Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Means Telugu Drama Party Says YS Jagan1
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్‌ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్‌ అన్నారు... చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్లు, రేషన్‌ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్‌ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్‌, బకాయిలు పెండింగ్‌. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, రాజధాని పనులు.. లిక్కర్‌ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్‌ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్‌ అన్నారు.క్లిక్‌ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన

Jagan Gollaprollu Penukonda YSRCP Leaders Meeting Key Comments Updates2
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్‌ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్‌ ఉండి ఉంటేనా..

Political Analysts On Pawan Double Stand Cine Industry3
అధికారం ఉంది కదా అని అడ్డంగా నడుస్తున్నారా?

ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్‌ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Mp Avinash Reddy Slams Chandrababu Naidu Over Ysr District Tdp Maha Nadu  Meeting4
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’

సాక్షి,వైఎస్సార్‌ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్‌ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్‌ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్‌ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్‌ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్‌. వైఎస్‌ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్‌ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు.

LSG VS RCB: Ashwin Slams Rishabh Pant, Defends Digvesh Over His Mankad Attempt5
LSG VS RCB: రిషబ్‌ పంత్‌పై మండిపడ్డ అశ్విన్‌.. సొంత బౌలర్‌నే ఫూల్‌ చేశాడు..!

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ కీలక దశలో సాగుతుండగా లక్నో స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠీ మన్కడింగ్‌కు (నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లోని బ్యాటర్‌ బంతి వేయకముందే క్రీజ్‌ను దాటిన సమయంలో బౌలర్ వికెట్లను గిరాటు వేయడం) పాల్పడ్డాడు. ఈ విషయమై రాఠీ అప్పీల్‌ చేసినప్పటికీ.. లక్నో కెప్టెన్‌ పంత్‌ దాన్ని విత్‌డ్రా చేసుకున్నాడు. రీప్లే పరిశీలించిన అనంతరం థర్డ్‌ అంపైర్‌ దీన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.టెక్నికల్‌గా (రాఠీ ఫ్రంట్‌ ఫుట్‌ ల్యాండ్‌ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న జితేశ్‌ శర్మ క్రీజ్‌లోనే ఉన్నాడు) ఇది నాటౌటే అయినప్పటికీ.. రూల్స్‌కు విరుద్దం అయితే కాదు. గతంలో చాలా సందర్భాల్లో బౌలర్లు మన్కడింగ్‌ చేసి బ్యాటర్లను ఔట్‌ చేశారు. తాజాగా అదే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కెప్టెన్‌ బౌలర్‌ను సమర్థించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అ విషయమై క్రికెట్‌ సర్కిల్స్‌లోభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాఠీ చర్యను సమర్దిస్తుంటే.. మరికొందరు పంత్‌ అప్పీల్‌ను వెనక్కు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.రాఠీ చర్యను సమర్దించిన వారిలో సీఎస్‌కే వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఉన్నాడు. యాష్‌ ఓ పక్క రాఠీ చర్యను సమర్దిస్తూనే, అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకున్న పంత్‌ను తప్పుబట్టాడు. పంత్‌ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకోవడం వల్ల రాఠీ కోట్లాది మంది అభిమానుల ముందు ఫూల్‌ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. పంత్‌ రాఠీని జీవితంలో ఇం​కోసారి మన్కడింగ్‌కు పాల్పడకుండా చేశాడని మండిపడ్డాడు.మన్కడింగ్‌ విషయంలో బౌలర్లంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించాడు. ఓ రకంగా బౌలర్‌కు ఇది అవమానమని అన్నాడు. పంత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రాఠీ భయపడి ఉంటాడని తెలిపాడు. బౌలర్‌ చర్యను వెనకేసుకురావడం కెప్టెన్‌ బాధ్యత అని గుర్తు చేశాడు. ఔటైనా, నాటౌటైనా మన్నడింగ్‌ అనేది ఆటలో భాగమని అన్నాడు. మ్యాచ్‌ కీలక దశలో సాగుతుండగా బౌలర్‌ ఇలాంటి ప్రయత్నం చేయడం​ తప్పేది కాదని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో (ఆఖరి బంతి​కి) ఇది జరిగింది. రాఠీ మన్కడింగ్‌కు పాల్పడే సమయానికి ఆర్సీబీ 19 బంతుల్లో 29 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటకే జితేశ్‌ శర్మ జోరు మీదున్నాడు. ఒకవేళ జితేశ్‌ మన్కడింగ్‌ ద్వారా ఔటయ్యుంటే ఆర్సీబీ కష్టాల్లో పడేది. మ్యాచ్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భంలో పంత్‌ బౌలర్‌ అప్పీల్‌ను ఉపసంహరించుకుని ఆర్సీబీకి ఫేవర్‌ చేశాడు. క్రీడా స్పూర్తి అని పెద్దపెద్ద మాటలు అనుకోవచ్చు కానీ, మ్యాచ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్‌ చేసింది కరెక్టే అని చెప్పాలి. రాఠీ అప్పీల్‌ను పంత్‌ చిన్నచూపు చూసి తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా అప్పీల్‌ విత్‌డ్రా చేసుకున్న తర్వాత జితేశ్‌ను కౌగించుకుని సొంత బౌలర్‌ను అవమానించాడు. మన్కడింగ్‌ తర్వాత మరింత రెచ్చిపోయిన జితేశ్‌ కొద్ది బంతుల్లోనే మ్యాచ్‌ను లక్నో చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు.

Chandrababu comments on Maha Nadu occasion create a stir6
మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం

సాక్షి,వైఎస్సార్‌: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Poor Kamal Haasan Siddaramaiah On Kannada Language Row7
పాపం కమల్‌ హాసన్‌.. సిద్ధరామయ్య సెటైర్లు

బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్‌ కామెంట్‌పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్‌ హాసన్‌కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్‌ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్‌ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్‌ కుమార్‌ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్‌ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్‌ లైఫ్‌ చిత్ర(Thug Life) ఈవెంట్‌లో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్‌పై ఇటు రాజకీయంగా, అటు సోషల్‌ మీడియాలోనూ కమల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్‌ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్‌లో కమల్‌ హాసన్‌, శింబు, త్రిష, అభిరామి లీడ్‌ రోల్స్‌లో నటించిన థగ్‌ లైఫ్‌ సినిమా జూన్‌ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్‌ కమల్‌.. నల్ల ఇంకు పోస్తాం

Shah Rukh Khan As Brand Ambassador of Candere8
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Vijay Antony Latest Movie Maargan Telugu Trailer Out Now9
విజయ్ ఆంటోని మిస్టరీ థ్రిల్లర్‌.. తెలుగు ట్రైలర్‌ చూశారా?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమాకు కోలీవుడ్‌లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన లియో జాన్‌ పాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఇటీవల మార్గన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. అయితే మూవీ పాత్రకు సంబంధించిన గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సందర్భంగా మీ గెటప్‌ గురించి ఏమైనా రివీల్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మీకు సినిమా మొత్తం ఇక్కడే చూపిస్తామని నవ్వుతూ మాట్లాడారు. ఒకవేళ ఇండియాలో నేనే గనక రిచ్ అయ్యుంటే.. నా సినిమాలన్నీ ఉచితంగా ప్రదర్శించేవాడినని విజయ్ అన్నారు. ఇది విన్న అభిమానులు విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మార్గన్‌ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్‌ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్‌లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

New Digital ID For Your Home Govt Plans Address Aadhaar10
అడ్రస్‌ ఆధార్‌.. ప్రభుత్వం కొత్త కసరత్తు!

దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపు రుజువు కోసం తీసుకువచ్చిన ఆధార్ మాదిరిగానే ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఉండే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. డోర్‌ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి సహాయపడుతుంది.దుర్వినియోగం కట్టడి..ప్రస్తుతం, చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎటువంటి ప్రామాణిక వ్యవస్థా లేదు. స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలనూ జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టమైన వినియోగదారు చేతుల్లో పెట్టడం ఈ కొత్త చొరవ లక్ష్యం.ఆర్థిక వ్యవస్థకూ నష్టం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన, ప్రామాణిక చిరునామాలకు డిమాండ్ పెరిగింది. అయితే దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్ లపై ఆధారపడున్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఏటా 10–14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు అరశాతం.👉ఇది చదివారా? ఆధార్‌ అప్‌డేట్‌ గడువు జూన్‌ 14 వరకే..ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందంటే..చిరునామాలను ఎలా రాయాలి.. నిల్వ చేయాలి... సురక్షితంగా యాక్సెస్ చేసుకోవాలో నిర్వచించడానికి ప్రతిపాదిత పరిష్కారం సమగ్ర 'డిజిటల్ అడ్రస్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు ప్రైవసీ ప్రోటాకాల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.డిజిపిన్.. స్మార్ట్ అడ్రస్ కోడ్ఈ వ్యవస్థలో గుండెకాయ లాంటిది డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్‌ల మాదిరిగా కాకుండా డిజిపిన్‌లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపారా సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక జనావాసాలు, సాంప్రదాయ చిరునామా వ్యవస్థలు లేని అడవులు, కొండలు వంటి భౌగోళిక సవాళ్లతో కూడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement