Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comment On Payyavula Jagannamasmarana During Budget1
అరరే కేశవా.. ఎన్టీఆర్‌, బాబులను బద్నాం చేస్తే ఎలా?

గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్‌ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్‌ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు. ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్‌ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది. 👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు.. 👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్‌లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?. ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్‌సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!. అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్‌ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?. విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్‌ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్‌ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?. సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా! ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయంమహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్‌.. వీటి ఊసే లేదు. అలాగే వలంటీర్‌ వ్యవస్థకు మంగళం పాడేశారు. 👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్‌లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్‌లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

AP Govt Imposed Restriction On Sakshi And Other TV Channels2
సాక్షి దెబ్బకు దిగొచ్చిన నారా లోకేష్‌

ప్రెస్‌మీట్‌లలో ‘‘సాక్షి.. ఎక్కడమ్మా?’’ అంటూ ఇంతకాలం వెటకారం ప్రదర్శిస్తూ వచ్చిన చినబాబు.. ఇప్పుడు ఆ ఛానెల్‌ కెమెరా కనిపిస్తే ముఖం తిప్పేసుకుంటున్నారు. ఆయన తెచ్చిన రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. తొమ్మిది నెలల పాలనలో అమలుకాని కూటమి ప్రభుత్వ హామీలు.. ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్‌సీపీ వినిపిస్తున్న గళమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఇవాళ అణచివేత చర్యలకు దిగగా.. సాక్షి దానిని అంతే ధీటుగా ఎదుర్కొంది.సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి పాలన(Kutami Rule)లో అరాచకాలు ఏనాడో తారాస్థాయిని చేరాయి. అయితే రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుచేస్తూ ఈ మధ్య మీడియా స్వేచ్ఛను కూడా హరించి వేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో కవరేజ్‌ కోసం సాక్షి ఛానెల్‌(Sakshi Channel) సహా నాలుగింటిపై ఆంక్షలు విధించడం చూశాం. ఇప్పుడు.. ఇవాళ.. శాసన మండలిలోనూ ప్రత్యక్ష ప్రసారాలు రాకుండా చానెల్స్‌ను అసెంబ్లీలోకి అనుమతించలేదు.ఏపీ శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల దెబ్బకు మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh Babu) వణికిపోయారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. చివరకు.. నీళ్లు నమిలిన గొంతుతోనే.. తమ లెక్కలన్నీ తప్పుడువేనని.. తమదంతా డబ్బా ప్రచారమేనని నిజాలు ఒప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఇవాళ అసెంబ్లీ శాసన మండలిలో సమాచారశాఖ సాక్షికి లైవ్‌ ప్రసారాలను నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.సాక్షి మాత్రమే కాదు.. మరో మూడు మీడియా చానెల్స్‌కు లైవ్‌ ప్రసారం ఇవ్వకుండా అసెంబ్లీలోకి అనుమతించలేదు. కేవలం చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లకు అనుకూలంగా ఉన్న ఛానెల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ పరిణామంపై సాక్షి గళమెత్తింది. ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను.. ప్రశ్నించే ప్రతినిధులను చూపించేందుకు అనుమతి ఇవ్వాలని పోరాడింది. ఈ దెబ్బకు కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఐ అండ్‌ పీఆర్‌ ఛానెల్‌లో శాసన మండలి ప్రసారాలు పునఃప్రారంభం అయ్యాయి. మొన్నటిదాకా సాక్షి మీడియా సంస్థ మీద అవాక్కులు చవాక్కులు పేల్చిన లోకేష్‌.. ఇప్పుడు ఆ ఛానెల్‌నే చూసి భయపడే స్థాయికి చేరుకున్నారనే చర్చ ఒకవైపు రాజకీయ వర్గాల్లో.. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ నడుస్తోంది ఇప్పుడు .

Travis Heads performance against India in international cricket listed3
ఆసీస్‌తో సెమీఫైనల్‌.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూపు స్టేజిలో ఆజేయంగా నిలిచిన భార‌త జ‌ట్టు.. ఇప్పుడు కీల‌క స‌మ‌రానికి సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైన‌ల్లో మంగ‌ళ‌వారం దుబాయ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో భార‌త్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2023 ఓట‌మికి బదులు తీర్చుకోవాల‌ని రోహిత్ సేన క‌సితో ఉంది. అందుకు త‌గ్గ‌ట్టు త‌మ ఆస్త‌శాస్త్రాల‌ను భార‌త జ‌ట్టు సిద్దం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా టీమిండియాను మరోసారి మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ప్లేయర్లు దూరమైనప్పటికి స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు అదరగొడుతోంది. దీంతో మరోసారి ఆసీస్‌-భారత్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్పిస్తోంది.మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?అయితే తొలి సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌​ ట్రావిస్ హెడ్‌పైనే ఉన్నాయి. ప్రత్యర్ధి భారత్ అయితే చెలరేగిపోయే హెడ్‌.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. వన్డే ప్రపంచకప్‌-2023లో​ ఫైనల్లో అతడి చేసిన విధ్వంసం సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోరు.ఈ డేంజరస్ బ్యాటర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. గ‌తేడాది జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్ ఆస్ట్రేలియా ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. హెడ్ మాత్రం అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 43 బంతుల్లో 76 ప‌రుగులు చేసి త‌న జ‌ట్టును గెలిపించే అంత ప‌నిచేశాడు. అంత‌కుముందు వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ భార‌త్‌పై సెంచ‌రీతో మెరిశాడు. ఇటీవ‌ల జ‌రిగిన బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో హెడ్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అందుకే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భార‌త అభిమానులు భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి హెడ్‌ను అడ్డుకునేందుకు భార‌త్ ఎటువంటి వ్యూహాలు రచిస్తుందో మ‌రో 24 గంట‌లు వేచి చూడాలి.భార‌త్‌పై హెడ్ రికార్డు..టీమిండియాపై వ‌న్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌పై 9 వ‌న్డేలు ఆడిన హెడ్‌.. 43.12 స‌గ‌టుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచ‌రీతో పాటు హాఫ్ సెంచ‌రీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 ప‌రుగులుగా ఉంది. టెస్టుల్లో భార‌త్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 స‌గ‌టుతో 1163 ప‌రుగులు సాధించాడు.భారత్‌దే పైచేయి..కాగా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆసీస్‌పై భార‌త్‌దే పై చేయిగా ఉంది. ఇరు జ‌ట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ముఖాముఖి త‌ల‌ప‌డ‌గా.. భార‌త్ రెండింట‌, ఆసీస్ కేవ‌లం ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. చదవండి: Champions Trophy: అక్షర్ పటేల్ కాళ్లు మొక్క‌బోయిన కోహ్లి.. వీడియో వైర‌ల్

Redbook Constitution In AP: Posani Case Bail Plea Updates4
పోసాని కృష్ణమురళిపై మరో అక్రమ కేసు

అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali) మరో కేసు నమోదు అయ్యింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. దీంతో.. సోమవారం ఉదయం ఆయన్ని రాజంపేట సబ్‌ జైలు నుంచి అక్కడికి తరలిస్తున్నారు.ఈ ఉదయాన్నే పీటీ వారెంట్‌(PT Warrant)తో నరసరావుపేట టూటౌన్‌ పోలీసులు రాజంపేట సబ్‌జైలుకు చేరుకున్నారు. పోసాని మీద బీఎన్‌ఎస్‌ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. అయితే అభియోగాలు ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే పోసానికి బెయిల్‌ దక్కే అవకాశాలు ఉండడంతోనే ఇలా ఇప్పుడు మరో కేసు పెట్టారని వైఎస్సార్‌సీపీ(YSRCP) శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కోసం పోలీసుల పోటీనరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్‌ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్‌ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు.👉పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కడప కోర్టు(Kadapa Court) పోసాని కృష్ణ మురళీ తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు పోసానిని కలిసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్‌ పెట్టున్నారు. అయితే ఈ లోపే ఆయన్ని నరసరావుపేట తరలించడం గమనార్హం.👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు(తాజా కేసుతో కలిపి..) నమోదు చేశారని అంటోంది. అయితే ఆయనకు గతంలో సర్జరీ జరగడంతో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పోలీసులు వీటన్నంటిని పట్టించుకోవడం లేదు. కావాలనే ఇబ్బంది పెట్టేందుకు వివిధ పోలీసు స్టేషన్లు తిప్పుతున్నారు. పైగా పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్‌లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package5
ఎల్‌పీయూ రికార్డు.. 1700 విద్యార్థులకు 10 లక్షలపైనే ప్యాకేజీలు

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Congress Leader Shama Mohamed Fat-Shames Rohit Sharma6
రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నేత బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు

ఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్‌ శర్మపై బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేశారు. రోహిత్‌ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ రోహిత్‌ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్‌ ఆటతీరుపై కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్‌ వేదికగా రోహిత్‌ను టార్గెట్‌ చేసి.. రోహిత్‌ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్‌ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్‌ భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్‌ రోహిత్‌. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్‌ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్‌ను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ క్రికెట్‌ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్‌ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్‌ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఐపీఎల్‌లో కూడా రోహిత్‌ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్‌ చరిత్రలోనే రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే.

 Oscars 2025 Awards Winners List7
97వ ఆస్కార్‌ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా'

97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యంగానే అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. అవార్డుల కోసం హాలీవుడ్‌ టాప్‌ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. రెడ్‌ కార్పెట్‌పై సరికొత్త ట్రెండీ దుస్తుల్లో వారందరూ మెరిశారు. అమెరికాకు చెందిన 'అనోరా' ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌-2025 అవార్డ్‌ను దక్కించుకుంది. అయితే ఇదే చిత్రంలో నటించిన మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ ఉత్తమ హీరోయిన్‌గా అవార్డ్‌ అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా) దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ఆడ్రిన్‌ బ్రాడీ అందుకున్నారు. ది బ్రూటలిస్ట్‌ అనే చిత్రంలో ఆయన నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన 'డ్యూన్‌: పార్ట్‌2' చిత్రం కూడా రెండు విభాగాల్లో అవార్డ్స్‌ను అందుకుంది. ఉత్తమ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది ఆస్కార్‌ విజేతలు- 2025 ఉత్తమ చిత్రం – (అనోరా)ఉత్తమ నటుడు – అడ్రియన్ నికోలస్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్) ఉత్తమ నటి – మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ (అనోరా) ఉత్తమ దర్శకుడు –సీన్ బేకర్ (అనోరా) ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్‌ పెయిన్‌)ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్) ఉత్తమ సినిమాటోగ్రఫీ - లాల్‌ క్రాలే ( ది బ్రూటలిస్ట్‌)ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్‌క్లేవ్‌)ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – పాల్ టాజ్‌వెల్ (విక్‌డ్‌- Wicked)ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ – (ఫ్లో- FLOW)ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- ఇన్‌ ద షాడో ఆఫ్‌ ద సైప్రెస్‌ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ - ది సబ్‌స్టాన్స్‌ఉత్తమ ఎడిటింగ్ - సీన్‌ బేకర్‌ (అనోరా)ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – "ఎల్ మాల్" (ఎమిలియా పెరెజ్)ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్‌డ్‌- Wicked)ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌– నో అదర్ ల్యాండ్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రాఉత్తమ సౌండ్‌ - డ్యూన్‌- పార్ట్‌2బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – డ్యూన్‌- పార్ట్‌2 ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం- ఐ యామ్ నాట్ ఎ రోబోట్బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ – డేనియల్ బ్లమ్‌బెర్గ్ (ది బ్రూటలిస్ట్)

Police Arrested Accused In Congress Himani Narwal Case8
కాంగ్రెస్‌ నేత హిమాని కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. అతడే హంతకుడు?

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత హిమాని నర్వాల్‌ దారుణ హత్య హర్యానాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా.. అతడు హిమానికి స్నేహితుడు అని తెలుస్తోంది. హర్యానాకు చెందిన కాంగ్రెస్‌ నేత హిమాని హత్య కేసులో సోమవారం ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక, పోలీసులు అతడి దగ్గర నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా హిమానికి స్నేహితుడి అని తెలిసింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు సమాచారం. హిమాని ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాని అతడిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. హర్యానాలోని రోహతక్ జిల్లాలో శనివారం హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. సంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలం చేకూర్చుతోంది.ఇక, హిమాని నర్వాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని నర్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటుందని సాంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ తెలిపారు.#WATCH | Rohtak, Haryana: Visuals of the accused who is arrested in Congress worker Himani Narwal murder case. pic.twitter.com/zSvHIEIP7a— ANI (@ANI) March 3, 2025బాధితురాలి తల్లి ఆరోపణలుఅంతకుముందు, బాధితురాలి తల్లి సవిత సంచలన ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కోసం తన కూతురు పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదన్నారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను ఆమె అంత్యక్రియలు చేయనని అన్నారు.

Bitcoin Jumps Above 91000 Dollar After Trump US Crypto Reserve News9
ట్రంప్ ప్రకటన: భారీగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్​ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బిట్‌కాయిన్‌తో సహా.. అనేక క్రిప్టో కరెన్సీల విలువ మరింత పెరిగిపోయింది.డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ ధర 91,000 డాలర్లను (సుమారు రూ.80 లక్షలు) దాటింది. ఎక్స్‌ఆర్‌పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎంఎస్టీఆర్, కాయిన్, హెచ్ఓఓడీ, ఎంఏఆర్ఏ, ఆర్ఐఓటీ వంటి క్రిప్టో లింక్డ్ స్టాక్‌లు కూడా బుల్లిష్ బిడ్‌లను చూసే అవకాశం ఉంది.మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించడంతో క్రిప్టో ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడం ప్రారంభించాయి. సమ్మిట్‌కు ప్రముఖ వ్యవస్థాపకులు, సీఈఓలు, క్రిప్టో పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది.క్రిప్టో కాయిన్స్ విలువలు ఇలా..భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:55 గంటల సమాయానికి సొలనా కాయిన్ (ఎస్ఓఎల్) విలువ 24 శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరుకుంది. ఎక్స్‌ఆర్‌పీ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు, కార్డానో విలువ 1.1 డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కాయిన్స్ మాత్రమే కాకుండా.. మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.గమనిక: క్రిప్టోకరెన్సీలో విపరీతమైన రిస్క్ ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటి విలువ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు పతనావస్థకు చేరుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే.. దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి, లేదా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?

Women's Day: Sunalini Menon Indias First Female Coffee Taster10
కాఫీ నాణ్యతను డిసైడ్‌ చేసేది ఆమె..! ది బెస్ట్‌ ఏంటో..

పొద్దుపొద్దునే ముక్కుపుటలను తాకి మేల్కొలిపే కాఫీ వాసనకు ఫిదా కానివాళ్లు ఉండరు. అలాంటి కాఫీల్లో మంచి నాణ్యతను డిసైడ్‌ చేసే వాళ్లు ఉంటారని, మరిన్ని విబిన్నమైన బ్రూలను తయారు చేస్తారని తెలుసా..?. జస్ట్‌ కాఫీ గింజలతోనే చేసే కాఫీ కాదు. వాటిని ఉడకించి లేదా రోస్ట్‌చేస్తే వచ్చే ఫ్లేవర్‌లలో ఏది ది బెస్ట్‌ టేస్ట్‌ అని డిసైడ్‌ చేసి వాటికి రేటింగ్‌ ఇచ్చి మార్కెటింగ్‌ చేస్తాయి కంపెనీలు. అందుకోసం ప్రత్యేక కాఫీ టేస్టర్‌లను పెడతారు. వాళ్లే మంచి నాణ్యతతో కూడిన కాఫీని రైతులతో తయారు చేయిస్తారు. అలా మనదేశలో తొలి మహిళా కాఫీ టేస్టర్‌గా పేరుగాంచిన ఆమె ఎవరో తెలుసా..!. ఆమె అక్షరాల అచ్చ తెలుగింటి ఆడపడుచు..!. మరీ ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది? ఎలా అంచెలంచెలుగా ఎదిగింది తదితరాల గురించి చూద్దామా..!.కాఫీ ప్రపంచంలో ది బెస్ట్‌ కాఫీలను మనకందించేది సునాలిని ఎన్. మీనన్. ఆమె భారతదేశంలోని తొలి మహిళా కాఫీ టేస్టర్‌. మీనన్‌ తన నిపుణుల బృందంతో కాఫీ బీన్స్‌ని అంచనా వేస్తారు. వాటిని ఉడికించడం లేదా రోస్ట్‌ చేయడం ద్వారా దాని రుచి, రంగుని డిసైడ్‌ చేసి ఏది బెస్ట్‌ అనేది నిర్ణయిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే కాఫీలను తయారు చేయించేది సునాలినే. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..ఆమె ఫుడ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె డైటీషియన్‌ కావాలని అనుకుంది. ఆ నేపథ్యంలో న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైటెటిక్స్‌లో డైటెటిక్స్‌లో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అలా స్కాలర్‌షిప్ కూడా పొందింది. ఇక యూఎస్‌ వీసా వచ్చేస్తే వెళ్లిపోవడమే తరువాయి. ఆ తరుణంలో స్థానిక వార్తాపత్రికలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాఫీ టేస్టర్ రిక్రూట్‌మెంట్‌ ప్రకటన చూసింది. ఇది కాఫీకి ప్రభుత్వ నోడల్‌ సంస్థ. ఈ ప్రకటన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే తన మేనమామ టీ ఫ్యాక్టరీలోని ఘటన గుర్తుకొచ్చింది. అక్కడ తన మావయ్య వాళ్ల బృందం టీలని సిప్‌ చేసి చర్చిస్తున్న విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పడుది టీ రుచి, సూక్ష్మ నైపుణ్యాలు అంచనా వేయడానికి అలా చేస్తున్నారనేది ఆమెకు తెలియదు. వెంటనే ఆ ఆసక్తితోనే ఆ ఉద్యోగ ప్రకటనకు అప్లై చేసింది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. కానీ సునాలిని ఎంపికవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదుగుతూ.. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్‌ స్థాయి నుంచి ఏకంగా బెంగళూరులో ప్రత్యేకంగా కాఫీలాబ్‌ను స్థాపించే వరకు వెళ్లిపోయింది. ఇది కాఫీ నాణ్యతను నిర్థారించడంలో ఆమె చేసిన అచంచలమైన కృషికి సంకేతం అని చెప్పొచ్చు.సునాలిని తెలుగమ్మాయే..ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని కడలూరుకి చెందింది. అది తన అమ్మమ్మగారి ఊరు. మద్రాస్‌లో పెరగడంతో కాఫీతో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం మద్రాసుని చెన్నైగా పిలుస్తున్నారు. ఇది దక్షిణ భారత ఫిల్టర్ కాఫీకి కేంద్రంగా ఉండేది. అలా సునాలినికి ఇంటి నుంచే కాఫీపై ఆసక్తి ఏర్పడటం జరిగింది. ఇక ఆమె తన కెరీర్‌ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ రంగంలో సముచిత స్థానం ఏర్పరుచుకునేలా చాలా కష్టపడింది. పురుషాధిక్య ప్రదేశంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఏ మహిళకైనా చాలా ధైర్యం ఉండాలని అన్నారామె. ఇలా కాఫీ రుచులను చూస్తూ విసుగొచ్చేసిందా అని సునాలిని ప్రశ్నిస్తే..మరింతగా వాటి గురించి తెలుసుకునేలా మక్కువ ఏర్పరచుకున్నానంటోందామె. ఏ రంగంలోనే బాగా రాణించాలంటే విసుగుకి చోటివ్వకూడదని నొక్కి చెబుతోంది. ఆ ఆసక్తి వల్లే తనకు ప్రతిరోజూ విభిన్న కాఫీ రుచలను ఆస్వాదించడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కుంటున్నాని చెబుతోంది. ఇక చివరిగా తనకు ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ అంటే మహా ఇష్టమని అ‍న్నారు. ఏరంగంలోనైనా సవాళ్లు ఉంటాయనేది సహజం, ఐతే దాన్ని ఇష్టంగా మార్చుకుని ఆసక్తి ఏర్పరుచుకుంటే కచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకుంటానేందుకు సునాలిని విజయగాథే నిదర్శనం. (చదవండి: అరబిక్‌ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

Advertisement

వీడియోలు

Advertisement