Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

MLC Kavitha Serious Comments On BRS Party1
కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్‌ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్‌ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్‌ మీటింగ్‌ సక్సెస్‌ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్‌ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్‌.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్‌తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్‌కి వెళ్ళిన వాళ్ళు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారని అన్నారు. నేను అసలే మంచి దాన్ని కాదు..డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్‌ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్‌ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్లాన్‌.. అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కేసీఆర్‌కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే.. పార్టీ పరంగా ఏం చేశారు?. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసింది?. అదానీ టీ షర్ట్స్ వేసుకొని హంగామా చేసి వదిలేశారు.పార్టీ కోసం కేసీఆర్‌కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్‌ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు. నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో​ కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్‌లైన్‌ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.

Telangana Government Issues Gaddar Awards2
'గద్దర్‌ అవార్డ్స్‌' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్‌'

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ నటి జయసుధ (Jayasudha), ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్‌ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను అవార్డ్స్‌ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్‌ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్‌ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్‌ టీమ్‌, ఫీచర్‌ ఫిల్మ్‌, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్‌, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం ‌: పోటేల్‌ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్‌ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఐ అండ్‌ మై ఫ్రెండ్స్‌ఉత్తమ వినోదాత్మక చిత్రం : ఆయ్‌హిస్టరీ ఫీచర్‌ విభాగంలో ఉత్తమ హెరిటేజ్‌ చిత్రం- రజాకార్‌ ఉత్తమ నటుడు‌: అల్లు అర్జున్‌ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్‌ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్‌ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్‌ (రజాకార్‌)ఉత్తమ సహాయ నటుడు : ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ : చంద్రశేఖర్‌ (గ్యాంగ్‌స్టర్‌ )ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : గణేష్‌ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్‌: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : సిద్‌ శ్రీరామ్‌ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ ఫిమేల్‌: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- విశ్వనాథ్‌రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్‌ జ్యూరీ అవార్డ్స్‌ విజేతలు దుల్కర్‌ సల్మాన్‌: లక్కీ భాస్కర్‌అనన్య నాగళ్ల: పొట్టేల్‌దర్శకులు సూజిత్‌, సందీప్‌ (క) నిర్మాతలు ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ (రాజూ యాదవ్‌)స్పెషల్‌ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

KSR Comments On Chandrababu Mahanadu3
బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది!

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. సూపర్‌ సిక్స్‌ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో!.సాధారణంగా మహానాడు కార్యక్రమాల్లో విధానాలపై చర్చ జరిగేది. పాలనలోని మంచిచెడు గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడలా కాదు.. స్వోత్కర్ష, గప్పాలు కొట్టుకోవడం, అతిశయోక్తులతో ప్రసంగాలు ఒకవైపు, అంతా లోకేశ్‌ మయం అన్నట్లుగా మరోవైపు ఈ సభ జరిగింది. లోకేశ్‌ నా తెలుగు కుటుంబం అని సొంత లోగోని ఏర్పాటు చేసుకోవడం, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకుంటున్న ఆరు శాసనాలు ప్రచారం కోసం ఈ సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని అంటూనే పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెప్పడం ద్వారా ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లయింది.జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒకటికి, రెండుసార్లు అనడం ద్వారా లోకేశ్‌కు బ్రేక్ వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆలోచన వచ్చింది కానీ, దానికి పవన్ కళ్యాణ్, జనసేన కేడర్‌ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ స్థాయి తగ్గినట్లవుతుందని వారి బాధ. దీనిని గమనిస్తే, వారిద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదేమో అన్న సందేహం వస్తుంది. ఈ సంగతి పక్కన బెడితే చంద్రబాబు స్పీచ్ అంతా ఎప్పటి మాదిరి అసత్యాలు, అర్ధసత్యాలు, జగన్ ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో పేలవంగా సాగింది. రాజమండ్రిలో ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం, గ్యాస్ సిలిండర్ల పథకం అరకొర అమలు మినహా మిగిలిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించాలి కదా!. పోనీ ఫలానా అభివృద్ది సాధించామని చెప్పగలిగారా? నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఉన్నాయి.ఇవి కాకుండా షణ్ముక వ్యూహం అంటూ, ఎన్నికల ప్రణాళిక పేరుతో దాదాపు 200 హామీలు ఇచ్చారు. జూన్‌లో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని అంటున్నారే తప్ప, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదో, అది తమ వైఫల్యమో కాదో చంద్రబాబు మాట మాత్రం చెప్పలేకపోయారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో రాసినప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిసి మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. వేరే హామీలలో వలంటీర్ల కొనసాగింపు, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియాలో కవరేజీకి అవసరమైన డైలాగులు మాత్రం చెప్పారనిపిస్తుంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా అవసరమైన విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం ఏమిటి?.గత మహానాడు అనండి, పార్టీ సభ అనండి.. లేదా తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఏం తీసుకువస్తారు?. అంటే మేనిఫెస్టోలోని అంశాలన్నిటినీ గాలికి వదలివేసినట్లేనా!. కార్యకర్తల ద్వారా రాజకీయ పాలన చేస్తారట. ఈ ఏడాది కాలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సాగించిన అరాచకాలు, ఎమ్మెల్యేలు చేసిన దందాలు సరిపోలేదని భావిస్తున్నారా? లేక అవినీతి పథకాలతో కార్యకర్తల జేబులు నింపుతారా!. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి వారు ప్రజలపై పెత్తనం చేస్తూ సంపాదించుకోవచ్చని చెబుతున్నారా?. ఆ డబ్బుతో ఎన్నికలలో గెలవవచ్చన్నది వీరి ఉద్దేశమా?.గత ముఖ్యమంత్రి జగన్ ఆయా స్కీములలో కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏవీ చూడవద్దని అధికారులకు చెబితే, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం సంకుచిత ధోరణితో టీడీపీ కార్యకర్తలకే పనులు చేయమని చెప్పడం సముచితమేనా!. వైఎస్సార్‌సీపీ పాలనలో అవినీతి జరిగిందని.. గాడి తప్పిన నేతలను, అధికారులను శిక్షిస్తామని ఆయన అంటున్నారు. అవినీతిని సహించబోమని, అవినీతిపై పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ఆయన చెబితే సభికులు చెవిలో పూలు పెట్టుకుని విని ఉండాలి. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై, కొందరు అప్పటి మంత్రులపైన అవినీతి కేసులు ఆధార సహితంగా వచ్చాయి కదా!. అప్పటి దర్యాప్తు అధికారులు చూపించిన ఆధారాలు సరైనవా? కావా? అన్నవాటిపై చంద్రబాబు కానీ, మరే టీడీపీ నేత అయినా మాట్లాడారా!. అవన్ని ఎందుకు టీడీపీ ఖాతాలోకి అక్రమ సొమ్ము చేరిందని ఆరోపణలు వచ్చాయి.అలాగే కేంద్ర ప్రభుత్వ సీబీటీడీనే చంద్రబాబు కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రకటించిందా? లేదా?. ఆదాయ పన్ను శాఖ ఎందుకు నోటీసు ఇచ్చింది?. వాటి గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా!. కాకపోతే ఆయనకు మేనేజ్ మెంట్ స్కిల్‌ ఉంది కనుక ఆ కేసులు ముందుకు వెళ్లకుండా చూడగలిగారు. జగన టైమ్ లో హత్యా రాజకీయాలు జరిగాయట. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, పార్టీ రంగు పులిమి రాజకీయం చేసిన సంగతి ఆయన ఆత్మకు తెలియదా!. మాచర్ల వద్ద హత్యకు గురైన ఒక టీడీపీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం సరైనదేనా?. అది కొలమానం అయితే ఈ మహానాడులో ప్రసంగాల ప్రకారం వెయ్యి మందికి పైగా హత్యలకు గురయ్యారని చెప్పారు కదా!. మరి ఆ వెయ్యి మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?. నిజానికి మాచర్ల హత్య కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినదే. కాని రాజకీయ లబ్దికోసం టీడీపీ గేమ్ ఆడిందని అంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు?. ఎందరు పోలీసుల వేధింపులు ఎదుర్కుంటున్నారు.మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోరాల మాటేమిటి!. తెనాలిలో దళిత, ముస్లిం యువకులు ముగ్గురిని పోలీసులు బహిరంగంగా అరికాళ్లపై ఇష్టారాజ్యంగా కొట్టడమే టీడీపీ ప్రభుత్వ విధానమా?. ఇక అక్రమ కేసుల సంగతి సరే సరి. ఇన్ని చేస్తూ జగన్ ప్రభుత్వంలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ అసత్యాలు, అర్ధ సత్యాలు వల్లే వేస్తున్నారు. ఇక లోకేష్ చెబుతున్న ఆరు శాసనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయనిపిస్తుంది. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ పేర్కొన్న అంశంలో 1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మళ్లీ సీఎం పదవి చేపట్టారని అన్నారు. బాగానే ఉంది. మరి 1995లో స్వయంగా అల్లుడు అయిన చంద్రబాబే ఎందుకు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతిడిని చేశారు కదా? చంద్రబాబును అప్పట్లో ఎన్టీఆర్‌ ఎన్ని విధాలుగా దూషించారన్నది కూడా విశ్వ విఖ్యాతమైనవే కదా!.తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేసే యువగళం అన్నారు. అభ్యంతరం లేదు. వారిష్టం. స్త్రీ శక్తి మూడో శాసనమని తెలిపారు. ఎన్టీఆర్‌ మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇస్తే, చంద్రబాబు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చారట. అదేమిటో? మరి ఆడబిడ్డ నిధి, ఈ ఏడాది తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు? పేదల సేవలో సోషల్ ఇంజినీరింగ్ అనేది మరో శాసనమట. వృద్దులకు రూ.నాలుగు వేలు ఫింఛన్‌ ఇస్తున్నారు. దాంతోనే పేరికం పోతుందా!. పీ-4 పేరుతో పేదలను పెట్టుబడిదారులకు వదలి వేయడం తెలుగుదేశం పాలసీగా మారింది కదా!.2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఉండే విలువ ఎంతో తెలియదు. అన్నదాతకు అండగా ఉండటం మరో శాసనం అని చెప్పారు. వారికి ఇవ్వవలసిన రూ.ఇరవై వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? చివరి శాసనం కార్యకర్తే అధినేత అని పేర్కొన్నారు. వారిని సొంతకాళ్లపై నిలబడేలా ఆర్థికంగా బాగు చేస్తారట. అంటే ప్రభుత్వ సొమ్మును వారికి దోచిపెడతామని పరోక్షంగా చెప్పడమే కదా అని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నిటినీ మించి టీడీపీ పేదల పార్టీ అట. ఆ పేదల పార్టీకి ఒక్క రోజులో సుమారు రూ.22 కోట్ల విరాళం వచ్చిందట. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది.1987 మహానాడు విజయవాడ కృష్ణా తీరంలో జరిగింది. అందులో ఒక హుండీ పెట్టారు. విరాళాలు ఇవ్వదలిచిన వారు అందులో వేయవచ్చని ప్రకటించారు. ఆ హుండీ వద్దకు ఎవరూ వెళ్లినట్లు కనిపించలేదు. కాని తెల్లవారే సరికల్లా భారీ మొత్తాలు వచ్చాయని ప్రకటించేవారు. ఇందులో మతలబు ఏమిటని అప్పట్లో కథనాలు వచ్చాయి. మరి ఇప్పుడు నిజంగానే అభిమానులు, పార్టీ నేతలు విరాళాలు ఇస్తుంటే మంచిదే. ఏది ఏమైనా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడపలో మహానాడు పెట్టి చంద్రబాబు, లోకేశ్‌లు తమ అహం చల్లబరుచుకుని ఉండవచ్చు కానీ, రాయలసీమకు గానీ, రాష్ట్ర ప్రజలకు కానీ.. ఈ మహానాడు వల్ల ఒరిగింది ఏమిటి అన్న దానికి జవాబు దొరుకుతుందా?. అందుకే జగన్ ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తే హీరోయిజం కాని, కడపలో మహానాడు పెడితే హీరోయిజం ఏముందని అడిగారు. దానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

 Kaif grills BCCI for hypocrisy in selecting Indias Test squad for England4
'శ్రేయ‌స్ ఏమి త‌ప్పు చేశాడు.. కావాల‌నే ఎంపిక చేయ‌లేదు'

ఐపీఎల్‌-2025 సీజ‌న్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇంగ్లీష్ జ‌ట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఈ సిరీస్ కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. భార‌త టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ స్ధానంలో శుబ్‌మ‌న్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ నియ‌మితుడ‌య్యాడు. అయితే ఈ జ‌ట్టులో అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయస్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆట‌గాడు సాయి సుదర్శన్‌కు సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. తాజాగా సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యంపై భార‌త మాజీ క్రికెట‌ర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. సుద‌ర్శ‌న్ బ‌దులుగా అనుభ‌వం ఉన్న అయ్య‌ర్‌కు ఛాన్స్ ఇవ్వాల్సంద‌ని కైఫ్ అభిప్రాయ‌ప‌డ్డాడు."సాయి సుదర్శన్ ఒక అద్బుత‌మైన ఆట‌గాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజ‌న్‌లో బాగా రాణించ‌డంతో అత‌డిని టెస్టు జ‌ట్టులోకి తీసుకున్నారు. అదే స‌మ‌యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ‌త కొంత‌కాలంగా మూడు ఫార్మాట్ల‌లోనూ అత‌డు నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్‌-2023, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్య‌ర్‌ దాదాపు 550 పరుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో కూడా అద్బుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్‌గా అత‌డు విజ‌య‌వంత‌మ‌య్యాడు. సుద‌ర్శ‌న్‌ను వైట్ క్రికెట్ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా టెస్టు జ‌ట్టులోకి తీసుకున్న‌ప్పుడు, మ‌రి అయ్య‌ర్ విష‌యంలో ఏమైంద‌ని" సెల‌క్ట‌ర్ల‌పై కైఫ్ మండిప‌డ్డాడు.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్

Modi Sikkim Visit Cancelled Statehood day Celebrations5
ముష్కరులకు దీటుగా బదులిచ్చాం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ‘పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడి, భారతీయులను విభజించాలని కోరుకున్న ముష్కరులకు భారత్‌ తగిన సమాధానం ఇచ్చిందని’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత భారతీయులు మునుపెన్నడూ లేనంతగా ఐక్యతను వ్యక్తం చేశారని అన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసింది కేవలం భారతీయులపై దాడి మాత్రమే కాదు. ఇది మానవత్వంపై జరిగిన దాడి. మన సోదర స్ఫూర్తిపై దాడి. అయితే ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం వారికి బలమైన ప్రతిస్పందన చూపామని ప్రధాని మోదీ బాగ్డోగ్రాలో వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.నేడు (గురువారం) జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సిక్కిం పర్యటన ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. సిక్కిం రాష్ట్ర అవతరణ 50వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని హాజరుకావలసి ఉంది. దీనిలో భాగంగా ఆయన గ్యాంగ్‌టక్‌ చేరుకుని, రూ. 750 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలించని కారణంగా రద్దయ్యాయి. దీంతో ప్రధాని మోదీ బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్‌) నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సిక్కిం ప్రజాస్వామ్య ప్రయాణంలో స్వర్ణోత్సవం అని అన్నారు. తాను రాష్ట్ర ప్రజల సమక్షంలో ఉంటూ, 50 వసంతాల విజయవంతమైన ప్రయాణాన్ని చూడాలనుకున్నానని, అయితే ఢిల్లీ నుండి బాగ్డోగ్రా చేరుకోగానే, అక్కడి వాతావరణం తనను మరింత ముందుకు వెళ్లకుండా ఆపివేసిందని, ఫలితంగా సిక్కిం ప్రజలను వ్యక్తిగతంగా కలిసే అవకాశం దక్కలేదని ప్రధాని మోదీ ‍పేర్కొన్నారు.సిక్కిం 50వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మలచేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృష్టిచేశారని ప్రధాని అన్నారు. సిక్కిం 50వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. 50 ఏళ్ల క్రితం సిక్కిం తనకు తానుగా ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించుకుందని, నాడు సిక్కిం(Sikkim) ప్రజలు భారతదేశంతో కనెక్ట్ కావాలని కోరుకున్నారన్నారు. ఈ రోజు సిక్కింలోని ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. 50 ఏళ్లలో సిక్కిం 100శాతం సేంద్రీయ రాష్ట్రంగా మారిందని, సంస్కృతి, వారసత్వ సంపదకు చిహ్నంగా ఉద్భవించిందని ప్రధాని అన్నారు.2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అని చెప్పామని, ఈ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చిందని మోదీ పేర్కొన్నారు. నేడు సిక్కిం అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని, ఇది నవ భారత అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయంగా మారనున్నదని ప్రధాని మోదీ అన్నారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ఆ రాష్ట్రాల్లో ‍ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

TDP Mahanadu Day 3 Updates: Even Police Faced Troubles In Mahanadu6
మహానాడులో పోలీసులకూ తప్పని కష్టాలు!

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇంకోవైపు.. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్‌’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్‌ స్పీచ్‌.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు

Microsoft Yotta Partner to Boost AI in India7
మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు

న్యూఢిల్లీ: భారత్‌లో కృత్రిమ మేథని (ఏఐ) మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్, యోటా డేటా సర్వీసెస్‌ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం యోటా ఏఐ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం అయిన శక్తి క్లౌడ్‌లో మైక్రోసాఫ్ట్‌ తమ అజూర్‌ ఏఐ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది.దీంతో డెవలపర్లు, స్టార్టప్‌లు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండియాఏఐ మిషన్‌లో భాగమైన సంస్థలకు అధునాతన సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా కృత్రిమ మేథ సామర్థ్యాలను పెంపొందించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను పటిష్టపర్చడం ద్వారా ఇండియాఏఐ మిషన్‌ లక్ష్యాల సాధనకు కూడా మైక్రోసాఫ్ట్‌–యోటా భాగస్వామ్యం తోడ్పడనుంది.👉ఇదీ చదవండి: టీసీఎస్‌లో భారీగా ఏఐ ఏజెంట్లు..ఇండియాఏఐ మిషన్ అనేది దేశంలోని కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ చొరవ. ఏఐ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించడం ఈ మిషన్ లక్ష్యం. దేశీ ఏఐ మోడల్స్‌ను రూపొందించడానికి సంబంధించి 2025 మే నాటికి ఇండియాఏఐ మిషన్‌కు 500 పైగా ప్రతిపాదనలు వచ్చాయి.

Kuppam farmers Serious On Chandrababu8
చంద్రబాబును గెలిపించడమే మా తప్పు.. కుప్పంలో రైతుల ఆగ్రహం

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.కాగా, కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది.

Viral video: Baraat of 400 people shut down Wall Street Goes Viral9
పెళ్లి బరాత్‌తో దద్దరిల్లిన వాల్‌స్ట్రీట్‌

మన దేశంలో ఏం రేంజ్‌లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్‌ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్‌ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్‌లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్‌కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్‌స్ట్రీట్‌లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్‌ నిర్వహించి..ఓ లెవెల్‌లో ఆడిపాడి ఎంజాయ్‌ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్‌స్ట్రీట్‌ మూసేశారు. ఆ వాల్‌స్ట్రీట్‌ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్‌ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్‌లకు అనుగుణంగా డ్యాన్స్‌లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్‌స్ట్రీట్‌ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్‌ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి:

US Court Blocks Donlad Trump Tariffs10
ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌కు యూఎస్‌ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితిలో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్‌హట్టన్‌ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, ట్రంప్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌లు (Trump Tariffs) అమలుకాకుండా యూఎస్‌ ట్రేడ్‌ కోర్టు నిలుపుదల చేసింది. ఈ క్రమంలో మాన్‌హట్టన్‌ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉంది. విశేష అధికారాలతో టారిఫ్‌లు విధించడం సరికాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడమే అవుతుంది అని చెప్పుకొచ్చింది.అయితే, ట్రంప్ ఈ చర్యను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకున్నట్టు అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని కోర్టు తేల్చింది. ఇదే సమయంలో ‘భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల (India-Pakistan Tensions)’ అంశాన్ని ట్రంప్‌ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.🇺🇸 JUST IN: US federal court blocks Trump's "Liberation Day" tariffs from taking effect.It rules that the president overstepped his constitutional authority by unilaterally imposing import duties on countries with trade surpluses against the United States. pic.twitter.com/WmJlyoEz9H— Cointelegraph (@Cointelegraph) May 29, 2025అధ్యక్షుడికి ఉన్న టారిఫ్‌ అధికారాలను సమర్థించాలని ట్రంప్‌ (Donald Trump) అడ్మినిస్ట్రేషన్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్‌.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్‌ అధికారం వల్లనే ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్‌ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్‌ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్‌ అడ్మిస్ట్రేషన్‌ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.ఇక, ఈ టారిఫ్‌లపై అమెరికాలోని ఐదు చిన్న దిగుమతి వ్యాపార సంస్థలు, ఒరెగాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధం, నిర్లక్ష్యంగా తీసుకున్నవని, ఆర్థికంగా నష్టం కలిగించేవి అంటూ వారు పేర్కొన్నారు. 🚨 BIG BREAKING 🚨🇺🇸 US Federal Court blocks President Trump's Liberation Day tariffs from taking effect.Donald Trump files appeal after Federal Court blocks tariffs.White House: It's "not for unelected judges to decide how to properly address a national emergency." pic.twitter.com/yCotgRaQq6— Crypto Aman (@cryptoamanclub) May 29, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement