Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Leaders protests forced resignations of VCs in AP Legislative Council1
అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్‌సీపీ

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల బలవంతపు రాజీనామాల వ్యవహారం.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాల అంశాలు మంగళవారం శాసన మండలిని కుదిపేశాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మంది వీసీలను బెదిరించి.. బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్‌ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారా.. వాట్సాప్‌లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని చెప్పారా.. ఇలా ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా.. ఆరోపణలను వెంటనే వెనక్కు తీసుకోవాలి’ అంటూ గుడ్లురమబోయారు. ‘వీసీలందరికి ఐఏఎస్‌ అధికారి సౌరబ్‌ గౌర్‌ ఫోన్‌ చేసి రాజీనామా చేయండని ఒత్తిడి చేశారు. కావాలంటే కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు. వీసీలు తమ రాజీనామా పత్రంలో ‘ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు’ అని విపక్ష సభ్యులు ఆధారాలు చూపగా లోకేశ్‌ వెంటనే మాట మార్చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలో చూపాలన్న డిమాండ్‌కు సమాధానం చెప్ప­లేక మంత్రులు నీళ్లు నమిలారు. తర్జుమా చేయడంలో పొరపాటంటూ మంత్రి లోకేశ్‌ కవర్‌ చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. సర్కారు ద్వంద్వ నీతిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. వీసీలతో బలవంతపు రాజీనామాలుసాక్షి, అమరావతి: ‘గవర్నర్‌ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్‌ ప్రొసెస్‌. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీ కాలం ముగిసిన తర్వాతే సెర్చ్‌ కమిటీ వేసి నియామకాలు చేప­డుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలుండగా, 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంత మంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి, బలవంతంగా వారితో రాజీనామా చేయించారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌తో కూడా బలవంతగా రాజీ­నామా చేయించడం నిజం కాదా.. ’ అని శాసన మండలి వేదికగా వైఎస్సార్‌సీపీ గళం విప్పింది. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచార­ణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘మేము బెదిరించాం.. భయపెట్టాం.. బయటకు పం­పించాం.. అని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపి­స్తున్నారు. విద్యా­శాఖా మంత్రిగా అడుగుతున్నా.. ఆధారాలుంటే హౌస్‌లో పెట్టండి’ అని మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసి­రారు. దీనిపై ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి బదులిస్తూ.. ‘నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి, గంద­రగోళం సృష్టించి.. వీసీ రాజీ­నామా చేసి పోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. ఇంత మంది ఒకేసారి రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. వెంటనే లోకేశ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘ఏదో రాయి వేస్తాం.. మట్టి వేస్తాం.. కడుక్కోండి.. అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో.. ఏమని బెదిరించారో.. రాజీనామా చేసిన వీసీలు ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పమనండి.. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్‌ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాది­రిగా ఒక సామాజిక వర్గానికే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో జ్యూడిషియల్‌ విచారణకు ఆదేశించండి’ అని నిలదీశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్‌ మళ్లీ జోక్యం చేసుకుంటూ.. ‘యూనివర్సిటీలకు ఛాన్స­లర్‌ గవర్నర్‌. మీరు గవర్నర్‌ను కించ పరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్‌ ఫోన్‌ చేశాడా.. లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్‌ చేశారో చెప్పమనండి.. లేదా మా ఆఫీస్‌ నుంచి ఎవరైనా ఫోన్‌ చేసి బెదిరించారో చెప్పమంటే చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డపేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారాలుంటే బయట పెట్టండి. తప్పకుండా విచారణ జరిపిస్తాం.. ల్యాప్‌ ట్యాప్‌ నా దగ్గరే ఉంది.. ఇప్పుడే ఆర్డర్‌ ఇస్తా.. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్‌ చేశారా? వాట్సాప్‌ మెసేజ్‌ చేశారా? వివరాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. వీసీల రాజీనామాల వ్యవహారమే కాదు.. 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటకు తీద్దాం. అన్నీ బయటకొస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు. ఎవరినీ వదిలి పెట్టం. వెయిట్‌ అండ్‌ వాచ్‌.. టైమ్, డేట్‌ రాసుకోండి’ అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేశ్‌ హెచ్చరించారు. ఈ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రాం­గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బావమరుదులు, మేనత్తలే అని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఓడిపోయారు కాబట్టి వారంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళంతో చైర్మన్‌ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.ఇవిగో ఆధారాలు..సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీ చంద్ర­శేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘వీసీలందరికీ ఐఏఎస్‌ అధికారి సౌరబ్‌ గౌర్‌æ ఫోన్‌ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మరుసటి రోజే వారంతా రాజీనామా చేశారు. కావాలంటే కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీసీలు తమ రాజీనామా పత్రంలో ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తక్షణమే విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ‘ఏ విచారణ కావాలి.. జ్యుడీషియల్‌ విచారణా లేక డిపార్టుమెంటల్‌ విచారణా.. క్లారిటీ ఇవ్వండి‘ అని చైర్మన్‌ కోరగా, ‘మేము జ్యూడిషియల్‌ ఎంక్వైరీ కోరుతున్నాం.. వాళ్లు ఎంక్వైరీ వేసినా మాకు అభ్యంతరం లేదు. మంత్రి చెబుతున్నట్టు 2019 నుంచే కాదు.. కావాలంటే 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. మాకు అభ్యంతరంలేదు. వాస్తవాలే­మిటో ప్రజలకు తెలుస్తాయి’ అని బొత్స సత్యనారా­యణ స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి లోకేశ్‌ మాట మార్చారు. ‘ప్రైమ్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ ఇస్తే ఎంక్వైరీ వేస్తాం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టమంటే ఎలా?’ అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ‘ముందు ఒకలా మాట్లాడు­తు­న్నారు.. ఆధా­రాలు చూపాక మరొకలా మాట్లాడు­తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.బెదిరిపోయేవాళ్లెవరూ లేరు: బొత్స మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్య­నారాయణ మాట్లాడుతూ ‘ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపాలని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎంక్వైరీ వేయండి.. నిరూపిస్తాం.. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. చట్ట ప్రకారం ఏం చేయదల్చుకున్నారో చేయండి. ఇక్కడ ఎవరూ బెదిరిపోయేవాళ్లు, అదిరిపోయే వాళ్లు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్లు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’ అని బొత్స సత్యనారాయణ... మంత్రి లోకేశ్‌కు దీటుగా స్పందించారు.

Ys Jagan Meeting with leaders on first day of Pulivendula tour2
ప్రజలకు అండగా నిలుద్దాం: వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ప్రజల మదిలో మనం చెరగని ముద్ర వేశాం... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాల­నందించాం. విపక్ష పార్టీ నాయకులుగా ప్రజాపక్షమే ఏకైక అజెండాగా పని చేద్దాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల హృదయాలను గెలుచుకుందాం..’’ అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే అనే విషయాన్ని గుర్తెరిగి పార్టీ నేతలంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్‌ సందర్భంగా తొలుత ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయ­కులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ­య్యారు. ఆయా నేతలను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌­రెడ్డి పరిచయం చేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పార్టీ పదవులు పొందిన నాయ­కులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టే ప్రజ­êవ్యతిరేక చర్యలపై ఉద్యమించాలని.. స్థానిక సమస్యలపై ప్రజల గొంతుకగా పని చేయాలని సూచించారు.వైఎస్సార్‌ సీపీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా పాలన అందించామన్నారు. అబద్ధాల హామీలతో టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టారన్నారు. చంద్రబాబు నయ­వంచకుడని తెలిసి కూడా ప్రజలు నమ్మి ఓటేశారని, అతి తక్కువ సమయంలోనే మోసపో­యా­మని గ్రహిస్తు­న్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. పులివెందులలో కోలాహలం..రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయంతాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు పులి­వెందుల చేరుకున్నారు. భాకరాపురంలోని తన నివా­సంలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం కార్యా­ల­యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల సమ­స్యలు అడిగి తెలుసుకుంటూ వారి విజ్ఞప్తులను స్వీక­రించారు. అప్పటికప్పుడు పరిష్కా­రం అయ్యే సమ­స్యలను పరిష్కరిస్తూనే.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని నోట్‌ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పులివెందులలో సందడి వాతావరణం నెలకొంది. అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నూతన జంటలకు ఆశీర్వాదం...పులివెందులలో ఇటీవల వివాహం జరిగిన నాలుగు నూతన జంటలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. నారాయణ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న వై.మహేశ్వరరెడ్డి కుమార్తె అనిలాదేవి, అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు అందజేశారు. అలాగే చెన్నారెడ్డి కాలనీలో నివసించే రవీంద్రనాథరెడ్డి కుమార్తె సాయిలహరి, అల్లుడు లిఖిత్‌లతోపాటు జి.మహేశ్వరరెడ్డి కుమార్తె సాహిత్య, అల్లుడు రామమనోహర్‌రెడ్డికి.. సుదర్శన్‌ కుమారుడు అనుదీప్‌కుమార్, కోడలు లాస్యశ్రీలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జంటల కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఘనస్వాగతం...తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌­నాథరెడ్డి, డాక్టర్‌ సుధా, కడప మేయర్‌ సురేష్‌­బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌.రఘురామిరెడ్డి, ఎస్‌బీ అంజాద్‌ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సి­పల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహరరెడ్డి, బీసీ సెల్‌ నేత బంగారు నాగయ్య, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిన్నప్ప పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతి­నిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మండలశాఖ అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ...సింహాద్రిపురం మండలశాఖ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అప్పట్లో ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పులివెందులలో నివాసం ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులను కలుసుకున్నారు.మామను చూడాలని పాదయాత్ర!సాక్షి ప్రతినిధి, కడప: అభిమానానికి హద్దుండదు...! ఆత్మీయతకు వయసుతో నిమిత్తం లేదు!! వైఎస్‌ జగన్‌ పట్ల చిన్నారుల మక్కువ మరోమారు నిరూపితమైంది. పులివెందులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివసించే బాలుడు మాబు షరీఫ్‌కు వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని ఇష్టం. వైఎస్‌ జగన్‌ పులివెందుల వస్తున్నట్లు తెలియడంతో ఎలాగైనా ఆయన్ను కలిసి ఫొటో దిగాలనే ఆరాటంతో తెల్లవారుజామున 5.30 గంటలకు చెప్పులు లేకుండా కాలినడకన ఇంటి నుంచి బయలుదేరాడు. హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని నిరీక్షించాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ తన వద్దకు వచ్చిన బాలుడిని గమనించి ఆప్యాయంగా పలుకరించారు. కరచాలనం చేయడంతో ఆనంద బాష్పాలు రాల్చిన చిన్నారి కళ్ల నీళ్లు తుడిచి వివరాలు కనుక్కున్నారు. మామయ్య తనను దగ్గరకు తీసుకున్నారని బాలుడు ఎంతో సంబరంగా వైఎస్‌ జగన్‌తో ఓ ఫొటో దిగాడు. ఆ చిన్నారి అభిమానాన్ని చూసి వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. అనంతరం ఆ బాలుడికి జాగ్రత్తలు చెప్పి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించారు.

Rasi Phalalu: Daily Horoscope On 26 Feb 2025 In Telugu3
ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది.. సంఘంలో గౌరవం

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.9.48 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శ్రవణం సా.4.38 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.8.33 నుండి 10.05 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.52 నుండి 12.40 వరకు,అమృతఘడియలు: ఉ.6.16 నుండి 7.50 వరకు, తదుపరి తె.5.50 నుండి 7.24 వరకు (తెల్లవారితే గురువారం), మహాశివరాత్రి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.25, సూర్యాస్తమయం: 6.01. మేషం.... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వృషభం.... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.మిథునం.... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు.కర్కాటకం... కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దైవదర్శనాలు.సింహం... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కన్య.... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.తుల.... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.వృశ్చికం..... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం.ధనుస్సు.. పనులు మందగిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు నిరుత్సాహం..మకరం....... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు.కుంభం.. పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మీనం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Maha Kumbh concludes on Feb 264
నేడే ఆఖరి అమృత స్నానం

మహాకుంభ్‌ నగర్‌(యూపీ): కోట్లాది మంది భక్తుల శరణ ఘోష, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య భక్త జన కోటి పుణ్య స్నానాలు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి కొనసాగింపుగా ‘మహా కుంభమేళా’గా వినతికెక్కిన మహత్తర ఆధ్యాత్మిక వేడుక ఎట్టకేలకు చిట్టచివరకు చేరుకుంది.గత 44 రోజులుగా త్రివేణి సంగమ క్షేత్రంలో అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది భక్తుల పవిత్ర స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా ఘాట్లు బుధవారం తుదిఅంకంలో భాగంగా మహాశివరాత్రితో మరోసారి ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా మారనున్నాయి. నేడు మహా శివరాత్రిని పురస్కరించుకుని కోటి మంది భక్తులు చిట్టచివరిదైన ‘అమృత్‌ స్నాన్‌’ క్రతువులో పాలుపంచుకోనున్నారని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఘాట్‌ల వద్దకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంతటా వాహనాలను నిషేధించారు.‘నో వెహికల్‌ జోన్‌’గా ప్రకటించారు. ఇటీవల త్రివేణి సంగం ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా పోలీసు బలగాలను మొహరించింది. చిట్టచివరి రోజు కావడంతో భక్తులు తాకిడి అనూహ్యంగా ఉండొచ్చన్న అంచనాలతో ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వసన్నద్ధమైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో కుంభమేళా భక్తుల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘాట్‌ల వద్ద ఒకేచోట జనం పోగుబడకుండా ప్రత్యేక పర్యవేక్షణా బలగాలను రంగంలోకి దింపారు.

President Trump Meets with French President Macron5
పుతిన్‌ నియంత కాదు: ట్రంప్‌

వాషింగ్టన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ‘నియంత’ అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిరాకరించారు. ఓవల్‌ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘పుతిన్‌ను నియంతగా భావిస్తున్నారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘మనం స్మార్ట్‌ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుందా అనేది కీలక చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘సంప్రదింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే.. రష్యా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా, ఉక్రెయిన్‌ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సంతకం చేయడానికి త్వరలోనే జెలెన్‌స్కీ అమెరికా వస్తారని ఆశిస్తున్నా’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.ఏరోస్పేస్, వైద్య, సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అయితే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌కు అందించిన 180 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ సహాయంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్‌ శాంతి చర్చల అనంతరం పుతిన్‌ను కలుస్తానని ట్రంప్‌ తెలిపారు. శాంతి ఒప్పందానికి పుతిన్‌ అంగీకరిస్తారని, అతను మరింత యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. శాంతి అంటే ఉక్రెయిన్‌ లొంగిపోవడం కాదు: మాక్రాన్‌ అయితే.. ఉక్రెయిన్‌ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టి ఏ శాంతి ఒప్పందం జరగకూడదని మాక్రాన్‌ స్పష్టం చేశారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా భద్రతా హామీలు ఉండాలని, శాంతి అంటే ఉక్రెయిన్‌ లొంగిపోవడం కాదని మాక్రాన్‌ హెచ్చరించారు. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ప్రతిపాదనపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కలిసి పనిచేస్తామని మాక్రాన్‌ తెలిపారు. సుస్థిరత్వాన్ని ఏర్పరచడానికి యూరప్‌ సిద్ధంగా ఉందని, ఆ శాశ్వత శాంతిని సాధించడానికి బలమైన అమెరికా జోక్యం అవసరమని మాక్రాన్‌ నొక్కి చెప్పారు. అట్లాంటిక్‌ విభేదాలున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ముందుకు సాగాయని మాక్రాన్‌ నొక్కి చెప్పారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక కొత్త దౌత్య అవకాశం లభించిందన్నారు.

Former Beverages Corporation employee Satya Prasad in CID custody6
చెప్పినట్లు చేసి తీరాల్సిందే!

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ కక్ష సాధింపు కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఏకంగా సీఆర్‌పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించే కుట్రను వేగవంతం చేసింది. రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవ­రెడ్డి, సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్‌లతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే లక్ష్యంగా వేధింపులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా వైఎస్సార్‌ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగం పన్నింది. ఉన్నతాధికారులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం!చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూన్‌ 12న అధికారంలోకి రాగానే రెడ్‌బుక్‌ కక్ష సాధింపులకు తెరతీస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై అదే నెల 24న అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్‌ పొందారు. దాంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది. డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ కుట్రను ప్రస్తుతం పోలీసు శాఖను శాసిస్తున్న రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ స్వయంగా పర్యవేక్షిస్తు­న్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లను ఉద్దేశపూర్వకంగా పేర్కొనకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా చేయాలన్నది అసలు పన్నాగం. కేసు దర్యాప్తు పేరిట వాసుదేవరెడ్డిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు విస్పష్టంగా ఆదేశించారు. అప్పటి నుంచి విచారణ పేరిట సీఐడీ బృందాలు వాసుదేవరెడ్డిని వేధిస్తూనే ఉన్నాయి. ఆయన్ను కొద్ది రోజుల పాటు అనధికారికంగా నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డాయి. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి చెప్పినట్లుగా నడుచుకు­న్నామని, మద్యం వ్యవహారాలను వారిద్దరే పూర్తిగా పర్యవేక్షించారంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వక పోవడంతో ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసులో మరింతగా బరి తెగించేందుకు సీఐడీ సన్నద్ధమైంది. రప్పించి.. రహస్యంగా రికార్డింగ్‌!రెడ్‌ బుక్‌ కుట్రలో భాగంగా సీఐడీ పెద్దలు.. బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులను రప్పించి మాట్లాడుతున్నారు. వారు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతామని నమ్మబలుకుతున్నారు. సాధారణ సంభాషణలు, పిచ్చాపాటి తరహాలో మాట్లాడుతున్నప్పటికీ కార్యా­ల­యంలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమె­రాల ద్వారా మొత్తం వ్యవహారాన్ని రికార్డింగ్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారిని మరోసారి పిలిపించి వీడియో రికార్డింగులను చూపించి బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సీఐడీ అదుపులో సత్యప్రసాద్‌...అబద్ధపు వాంగ్మూలం నమోదు కుట్రలో భాగంగా బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వపు ఉద్యోగి సత్య ప్రసాద్‌ను సీఐడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను విజయవాడకు తరలించి కొద్ది రోజులుగా తమదైన శైలిలో విచారించి బెంబేలెత్తిస్తున్నారు. సత్య ప్రసాద్‌ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సీఐడీ అధికారుల బెదిరింపులు, వేధింపులు కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వారు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేందుకు సత్య ప్రసాద్‌ సమ్మతించినట్టు సమాచారం! దీంతో ఆయనతో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించేందుకు సీఐడీ అధికారులు రెండు రోజులుగా సన్నాహాలు వేగవంతం చేశారు. వాంగ్మూలం నమోదు చేయించగానే కుట్రలో తరువాత అంకానికి తెరతీయనున్నారు.ఇక టార్గెట్‌ రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి..!సత్య ప్రసాద్‌ను బెదిరించి దారికి తెచ్చుకున్న సీఐడీ అధికారులు గతంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహ­రించిన రాజ్‌ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకు­న్నారు. ఆయన ఆచూకీ కోసం కొద్ది రోజు­లుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టమైన సమాచారం అందగానే అరెస్ట్‌ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సీఐడీ అధికారుల బృందాలను ఇప్పటికే హైదరాబాద్‌ పంపారు. వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్‌ చేయాలన్నది సీఐడీ అధికారుల లక్ష్యం.అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకుంటే అంతు చూస్తాం..!వాసుదేవరెడ్డితోపాటు బెవరేజస్‌ కార్పొరేషన్‌లో గతంలో పని చేసిన సత్య ప్రసాద్‌తో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించే కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. వారిద్దరినీ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్న సీఐడీ అధికారులు.. ఈ వారంలో సీఆర్‌పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక నిరీక్షించే ఓపిక లేదని.. అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా వాంగ్మూల నమోదు ప్రక్రియ పనులు మొదలు పెట్టడం గమనార్హం.తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు!రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తోపాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించాలనే కుతంత్రాన్ని రచిస్తోంది. సీఐడీ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్‌ డ్రైవ్‌లు, సీడీలు, హార్డ్‌ డిస్క్‌లలో స్టోర్‌ చేస్తారు. అనంతరం వాటిని వెంటబెట్టుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, డిస్టిల­రీల కార్యాలయాల్లో తనిఖీలకు బయలుదే­రు­తారు. అవన్నీ ఆ నివాసాలు, కార్యా­లయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించినట్లు ప్రకటిస్తారు. తద్వారా తప్పుడు సాక్ష్యా­లు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలని సీఐడీ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది!

Sixth rescue team reaches end of SLBC tunnel7
ఆశలు ఆవిరి!

సాక్షి, హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎల్‌ఎల్‌బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఆరో ప్రయత్నంలో భాగంగా మంగళవారం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు. ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు. టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి. అయితే కార్మికుల క్షేమంపై మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నాక బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. చివరి వరకు వెళ్లిన తొలి బృందం ఇదే..: మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరో రెస్క్యూ బృందం సొరంగంలో ప్రవేశించింది. ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ టీం ప్రత్యేకంగా తమకు కావాల్సిన వస్తువులను సేకరించి, వెల్డింగ్‌ చేయించుకుని టన్నెల్‌లోకి తీసుకెళ్లింది. టన్నెల్‌లో బురద దాటేందుకు వీలుగా, టన్నెల్‌ సైడ్‌ గోడలకు రాడ్లు కొడుతూ ప్రత్యేక దారి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని వెంటబెట్టుకుని వెళ్లింది. గంటన్నర ప్రయాణించి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సొరంగం చివరి అంచువరకు వెళ్లిన ఆరో బృందం గాలింపులు నిర్వహించింది. సొరంగం చివరన ప్రమాద స్థలానికి చేరుకున్న తొలి రెస్క్యూ బృందం ఇదే కావడం గమనార్హం. ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్లు, స్నైఫర్‌ డాగ్స్, డ్రోన్‌ ఆపరేటర్లు, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) నిపుణులతో సహా మొత్తం 35 మంది బృందంలో ఉండగా, సొరంగం చివరికి 11 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్లతో పాటు నలుగురు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మాత్రమే చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో 15–18 మీటర్ల ఎత్తులో 140 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. ‘కూలిపోయే ప్రమాదం ఉంది..’ : అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్‌ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది. నేడు ఏడో ప్రయత్నం.. : ఏడో ప్రయత్నంలో భాగంగా బుధవారం ఉదయం మళ్లీ ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్లతో కూడిన బృందం సొరంగంలోకి వెళ్లనుంది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన తుక్కును గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేయడంతో పాటు కంకర, బండ రాళ్లు, మట్టిని తొలగించే ఆపరేషన్‌ను ప్రారంభించనుంది. సహాయక బృందాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి జేసీబీ యంత్రాలు వినియోగించకుండా ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్ల బృందాలతో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఎన్నిరోజుల సమయం పడుతుందో చెప్పలేమని ర్యాట్‌ హోల్‌ మైనర్‌ ఫిరోజ్‌ ఖురేషీ ‘సాక్షి’తో అన్నారు. కన్పించిన టీబీఎం ఉపరితల భాగం: మంగళవారం సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందానికి టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం) ఉపరితల భాగం కనిపించింది. బండ రాళ్లు, కాంక్రీట్‌ పడడంతో ఈ భాగం ఊర్తిగా ధ్వంసమై కనిపించగా, మిగిలిన భాగం మట్టి, కంకర, శిథిలాల్లో కూరుకుపోయింది. శిథిలాలను తొలగించి పరిశీలించిన తర్వాతే టీబీఎం మళ్లీ పనిచేయగలుగుతుందో లేదో తేలనుంది. సొరంగం పైకప్పునకు రక్షణగా ఉన్న కాంక్రీట్‌ సెగ్మెంట్లు కూడా కొంతవరకు కూలిపోయి, మరికొన్ని వంగిపోయి కనిపిస్తున్నాయి. కిందనుంచి శిథిలాలను తొలగించే క్రమంలో కాంక్రీట్‌ సెగ్మెంట్లు, శిథిలాలు ఊడిపోయి రెస్క్యూ టీంకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీబీఎం మిషన్‌పై పడిన మట్టి, బురదను తొలగించేందుకు మెష్‌ ప్రేమ్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా బురద నుంచి నీటిని వేరుచేసి డీ వాటరింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.ప్రస్తుతం నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల వరక నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ఈ నీటిని బయటకు తోడేందుకు ఐదు మోటార్లతో డీ వాటరింగ్‌ చేపడుతున్నారు. బుధవారం సాయంత్రానికి మొత్తం నీటిని డీవాటరింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులైనా తమ వారి జాడ తెలియకపోవడంతో, ఏ క్షణంలో ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.వారిని కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం» రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి»డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో టన్నెల్‌ ఇన్‌లెట్‌ పరిశీలన» మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డితో కలిసి సహాయక చర్యల పర్యవేక్షణ సాక్షి, నాగర్‌కర్నూల్‌/ అచ్చంపేట: శ్రీశైల ఎడమ కా ల్వ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని, ఇందు కోసం అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞా నాన్ని ఉపయోగించుకుంటామని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఇన్‌లెట్‌ను పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.అనంతరం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, జేపీ కార్యాలయంలో రెండుసార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సహా ఆయా శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, సహాయ చర్యల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. బురదను తొలగించడమే సమస్య‘ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలోకి అకస్మాత్తుగా వచ్చిన నీటి ఊటతో 40 నుంచి 50 మీటర్ల మేర బురద పేరుకుంది. టన్నెల్‌లో 11 కి.మీ తర్వాత ప్రాంతం నీటితో నిండి ఉంది. 13.50 కి.మీ వద్ద టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) ఉంది. ఎయిర్‌ సప్లయ్‌ పైప్‌లైన్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం టన్నెల్‌లో 10 వేల క్యూబిక్‌ మీటర్ల బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశాం. దీనిని తొలగించడమే ప్రధాన సమస్య’ అని మంత్రి ఉత్తమ్‌ చెప్పా రు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ, స్పెషల్‌ ఆఫీసర్‌ ఇ.శ్రీధర్, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.గ్రౌటింగ్‌ విఫలం కావడంతోనేనా..? సొరంగం కూలిన ప్రాంతంలో కొన్నిరోజుల కింద నిర్మాణ సంస్థ పీయూ గ్రౌటింగ్‌ చేసింది. జీఎస్‌ఐ నుంచి జియాలజిస్టు వచ్చి పరిశీలించి, పనులు కొనసాగించవచ్చని చెప్పాకే టన్నెల్‌ పనులు పునః ప్రారంభించారు. అయితే సొరంగం కూలిన ప్రాంతంలో మొత్తం పీయూ గ్రౌటింగ్‌ కోసం వినియోగించిన రసాయన అవశేషాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయి కనిపించాయి. దీంతో గ్రౌటింగ్‌ విఫలం కావడంతోనే సొరంగం కూలిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫాల్ట్‌ లైన్‌ గుర్తించేందుకు జీఎస్‌ఐ అధ్యయనం సొరంగం కూలడానికి కారణమైన ఫాల్ట్‌ లైన్‌ను గుర్తించడానికి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సొరంగం ఉపరితలం నుంచి వారు సర్వే చేసి ఏ ప్రాంతంలో మట్టి వదులుగా, బలహీనంగా ఉందో గుర్తించి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. బుధవారం మరో జీఎస్‌ఐ బృందం రాబోతోంది. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) నిపుణుల బృందం సైతం బుధవారం సొరంగం వద్దకు రానున్నారని అధికారవర్గాలు తెలిపాయి. తక్షణమే నివేదిక ఇవ్వండి : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనపై తక్షణమే నివేదిక సమరి్పంచాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) దక్షిణాది విభాగం.. రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. శ్రీశైలం జలాశయంతో సొరంగం అనుసంధానం కానుండడంతో ఈ ప్రమాదంతో జలాశయంపై ఉండనున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మా వాళ్లను క్షేమంగా అప్పగించండిజార్ఖండ్‌ కార్మికుల కుటుంబ సభ్యుల ఆవేదనఅచ్చంపేట: బతుకుదెరువు కోసం మా పిల్లలు ఇక్కడికి వచ్చారు.. వారు క్షేమంగా బయటికి తిరిగి వస్తారు కదా.. అంటూ దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమా దంలో చిక్కుకున్న కార్మికుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొరంగంలో వాళ్లు ఎలా ఉన్నారో తలుచుకుంటేనే భయమేస్తోంది. మా పిల్లలను మాకు క్షేమంగా అప్పగిస్తే చాలు..’ అని వేడుకున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నలుగురు కార్మికుల కుటుంబ సభ్యులు మంగళవారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు వచ్చారు. స్థానిక అధికారులు వారితో మాట్లాడి భరోసా కల్పించారు. తమవారు క్షేమంగా బయటికి రావాలని సొరంగంలో చిక్కుకున్న జగ్దాక్షేస్‌ అన్న జల్లామ్‌క్షేస్‌ చెప్పాడు. ‘నా పెద్ద కొడుకైన సందీప్‌ సాహు ఆరేళ్ల క్రితం కంపెనీలో పనిచేసేందుకు వచ్చి ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. నా కొడుకు క్షేమంగా వస్తే మా ఊరికి తీసుకెళ్లిపోతా..’ అని సందీప్‌ తండ్రి జీత్‌రామ్‌ సాహు అన్నాడు.

High Court on arrest of social media activist Ramana8
పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు

డీజీపీ పోస్టుపై మాకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండానియంత్రించుకుంటున్నాం. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ బొసా రమణ అరెస్ట్‌ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రమణ అరెస్ట్‌ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రమణ అరెస్ట్‌ విషయంలో విశాఖ పోలీస్‌ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: డీజీపీ పోస్టుపై తమకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నామని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ బొసా రమణ అరెస్ట్‌ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించింది. రమణ అరెస్ట్‌ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరామని పేర్కొంది. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. రమణ అరెస్ట్‌ విషయంలో విశాఖ పోలీస్‌ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అందుబాటులో లేనందున సహాయ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను మార్చి 11వతే­దీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణ అక్రమ నిర్బంధంపై పిటిషన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖ జిల్లా మద్దిపాలెం, చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పరస్పర విరుద్ధంగా రెండు నివేదికలు... ధర్మాసనం ఆదేశాల మేరకు బొసా రమణ అరెస్ట్‌ విషయంలో విశాఖ పోలీస్‌ కమిషనర్, ప్రకాశం ఎస్‌పీ తమ నివేదికలను అందచేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ఈ రెండు నివేదికల్లో అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నా­యని పేర్కొంది. రమణను పొదిలి పోలీసులు విశాఖలోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్‌ చేశారని కమిషనర్‌ చెబుతుండగా.. ప్రకాశం ఎస్‌పీ మాత్రం విశాఖ ఎంవీవీ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్‌ చేసినట్లు చెబుతున్నారని తెలిపింది. అరెస్ట్‌ వి­షయంలో వాస్తవాలను కోర్టు ముందుంచడం లేదని, అందువల్లే డీజీపీ నుంచి నివేదిక కోరామని స్పష్టం చేసింది. వర్రా అక్రమ నిర్బంధం కేసులో విద్యాసాగర్‌ నాయుడుకు నోటీసులుసోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో వైఎస్సార్‌ కడప జిల్లా అప్పటి ఇన్‌చార్జ్‌ ఎస్‌పీ విద్యాసాగర్‌ నాయుడిని హైకోర్టు సుమోటోగా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధం విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపింది. వాటికి బదులివ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేసింది. తన భర్త రవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్రా కళ్యాణి గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Delhi Capitals beat Gujarat by six wickets in wpl 9
ఢిల్లీ అలవోకగా...

బెంగళూరు: ఈ సీజన్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా గుజరాత్‌ నిర్ణీ త 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి (29 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకుంది.డాటిన్‌ (24 బంతుల్లో 26; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. మరిజాన్‌ కాప్, శిఖా పాండే, అనాబెల్‌ సదర్లాండ్‌ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెస్‌ జొనాసెన్‌ (32 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. ఆరంభంలోనే దెబ్బ... మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టులో బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో హర్లీన్‌ (5), లిచ్‌ఫీల్డ్‌ (0)లను అవుట్‌ చేసిన మరిజాన్‌ కాప్‌ దెబ్బ తీసింది. మరుసటి ఓవర్లో శిఖాపాండే వరుస బంతుల్లో బెథ్‌ మూని (10), కాశ్వీ గౌతమ్‌ (0)లను అవుట్‌ చేయడంతో ఇరవై పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది.కాసేపటికి కెప్టెన్‌ ఆష్లీ గార్డ్‌నర్‌ (3), డియాండ్ర డాటిన్‌లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 60/6 వద్ద గుజరాత్‌ కుదేలైంది. ఈ దశలో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ భారతి, తనూజ (16) ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది. ధనాధన్‌... సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ (3) వికెట్‌ను కోల్పోయింది. స్టార్‌ బ్యాటర్‌ను అవుట్‌ చేశామన్న ఆనందం గుజరాత్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్‌ షఫాలీ వర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెస్‌ జొనాసెన్‌ ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి. జెస్‌ బౌండరీలతో అలరించగా, షఫాలీ భారీ సిక్సర్లతో అదరగొట్టింది. వీరిద్దరు 31 బంతుల్లోనే 74 పరుగులు జత చేశారు. షఫాలీ జోరుకు గార్డ్‌నర్‌ అడ్డుకట్ట వేయగా, జెమీమా (5), అనాబెల్‌ (1) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా... 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జొనాసెన్‌ మిగతా లాంఛనాన్ని చకచకా పూర్తి చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (సి) నికీ (బి) శిఖా పాండే 10; హర్లీన్‌ డియోల్‌ (సి) బ్రైస్‌ (బి) మరిజాన్‌ కాప్‌ 5; లిచ్‌ఫీల్డ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మరిజాన్‌ కాప్‌ 0; ఆష్లీ గార్డ్‌నర్‌ (బి) టిటాస్‌ సాధు 3; కాశ్వీ (సి) నికీ (బి) శిఖా పాండే 0; డియాండ్రా (బి) అనాబెల్‌ 26; తనూజ (రనౌట్‌) 16; భారతి (నాటౌట్‌) 36; సిమ్రన్‌ (సి) లానింగ్‌ (బి) అనాబెల్‌ 5; మేఘన (బి) జెస్‌ జొనాసెన్‌ 0; ప్రియా మిశ్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–20, 4–20, 5–41, 6–60, 7–111, 8–121, 9–122. బౌలింగ్‌: శిఖా పాండే 3–0–18–2, మరిజాన్‌ కాప్‌ 4–1–17–2, టిటాస్‌ సాధు 2–0–15–1, అనాబెల్‌ 4–0–20–2, మిన్ను మణి 4–0–21–0, జెస్‌ జొనాసెన్‌ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మెగ్‌ లానింగ్‌ (బి) కాశ్వీ 3; షఫాలీ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్‌నర్‌ 44; జెస్‌ జొనాసెన్‌ (నాటౌట్‌) 61; జెమీమా (సి) భారతి (బి) తనూజ 5; అనాబెల్‌ (సి) బెత్‌ మూనీ (బి) కాశ్వీ 1; మరిజాన్‌ కాప్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.1 ఓవర్లలో 4 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–114, 4–115. బౌలింగ్‌: డియాండ్ర 4–0–30–0, కాశ్వీ 4–0–26–2, ఆష్లీ గార్డ్‌నర్‌ 3–0–33–1, మేఘన 1–0–8–0, ప్రియా 1.1–0–18–0, తనూజ 2–0–13–1.

PC shipments in India up 3. 8 Percent to 14. 4 million in 202410
పీసీలకు ఫుల్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: పర్సనల్‌ కంప్యూటర్ల (పీసీ)కు 2024లోనూ బలమైన డిమాండ్‌ కొనసాగింది. వీటి షిప్‌మెంట్‌ (మార్కెట్‌కు రవాణా) 3.8 శాతం మేర పెరిగింది. మొత్తం 14.4 మిలియన్‌ యూనిట్ల పీసీల రవాణా జరిగినట్టు మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గేమింగ్, ఏఐ ఆధారిత పీసీలకు అధిక డిమాండ్‌ నెలకొన్నట్టు తెలిపింది. 2025లో పీసీ మార్కెట్‌ తక్కువ స్థాయి సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐడీసీ అంచనా వేసింది. ఈ మేరకు త్రైమాసిక వారీ పీసీ డివైజ్‌ ట్రాక్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ‘‘రూపాయి బలహీనపడడం పీసీల ధరలు పెరగడానికి దారితీసింది. ఇది చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలతోపాటు, వినియోగ విభాగంపై ప్రభావం చూపించింది’’అని ఐడీసీ ఇండియా, దక్షిణాసియా అసోసియేస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డివైజెస్‌ రీసెర్చ్‌) నవకేందర్‌ సింగ్‌ ప్రకటించారు. అగ్రస్థానంలో హెచ్‌పీ ⇒ హెచ్‌పీ గతేడాది 30.1 శాతం పీసీల రవాణాతో (మార్కెట్‌కు) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఈ సంస్థ మార్కెట్‌ వాటా 30 శాతంగా నమోదైంది. వార్షికంగా చూస్తే 1 శాతం, త్రైమాసికం వారీగా చూస్తే 1.8 శాతం చొప్పున రవాణా తగ్గింది. ⇒ లెనోవో సంస్థ 17.2 శాతం పీసీలను రవాణా చేసింది. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ⇒ డెల్‌ 16.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. 8.1 శాతం వృద్ధిని చూపించింది. . ⇒ ప్రీమియం నోట్‌బుక్‌ల షిప్‌మెంట్‌ (1,000 డా లర్లకు పైన ధరలోనివి) గతేడాది 13.8% పెరిగింది. ⇒ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి పీసీలకు డిమాండ్‌ 10.6% మేర పెరిగింది. ⇒ 2024 చివరి మూడు నెలల కాలంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) మొత్తం పీసీల మార్కెట్‌ 6.9 శాతం, నోట్‌బుక్‌ విభాగం 9.6 శాతం మేర వృద్ధి చెందాయి. ⇒ తైవాన్‌ కంపెనీ ఏసర్‌ 2024లో 27.7 శాతం మేర షిప్‌మెంట్‌లో వృద్ధిని చూపించింది. 15.1 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంది. ⇒ ఆసుస్‌ 38.4 శాతం వృద్ధిని డిసెంబర్‌ త్రైమాసికంలో సాధించింది. అదే కాలంలో లెనోవో 13.5 శాతం అధికంగా షిప్‌మెంట్‌ చేసి 18.5 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ⇒ డెల్‌ సంస్థ డిసెంబర్‌ త్రైమాసికంలో 18.1 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. 5.8 శాతం వృద్ధిని చూపించింది. ఏసర్‌ కూడా డిసెంబర్‌ క్వార్టర్‌లో 20% వృద్ధిని నమోదు చేసి, 15.7 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంది. వర్క్‌స్టేషన్లకు మరింత డిమాండ్‌. ‘‘సంప్రదాయ పీసీ మార్కెట్‌ (డెస్క్ టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేషన్లు) 2024లో 14.4 మిలియన్‌ యూనిట్లను షిప్‌మెంట్‌ చేసింది. వార్షికంగా 3.8 శాతం వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా చూస్తే నోట్‌బుక్‌ల షిప్‌మెంట్‌ 4.5 శాతం మేర, డెస్క్ టాప్‌ల షిప్‌మెంట్‌ 1.8 శాతం మేర అధికంగా జరిగాయి. వర్క్‌స్టేషన్ల షిప్‌మెంట్‌ రికార్డు స్థాయిలో 10.9 శాతం పెరిగింది. నోట్‌బుక్‌లకు డిమాండ్‌ బలంగా ఉంది. వాణిజ్య పీసీ మార్కెట్‌ సైతం తాజా ఆర్డర్లతో పుంజుకుంది’’అని ఐడీసీ నివేదిక వెల్లడించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

title
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!

వలసదారుల విషయంలో  డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

Advertisement

వీడియోలు

Advertisement