Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Press Meet Highlights March 5th 2025 News1
YSRCP వాళ్లకు ఏ పథకాలు ఇవ్వకూడదా?: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మీడియా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ అరాచకాలపై, చంద్రబాబు మోసాలపై మాట్లాడుతున్నారు.ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్‌ 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. సూపర్‌ సిక్స్‌, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. 👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్‌ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్‌లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్‌ సర్వేలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్‌లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?👉జగన్‌ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్‌ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 👉స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్‌లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్‌ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 👉అఫ్‌కోర్స్‌.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్‌లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా.. మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్‌ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 👉 సూపర్‌ సిక్స్‌.. సెవెన్‌ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్‌ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం. 👉వైఎస్సార్‌సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ అందరూ చూడాలిఎన్నికల టైంలో చంద్రబాబు: జగన్‌ ఇప్పించిన సంక్షేమం ఆగదు. 143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాంఅసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్‌ సిక్స్‌ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.👉సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్‌లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ పెన్షన్‌ నిధులు తగ్గించేశారు👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీలకు సంక్షేమం ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్‌ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు ఉంటుంది👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. ఉద్యోగులను దారుణంగా మోసం చేశారు. కోవిడ్‌లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు మేం చెల్లించాం.

Steve Smith announces retirement from ODIs after Australias Champions Trophy exit2
భార‌త్ చేతిలో ఓట‌మి.. స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. వ‌న్డే క్రికెట్‌కు స్మిత్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 సెమీఫైన‌ల్లో భార‌త్ చేతిలో ఓట‌మి అనంత‌రం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ పరాజయం పాలైంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌గా స్మిత్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

US President Trump reads letter from Zelensky during address to Congress3
జెలెన్‌స్కీ నుంచి ముఖ్యసందేశం వచ్చింది: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికన్‌ కాంగ్రెస్‌ తొలిసారి ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump).. మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పంపిన ముఖ్యమైన సందేశాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్‌ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేసినట్లు ట్రంప్‌ ఆ లేఖను చదివి వినిపించారు.అమెరికా కల పునరుద్ధరణ పేరిట మంగళవారం అమెరికా కాంగ్రెస్‌(US Congress)లో ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం టారిఫ్‌ అంశంతో పాటు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేతపైనా స్పందించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy)తో వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్‌ ఆఫీస్‌లోట్రంప్‌ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌(JD Vance)లు జెలెన్‌స్కీ తీరుపై కెమెరాల సాక్షిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే జెలెన్‌స్కీ వెనుదిగారు. ఆ వెంటనే తన తీరును సమర్థించుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. ఈ క్రమంలో.. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి. ఆ వెంటనే ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారాయన.దీంతో కొన్ని గంటల్లోనే జెలెన్‌స్కీ దిగివచ్చారు. ట్రంప్‌తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనన్నారు. ట్రంప్‌ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు.

Jagan Slams CBN Over Stop Welfare Schemes To YSRCP Activists Comments4
అదేమైనా మీ బాబుగారి సొమ్మా?: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, వాళ్లకు ఇస్తే పాముకు పాలు పోసిట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.వైఎస్సార్‌సీపీ(YSRCP) వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇలా బహిరంగంగా, నిసిగ్గుగా మాట్లాడతారా?. జడ్జిలుగానీ, గవర్నర్‌గానీ చంద్రబాబు(Chandrababu) లేదంటే నా ఈ వ్యాఖ్యలైనా ఒకసారి చూడాలి. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అని జగన్‌ ప్రశ్నించారు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package5
క్యాంపస్ ఇంట‌ర్వ్యూలో జాక్‌పాట్‌!

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Big Twist In Malakpet Sirisha Death Case6
శిరీష కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. స్వాతి, వినయ్‌ ప్లాన్‌ ప్రకారమే...

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శిరీషను భర్త, ఆమె ఆడపడుచు (భర్త సోదరి) స్వాతి కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో వినయ్‌, స్వాతిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన శిరీషను తన భర్త, ఆడపడుచు స్వాతి కలిసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. స్వాతి ప్లాన్‌ ప్రకారం.. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. తన అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని కోపంతో వినయ్ హత్య చేసినట్టు చెప్పారు. హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్‌ మాయం చేయాలనుకున్నాడని వెల్లడించారు. మరోవైపు, ఊపిరాడకుండా చేయటంతోనే ఆమె మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో సైతం వెల్లడైంది.మెడ చుట్టూ గాయాలు..అంతకుముందు.. శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి.. మృతురాలి బంధువులు వినయ్‌ను నిలదీయగా, పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినపుడు సీపీఆర్‌ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయాయంటూ ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు కుదుపులకు గాయాలైనట్టు మరోసారి చెప్పాడు. దీంతో, శిరీషను అతడే హత్య చేసినట్టు బంధువులు ఆరోపించారు.భర్త వేధింపులు.. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను 2017లో శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో పాప జన్మించింది. పెళ్లయిన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్‌ నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మార్చి రెండో తేదీన ప్లాన్‌ చేసి ఆమెను హత్య చేశారు. అనంతరం, గుండెపోటుతో చనిపోయినట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పాడు వినయ్‌.ఈ క్రమంలో వారు వచ్చేలోపే మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Amitabh Bachchan Reacts To Post On Son Abhishek Bachchan Facing Nepotism Negativity7
నాన్నను కదా ఆ మాట చెప్పలేకపోతున్నా: అమితాబ్‌

స్టార్‌ హీరోహీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. బ్యాగ్రౌండ్‌ సపోర్ట్‌తో సినిమా చాన్స్‌లు ఈజీగానే వస్తాయి. కానీ టాలెంట్‌ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. రికమెండేషన్‌తో ఒకటిరెండు సినిమా చాన్స్‌లు వచ్చినా.. నటనతో ఆకట్టుకోలేకపోతే ఎంతపెద్ద స్టార్‌ కిడ్‌ అయినా దుకాణం సర్దుకోవాల్సిందే. అయితే కొంతమందికి నెపోటిజం అనేది వరంగా మారితే..మరికొంతమందికి మాత్రం అదే శాపంగా మారుతుంది. ఎంత టాలెంట్‌ ఉన్నా.. అద్భుతంగా నటించినా..నెపోటిజం(బంధుప్రీతి) వల్లే చాన్స్‌లు వస్తున్నాయని విమర్శలు చేసే వాళ్లు ఉంటారు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నవారిలో బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌(Abhishek Bachchan ) ఒకరు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) వారసుడిగా ఇండస్ట్రీలోకి పెట్టిన అభిషేక్‌.. యువ, ధూమ్‌, గురు, ఢిల్లీ 6 లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించినా.. ఇప్పటికీ ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. నెపోటిజం(Nepotism) వల్లే ఆయన పరిశ్రమలో కొనసాగుతున్నారని ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై అమితాబ్‌ బచ్చన్‌ స్పందిస్తూ తన కొడుకుకు మద్దతుగా నిలిచాడు. ‘ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినప్పటికీ.. అభిషేక్‌ అనవసరంగా నెపో కిడ్‌ అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా?’ అని ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. దీనిపై అమితాబ్‌ స్పందిస్తూ..‘నిజం చెప్పాలంటే నాక్కుడా అదే ఫీలింగ్‌. కానీ నాన్నని కదా ఈ మాట చెప్పలేకపోతున్నాను’ అని రిప్లై ఇచ్చాడు. కాగా, గతంలో అభిషేక్‌ నెపోటిజం విమర్శలపై స్పందిస్తూ..‘నా కెరీర్‌ విషయంలో నాన్న ఎప్పుడు సాయం చేయలేదు. నాతో సినిమాలను చేయమని ఎవరిని అడగలేదు. అందరి నటులలాగే నేను అవకాశాల కోసం తిరిగాను. నా టాలెంట్‌ని గుర్తించి దర్శకనిర్మాతలు చాన్స్‌లు ఇచ్చారు. అంతేకానీ నాన్న ఎప్పుడూ నాకు రికమెండేషన్‌ చేయలేదు. నా సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించలేదు. నేనే ఆయన నటించిన ‘పా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను’ అని చెప్పారు.

Gold and silver rates today on market in Telugu states8
భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,650 (22 క్యారెట్స్), రూ.87,980 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.550, రూ.600 పెరిగింది.ఇదీ చదవండి: ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై నిబంధనలు కఠినతరంచెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.550 పెరిగి రూ.88,130కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.600 పెరిగి రూ.88,240 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. బుధవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,07,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Going to the gym check these saftey measures deets inside9
జిమ్‌ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు!

జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యానికి మేలే.. కానీ జిమ్‌కి వెళ్లే ముందు మానసికంగా, ఆరోగ్యంగా సంసిద్ధంగా ఉన్నామా? లేదా! అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు తగిన మూల్యం తప్పదని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. జిమ్‌ చేసే క్రమంలో నియమావళిని తప్పక పాటించాలని, ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలని చెబుతున్నారు. ఇటీవల జిమ్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతి చెందిన వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇప్పుడీ అంశాలు చెప్పుకోడానికి ఇదే ప్రధాన కారణం. సొంత ప్రయోగాలకు పోకుండా నిపుణుల సలహాల మేరకే వ్యాయామం చేయాలనేదే ఇందులోని ముఖ్య ఉద్దేశం. – సాక్షి, సిటీబ్యూరో ఈ మధ్యనే ఒక జాతీయ స్థాయి ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన యస్తిక (17) ప్రాక్టీస్‌లో భాగంగా 270 కిలోల బరువును ఎత్తుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు వెయిట్స్‌ మెడపై పడి చనిపోయింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీంతో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన మరికొన్ని వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో.. షేర్‌ చేస్తున్నారు. కేవలం చిన్న పొరపాట్లే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిమ్, వ్యాయామ సమయాల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను సూచిస్తున్నారు. జిమ్‌ పార్ట్‌నర్‌ తప్పనిసరి.. ప్రమాదకర వ్యాయామాలు చేస్తున్న సమయంలో జిమ్‌ పార్ట్‌నర్‌ను ఎంచుకోవడం తప్పనిసరి. ట్రైనర్‌ ఉన్నప్పటికీ ఎక్కువ సమయం విభిన్న వర్కవుట్లు చేసే క్రమంలో పార్ట్‌నర్‌ ప్రమాదాల నుంచి రక్షణగా నిలుస్తారు. ముఖ్యంగా బెంచ్‌ ప్రెస్, స్క్వాట్స్‌ వంటి వ్యాయామాల్లో, అధిక బరువులను ఎత్తుతూ వర్కవుట్లు చేసే సమయంలో భాగస్వామి సమన్వయం చేస్తారు. స్పాటర్‌ లిఫ్టింగ్‌ సమయంలో సహాయకారిగా ఉంటారు. టెక్నిక్స్‌తోనే సేఫ్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌ వంటి కఠిన వ్యాయామాలు చేసే క్రమంలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటం ప్రాథమిక నియమం. ఫామ్‌లో లేని సమయంలో ఎలాంటి బరువులూ ఎత్తే ప్రయత్నం చేయకూడదు. దీంతోపాటు జిమ్‌ టెక్నిక్స్‌ ప్రమాదాలు, గాయాల బారినుంచి సంరక్షిస్తాయి. శారీరక, మానసిక దృఢత్వమే హాస్పిటల్‌ బెడ్‌ పై కాకుండా వెయిట్‌ లిఫ్టింగ్‌ బెంచ్‌పై ఉండేందుకు ఉపకరిస్తుందని ఉమెన్‌ ఫిట్నెస్‌ ట్రైనర్‌ శ్వేత పేర్కొన్నారు. పరిసరాలను గమనించాలి.. వ్యాయామం చేస్తున్న సమయంలో చాలా మంది ఇయర్‌ బడ్స్‌ పెట్టుకుంటారు. ఇది ప్రమాదాలకు కారణం కావచ్చు. వ్యాయామం చేసేటప్పుటు జిమ్‌ పరిసరాల్లో, ఇతరులు చేస్తున్న వ్యాయామ ప్రక్రియలను గమనిస్తుండాలి. లేదంటే పొరపాటున ఇతరులు చేసే వ్యాయామ పరికరాలు తగలడం, మీద పడటం, రాడ్స్‌ తగలడం వంటి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని ట్రైనర్లు చెబుతున్నారు. ద్రవాలతో డీహైడ్రేషన్‌కు చెక్‌.. సాధారణంగా జిమ్‌ సెంటర్లన్నీ వెంటిలేషన్‌ తక్కువగా ఉండే పెద్ద పెద్ద హాల్స్‌లో నిర్వహిస్తుంటారు. ఓ వైపు వ్యాయామం ద్వారా వచ్చే వేడి, మరో వైపు ఉబికివచ్చే చెమటలు. ఈ కారణాలతో శరీరం డీహైడ్రేట్‌ కావడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో అనువైన ద్రవాలు, పానీయాలు తీసుకోవడం కీలకం. లేదా ఇతర ప్రమాదాలకు డీహైడ్రేషన్‌ కూడా కారణమవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం.. జిమ్‌ కల్చర్‌లో క్రమశిక్షణ ప్రాథమిక నియమం. ఫిట్నెస్‌ వ్యాయామాల తరువాత జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ వాటిని భద్రపరిచే ర్యాక్‌లో పెట్టడం ఇతరులను ప్రమాదాల నుంచి నివారిస్తుంది. జిమ్‌ ఫ్లోర్‌పై డంబెల్స్, వెయిటింగ్‌ బెల్స్‌ ఎక్కడివక్కడే ఉంచడం వల్ల కాలికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి స్కిప్‌ అయ్యి దానిపై పడితే తలకు బలమైన గాయాలు అయిన సందర్భాలూ కోకొల్లలు. జిమ్‌లో తగిలే గాయాలకు మరో ప్రధాన కారణం ‘వ్యాయామ క్రమశిక్షణ’ లేకపోవడమేనని ప్రముఖ ట్రైనర్‌ సంతోష్‌ హెన్రిక్‌ తెలిపారు. వార్మ్‌ అప్‌ తప్పనిసరి.. వ్యాయామాలకు ముందు వార్మ్‌ అప్‌ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్‌ సెషన్‌ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్‌– లేదా ప్లేట్‌–లోడెడ్‌ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. వ్యాయామాలకు ముందు వార్మ్‌ అప్‌ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్‌ సెషన్‌ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్‌– లేదా ప్లేట్‌–లోడెడ్‌ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. సమయం తప్పనిసరి.. ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆదరాబాదరా జిమ్‌కి వెళ్లడం సరికాదు. ఇది అత్యంత ప్రమాదకరం. వ్యాయామాలు, ఫిట్నెస్‌ ప్రక్రియలను నిర్దేశిత సమయాల్లోనే చేయాలి. తక్కువ సమయంలో పూర్తి చేసి వెళ్లాలనే తొందరలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. జిమ్‌ పార్ట్నర్‌ కోసం త్వరగా ముగించడం, ఎక్కువ సేపు చేయడం కూడా ప్రమాదమే. మన స్థాయికి తగ్గట్టుగానే..వ్యాయామాల్లో ఎక్కువగా చేసే తప్పలు ‘సామర్థ్యానికి మించిన బరువులను ఎత్తడం’. అధిక బరువులను ఓ క్రమ పద్ధతిలో రోజు రోజుకూ పెంచుకుంటూ పోవాలనేది నిపుణుల సూచన. ఎంత ఎత్తగలరో అంతే ఎత్తండి అని ప్రతి ట్రైనర్‌ చెబుతుంటారు. అనివార్యకారణాల వల్ల కొన్ని రోజులు జిమ్‌కు వెళ్లని పక్షంలో.. తిరిగి మునుపటి బరువులు ఎత్తడం సరికాదు. దీనివల్ల కండరాలకు గాయాలయ్యే ప్రమాదం ఉందని బంజారాహిల్స్‌లోని ఓ జిమ్‌ ట్రైనర్‌ రవి చెబుతున్నారు. వ్యాయామాలు చేసేవారు తమతోపాటు తప్పనిసరిగా టవల్‌ వెంట తీసుకెళ్లాలి. ఇది ఆరోగ్య రక్షణకు, ప్రమాదాల నివారణకు సహకరిస్తుంది. వ్యాయామాల సమయంలో పట్టే చెమట వల్ల బరువైన వస్తువులు జారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గాయాలు కావొచ్చు. టవల్‌తో చెమటను తుడుచుకోవడం వల్ల దాని ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములు తొలగిపోయి చర్మానికి రక్షణ చేకూరుతుంది.

CBI And Interpol Reacts On Phone Tapping case10
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఎక్కడంటే?

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్‌ పోల్‌కు రెడ్‌ కార్నర్‌ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్‌ పోల్‌ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్‌ పోల్‌(Interpol )కు రెడ్‌ కార్నర్‌ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.అనంతరం స్పందించిన ఇంటర్‌ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్‌ పోల్‌ నుంచి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
మిసెస్‌ ఇండియా పోటీలకు తెలుగు ఎన్‌ఆర్‌ఐ

సాక్షి, సిటీబ్యూరో: లండన్‌ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో

title
టంపా వేదికగా నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

title
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం

ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

Advertisement

వీడియోలు

Advertisement