బౌల్స్‌లో నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కింద కూర్చునే తింటారు. సమతుల ఆహారం: జపనీస్ ఆహారం లో పండ్లు, ఒమేగా ఫాటీ ఆమ్లాలు అధికం గా ఉండే చేపలు, బియ్యం, తృణధాన్యాలు, టోఫు, సోయా, మిసో, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కాన్సర్, గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చు. ఈ ఆహారం కారణంగానే జపాన్‌లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.హెర్బల్ టీ: జపనీస్ ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడతారు. అది వారి సంస్కృతిలో భాగంగా భావిస్తారు. జపాన్ ద్వీప సమూహంలో మాచా టీ చాలా ప్రాచుర్యం పొందింది. టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కాన్సర్‌తో పోరాడే శక్తినిస్తాయి. కాలి నడకకు ప్రాధాన్యం: జపాన్ ప్రజలు ఒకేచోట కూర్చుని పని చేసే జీవన శైలిని అంతగా ఇష్టపడరు. యువకుల నుంచి వృద్ధుల వరకు అంతా నడవడానికే ఇష్టపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు నడవడం లేదా సైక్లింగ్? చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ వారి ఆయుర్ధాయం పెరగ డానికి దోహదం చేస్తాయి.జీన్స్ ఇవి వారు ధరించే జీన్స్ కాదు.. జపనీస్‌లో సహజసిద్ధంగా ఉండే జన్యువులు. ఇవే వారి ఆయుష్షును పెంచుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్స్, గుండెపోటు, సెరెబ్రోవాస్కులర్, హృదయ సంబంధ వ్యాధులలను నిరోధించడానికి ఈ జన్యువులు సహాయపడతాయి.వృద్ధుల సంరక్షణ: ఇతర దేశాలలా జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఓల్డ్? ఏజ్?హోమ్‌లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని అక్కడి వారి నమ్మకం. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఆరోగ్య సంరక్షణ: జపాన్‌లో అనారోగ్యాలను నివారించి, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.సామాజిక నిర్మాణం: బలమైన సామాజిక సంబంధాలు, సమాజ మద్దతు మెరుగైన మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి దారితీస్తుంది, ఇవి దీర్ఘాయువుకు ముఖ్యమైనవి.చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!చూశారుగా...పైన చెప్పుకున్న వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాలు తప్ప మిగతావన్నీ మనం సులువుగా అనుసరించదగ్గవే. వీలయిన వాటిని వీలయినంత వరకు అనుసరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉందాం. దీర్ఘాయుష్మాన్ భవ!
ఫొటోలు


వైభవంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)


‘కోర్ట్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)


సప్తగిరి ‘పెళ్ళి కాని ప్రసాద్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)


మహిళల ప్రీమియర్ లీగ్‌లో విజేతగా ముంబై ఇండియన్స్..టైటిల్ సొంతం (ఫొటోలు)


Birthday Special: అలియా భట్ 32వ బర్త్‌డే వేడుకలో స్పెషల్ ఫొటోస్


బ్లాక్ అండ్ వైట్‌లో పూజిత పొన్నాడ సూపర్ క్యూట్ ఫోటోలు


‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి ఎంత క్యూట్‌గా ఉందో చూడండి (ఫొటోలు)


పాలిటిక్స్‌లో బిల్డప్ బాబాయ్ అవతారమెత్తిన పీకే!


కళ్లు చెదిరిపోయేలా కలర్‌ఫుల్ డ్రెస్‌లో కృతి శెట్టి (ఫోటోలు)


వరంగల్ జిల్లా : అట్టహాసంగా ప్రారంభమైన కొమ్మాల జాతర (ఫొటోలు)
National View all

Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు
భాగల్పూర్: బీహార్(

హోలీ డ్యాన్స్ చేస్తావా.. సస్పెండ్ చేయించమంటావా?
పాట్న: హోలీ వేడుకల సమయంలో డ్యాన్స్ చేస్తావా లేక సస్పెండ్ చ

మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా..
పట్నా: సోషల్ మీడియాతో కొంతమేరకు ముప్పు పొంచివున్నమాట వాస్తవమే అయినప్

తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్(

కపట ప్రేమకు యువతి బలి
హుబ్లీ: మరో దారుణం జరిగింది.
International View all

కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ క

అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం
ఓక్లహామా సిటీ (యూఎస్): అమెరికా(

హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 20 మంది మృతి
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(

దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్‌లకు ఏమి దక్కాయి?
పొరుగుదేశం పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్‌ప్రెస్(

ఉక్రెయిన్ సేనలకు పుతిన్ హెచ్చరిక.. మీ ప్రాణాలకు గ్యారంటీ లేదంటూ..
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం
NRI View all

కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ క

గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసార

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస
International View all

పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా

214 మందిని చంపేశాం
ఇస్లామాబాద్: తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ల

ప్రాణం పోయినంత పనైంది
డెన్వర్: ఏదైనా ఒక విమాన ప్రమాదం నుంచి కాస్తంతలో తప్పించుకోగ

ఈ బస్సుకు డ్రైవర్ లేడు!
బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనా నగర వీధుల్లో ఒక కొత్త బ

ట్రంప్ ప్రతిపాదనతో ఆటలొద్దు
లండన్: ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతి కోసం అమెరికా అధ్య
NRI View all

పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు వి

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.
National View all

లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్ప

అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం
దెర్గావ్జ్వాల్: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, మౌల

రాళ్లతో హోలీ.. 42 మందికి గాయాలు.. ఎక్కడంటే?
దుంగార్పూర్: రాజస్థాన్‌లోని దుంగార్పూర్లో హోలీవేడుకలను ర

‘ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఒకానొక సమ

గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళన
క్రైమ్

పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యతో గొడవపడి భర్త.. పటాన్చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్‌చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్లో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్‌లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కుల్ఫీ ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీట్లలో గంజాయి
సాక్షి, హైదారాబాద్/అబిడ్స్ : హోలీ సంబరాలను సొమ్ము చేసుకొనేందు కు గంజాయి విక్రేతల ముఠా కొత్త పన్నాగం పన్నింది. హోలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం లోయర్ ధూల్‌పేట్‌లో కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లకు సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి కుల్ఫీ ఐస్‌క్రీమ్‌ల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వా«దీనం చేసుకుని, సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

కస్టడీలోని యువకుడి మృతితో కలకలం
నిజామాబాద్: సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని వడ్డెర కాలనీకి చెందిన అలకుంట సంపత్ (31) జగిత్యాల జిల్లాలోని శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సంపత్‌తోపాటు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేటకు చెందిన చిరంజీవి, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్కు చెందిన మిట్టాపల్లి నర్సారెడ్డిలు పనిచేస్తున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేశారు. కొంతమందిని లావోస్ దేశానికి డేటాఎంట్రీ ఆపరేటర్ల పేరిట పంపించారు. తీరా అక్కడ సైబర్‌నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసి స్వదేశానికి తిరిగొచ్చారు. అనంతరం ఆలకుంట సంపత్, చిరంజీవి, నర్సారెడ్డిలపై జిల్లా కేంద్రంలోని సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ముగ్గురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 12న కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ నిమిత్తం జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం జిల్లా కేంద్రంలోని సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా, గురువారం రాత్రి సంపత్ ఎడమ చేయి లాగుతోందని పోలీస్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. సంపత్ మృతి విషయాన్ని గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు తమకు చెప్పినట్టు కుటుంబీకులు తెలిపారు.ఫస్ట్‌క్లాస్ జడ్జి సమక్షంలో..సంపత్ మృతదేహానికి ఫస్ట్‌క్లాస్ జడ్జి హరికృష్ణ సమక్షంలో ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టును సీపీ సాయిచైతన్యకు అందించారు. సంపత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.గుండె సమస్యతో మృతి చెందాడు‘అలకుంట సంపత్ గుండె సంబంధిత సమస్యతోనే మృతి చెందాడు. సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగ యువతను థాయిలాండ్, మయన్మార్, లావోస్ తదితర ప్రాంతాలకు పంపించేవాడు. మోసపోయిన వారి ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు గురువారం జగిత్యాలలోని సంపత్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేశారు. అదే రోజు రాత్రి ఎడమ చేయి, ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో పోలీసులు జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. జీజీహెచ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో సంపత్ నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించాం. జీజీహెచ్‌కు వెళ్లిన తర్వాత సంపత్ కుప్పకూలిపోయాడు. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. సంపత్ మృతిపై ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ కొనసాగుతోంది.’ అని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సమగ్ర విచారణ జరపాలిసంపత్ మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం జీజీహెచ్‌కు చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త సంపత్ మృతి చెందాడని భార్య ఆరోపించారు. మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని జీజీహెచ్ ఎదుట ఉన్న రోడ్డుపై ధర్నా చేశారు. న్యాయం చేస్తామని, జడ్జి సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా పోస్టుమార్టం చేయించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు.

మనవడి పుట్టిన రోజు నాడే తాత బలవన్మరణం
మియాపూర్: మనవడి పుట్టిన రోజు నాడే అతడి తాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌కు చెందిన రాఘవేందర్ రావు(60) భార్య విజయలక్ష్మితో కలిసి మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవేందర్రావు కాలనీలో విజయ స్వగృహ ఫుడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాఘవేందర్రావు మనవడు అర్జున్ పుట్టిన రోజు కావడంతో సాయంత్రం వేడుకలు నిర్వహించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్‌కు వెళ్లారు. రాఘవేందర్ రావును కూడా రావాలని కోరగా.. తాను ఇంట్లోనే ఉంటానని, మీరు వెళ్లి రండి అని చెప్పారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా బెడ్రూం లోపలి నుంచి డోర్ వేసి ఉంది. రాఘవేందర్రావును ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో.. కిటికిలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపు బద్దలు కొట్టి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా రాఘవేందర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మనవడి పుట్టిన రోజు నాడే రాఘవేందర్ రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
వీడియోలు


గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా


Ambati Rambabu: జనసేన పార్టీకి దశదిశ లేదు


చెంపదెబ్బలు కొట్టారు.. ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించారు: రన్యా


బాలినేని కామెంట్స్ కు అంబటి కౌంటర్


పరిటాల సునీతపై మైనారిటీలు ఫైర్..


పోసాని అనారోగ్యంగా ఉన్నారు: మనోహర్ రెడ్డి


భారతీయ విద్యార్ధిని రంజనీ వీసా రద్దు కారణం ఇదే..!


హోలీ పేరుతో విద్యార్థినులతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన


జగన్ గురించి మాట్లాడే స్థాయి బాలినేనికి ఉందా?: చుండూరి రవిబాబు


Tanuku: ఏపీ సీఎం చంద్రబాబు రోడ్ షోకు స్పందన కరువు