Top Stories
ప్రధాన వార్తలు

మరో రెండ్రోజులు పట్టొచ్చు.. SLBC రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం రేవంత్
SLBC Tunnel Rescue Operation Updates :7:30pm SLBC టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ ప్రెస్మీట్ఎస్ఎల్బీసీ పనులు 2005లో మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసిందిపనులు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగిందిగత 10ఏళ్లలో రెండు కిలోమీటర్లు కూడా టన్నెల్ తవ్వలేదుమేం వచ్చాక పనులు ఊపందుకున్నాయినిపుణలతో చర్చించి పనులు ప్రారంభించాంఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి11కేంద్ర రాష్ట్రాల రెస్క్యూ బృందాలు సహాకచర్యల్లో పాల్గొన్నాయితీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందిస్తున్నారెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే సరికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందిప్రమాదం జరిగిన వెంటనే మంత్రులను పంపించా, సమీక్ష నిర్వహించాప్రపంచంలోనే ఇదే అతిపెద్ద,పొడవైన టన్నెల్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందిబాధితుల పట్ల సానుభూతి చూపించాలిఎన్ని రోజులైనా మృత దేహాలను వెలికి తీయాల్సిందే.. బాధిత కుటుంబాలకు అప్పగించాల్సిందేకన్వేయర్ బెల్ట్‌ను రేపటిలోగా అందుబాటులోకి తెస్తామన్నారుకన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే రెస్క్యూ వేగవంతం అవుతుంది అవసరమైతే రోబోలను పంపి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయిస్తాంఏం జరిగినా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయతం చేస్తున్నారుఏం జరిగినా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ఉందిగతంలో శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ప్రమాదం జరిగితే చూసేందుకు వెళ్లిన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు7:00pm ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులతో సమీక్షతక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వండి.ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలిఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలిమరింత మంది నిపుణులను రప్పించండిభవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదుఎన్జీఆర్ఐ నిపుణులు వచ్చాక మరింత వేగంగా సహాయక చర్యలుత్వరలో సిస్మాలజీ నిపుణులు కూడా వస్తారువిభాగాల వారీగా చేయాల్సిన పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలితక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వండి 6:00pmఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డిటన్నెల్ ప్రమాదంపై రెస్క్యూటీం హెడ్స్,అధికారులతో సీఎం సమీక్షప్రమాదం జరిగిన ప్రదేశం..కొనసాగుతున్న సహయకచర్యలపై సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అదికారులుమరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంసీఎంతోపాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తదితరులు4:00pmఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయ చర్యలు ప్లాస్మా కట్టర్స్‌తో టీబీఎం మిషన్లు కట్ చేస్తున్న రెస్క్యూ సిబ్బంది.జీపీఆర్ చిత్రాలు గుర్తించిన ప్రాంతాల్లో శరవేగంగా పనులుభారీగా నీటి ఊట వస్తుండడంతో తోడిపోస్తున్న సిబ్బంది సాక్షి,హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు నీటి ఊట ఆటంకంగా మారింది. దీంతో ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ టీమ్ సర్వే చేసేందుకు రంగంలోకి దిగారు.ఇందులో భాగంగా ఎస్ఎల్బీసీ టన్నెల్‌పై భాగమైన అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ అధికారులు సర్వే నిర్వహించారు. అధికారుల సర్వేలో ప్రమాదం స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతున నీటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం వాగుల నీరు ప్రవహిస్తుంటుంది.ఈ వాగుల్లోని మల్లెల తీర్థం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. మల్లెలతీర్ధం నుంచి నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తున్నది. వాగుల ప్రవాహం వల్లే ఎస్ఎల్బీసీ టెన్నెల్లో నీటి ఊట ఉన్నట్లు నిర్ధారించారు. జియోలాజికల్ అధికారులు పరీక్షించారు. నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో ఆరాతీశారు. అయితే ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం నుంచి ప్రవహించే నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తుంది. వాటిలో మల్లెల తీర్ధం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీపీఆర్ ద్వారా గల్లంతైన వారి ఆచూకీ లభ్యంమరోవైపు రెస్క్యూ సిబ్బంది జీపీఆర్ ద్వారా ఒక ప్రాంతంలో 2మీటర్ల లోతులో గల్లంతైన వారిలో నలుగురి ఆచూకీ , మరో ప్రాంతంలో ఏడు మీటర్ల లోతులో మరో నలుగురి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. ఎస్ఎల్ బీసీ వద్దకు సీఎం రేవంత్తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిప్టునకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శనివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీఎస్ శాంతికుమారితో కలిసి రెస్క్యూ ఏజెన్సీలు, సభ్యులతో టన్నెల్ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం జరుగుతున్న సహాయ చర్యల్లో పురోగతి కనిపించిందని, ఆదివారం సాయంత్రానికి ఏదైనా సమాచారం లభ్యమయ్యే అవకాశముందని ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పైకప్పు కూలిన విషయం తెలిసిందే. అక్కడ ఎనిమిది రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

CT 2025, IND VS NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) ఖాతాలో మరో వరల్డ్ రికార్డు (World Record) చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో 300 వన్డేల మైలురాయిని తాకిన విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో 300 వన్డేలు, 100కు పైగా టెస్ట్‌లు, 100కు పైగా టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ ఇతర క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు. విరాట్ ఇప్పటివరకు 300 వన్డేలు, 123 టెస్ట్‌లు, 125 టీ20లు ఆడాడు. భారత్ తరఫున 300 వన్డేలు ఆడిన ఏడో క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌కు ముందు సచిన్ టెండూల్కర్ (463), ఎంఎస్ ధోని (350), రాహుల్ ద్రవిడ్ (344), మహ్మద్ అజారుద్దీన్ (334), సౌరవ్ గంగూలీ (311), యువరాజ్ సింగ్ (304) భారత్ తరఫున 300 వన్డేల మైలురాయిని తాకారు.కాగా, విరాట్ తన 300 వన్డేలో కేవలం 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని క్యాచ్‌తో విరాట్‌ను పెవిలియన్‌కు పంపాడు. గత మ్యాచ్‌లో విరాట్ పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ 52 పరుగులు చేసుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు. ప్రస్తుతం (ఈ మ్యాచ్‌తో కలుపుకుని) విరాట్ ఖాతాలో 662 పరుగులు ఉన్నాయి (ఛాంపియన్స్ ట్రోఫీలో).ఓవరాల్‌గా విరాట్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో సచిన్ (18426), సంగక్కర (14234) మత్రమే విరాట్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. విరాట్ ఇప్పటివరకు 288 ఇన్నింగ్స్‌లు ఆడి 14096 పరుగులు చేశాడు. విరాట్ ఇటీవలే వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పాక్‌పై సెంచరీతో వన్డేల్లో విరాట్ సెంచరీల సంఖ్య 51కి చేరింది. ప్రపంచ క్రికెట్లో ఇన్ని సెంచరీలు (50కిపైగా) ఎవరూ చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్‌లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది.

చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్‌పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు.

రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. ఎక్కడంటే?
రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్‌ను కేవలం రూ.5 మాత్రమే అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రైతులను ప్రోత్సహించడం. వారి జీవితాలను మెరుగుపరచడం. విద్యుత్ సమస్యలు లేకుండా, సాగునీటి అవసరాలను తీర్చేందుకు సౌర (సోలార్) పంప్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే మూడు సంవత్సరాల్లో 30 లక్షల సోలార్ పంప్‌లను రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతుల నుండి సౌర విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. తద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశముంది.కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని వ్యాఖ్యానించారు.

వైట్ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ షాక్ తగిలింది. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు అంటే ఒక్క లీటరు చమురు ఇవ్వబోమని అమెరికా సైన్యానికి ఇంధనం సరఫరా చేసే నార్వే దేశ చమురు, యుద్ధనౌకల్ని సరఫరా చేసే హాల్ట్బ్యాక్ బంకర్స్ (Haltbakk Bunkers) సంస్థ ఖరాఖండీగా చెప్పేసింది. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల (Volodymyr Zelensky)మధ్య మాటలు మంటలు రేపాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇందుకు అమెరికా పెద్దన్నగా వ్యవరిస్తోంది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య బహిరంగంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్ పట్టుబట్టారు. భవిష్యత్‌లో రష్యా మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారా?, అందుకు మీరు భరోసా ఇస్తారా జెలెన్ స్కీ ఎదురు ప్రశ్నవేశారు. జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్,జేడీ వాన్స్ లు నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునేలా మాటమాట పెరిగింది.WOW. After yesterday’s Oval Office ambush of President Zelensky, Haltbakk Bunkers, one of Norway’s leading marine fuel providers, announced that it will no longer refuel U.S. Navy vessels, urging other European firms to follow suit.The United States is weaker and more isolated… pic.twitter.com/D9w32n1xBA— Republicans against Trump (@RpsAgainstTrump) March 1, 2025 ఈ పరిణామంలో ప్రపంచ దేశాలు వ్లాదిమిర్ జెలెన్స్కీకి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. తాజాగా, నార్వేజియన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని అమెరికాకు సరఫరా చేసే నార్వేజియన్ దేశ సంస్థ haltbakk బుంకెర్స్ కీలక ప్రకటన చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో పహారా కాస్తున్న అమెరికా సైనిక బలగాలకు సరఫరా చేసే ఇంధనాన్ని తక్షణమే ఆపేస్తున్నట్లు వెల్లడించింది. అందుకు వాషింగ్టన్లో శుక్రవారం అమెరికా, ఉక్రెయిన్ దేశాల దౌత్య సమావేశంలో జరిగిన వివాదమేనని తెలుస్తోంది. హల్ట్ బ్యాక్ బంకర్స్ తన ప్రకటనలో 2024లో అమెరికా సైనిక బలగాలకు సుమారు 30,00,000 లీటర్ల ఇంధనాన్ని సరఫరా చేసింది. వైట్ హౌస్‌లో దేశాధ్యక్షుల మధ్య జరిగిన వాగ్వాదంలో జెలెన్స్కీకి అండగా నిలుస్తోంది. అందుకే మా సంస్థ అమెరికా సైనిక బలగాలకు ఇంధన సరఫరా చేయడం వెంటనే ఆపివేయాలని నిర్ణయించుకుంది’ అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఏమైందో ఏమో కొద్ది సేపటి తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసినట్లు సమాచారం.

ఎల్పీయూ రికార్డు.. 1700 విద్యార్థులకు 10 లక్షలపైనే ప్యాకేజీలు
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్‌జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్‌గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్ద ఆమె నివసిస్తోంది.ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లి హఠాత్తుగా చనిపోవడంతో ఆమె తల్లి.. పిల్లిని పాతిపెట్టమని చెప్పింది. అందుకు పూజ నిరాకరించింది. అది తిరిగి బతికి వస్తుందంటూ.. రెండు రోజుల పాటు ఆ పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పిన కానీ పూజ వినిపించుకోలేదు.పిల్లి మృతితో తీవ్ర కుంగుబాటుకు గురైన పూజ.. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్రా దేవి తన కూతురిని చూడటానికి తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నాగచైతన్య సినిమాతో ఎంట్రీ.. సమంతకు అరుదైన గౌరవం
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో కనిపించింది. అయితే కొత్త ఏడాదిలో ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో రీ ఎంట్రీకి మాత్రం నానా తంటాలు పడుతోంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన సొంత బ్యానర్లోని మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది.అయితే తాజాగా సమంతను ఓ అవార్డ్ వరించింది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రముఖ సంస్థ ఆమెను సత్కరించింది. చెన్నైకి చెందిన ఎంసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు సమంతకు అవార్డ్‌ను అందజేశారు. బిహైండ్‌వుడ్స్ గోల్డ్ అందించే హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌కు ఆమెకు అందించారు. చెన్నైలో జరిగిన వేడుకలో సమంత ఈ అవార్డ్‌ను అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సామ్. అంతేకాకుండా సిటాడెల్ వెబ్ సిరీస్‌కు కూడా మరో అవార్డ్‌ను అందుకుంది ఈ ముద్దగుమ్మ.(ఇది చదవండి: 'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్)కాగా.. సమంత 2010లో అక్కినేని నాగచైతన్య సరసన ఏ మాయ చేసావే అనే సినిమాతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. సామ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సిటాడెల్ హనీ బన్నీ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు, డీకే కూడా హాజరయ్యారు.రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తలుకాగా.. ఇటీవల రాజ్ నిడిమోరుతో డేటింగ్ ఉందంటూ సమంతపై వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో మరోసారి రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి సమంత, రాజ్ నిడిమోరు ఓకే వేదికపై మెరిశారు. దీంతో మరోసారి సమంతపై డేటింగ్ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే సామ్ కానీ.. రాజ్ నిడిమోరు కానీ స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు.

కొత్త బండి కొంటున్నారా.. హ్యాండ్లింగ్ చార్జీలతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాల అమ్మకాలపై రకరకాల చార్జీలు, ఫీజుల రూపంలో వాహనదారులను నిలువునా దోచుకొనే వాహన షోరూమ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు తెలంగాణ రవాణాశాఖ సన్నద్ధమైంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాహనాల అమ్మకాలపైన హ్యాండ్లింగ్ చార్జీలు (handling charges), ఆర్టీఏ చార్జీల పేరిట రూ.5000 నుంచి రూ.10,000 వరకు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. గోడౌన్లలో ఉన్న వాహనాలను షోరూమ్ వరకు తరలించి వినియోగదారుడికి విక్రయించేందుకు హ్యాండ్లింగ్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు.అలాగే వాహనాల రిజిస్ట్రేషన్లపైన సుమారు రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వాహన వినియోగదారులపైన నిలువు దోపిడీకి పాల్పడే ఆటోమొబైల్ డీలర్లపైన కఠిన చర్యలను తీసుకోనున్నట్లు రవాణాశాఖ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అథరైజేషన్‌ను సస్పెండ్ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జీవిత కాలపు పన్ను (life time tax) చెల్లింపుల్లో, వాహనదారుడు రెండవ వాహనం కొనుగోలు చేసే సమయంలో విధించాల్సిన అదనపు జీవిత కాలపు పన్నుపైన కచ్చితమైన నిబంధనలు పాటించవలసిందేనన్నారు.పన్ను చెల్లింపుల్లో కొందరు డీలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వాహనదారులు తాము బండి కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి అదనపు చార్జీల వసూళ్లకు పాల్పడినా రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. షోరూమ్‌లలో హ్యాండ్లింగ్ చార్జీల కోసం డిమాండ్ చేస్తే నేరుగా రవాణా కమిషనర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అలాంటి డీలర్లను, షోరూమ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సమగ్రమైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్‌గౌడ్ స్పష్టం చేశారు.మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన సంస్థపై కేసు బంజారాహిల్స్: ప్రఖ్యాత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నమ్మించి మోసగించిన సంస్థ యజమానితో పాటు ఇద్దరు ఉద్యోగులు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్‌పూర్ నగరానికి చెందిన సురేంద్రకుమార్ చంద్రాకర్ తన కుమారుడు ఆకర్ష్ చంద్రాకర్‌కు ఎంబీబీఎస్ సీటు కోసం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సైబర్ హైట్స్‌లో ఉన్న శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్‌ను సంప్రదించాడు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగి రాకేష్ శైనీ మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ సురేంద్రకుమార్‌ను నమ్మించి గత ఏడాది సెపె్టంబర్ 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నాడు.శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ అధినేత రాఘవేంద్రశర్మతో ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. చత్తీస్ఘడ్ బిలాయ్‌లో ఉన్న శంకరాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని ఈ సంస్థ అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్ శైనీ, గిరీష్ రూపానీలు నమ్మబలికి రూ.10,74,167 డీడీ కూడా తీసుకున్నారు. బిలాయ్‌లోని శంకరాచార్య మెడికల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా కూడా వెల్లడించారు. అయితే సురేంద్రకుమార్ కుమారుడు ఆకర్ష్‌కు నీట్ పరీక్షలో భాగంగా విశాఖపట్టణంలో మెడికల్ సీటు వచ్చింది. దీంతో తాను ఇచ్చిన రూ.10.74 లక్షల డీడీని తిరిగి ఇవ్వాలని సురేంద్రకుమార్ కోరారు. దీంతో ఈ సంస్థ అధినేతతో పాటు మిగతా ఉద్యోగులు స్పందించలేదు.చదవండి: 9999 @ రూ.9.37 లక్షలుతాను ఇచ్చిన డీడీని టోలిచౌకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) నుంచి డ్రా చేసుకున్నారని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శంకరాచార్య మెడికల్ కాలేజీ పేరుతో డూప్లికేట్ అకౌంట్ తెరిచి తాను ఇచ్చిన డీడీని ఈ సంస్థ తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ కార్యాలయం గత ఏడాది అక్టోబర్ 29 నుంచి మూతపడి ఉండగా, దీని అధినేత రాఘవేంద్రశర్మ పరారీలో ఉన్నాడు. ఈ విషయంలో బాధితుడు చత్తీస్‌ఘడ్‌లో కూడా వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్‌తో పాటు శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ, దీని అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్శైనీ, గిరీష్ రూపానీలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద 'డ్రాగన్'.. పది రోజుల్లోనే రికార్డ్‌స్థాయి వసూళ్లు!
మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
CT 2025, IND VS NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
వలస కార్మికుల మృత్యు ఘోష
హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు
'మ్యాడ్ స్క్వేర్' డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే
ఆదిలాబాద్ కా అమితాబ్.. ఎంత పొడుగున్నాడ్రా బాబూ!
మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం: కేటీఆర్
రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. ఎక్కడంటే?
CT 2025, IND VS NZ: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. కోహ్లికి ఫ్యూజులు ఔట్
'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
నాగచైతన్య సినిమాతో ఎంట్రీ.. సమంతకు అరుదైన గౌరవం
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది?
విడాకుల తర్వాత పరిచయం.. పిల్లలు ఎందుకు లేరంటే?: నటి సీత
మారిన పాస్‌పోర్ట్ రూల్స్..
వైట్ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
నా ఏజ్ ... గేజ్ చూడాలి కదా
బాక్సాఫీస్ వద్ద 'డ్రాగన్'.. పది రోజుల్లోనే రికార్డ్‌స్థాయి వసూళ్లు!
మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
CT 2025, IND VS NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
వలస కార్మికుల మృత్యు ఘోష
హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు
'మ్యాడ్ స్క్వేర్' డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే
ఆదిలాబాద్ కా అమితాబ్.. ఎంత పొడుగున్నాడ్రా బాబూ!
మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం: కేటీఆర్
రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. ఎక్కడంటే?
CT 2025, IND VS NZ: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. కోహ్లికి ఫ్యూజులు ఔట్
'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
నాగచైతన్య సినిమాతో ఎంట్రీ.. సమంతకు అరుదైన గౌరవం
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది?
విడాకుల తర్వాత పరిచయం.. పిల్లలు ఎందుకు లేరంటే?: నటి సీత
మారిన పాస్‌పోర్ట్ రూల్స్..
వైట్ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
నా ఏజ్ ... గేజ్ చూడాలి కదా
సినిమా

నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తన పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకుంది.బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది.తండేల్ అసలు కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే 'తండేల్' మూవీని వీక్షించాల్సిందే.Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025

రెండో పెళ్లి.. ఊహిస్తేనే భయంగా ఉంది: పూనమ్ పాండే
పెళ్లి మాట ఎత్తితేనే భయపడుతోంది బోల్డ్ బ్యూటీ, నటి పూనమ్ పాండే (Poonam Pandey). విడాకుల తర్వాత తన జీవితం సంతోషంగా సాగుతోందని, మళ్లీ ఎవర్నైనా నమ్మాలంటే భయంగా ఉందని చెప్తోంది. పూనమ్ పాండే 2020లో ప్రియుడు సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. అతడితో గోవాకు హనీమూన్‌కు కూడా వెళ్లింది. ఆ సమయంలో సామ్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్టు కూడా చేశారు. అదే సమయంలో పూనమ్ కళ్లు, ముఖంపై గాయాలతో ఆస్పత్రిలో చేరింది.రెండేళ్లుగా ఒంటరిగానే..అవన్నీ గుర్తు చేసుకుంటేనే భయపడిపోతోంది పూనమ్ పాండే. రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాను. వైవాహిక జీవితం నాకు కలిసిరాదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడైతే హాయిగా జీవిస్తున్నాను. నాకు అందమైన కుటుంబం, మంచి కెరీర్ ఉంది. ఈ రెండింటితో నేను సంతృప్తిగా ఉన్నాను. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందని. ఎవరేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఎవర్నీ నమ్మలేకున్నాను అని చెప్పుకొచ్చింది.వివాదాలతో సావాసం..గతేడాది గర్భాయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏకంగా తాను చనిపోయినట్లు ప్రచారం చేసుకుంది. ఆ వార్తలు వైరలయ్యాక తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే అలాంటి ప్రాంక్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 2011లో వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద నూలుపోగులేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఇలాంటి సంచలన కామెంట్లు, డ్రామాలతోనే పూనమ్ ఎక్కువ పాపులర్ అయింది.చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా

ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు: విద్యా బాలన్
బాలీవుడ్ విద్యా బాలన్ గతేడాది భూల్ భూలయ్యా-3 మూవీతో అభిమానులను అలరించింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో వచ్చిన ఈ మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే విద్యా బాలన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆన్లైన్లో పెద్దఎత్తున తనకు సంబంధించిన వీడియోలపై ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అవన్నీ ఫేక్ అనీ.. కేవలం ఏఐ సాయంతో రూపొందించారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తప్పుదారి పట్టించేలా ఉన్న వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా అని తెలిపింది.విద్యాబాలన్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'నేను మీకు ఇష్టమైన విద్యాబాలన్. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్‌లో అనేక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాకుండా అవీ నన్ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆ వీడియోలు ఏఐ సాయంతో రూపొందించినవి. అవన్నీ ఫేక్ అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. వాటిని క్రియేట్ చేయడం, వ్యాప్తి చేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి కంటెంట్‌ను నేను ఏ విధంగానూ ఆమోదించను. వీడియోలలో చేసిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటివీ నా అభిప్రాయాలు, నా పనిని ప్రభావితం చేయలేవు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేముందు ధృవీకరించుకోండి. ఎందుకంటే ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇలాంటివాటితో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.' అని రాసుకొచ్చింది. కాగా.. గతంలో విద్యాబాలన్ కంటేముందే రష్మిక మందన్న, దీపికా పదుకొణె, అలియా భట్, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ సైతం డీప్‌ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya)

టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలు.. మళ్లీ రిపీట్..
చిత్ర పరిశ్రమలో హిట్ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్ జోడీ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్‌లో ఫుల్ క్రేజ్‌తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్ జోడీని రిపీట్ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...పద్దెనిమిదేళ్ల తర్వాత..హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్. కానీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. తాజాగా పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టారట. రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మాస్ జాతర రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్ జాతర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘మాస్ జాతర’ సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నాలుగోసారి...నటుడు శివాజీ, నటి లయది హిట్ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్ శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. బ్యాక్ టు బ్యాక్హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్–శ్రీలీల జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్‌హుడ్’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ నటించారు. 2023 జూన్ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్.ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి. మరికొన్ని జోడీలు‘సీతా రామం’ సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రెండోసారి నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్ జోడీ కూడా రిపీట్ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్. మరి ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. మరికొన్ని జోడీలు కూడా రిపీట్ కానున్నాయని సమాచారం. – డేరంగుల జగన్ మోహన్ చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

Champions Trophy 2025: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లైవ్ అప్డేట్స్
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్జడేజా బౌలింగ్‌లో బౌండరీతో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్‌కు వన్డేల్లో ఇది 47వ హాఫ్ సెంచరీ. కేన్ తన హాఫ్ సెంచరీలో 5 బౌండరీలు బాదాడు. మ్యాజిక్ చేసిన కుల్దీప్.. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్93 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ డెలివరీతో డారిల్ మిచెల్‌ను (17) ఎల్బీడబ్ల్యూ చేశాడు. 26 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 104/3గా ఉంది. కేన్ విలియమ్సన్ 45, టామ్ లాథమ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాంటే ఇంకా 146 పరుగులు చేయాలి. విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తి49 పరుగుల వద్ద (13.3 ఓవర్లు) న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో విల్ యంగ్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేన్ విలియమ్సన్కు (19) జతగా డారిల్ మిచెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్250 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ పట్టడంతో రచిన్ రవీంద్ర (6) ఔటయ్యాడు. విల్ యంగ్‌కు (10) జతగా కేన్ విలియమ్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు.రాణించిన శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు.ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో మెరిశాడు. జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (కోహ్లి), కేన్ విలియమ్సన్ (జడేజా) పట్టిన క్యాచ్‌లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్246 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (45) ఔటయ్యాడు. చివరి ఓవర్లో హార్దిక్ సింగిల్స్ తీయకుండా ఓవరాక్షన్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా223 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్182 పరుగుల వద్ద (39.1 ఓవర్లు) భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు (3) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్172 పరుగుల వద్ద (36.2 ఓవర్లు) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 98 బంతుల్లో 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు (17) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్128 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కుదురుకున్న అక్షర్ పటేల్ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో అక్షర్ ఔటయ్యాడు. కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అక్షర్‌ను పెవిలియన్‌కు పంపాడు. శ్రేయస్‌కు (51) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన శ్రేయస్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 75 బంతుల్లో 4 బౌండరీల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇది అత్యంత నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీ. 29 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 127/3గా ఉంది. శ్రేయస్ 51, అక్షర్ పటేల్ 42 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (మార్చి 2) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17) మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ (2) ఈ టోర్నీలో తొలిసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్ కోహ్లి 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.కష్టాల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (35 నాటౌట్), అక్షర్ పటేల్ (23 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే 60 పరుగులు జోడించారు. 23 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులుగా ఉంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, జేమీసన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే

IND Vs NZ: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Updates:పీకల్లోతు కష్టాల్లో టీమిండియాటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్మూడో వికెట్‌గా వెనుదిరిగిన విరాట్‌కోహ్లి(11) ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేనాటికి భారత్ స్కోర్ 44-3తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్‌టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(2) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మాట్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 15/1. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది.యువ పేసర్ హర్షిత్ రాణాకు మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ కూడా ఓ మార్పుతో ఆడుతోంది. డెవాన్ కాన్వే స్ధానంలో డార్లీ మిచెల్ జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి ఇది 300వ వన్డే కావడం విశేషం.తుది జట్లుభారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కేచదవండి: 'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్

'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 29 ఏళ్ల తర్వాత తమ దేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్ జట్టు.. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.దీంతో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు టీమిండియా మాత్రం వరుస విజయాలతో తమ సెమీస్ బెర్త్‌ను బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడుతోంది.భద్రత కారణాల రీత్యా తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ ఈ ఈవెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా అన్ని క్రికెట్ బోర్డులు ఏకం కావాలని ఇంజమామ్ విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ విషయం పక్కన పెట్టండి. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ ఐపీఎల్లో పాల్గోంటారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఇతర ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గోనరు. అందుకు వారి క్రికెట్ బోర్డు అంగీకరించదు. కాబట్టి ఇతర క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడేందుకు ఎన్వోసీ జారీ చేయకూడదు. ఈ విషయంపై అన్ని క్రికెట్ బోర్డులు ఒకే తాటిపై రావాలని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ పేర్కొన్నాడు.అయితే ఒక్క పాకిస్తాన్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరికి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్థాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. ఐపీఎల్ మొదటి ఎడిషన్(2008) లో చాలా మంది పాక్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడారు.అయితే ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిషేధించారు. కాగా బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో ఆడేందకు అనుమతించదు. ఒక ఇండియన్ క్రికెటర్ ఓవర్సీస్ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాలంటే ఐపీఎల్‌తో సహా భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలి.చదవండి: CT 2025 IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ?

మహ్మద్ రిజ్వాన్‌కు భారీ షాక్.. పాక్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్!?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. చెత్త ఆటతీరుతో టోర్నీ లీగ్ స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. 29 ఏళ్ల తమ సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ కనీస పోటీ ఇవ్వలేకపోవడాన్ని ఆ దేశ మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ జట్టుపై ఇంటా బయట విమర్శల వర్షం కురుస్తునే ఉంది.న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. భారత్‌పై 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో కనీసం ఒక్క విజయం కూడా లేకుండా పాకిస్తాన్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రిజ్వాన్‌పై వేటు..!పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న మహ్మద్ రిజ్వాన్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వన్డేల్లో కాకుండా పాక్ టీ20 కెప్టెన్‌గా రిజ్వాన్ తప్పించాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిజ్వాన్ స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను నియమించాలని మొహ్సిన్ నఖ్వీ ఫిక్స్ అయినట్లు సమాచారం.త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ జట్టు ఈ నెలలో వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పాక్ జట్టు ఆతిథ్య కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. మార్చి 16న క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో పాక్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే పాక్ టీ20 కెప్టెన్‌గా షాదాబ్ తన ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశముంది. షాదాబ్ ఖాన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా పాక్ తరపున గతేడాది జూన్‌లో ఐర్లాండ్‌పై ఆడాడు. కానీ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో షాదాబ్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలను అప్పగించాలని పీసీబీ భావిస్తోంది. మరోవైపు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావిద్‌పై కూడా వేటు వేసేందుకు పీసీబీ సిద్దమైంది.చదవండి: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ?
బిజినెస్

ఎక్కువమంది ఆ బ్రాండ్ కార్లనే కొనేస్తున్నారు
ముంబై: వాహన కంపెనీల విక్రయాలు ఎగుమతులతో కలుపుకుని ఫిబ్రవరిలో ఆశాజనకంగా నమోదయ్యాయి. ప్యాసింజర్స్ వెహికిల్స్ తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. డిమాండ్ స్తబ్ధుగా ఉండడంతో హ్యుందాయ్, టాటా మోటార్స్ వాహన అమ్మకాలు నెమ్మదించాయి. ఎస్‌యూవీలు, ఎంపీవీ మోడళ్లకు గిరాకీ లభించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన విక్రయాలు గత నెలలో రెండంకెల వృద్ధి సాధించాయి.మారుతీ సుజుకీ దేశీయంగా గత నెలలో 1,60,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,60,271 యూనిట్లు. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 14,782 నుంచి 10,226 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 71,627 నుంచి 72,942 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 61,234 నుంచి 65,033 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఫిబ్రవరిలో కంపెనీ 1,99,400 యూనిట్ల వాహనాలు విక్రయించింది.➤హ్యుండై మోటార్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 3% క్షీణించి 58,727 యూనిట్లకు వచ్చి చేరాయి. దేశీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్ 2025లో ప్రతిపాదిత పన్ను సంస్కరణలు, మెరుగైన ద్రవ్య లభ్యత మార్కెట్‌కు అవసరమైన డిమాండ్‌ను అందిస్తాయని ఆశావాదంగా ఉన్నాం’ అని కంపెనీ సీఈవో తరుణ్ గర్గ్ అన్నారు.➤టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 8% తగ్గి 77,232 యూనిట్లకు పరిమితమయ్యాయి.➤ఎస్‌యూవీలకు డిమాండ్ లభించడంతో ఎంఅండ్ఎం మొత్తం అమ్మకాల్లో 15% వృద్ధి నమోదై 83,072 యూనిట్లకు చేరుకున్నాయి.

'ప్రైవేట్ టెల్కో నెట్వర్క్ అవసరం లేదు'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టెలికం నెట్వర్క్ కవరేజీ ఉన్న నేపథ్యంలో కంపెనీలు సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం దాదాపుగా లేదని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ వ్యాఖ్యానించారు.ప్రజలకు టెలికం కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉన్న చోట్ల లేదా అస్సలు లేని కనెక్టివిటీనే లేని భౌగోళిక ప్రాంతాల్లో, చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటివి కావాలి తప్ప భారత్‌లో అనవసరమని తెలిపారు. కంపెనీలు తమ ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలైన అవసరాల కోసం, నేరుగా టెలికం శాఖ నుంచి స్పెక్ట్రంను తీసుకుని, సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కొచ్చర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి బదులుగా పారిశ్రామిక వృద్ధికి దోహదపడే టెలికం మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ భారత్ నిధికి మరింతగా నిధులను సమకూర్చగలిగితే ఇంకా కనెక్టివిటీ అంతగా లేని ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కొచ్చర్ పేర్కొన్నారు.

మైక్రొసాఫ్ట్ కీలక నిర్ణయం: త్వరలో ఆ యాప్ షట్‌డౌన్!
ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్కైప్' (Skype)ను శాశ్వతంగా మూసివేయాలని, టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' యోచిస్తోంది. మే నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని.. కంపెనీ వెల్లడించింది.2003లో ప్రారంభమైన స్కైప్‌ను.. మైక్రోసాఫ్ట్ 2011లో 8.5 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ. 74వేలకోట్లు) కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇందులో అనేక అప్డేట్స్ తీసుకొచ్చింది. విండోస్ లైవ్ మెసెంజర్ తొలగింపు తరువాత.. 2015లో మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. ఇది మొత్తం తొమ్మిది నెలలు కొనసాగింది. అయితే ఇప్పుడు 22 ఏళ్ల స్కైప్ ప్రయాణానికి మంగళం పాడనుంది.మైక్రోసాఫ్ట్.. స్కైప్‌ను అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా పాటుపడింది. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీకి చెందిన 'ఐమెసేజ్'తో పోటీ పడటానికి సిద్ధమైంది. అయినా ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రారంభించింది. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా స్కైప్ అభివృద్ధి చెందలేదు. దీంతో చేసేదేమీ లేక.. కంపెనీ పూర్తిగా స్కైప్‌ను నిలిపివేయడానికి ఫిక్స్ అయింది. సంస్థ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా యూజర్లకు వెల్లడించనుంది.

రోజుకో రేటు వద్ద బంగారం: కారణాలివే..
బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజుకో రేటు.. ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకరోజు భారీగా పెరిగితే.. ఇంకోరోజు తగ్గిపోతాయి. ఎందుకిలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?.. ధరలు పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. ఆ కారణాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.అంతర్జాతీయ ధరలుబంగారం ధరలు ప్రపంచ మార్కెట్ ధోరణులపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ ధరలలో జరిగే ఏవైనా మార్పులు.. దేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ప్రపంచ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.దిగుమతి సుంకం & ప్రభుత్వ విధానాలుభారతదేశం భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి సుంకాలు, పన్ను విధానాలు భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచితే, బంగారం ధరలు పెరుగుతాయి. బంగారు నిల్వకు సంబంధించిన విధానాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.దేశీయ మార్కెట్లో డిమాండ్ & సరఫరాభారతదేశంలో బంగారం డిమాండ్ పండుగలు.. వివాహ సీజన్లలో గరిష్టంగా ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు, ధరలు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గవచ్చు. సరఫరా కూడా ఒక పాత్ర పోషిస్తుంది. కొరత ఉన్నప్పుడు కూడా బంగారం ధర ఎక్కువగా ఉండవచ్చు.రూపాయి vs యూఎస్ డాలర్ మారకం రేటుప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం.. అమెరికా డాలర్లతోనే జరుగుతుంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడితే, బంగారం ధర పెరుగుతుంది. అయితే రూపాయి బలపడితే.. బంగారం ధర తగ్గుతుంది. వడ్డీ రేట్లు & ద్రవ్యోల్బణం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.ప్రపంచ ఆర్థిక, రాజకీయ సంఘటనలుఆర్ధిక మాంద్యం, మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ అనిశ్చితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, పెట్టుబడిదారులు బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయి.ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ
ఫ్యామిలీ

అ‘టెన్’షన్ ప్లీజ్...కేర్ తీసుకోండి
ఆమె ఆరోగ్యమే ప్రపంచ భాగ్యంమహిళల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలపై అవగాహనపెరుగుతోంది. మహిళా దినోత్సవాలలో ‘మహిళల ఆరోగ్యం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఇరవైలలో...మున్ముందు ఆరోగ్యాల కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకేందుకు తగిన వ్యాయామాలు చేయాలి. పాల వంటి క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకుంటూ మున్ముందు ఆస్టియోపోరోసిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి → శబ్దకాలుష్యం నుంచి మీ చెవులను కాపాడుకోండి. ఎక్కువ శబ్దంతో వినకుండా మీరు రేడియో, టీవీ, మొబైల్... ఏది వింటున్నా వాల్యూమ్ తగ్గించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి → రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంటుంటే డాక్టర్లను సంప్రదించి, తగిన చికిత్స తీసుకుని దాన్ని క్రమబద్ధం చేసుకోండి → ఆటల్లో, వ్యాయామాల్లో గాయాలు కాకుండా చూసుకోండి. ఇవ్వాళ్టి గాయాలు భవిష్యత్తులో గండాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడండి → మనం ఏమి తింటున్నామనే విషయంపై దృష్టి సారించండి. ఇవ్వాళ్టి మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే... భవిష్యత్తులో మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులని గుర్తుంచుకోండి → వయసు పెరిగేకొద్దీ నిద్ర తగ్గే అవకాశముంది కాబట్టి వీలైనంత వరకు కనీసం తొమ్మిది గంటలపాటు కంటినిండా నిద్రపొండి. ముప్ఫైలలో...ఈ వయసులో కనిపించే కొద్దిపాటి మార్పులపై దృష్టిసారించండి. → మీ బరువును గమనించండి. మీరు బరువు పెరుగుతున్నారంటే జీవక్రియలు మందగించాయని అర్థం. మొదట్లో కొద్దిగానే పెరిగినట్లు కనిపిస్తున్నా జీవక్రియలు చురుగ్గా జరిగేలా చూస్తూ వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించండి. → చర్మాన్ని రక్షించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. కనీసం 15 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండటం చాలా అవసరం. అది క్యాన్సర్‌తో సహా పలు చర్మ సమస్యలను కాపాడుతుంది → ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండండి. ఒత్తిడి వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు కలుగుతాయి → ఈ వయసులోనే క్రమం తప్పకుండా అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలూ, మెడికల్ చెక్అప్స్ ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది → ప్రెగ్నెన్సీతో వచ్చే ముప్పులను గుర్తుంచుకోండి. ఎందుకంటే... 35 ఏళ్లు దాటాక వచ్చే ప్రెగ్నెన్సీలతో బిడ్డకు ఎన్నో రకాలుగా ముప్పు వచ్చే అవకాశాలుంటాయి. ఈ వయసులో గర్భధారణ కోసం ప్రయత్నిస్తుంటే తప్పనిసరిగా ఆబ్స్టేట్రీషియన్ను సంప్రదించండి. నలభైలలో...వయసు తాలూకు సంధి దశ అయిన ఈ ఈడులో కనిపించే మార్పులకు సిద్ధంకండి.→ మెనోపాజ్‌కు ముందుగా కనిపించే ‘పెరీ–మెనోపాజ్’ మార్పులను గమనిస్తూ ఉండండి. ఈస్ట్రోజెన్ మోతాదులు తగ్గడం వల్ల ఒంట్లోంచి వేడి ఆవిర్ల మాదిరిగా వస్తున్నాయా, నిద్ర పట్టడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయా, త్వరగా చిరాకుపడటం వంటి మార్పులు కనిపిస్తుంటే పాప్ స్మియర్ పరీక్షతోపాటు పెల్విస్ పరీక్షలు చేయించుకోండి → రొమ్ముక్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్ష మామోగ్రామ్ కూడా చేయించుకోండి → తీసుకుంటున్న ఆహారంపై దృష్టి నిలపండి. మీ జీవక్రియల వేగానికి తగినట్లుగా ఆహారం అందేలా... కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటున్నారా అన్న విషయాన్ని గమనించుకోండి ∙కంటి పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే చాలారకాల కంటి సమస్యలు ఈ వయసులోనే బయటపడతాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ 40లలోనే కళ్లజోడు ధరించాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించండి → మీ కుటుంబంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు ఉన్నట్లయితే కొలనోస్కోపీకి ΄్లాన్ చేసుకోండి. ఎందుకంటే కుటుంబ ఆరోగ్య చరిత్రలో జీర్ణ సంబంధమైన సమస్యలున్నవారి లో ఎంత త్వరగా సమస్యను కనుగొంటే అంత ఎక్కువ ప్రయోజనమని తెలుసుకోండి → రక్తంలో చక్కెర మోతాదులెలా ఉన్నాయో చూసుకోండి. చాలావరకు 40 ల లోనే టైప్–2 డయాబెటిస్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇది చాలామందిలో ఎలాంటి లక్షణాలూ లేకుండానే వచ్చేందుకు అవకాశమున్నందున ఒకసారి మీ డాక్టర్‌తో పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు.యాభైలలో...మీ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మెనోపాజ్ కోసం సిద్ధం కండి. 51 అన్నది చాలామందికి మెనోపాజ్ వచ్చే సగటు వయసు ∙చురుగ్గా ఉండండి. చురుకుదనం తగ్గిపోయే ఈ వయసులో చురుకుదనాన్ని పెంచుకోవడం వల్ల మున్ముందు చాలాకాలం పాటు మరింత ఆరోగ్యంగా ఉండగలరు → ఒకసారి మొత్తం దేహానికి సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకోండి. వీలైతే మీ యాభైలనుంచి ప్రతి రెండేళ్లకోమారు అన్ని బేసిక్ హెల్త్ పరీక్షలూ చేయించుకుంటూ ఉండటం మంచిది. → ఒకసారి ఈసీజీ తీయించుకోండి. సాధారణంగా గుండెజబ్బులు కనిపించేది ఈ వయసులోనే కాబట్టి ఒకసారి ఆ పరీక్ష చేయించుకుని, మీకు ఎలాంటి గుండెజబ్బులూ లేవని నిర్ధారణ చేసుకుని ఆనందంగా ఉండండి.అరవైలలో...ఈ వయసు... ఆరోగ్యానికి సంబంధించిన మరో దశకు మొదటి మెట్టు.→ ఆహారంలో మరింత పీచు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వయసులో ఆహారంలో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల పెద్దపేగుల్లో కండపెరగడం, ఇతరత్రా పెద్దపేగు సమస్యలను రాకుండా నివారించవచ్చు → నడక వంటి వ్యాయామాలు చేయండి. ఈ వయసులో చేసే వ్యాయామాలన్నీ దేహానికి మరింత ఎక్కువ శ్రమ కలిగించనివీ, మరీ తీవ్రమైనవి కాకుండా ఉండేవి అవసరం. వారంలో కనీసం 150 నిమిషాల పాటు దేహానికి మంచి కదలికలు ఉండే వ్యాయామం దొరికేలా చూసుకోండి. దీనివల్ల మీలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కనీసం 15 శాతం తగ్గుతాయి → ఈ వయసులో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ, మామోగ్రామ్ పరీక్షలూ చేయించుకోండి. బరువు పెరగకుండా చూసుకోండి. పెరుగుతున్న బరువు క్యాన్సర్‌తో సహా అనేక అనారోగ్యాలకు హేతువని గుర్తుంచుకోండి → పెద్ద వయసులో తీసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఫ్లూ, నిమోనియా వంటివి. → పెద్దవయసులో తీసుకోవల్సిన వ్యాక్సినేషన్ల గురించి తెలుసుకుని, వాటిని తీసుకోవడం వల్ల ఆ వయసులో అవి సోకకుండా జాగ్రత్త తీసుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే మంచి వయసులో ఉన్నప్పుడు వాటిని తట్టుకునేంత సామర్థ్యం వయసు పైబడ్డాక ఉండకపోవచ్చు.డెబ్భైలలో...వయసు పెరగడాన్ని గమనించుకుంటూ... ఆ ఈడుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోండి.→ ఈ వయసులో బాధలను దరిజేరనివ్వకండి. సంతోషంగా గడపడానికి ప్రాధాన్యమివ్వండి. మోకాళ్లు అరగడం వంటివి ఈ వయసులో సాధారణంగా కనిపించే సమస్యలు. మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్స్ వంటివి ఈ వయసులోనే చేయించుకోండి. మరింత వయసు పెరిగితే అంతగా సాధ్యం కాకపోవచ్చు → ఈ వయసులో కళ్ల సమస్యలు మామూలే. సాధారణంగా క్యాటరాక్ట్ వంటివి ఈ వయసులో కళ్లకు వచ్చే సమస్యలు. వీలైనంత త్వరగా కాటారాక్ట్ సర్జరీ చేయించుకుని సుదీర్ఘకాలం పాటు మీ కళ్లతో ప్రపంచాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేయండి.డాక్టర్ కె. ఉషారాణిసీనియర్ ఫిజీషియన్ ఇలా ప్రతి పదేళ్ల కాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, పది పదుల ఏళ్ల పాటు పదిలంగా ఉండండి.

అనంత్-రాధిక అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : మికా సింగ్ వ్యాఖ్యలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ,నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహం అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ప్రపంచంలోనే అతిఖరీదైన వివాహంగా పేరు గాంచింది. దీనిపై ప్రముఖ గాయకుడు మికా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఈ కార్పొరేట్ వెడ్డింగ్‌పై మికాసింగ్ (Mika Singh) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక చాలా మందికి ఒక ఆశీర్వాదకరమని వ్యాఖ్యానించారు. అనంత్, రాధికా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ పై విమర్శలను మికా సింగ్ ప్రస్తావించారు. వారిపెళ్లిపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు తాను ఎందుకు భావిస్తున్నానో కూడా వివరించాడు. ఆ ఒక్క పెళ్లి వల్ల లక్షల మందికి ఉపాధిలభించిందని, అందుకే అది బ్లెస్సింగ్ అన్నానని చెప్పుకొచ్చాడు. అంతమాత్రాన తానేమీ చెంచిగిరీ చేయడం లేదంటూ వివరణ ఇచ్చాడు. ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్స్ అనేక ఉపాధి అవకాశాలను అందిస్తాయనేది జనం అర్థం చేసుకోలేకపోతున్నారని మికా సింగ్ వ్యాఖ్యానించాడు. క్యాటరర్లు, డెకరేటర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంగీతకారులు, భద్రతా సిబ్బంది, మళ్లీ వీరినుంచిమరికొంతమందికి లాభం చేకూరుతుందన్నాడు. అంతేకాకుండా, అనేక మంది కళాకారులు, సెలబ్రిటీలు తమ తమ ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందుతారంటూ ఉదాహరణలతో చెప్పుకొచ్చాడు. తద్వారా అంబానీ కుటుంబం ఆడంబర వివాహంతో డబ్బు వృధా చేసిందన్న వ్యక్తులకు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇటువంటి గ్రాండ్ వెడ్డింగ్స్ వాటి నుండి సంపాదించే చాలా మందికి ఒక వరం అని పేర్కొన్నాడు.భారతదేశంలో అత్యంత ప్రియమైన గాయకులలో మికా సింగ్ ఒకరు. ఆయన తన ప్రత్యేకమైన స్వరం, ఆకట్టుకునే శైలితో అనేక మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. సుబా హోనే నా దే, ఆంఖ్ మారే, మౌజా హి మౌజా, పార్టీ తో బన్తీ హై లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలతో పాపులరయ్యాడు. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల గ్రాండ్ వివాహ వేడుకలో ప్రదర్శనకు ఆహ్వానించారు.కాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహంగత ఏడాది జూలైలో ముంబై నగరంలో జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. 2024లో జరిగిన అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. రెండు డెస్టినేషన్ ప్రీ-వెడ్డింగ్, ముంబైలో ఆరు రోజుల గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల ప్రముఖులతో పాటు, దేశీయంగా అనేక మంది వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.

జీనియస్ : 14 ఏళ్ల మానవ కాలిక్యులేటర్
పందొమ్మిదో ఎక్కం చెప్పమంటే తల గీరుకునే పిల్లలు ఉంటారు. చిన్న చిన్న కూడికలకు కాలిక్యులేటర్ వైపు చూసే వారూ ఉంటారు. ఇక పెద్ద లెక్కలంటే కాలిక్యులేటర్ కావాల్సిందే. కాని ఆర్యన్ నితిన్‌కు అది అక్కర్లేదు. ఎందుకంటే అతడే ఒక కాలిక్యులేటర్. అతని వయసు 14 ఏళ్లు. ఎంత పెద్ద నెంబర్లతో లెక్కలు ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తాడు.ఆర్యన్ ది మహారాష్ట్ర. ఆరేళ్ల వయసు నుంచే మనసులో లెక్కలు వేయడం, సమాధానాలు కనుక్కోవడం చేసేవాడు. అతని ఉత్సాహం చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆర్యన్ రోజూ ఐదారు గంటల΄ాటు కష్టమైన లెక్కలు సాధన చేసేవాడు. ఎవరు ఎంత పెద్ద లెక్క చెప్పినా మనసులోనే చేసి, టక్కున సమాధానం చెప్పేవాడు. దీంతో అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. 2021లో ‘మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్ మెంటల్ కాలిక్యులేషన్’ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించి, ఆ ఘనత పొందిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. 2022లో జర్మనీలో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో పాల్గొని మొదటిస్థానంలో నిలిచాడు. అంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. దీంతో గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్(జీఎంసీఏ)లో అతణ్ని ఫౌండింగ్ బోర్డు సభ్యుడిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రపంచ వేదికలపై తన సత్తా చాటాడు. 14 saal ke Aryan Shukla ne sirf 1 din mein banaye 6 Guinness World Record.Bharat ke Aryan Shukla ne apni kamaal ki pratibha dikhate hue ek hi din mein 6 Guinness World Record tod diye! Itni kam umar mein itni badi uplabdhi desh ke liye garv ki baat hai. Unki safalta naye yuvaon… pic.twitter.com/pA8dnoGj1O— Kashmir Watcher (@KashmirWatcher) February 19, 2025 గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాలన్న ఆకాంక్షతో దుబాయ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒకటి, రెండు కాదు.. ఒకేరోజు ఆరు ప్రపంచ రికార్డులను అతను సాధించాడు. 30.9 సెకండ్లలో 100 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, ఒక నిమిషం 9.68 సెకండ్లలో 200 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, 18.71 సెకండ్లలో 50 ఐదు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం.. ఇలా అతను చేసిన మేధోవిన్యాసాలు చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2024లో మరోసారి మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో మొదటిస్థానంలో నిలిచాడు. క్రమం తప్పకుండా రోజూ సాధన చేస్తే ఎలాంటి కష్టమైన విషయమైనా మన సాధించగలమని, మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వదలకూడదని అంటున్నాడు ఆర్యన్.

పెళ్లి, మంచి ఉద్యోగం, 4 సార్లు ఓటమి : ఐఏఎస్ కాజల్ సక్సెస్ స్టోరీ
గొప్ప గొప్ప కలలు అందరూ కంటారు. కానీ సాధించాలన్న ఆశయం ఉన్నవారు, లక్ష్యంతో పని చేసిన వాళ్లు మాత్రమే తమ కలల్ని సాకారం చేసుకుంటారు. క్రమశిక్షణ, కఠోరశ్రమ సవాళ్లను స్వీకరించే లక్షణం, ఫోకస్, డెడికేషన్ ఉన్నవారే లక్ష్య సాధనలో సఫలీ కృతులౌతారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కాజల్ జావ్లా (Kajal Jawla). పెళ్లి, ఉద్యోగ బాధ్యతలను మోస్తూనే సివిల్స్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలిచారు. స్ఫూర్తిదాకమకమైన కాజల్ జావ్లా సక్సెస్ గురించి తెలుసుకుందామా!కాజల్ జావ్లా ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 2010లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE) పట్టా అందుకుంది. ఆ తరువాత ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో ఉద్యోగం. రూ.23 లక్షల వార్షిక ప్యాకేజీ. ప్రేమించే భర్త. అందమైన కుటుంబం. కానీ ఐఏఎస్ కావాలన్న కల మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే భర్తతో మాట్లాడి, ఆయన మద్దతుతో ఐఏఎస్ కావాలనే తన సంకల్ప సాధనకు నడుం బిగించింది. ఫుల్‌టైమ్ జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయింది. కార్పొరేట్ ఉద్యోగం నుండి బయటపడి తన సహోద్యోగులు అంతా చిల్ అవుతోంటే కాజల్ మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేది. అలా తొమ్మిదేళ్ల పాటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగింది.దేశంలోని అత్యంత గౌరవనీయమైన సివిల్ సర్వెంట్ల ర్యాంకులకు ఎదగాలనే అచంచలమైన సంకల్పంతో పగలూ రాత్రి కష్టపడింది. కానీ అనుకున్నది సాధించేందుకు నాలుగు సార్లు నిరాశను, ఓటమిని భరించాల్సి వచ్చింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయింది. అయినా పట్టుదల వదలకుండా ఓర్పు, దృఢ సంకల్పంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కు సిద్ధమైంది. ఐదోసారి UPSC 2018 పరీక్షలో 28వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడంతో ఆమె కలలు నిజమయ్యాయి.భర్త మద్దతు2012లో 24 సంవత్సరాల వయసులో ఆమె UPSC సన్నాహాలు మొదలు పెట్టింది. ఆమె మొదటి ప్రయత్నం సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు, 2014 ,2016లోనూ అదే రిజల్ట్. ఈ కాలంలో, కాజల్ ఉద్యోగాలు మారడం వివాహం జరిగింది. భర్త ఆశిష్మాలిక్తో తన దీర్ఘకాలిక ఆశయాన్ని వెల్లడించింది. ఆయనిచ్చి సపోర్ట్‌తో గత వైఫల్యాల గురించి ఆలోచించ కుండా, చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది.ఈ ప్రయాణంలో కాజల్ జావ్లాకు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో పనిచేసే భర్త ఆశిష్ మాలిక్ సంపూర్ద మద్దతునిచ్చాడు. ఇంటిపనుల ఉంచి మినహాయింపు నిచ్చి, భర్త తన ప్రిపరేషన్‌కు తగిన సమయం కల్పించారని స్వయంగా కాజల్ ఒక సందర్భంగా తెలిపింది. అంతేకాదు ‘ఢిల్లీలో ఒక చిన్న ఇంట్లో ఉండవాళ్లం కాబట్టి. ఇంటి పనులు తక్కువగా ఉండేవి. ఎక్కువ వంట హడావిడి లేకుండా, ఫ్యాన్సీ భోజనాలకు సాధారణ కిచిడీ లేదా సలాడ్లతో పరిపెట్టు కునే వాళ్లం. తద్వారా ఎక్కువ టైమ్ ప్రిపరేషన్‌కు దొరికేది. ఇంటిని అద్దంలా ఉంచుకోవడం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. పెళ్ళయ్యాక కూడా బ్యాచిలర్స్‌గా బతికాం’ అని చెప్పింది. ఎక్కువ సెలవులు కూడాతీసుకోకుండా, వార్షిక సెలవులను వాడుకుంది. ప్రిలిమ్స్‌కు ఒక వారం ముందు సెలవు 'మెయిన్స్' కోసం 45 రోజుల, పెర్సనల్ టెస్ట్‌కి వారం రోజులు మాత్రమే సెలవు తీసుకుంది. ప్రారంభంలో తన వైఫల్యాలకు కారణం సమయం లేకపోవడమేనని కాజల్ చెప్పింది. ‘సమయం చాలా కీలకం. ప్రిపరేషన్‌కు సరిపడా సమయం లేకపోవడం సవాల్ లాంటిది. నా తొలి వైఫల్యానికి కారణం టైమ్ లేక పోవడమే.’ అంటూ తన అనుభవం గురించి చెప్పింది. ఓటమికి తలవంచకుండా, వైఫల్యానికి గల కారణాలను సమీక్షించుంటూ అచంలచమైన పట్టుదలతో తాను అనుకున్నది సాధించిన కాజల్ తనలాంటి వారెందరికో ప్రేరణగా నిలిచింది.
ఫొటోలు
National View all

మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్ నిర్

రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. ఎక్కడంటే?
రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల

9,000 హార్స్పవర్ రైలు ఇంజిన్ సిద్ధం.. ఎంత మాల్ లాగుతుందంటే..
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే(

కలసివెళ్లి.. కానరాని లోకాలకు
మైసూరు: ఐదుమంది భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు.
NRI View all

వలస కార్మికుల మృత్యు ఘోష
మోర్తాడ్ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శ

అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవ
International View all

వైట్ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (

Vivek Ramaswamy: పాదరక్షలు లేకుండా ఇంటర్వ్యూ.. ట్రోలింగ్ బారిన వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(

Zelensky: నా దారి రహదారి.. ఎక్కడా తగ్గేదేలే..!
వాషింగ్టన్: అమెరికా(USA) అధ్యక్షుడితో భేటీ

ట్రంప్ Vs జెలెన్స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్
ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడగాడట. ఉక్రెయిన్, రష్యా యుద్ధం..

ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి
బొలివియా: బొలివియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంద
క్రైమ్

అమ్మను అనాథను చేశాడు!
మన్సూరాబాద్(హైదరాబాద్): రోజు రోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు ఆమెను రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కాలనీవాసులు అక్కున చేర్చుకుని అన్న పానీయాలు అందించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ (80)కి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వీరిలో ఇద్దరు పెద్ద కుమారులు గతంలోనే చనిపోయారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ నాయక్ వద్ద ధర్మీ ఉంటోంది. లక్ష్మణ్‌నాయక్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఎల్బీనగర్లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం లక్ష్మణ్‌నాయక్ తన తల్లి ధరీ్మని మన్సూరాబాద్‌లోని చిత్రసీమ కాలనీలోని లిటిల్ చాంప్ స్కూల్ వద్ద తన ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ధర్మీ కాలనీలోని రోడ్ నంబర్–4లో ఓ మూలన కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన రిటైర్డ్ అధికారి బొప్పిడి కరుణాకర్‌రెడ్డి, సైదులు గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచారు. తన కుమారుడు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పింది. దీంతో ఆమెకు ఆశ్రయం కల్పించి ఈ సమాచారాన్ని 108తో పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో కాలనీ వాసులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఆలేటి వృద్థాశ్రమానికి ధరీ్మని తరలించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని కాలనీ వాసులు కోరారు.

మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆశ చూపించాడు. టీడీపీ నేతల మాటలు నమ్మిన నిరుద్యోగులు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసంఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం టీడీపీ నేతల బాధితులు ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి.

మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..
మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ శివపురి(Shivpuri District) జిల్లాలో జరిగిన పాశవికమైన ఘటన వివరాల్లోకి వెళ్తే..ఆ చిన్నారి ఓ యువకుడు జరిపిన లైంగికదాడి(Sexual Assault)లో తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే.. ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి, ఒంటి నిండా పంటి గుర్తులు పడ్డాయి. పెద్ద పేగు చిధ్రమైంది. ఆఖరికి ప్రైవేటు భాగం రెండుగా చీల్చేసి ఉంది. కనీసం మంచంపై పక్కకు కూడా తిరగలేని స్థితిలో.. కొన ఊపిరితో ఉందా చిన్నారి. ఫిబ్రవరి 22వ తేదీన దినార(Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి.. హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే.. పక్కింటి భయ్యా చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. కాసేపటికి ఆ కాలనీకి పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై.. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్ కమలారాజ్ ఆస్పత్రిలో చేర్పించారు.అత్యంత దారుణంగా..ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు గంటలపాటు అత్యవసర సర్జరీలు చేశారు వైద్యులు. గాయాలకు చికిత్సతో పాటు చిధ్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు వేశారు. అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మైనర్‌గా చూపించి..ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినటట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. అతని వయసు 17 ఏళ్లుగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్‌గా చూపించి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే..పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా.. జువైనల్ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. शिवपुरी के दिनारा में हमारी मासूम बेटी के साथ हुए अमानवीय कृत्य की जानकारी मिलते ही आज परिजनों से फोन पर बातचीत की एवं उन्हें हौसला दिया। बेटी अभी अस्पताल में भर्ती है और उसकी हालत स्थिर है। मैं लगातार डॉक्टरों की टीम के संपर्क में हूं। हमारे क्षेत्र और प्रदेश में इस तरह के…— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 25, 2025