Top Stories
ప్రధాన వార్తలు

అరరే కేశవా.. ఎన్టీఆర్, బాబులను బద్నాం చేస్తే ఎలా?
గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు. ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది. 👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు.. 👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?. ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!. అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?. విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?. సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా! ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయంమహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్.. వీటి ఊసే లేదు. అలాగే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు. 👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. కేశవ్ బడ్జెట్ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

సాక్షి దెబ్బకు దిగొచ్చిన నారా లోకేష్
ప్రెస్మీట్లలో ‘‘సాక్షి.. ఎక్కడమ్మా?’’ అంటూ ఇంతకాలం వెటకారం ప్రదర్శిస్తూ వచ్చిన చినబాబు.. ఇప్పుడు ఆ ఛానెల్ కెమెరా కనిపిస్తే ముఖం తిప్పేసుకుంటున్నారు. ఆయన తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం.. తొమ్మిది నెలల పాలనలో అమలుకాని కూటమి ప్రభుత్వ హామీలు.. ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్సీపీ వినిపిస్తున్న గళమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఇవాళ అణచివేత చర్యలకు దిగగా.. సాక్షి దానిని అంతే ధీటుగా ఎదుర్కొంది.సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి పాలన(Kutami Rule)లో అరాచకాలు ఏనాడో తారాస్థాయిని చేరాయి. అయితే రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ ఈ మధ్య మీడియా స్వేచ్ఛను కూడా హరించి వేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో కవరేజ్ కోసం సాక్షి ఛానెల్(Sakshi Channel) సహా నాలుగింటిపై ఆంక్షలు విధించడం చూశాం. ఇప్పుడు.. ఇవాళ.. శాసన మండలిలోనూ ప్రత్యక్ష ప్రసారాలు రాకుండా చానెల్స్‌ను అసెంబ్లీలోకి అనుమతించలేదు.ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల దెబ్బకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) వణికిపోయారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. చివరకు.. నీళ్లు నమిలిన గొంతుతోనే.. తమ లెక్కలన్నీ తప్పుడువేనని.. తమదంతా డబ్బా ప్రచారమేనని నిజాలు ఒప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఇవాళ అసెంబ్లీ శాసన మండలిలో సమాచారశాఖ సాక్షికి లైవ్ ప్రసారాలను నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.సాక్షి మాత్రమే కాదు.. మరో మూడు మీడియా చానెల్స్‌కు లైవ్ ప్రసారం ఇవ్వకుండా అసెంబ్లీలోకి అనుమతించలేదు. కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లకు అనుకూలంగా ఉన్న ఛానెల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ పరిణామంపై సాక్షి గళమెత్తింది. ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను.. ప్రశ్నించే ప్రతినిధులను చూపించేందుకు అనుమతి ఇవ్వాలని పోరాడింది. ఈ దెబ్బకు కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఐ అండ్ పీఆర్ ఛానెల్లో శాసన మండలి ప్రసారాలు పునఃప్రారంభం అయ్యాయి. మొన్నటిదాకా సాక్షి మీడియా సంస్థ మీద అవాక్కులు చవాక్కులు పేల్చిన లోకేష్.. ఇప్పుడు ఆ ఛానెల్నే చూసి భయపడే స్థాయికి చేరుకున్నారనే చర్చ ఒకవైపు రాజకీయ వర్గాల్లో.. మరోవైపు సోషల్ మీడియాలోనూ నడుస్తోంది ఇప్పుడు .

ఆసీస్‌తో సెమీఫైనల్.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూపు స్టేజిలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వన్డే ప్రపంచకప్-2023 ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన కసితో ఉంది. అందుకు తగ్గట్టు తమ ఆస్తశాస్త్రాలను భారత జట్టు సిద్దం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా టీమిండియాను మరోసారి మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ప్లేయర్లు దూరమైనప్పటికి స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు అదరగొడుతోంది. దీంతో మరోసారి ఆసీస్-భారత్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్పిస్తోంది.మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?అయితే తొలి సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌పైనే ఉన్నాయి. ప్రత్యర్ధి భారత్ అయితే చెలరేగిపోయే హెడ్.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్లో అతడి చేసిన విధ్వంసం సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోరు.ఈ డేంజరస్ బ్యాటర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హెడ్ మాత్రం అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లో 76 పరుగులు చేసి తన జట్టును గెలిపించే అంత పనిచేశాడు. అంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్‌పై సెంచరీతో మెరిశాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో హెడ్ పరుగుల వరద పారించాడు. అందుకే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భారత అభిమానులు భయపడుతున్నారు. మరి హెడ్‌ను అడ్డుకునేందుకు భారత్ ఎటువంటి వ్యూహాలు రచిస్తుందో మరో 24 గంటలు వేచి చూడాలి.భారత్‌పై హెడ్ రికార్డు..టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.భారత్‌దే పైచేయి..కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌పై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. భారత్ రెండింట, ఆసీస్ కేవలం ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. చదవండి: Champions Trophy: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి.. వీడియో వైరల్

పోసాని కృష్ణమురళిపై మరో అక్రమ కేసు
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali) మరో కేసు నమోదు అయ్యింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. దీంతో.. సోమవారం ఉదయం ఆయన్ని రాజంపేట సబ్ జైలు నుంచి అక్కడికి తరలిస్తున్నారు.ఈ ఉదయాన్నే పీటీ వారెంట్(PT Warrant)తో నరసరావుపేట టూటౌన్ పోలీసులు రాజంపేట సబ్‌జైలుకు చేరుకున్నారు. పోసాని మీద బీఎన్ఎస్ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. అయితే అభియోగాలు ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే పోసానికి బెయిల్ దక్కే అవకాశాలు ఉండడంతోనే ఇలా ఇప్పుడు మరో కేసు పెట్టారని వైఎస్సార్సీపీ(YSRCP) శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కోసం పోలీసుల పోటీనరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు.👉పోసాని భార్యను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కడప కోర్టు(Kadapa Court) పోసాని కృష్ణ మురళీ తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు పోసానిని కలిసేందుకు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ పెట్టున్నారు. అయితే ఈ లోపే ఆయన్ని నరసరావుపేట తరలించడం గమనార్హం.👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు(తాజా కేసుతో కలిపి..) నమోదు చేశారని అంటోంది. అయితే ఆయనకు గతంలో సర్జరీ జరగడంతో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పోలీసులు వీటన్నంటిని పట్టించుకోవడం లేదు. కావాలనే ఇబ్బంది పెట్టేందుకు వివిధ పోలీసు స్టేషన్లు తిప్పుతున్నారు. పైగా పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎల్పీయూ రికార్డు.. 1700 విద్యార్థులకు 10 లక్షలపైనే ప్యాకేజీలు
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్‌జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్‌గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్‌ను టార్గెట్ చేసి.. రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలోనే రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే.

97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా'
97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి. ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యంగానే అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. అవార్డుల కోసం హాలీవుడ్ టాప్ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై సరికొత్త ట్రెండీ దుస్తుల్లో వారందరూ మెరిశారు. అమెరికాకు చెందిన 'అనోరా' ఉత్తమ చిత్రంగా ఆస్కార్-2025 అవార్డ్‌ను దక్కించుకుంది. అయితే ఇదే చిత్రంలో నటించిన మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ ఉత్తమ హీరోయిన్గా అవార్డ్ అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా) దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ఆడ్రిన్ బ్రాడీ అందుకున్నారు. ది బ్రూటలిస్ట్ అనే చిత్రంలో ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన 'డ్యూన్: పార్ట్2' చిత్రం కూడా రెండు విభాగాల్లో అవార్డ్స్‌ను అందుకుంది. ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది ఆస్కార్ విజేతలు- 2025 ఉత్తమ చిత్రం – (అనోరా)ఉత్తమ నటుడు – అడ్రియన్ నికోలస్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్) ఉత్తమ నటి – మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ (అనోరా) ఉత్తమ దర్శకుడు –సీన్ బేకర్ (అనోరా) ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్) ఉత్తమ సినిమాటోగ్రఫీ - లాల్ క్రాలే ( ది బ్రూటలిస్ట్)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్క్లేవ్)ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – పాల్ టాజ్వెల్ (విక్డ్- Wicked)ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – (ఫ్లో- FLOW)ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- ఇన్ ద షాడో ఆఫ్ ద సైప్రెస్‌ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్‌ఉత్తమ ఎడిటింగ్ - సీన్ బేకర్ (అనోరా)ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – "ఎల్ మాల్" (ఎమిలియా పెరెజ్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్డ్- Wicked)ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్– నో అదర్ ల్యాండ్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రాఉత్తమ సౌండ్ - డ్యూన్- పార్ట్2బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్- పార్ట్2 ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం- ఐ యామ్ నాట్ ఎ రోబోట్బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – డేనియల్ బ్లమ్‌బెర్గ్ (ది బ్రూటలిస్ట్)

కాంగ్రెస్ నేత హిమాని కేసులో బిగ్ ట్విస్ట్.. అతడే హంతకుడు?
ఢిల్లీ: కాంగ్రెస్ నేత హిమాని నర్వాల్ దారుణ హత్య హర్యానాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా.. అతడు హిమానికి స్నేహితుడు అని తెలుస్తోంది. హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత హిమాని హత్య కేసులో సోమవారం ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక, పోలీసులు అతడి దగ్గర నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా హిమానికి స్నేహితుడి అని తెలిసింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు సమాచారం. హిమాని ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాని అతడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. హర్యానాలోని రోహతక్ జిల్లాలో శనివారం హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. సంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలం చేకూర్చుతోంది.ఇక, హిమాని నర్వాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని నర్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటుందని సాంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ తెలిపారు.#WATCH | Rohtak, Haryana: Visuals of the accused who is arrested in Congress worker Himani Narwal murder case. pic.twitter.com/zSvHIEIP7a— ANI (@ANI) March 3, 2025బాధితురాలి తల్లి ఆరోపణలుఅంతకుముందు, బాధితురాలి తల్లి సవిత సంచలన ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కోసం తన కూతురు పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదన్నారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను ఆమె అంత్యక్రియలు చేయనని అన్నారు.

ట్రంప్ ప్రకటన: భారీగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బిట్‌కాయిన్‌తో సహా.. అనేక క్రిప్టో కరెన్సీల విలువ మరింత పెరిగిపోయింది.డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ ధర 91,000 డాలర్లను (సుమారు రూ.80 లక్షలు) దాటింది. ఎక్స్ఆర్పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎంఎస్టీఆర్, కాయిన్, హెచ్ఓఓడీ, ఎంఏఆర్ఏ, ఆర్ఐఓటీ వంటి క్రిప్టో లింక్డ్ స్టాక్‌లు కూడా బుల్లిష్ బిడ్లను చూసే అవకాశం ఉంది.మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించడంతో క్రిప్టో ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడం ప్రారంభించాయి. సమ్మిట్‌కు ప్రముఖ వ్యవస్థాపకులు, సీఈఓలు, క్రిప్టో పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది.క్రిప్టో కాయిన్స్ విలువలు ఇలా..భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:55 గంటల సమాయానికి సొలనా కాయిన్ (ఎస్ఓఎల్) విలువ 24 శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరుకుంది. ఎక్స్ఆర్పీ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు, కార్డానో విలువ 1.1 డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కాయిన్స్ మాత్రమే కాకుండా.. మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.గమనిక: క్రిప్టోకరెన్సీలో విపరీతమైన రిస్క్ ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటి విలువ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు పతనావస్థకు చేరుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే.. దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి, లేదా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?

కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..
పొద్దుపొద్దునే ముక్కుపుటలను తాకి మేల్కొలిపే కాఫీ వాసనకు ఫిదా కానివాళ్లు ఉండరు. అలాంటి కాఫీల్లో మంచి నాణ్యతను డిసైడ్ చేసే వాళ్లు ఉంటారని, మరిన్ని విబిన్నమైన బ్రూలను తయారు చేస్తారని తెలుసా..?. జస్ట్ కాఫీ గింజలతోనే చేసే కాఫీ కాదు. వాటిని ఉడకించి లేదా రోస్ట్చేస్తే వచ్చే ఫ్లేవర్లలో ఏది ది బెస్ట్ టేస్ట్ అని డిసైడ్ చేసి వాటికి రేటింగ్ ఇచ్చి మార్కెటింగ్ చేస్తాయి కంపెనీలు. అందుకోసం ప్రత్యేక కాఫీ టేస్టర్లను పెడతారు. వాళ్లే మంచి నాణ్యతతో కూడిన కాఫీని రైతులతో తయారు చేయిస్తారు. అలా మనదేశలో తొలి మహిళా కాఫీ టేస్టర్‌గా పేరుగాంచిన ఆమె ఎవరో తెలుసా..!. ఆమె అక్షరాల అచ్చ తెలుగింటి ఆడపడుచు..!. మరీ ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది? ఎలా అంచెలంచెలుగా ఎదిగింది తదితరాల గురించి చూద్దామా..!.కాఫీ ప్రపంచంలో ది బెస్ట్ కాఫీలను మనకందించేది సునాలిని ఎన్. మీనన్. ఆమె భారతదేశంలోని తొలి మహిళా కాఫీ టేస్టర్. మీనన్ తన నిపుణుల బృందంతో కాఫీ బీన్స్‌ని అంచనా వేస్తారు. వాటిని ఉడికించడం లేదా రోస్ట్ చేయడం ద్వారా దాని రుచి, రంగుని డిసైడ్ చేసి ఏది బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే కాఫీలను తయారు చేయించేది సునాలినే. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..ఆమె ఫుడ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె డైటీషియన్ కావాలని అనుకుంది. ఆ నేపథ్యంలో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైటెటిక్స్‌లో డైటెటిక్స్‌లో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అలా స్కాలర్షిప్ కూడా పొందింది. ఇక యూఎస్ వీసా వచ్చేస్తే వెళ్లిపోవడమే తరువాయి. ఆ తరుణంలో స్థానిక వార్తాపత్రికలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాఫీ టేస్టర్ రిక్రూట్మెంట్ ప్రకటన చూసింది. ఇది కాఫీకి ప్రభుత్వ నోడల్ సంస్థ. ఈ ప్రకటన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే తన మేనమామ టీ ఫ్యాక్టరీలోని ఘటన గుర్తుకొచ్చింది. అక్కడ తన మావయ్య వాళ్ల బృందం టీలని సిప్ చేసి చర్చిస్తున్న విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పడుది టీ రుచి, సూక్ష్మ నైపుణ్యాలు అంచనా వేయడానికి అలా చేస్తున్నారనేది ఆమెకు తెలియదు. వెంటనే ఆ ఆసక్తితోనే ఆ ఉద్యోగ ప్రకటనకు అప్లై చేసింది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. కానీ సునాలిని ఎంపికవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదుగుతూ.. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా బెంగళూరులో ప్రత్యేకంగా కాఫీలాబ్ను స్థాపించే వరకు వెళ్లిపోయింది. ఇది కాఫీ నాణ్యతను నిర్థారించడంలో ఆమె చేసిన అచంచలమైన కృషికి సంకేతం అని చెప్పొచ్చు.సునాలిని తెలుగమ్మాయే..ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కడలూరుకి చెందింది. అది తన అమ్మమ్మగారి ఊరు. మద్రాస్‌లో పెరగడంతో కాఫీతో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం మద్రాసుని చెన్నైగా పిలుస్తున్నారు. ఇది దక్షిణ భారత ఫిల్టర్ కాఫీకి కేంద్రంగా ఉండేది. అలా సునాలినికి ఇంటి నుంచే కాఫీపై ఆసక్తి ఏర్పడటం జరిగింది. ఇక ఆమె తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ రంగంలో సముచిత స్థానం ఏర్పరుచుకునేలా చాలా కష్టపడింది. పురుషాధిక్య ప్రదేశంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఏ మహిళకైనా చాలా ధైర్యం ఉండాలని అన్నారామె. ఇలా కాఫీ రుచులను చూస్తూ విసుగొచ్చేసిందా అని సునాలిని ప్రశ్నిస్తే..మరింతగా వాటి గురించి తెలుసుకునేలా మక్కువ ఏర్పరచుకున్నానంటోందామె. ఏ రంగంలోనే బాగా రాణించాలంటే విసుగుకి చోటివ్వకూడదని నొక్కి చెబుతోంది. ఆ ఆసక్తి వల్లే తనకు ప్రతిరోజూ విభిన్న కాఫీ రుచలను ఆస్వాదించడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కుంటున్నాని చెబుతోంది. ఇక చివరిగా తనకు ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ అంటే మహా ఇష్టమని అన్నారు. ఏరంగంలోనైనా సవాళ్లు ఉంటాయనేది సహజం, ఐతే దాన్ని ఇష్టంగా మార్చుకుని ఆసక్తి ఏర్పరుచుకుంటే కచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకుంటానేందుకు సునాలిని విజయగాథే నిదర్శనం. (చదవండి: అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..)
ఉలవ రైతు నిలువు దోపిడీ
శిరీష అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు.. ఏమైంది?
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్
'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు
రేవంత్.. మార్చి ఎనిమిది మీకు డెడ్‌లైన్: కవిత హెచ్చరిక
రైల్వే.. నోవే!
105 మ్యాచ్‌లు.. 344 వికెట్లు! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్
డైరెక్టర్ వినాయక్ అనారోగ్యంపై రూమర్స్.. ఇదీ అసలు నిజం
పెరుగుతున్న నష్టాలు.. ముప్పులో 1,000 ఉద్యోగాలు
ప్రధాని మోదీ మెచ్చిన గిర్ అభయారణ్యం ప్రత్యేకతలివే..
నాగచైతన్య సినిమాతో ఎంట్రీ.. సమంతకు అరుదైన గౌరవం
50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా?
తన కంటే చిన్న వాడితో ప్రేమ.. భర్త, పిల్లల్ని కాదని ప్రియుడితో..
ఎలన్ మస్క్‌కు శిశు సంక్షేమ శాఖ ఇస్తే బెటర్ సార్ !
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
ఈ రాశి వారికి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్
CT 2025, IND VS NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
ఉలవ రైతు నిలువు దోపిడీ
శిరీష అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు.. ఏమైంది?
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్
'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు
రేవంత్.. మార్చి ఎనిమిది మీకు డెడ్‌లైన్: కవిత హెచ్చరిక
రైల్వే.. నోవే!
105 మ్యాచ్‌లు.. 344 వికెట్లు! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్
డైరెక్టర్ వినాయక్ అనారోగ్యంపై రూమర్స్.. ఇదీ అసలు నిజం
పెరుగుతున్న నష్టాలు.. ముప్పులో 1,000 ఉద్యోగాలు
ప్రధాని మోదీ మెచ్చిన గిర్ అభయారణ్యం ప్రత్యేకతలివే..
నాగచైతన్య సినిమాతో ఎంట్రీ.. సమంతకు అరుదైన గౌరవం
50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా?
తన కంటే చిన్న వాడితో ప్రేమ.. భర్త, పిల్లల్ని కాదని ప్రియుడితో..
ఎలన్ మస్క్‌కు శిశు సంక్షేమ శాఖ ఇస్తే బెటర్ సార్ !
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
ఈ రాశి వారికి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్
CT 2025, IND VS NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
సినిమా

ఆస్కార్-2025 విన్నింగ్ మూవీస్.. ఏది ఏ ఓటీటీలో?
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక.. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి చాలా సినిమాలు పోటీపడ్డాయి గానీ అంతిమంగా విజేతలు ఎవరనేది తేలిపోయింది. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్ సినిమా), ఉత్తమ నటిగా మికీ మ్యాడిసన్ నిలిచింది. ఉత్తమ చిత్రంగా అనోరా ఆస్కార్ పురస్కారం దక్కించుకుంది. మరి ఆస్కార్ గెలుచుకున్న సినిమాల్ని ఏ ఓటీటీలో చూడొచ్చంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)ఆస్కార్స్-2025 విజేతల జాబితా - ఓటీటీ డీటైల్స్ఉత్తమ చిత్రం- అనోరా మూవీ - (అమెజాన్ ప్రైమ్)ఉత్తమ నటుడు- అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్ సినిమా -అమెజాన్ ప్రైమ్)ఉత్తమ నటి - మికీ మ్యాడిసన్ (అనోరా మూవీ- అమెజాన్ ప్రైమ్)ఉత్తమ దర్శకుడు - సీన్ బెకర్ (అనోరా సినిమా - అమెజాన్ ప్రైమ్)ఉత్తమ సినిమాటోగ్రఫీ - ద బ్రూటలిస్ట్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ మూవీ - నో అదర్ ల్యాండ్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సినిమా - ఐ యామ్ స్టిల్ హియర్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - ద బ్రూటలిస్ట్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ సౌండ్ - డ్యూన్ పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - సీన్ బీకర్ (అనోరా మూవీ - అమెజాన్ ప్రైమ్)మిగతా విభాగాల్లో ఎవరెవరికి అవార్డులు?ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)ఉత్తమ సహాయ నటి – జో సల్దానా (ఎమిలియా పెరెజ్)బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కాంక్లేవ్బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – అనోరాబెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – విక్డ్ (పాల్ టేజ్ వెల్)బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – అనోరాబెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – విక్డ్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – పియర్ ఒలివియర్ పర్సిన్, స్టీఫెన్ గులియన్, మారిలిన్ స్కార్సెల్లి (ది సబ్ స్టాన్స్)బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం- ఐ యామ్ నాట్ ఏ రోబోబెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- ఇన్ ద షాడో ఆఫ్ సైప్రస్బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రాఈ ఏడాది ఉత్తమ చిత్రం, నటుడు, నటి, దర్శకుడు.. ఇలా దాదాపు విజేతగా నిలిచిన ప్రతి చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)

ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా
మరో కొత్త సినిమా పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల మొదటి వారంలో థియేటర్లలో రిలీజైన డబ్బింగ్ మూవీ 'పట్టుదల'.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులోకి వచ్చింది? దీని సంగతేంటి?తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించగా.. అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించిన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో 'పట్టుదల' పేరుతో ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చింది కానీ తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)రోడ్ యాక్షన్ థ్రిల్లర్ కావడం, కంటెంట్ పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ రాలేదు. కానీ హీరో అజిత్ కావడంతో కలెక్షన్స్ రూ.100 కోట్లు పైనే వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఓ లుక్కేసేయండి.'పట్టుదల' కథ విషయానికొస్తే. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్బైజాన్లో ఉంటారు. పిల్లలు లేరు, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుందామని అనుకుంటారు. విడిపోయే ముందు ఓ ఆఖరి రోడ్ ట్రిప్ కి రమ్మని అర్జున్, కాయల్ ని అడుగుతాడు. ఆ ప్రయాణంలో వాళ్లకి ప్రమాదాలు ఎదురవుతాయి. కాయల్ ని కిడ్నాప్ చేస్తారు. చివరికి ఏమయ్యిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు)

ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?
మార్చి తొలివారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల హడావుడి నడుస్తోంది. అందుకే తెలుగు సినిమాలేం ఈసారి థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కానీ ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ లో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు)మరోవైపు ఓటీటీలో కేవలం 11 సినిమాలు-వెబ్ సిరీసులే రాబోతున్నాయి. కానీ వీటిలో రేఖాచిత్రం అనే డబ్బింగ్ మూవీతో పాటు తండేల్, విడామయూర్చి, బాపు చిత్రాలు చూడదగ్గవే. ఇవి కాకుండా సర్ ప్రైజ్ రిలీజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 3-9వ తేదీ వరకు)నెట్ ఫ్లిక్స్విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 03తండేల్ (తెలుగు సినిమా) - మార్చి 07నదానియాన్ (హిందీ హిందీ మూవీ) - మార్చి 07అమెజాన్ ప్రైమ్దుఫాహియా (హిందీ సిరీస్) - మార్చి 07సోనీ లివ్రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 07ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) - మార్చి 07హాట్ స్టార్డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 06బాపు (తెలుగు సినిమా) - మార్చి 07తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) - మార్చి 07బుక్ మై షోబారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)

నటిపై సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోలీవుడ్ నటి విజయలక్ష్మి పడుపు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్టు నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్, నటుడు సీమాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వివరాలు..విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే సీమాన్ లైంగిక దాడికేసు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరిపి, కోర్టులోచార్జ్ షీట్ దాఖలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఈకేసు నుంచి తన పేరును తప్పించాలని కోరుతూ సీమాన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ పరిస్థితులలో సీమాన్ మరోమారు విజయలక్ష్మిపై విరుచుకుపడ్డారు. తెన్కాశి పర్యటనకు వెళ్తూ చైన్నె విమానాశ్రయంలో మీడియాతో ఆయన మట్లాడుతూ, తమిళనాడులో రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుల నమోదు లేని రోజంటూ లేదని వివరిస్తూ, వీటి మీద దృష్టి పెట్టకుండా తనను అవమాన పరచడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. తన మీద ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి పడుపు వృత్తిలో ఉన్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ఆరోపించారు. నగరంలో ఒక ఖరీదైన భవనం తీసుకుని ఆమెతో పాటు మరికొందరు యువతులతో ఈ వృత్తిలో ఉన్నారంటూ తెలిపారు. ఎంజాయ్మెంట్ గురించి ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ చెప్పిన ఎంజాయ్మెంట్ వితవుట్ రెస్పాన్స్ బిలిటీ అన్న వ్యాఖ్యలను తాను అనుసరిస్తున్నానని వివరించారు. పెరియార్ మార్గంలోనే ఇప్పుడు తానుకూడా నడుస్తున్నానని, అలాంటప్పుడు తాను ఏ తప్పు చేసినట్టో అని ప్రశ్నించారు. ఇందుకు డీఎంకే ఎంపీ కనిమొళితో పాటూ ఆ పార్టీ వర్గాలే కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయలక్ష్మి తన కన్నీరే భవిష్యత్‌లో సీమాన్‌కు శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి.. వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. లీగ్ స్టేజిని ఆజేయంగా ముగించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో విజయోత్సహంతో సెమీస్‌కు భారత్ సన్నద్దమైంది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కాళ్లును మొక్కబోయాడు. అవును మీరు విన్నది నిజమే. కోహ్లి ఎందుకు అలా చేశాడో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.అసలేం జరిగిందంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42) , హార్దిక్ పాండ్యా(45) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. టీమిండియా స్పిన్నర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. అయితే న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి కేన్ విలియమ్సన్ మాత్రం భారత్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. మిగితా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడితే కేన్ మాత్రం సమర్ధవంతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి అక్షర్ పటేల్.. విలియమ్సన్ వికెట్‌ను భారత్‌కు అందించాడు. కివీస్ ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. అద్బుతమైన బంతితో కేన్‌ను బోల్తా కొట్టించాడు. అక్షర్ సంధించిన ఫ్లైటెడ్ డెలివరీని సరిగ్గాఇ అంచనా వేయలేకపోయిన విలియమ్సన్ స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అక్షర్ తన 10 ఓవర్ల స్పెల్ చివరి బంతికి వికెట్ తీయడం గమనార్హం. దీంతో భారత్ విజయం లాంఛనమైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి వేగంగా అక్షర్ వద్దకు వెళ్లి అతడు కాళ్లను టచ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్షర్ వెంటనే కిందకూర్చుని నవ్వుతూ కోహ్లిని ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Kohli touching Axar Patel's feet after he got Williamson out 😭#Kohli #AxarPatel #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/mJmgQ95Y15— voodoo mama juju (@ayotarun) March 2, 2025

చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ స్టేజిని భారత్ విజయంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ విజయంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడిన వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) స్పిన్ మాయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.అతడిని ఎదుర్కోలేక కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చక్రవర్తి ఓవరాల్‌గా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో లక్ష్య చేధనలో కివీస్ 205 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన వరుణ్..అంతర్జాతీయ వన్డేల్లో మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్న భారత బౌలర్‌గా వరుణ్ రికార్డులకెక్కాడు. వరుణ్ తన రెండో మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బంగ్లాదేశ్‌పై బిన్నీ తన మూడో వన్డేలో కేవలం 4 పరుగులిచ్చి 6 వికెట్లతో చెలరేగాడు.తాజా మ్యాచ్‌తో బిన్నీ అల్‌టైమ్ రికార్డును చక్రవర్తి అధిగమించాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన మూడో భారత బౌలర్‌గా ఈ తమిళనాడు స్పిన్నర్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఈ ఫీట్‌ను అందుకున్నారు.సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ..ఇక మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2023 వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి బదలు తీర్చుకోవాలని కసితో రోహిత్ సేన ఉంది. ప్రస్తుతం భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. అయితే సెమీస్‌లో కూడా నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందా లేదా హర్షిత్ రాణాను మళ్లీ తుది జట్టులోకి తీసుకువస్తుందో వేచి చూడాలి.కివీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు రాణాకు విశ్రాంతి ఇచ్చిన టీమ్ మెనెజ్‌మెంట్.. వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చింది. అయితే జట్టులోకి వచ్చిన వరుణ్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం నలుగురు స్పిన్నర్లతో భారత్ ఆడింది. మొత్తం నలుగురు స్పిన్నర్లు కూడా తమ మార్క్‌ను చూపించారు. దీంతో తుది జట్టు కూర్పు భారత్‌కు సవాలుగా మారింది. అంతకు తోడు మహ్మద్ షమీ కూడా అంత రిథమ్‌లో కన్పించడం లేదు. మరి భారత జట్టు మెనెజ్‌మెంట్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో మరో 24 గంటలకు వేచి చూడక తప్పదు.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్

వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూపు స్టేజిని భారత్ ఆజేయంగా ముగించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టును అయ్యర్, అక్షర్ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 98 పరుగులు జోడించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం లక్ష్య చేధనలో కివీస్ 205 పరుగులకే కుప్పకూలింది. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు.అతడితో పాటు కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్, జడేజా, అక్షర్ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(81) టాప్ స్కోరర్ నిలిచాడు. కాగా భారత్ తమ తొలి సెమీఫైనల్లో మంగళవారం(మార్చి 4) ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సెమీస్‌కు ముందు ఇటువంటి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ తెలిపాడు."ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని భావించాము. మేము అనుకున్నది జరిగినందుకు చాలా అనందంగా ఉంది. న్యూజిలాండ్ జట్టు ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అటువంటి జట్టును ఓడించాలంటే మన ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాలి. పవర్ ప్లేలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము.ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మా దగ్గర క్వాలిటీ బౌలర్లు ఉండడంతో డిఫెండ్ చేసుకునే టోటల్ లభించందని భావించాము. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. నిజంగా వరుణ్ చక్రవర్తి ఒక మిస్టరీ స్పిన్నరే.అతడిని ఎవరితోనూ పోల్చలేం. తొలి రెండు మ్యాచ్‌లకే బెంచ్‌కే పరిమితమైన అతడికి ఓ ఛాన్స్ ఇద్దామని ఈ మ్యాచ్‌లో ఆడించాము. అతడు బంతితో అద్భుతం చేశాడు. తదుపరి మ్యాచ్ కోసం మేము ప్రస్తుతం ఆలోచించడం లేదు. కానీ అతని అద్భుత ప్రదర్శనతో టీమ్ కాంబినేషన్ కొంచెం తలనొప్పిగా మారింది. ఈ టోర్నమెంట్లో ప్రతీ మ్యాచ్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇటువంటి మెగా ఈవెంట్లలో తప్పులు జరగడం సహజం.కానీ తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆసీస్‌తో సెమీస్ మంచి గేమ్ కానుంది. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మ్యాచ్ కోసం నేను అతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.చదవండి: Champions Trophy: భారత్‌తో సెమీఫైనల్.. ఆసీస్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు

టీమిండియాతో సెమీఫైనల్.. ఆసీస్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా సెమీఫైనల్-1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ తొడకండరాలు పట్టేశాయి.దీంతో అతడికి విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచించారు. తద్వారా అతడు సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీతో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న కొన్నోలీ.. ఇప్పుడు ప్రధాన జట్టులోకి వచ్చాడు. కొన్నోలీకి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవలే జరిగిన బిగ్‌బాష్ లీగ్-2025 సీజన్లో కూపర్ దుమ్ములేపాడు. అదేవిధంగా ఈ యువ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మూడు వన్డేలు ఉన్నాయి. అయితే తుది జట్టులో మాత్రం టాప్-ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లేదా కొన్నోలీకి చోటు దక్కే అవకాశముంది. అదనపు స్పిన్ అప్షన్ కావాలని ఆసీస్ మెనెజ్‌మెంట్ భావిస్తే కొన్నోలీకే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయం.ఇక సెమీస్ పోరు కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న కంగారులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది.సెమీస్‌కు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంగాచదవండి: Champions Trophy: వరుణ్ ‘మిస్టరీ’ దెబ్బ
బిజినెస్

కస్టమర్ ఖాతాలోకి లక్షల కోట్లు!!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో లోపాల వల్ల కస్టమర్ల ఖాతాల్లోకి వేరే వాళ్ల డబ్బులొచ్చి పడుతుండటం, బ్యాంకులు నాలిక్కర్చుకుని మళ్లీ వెనక్కి తీసుకునే ఉదంతాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇది వేలు, లక్షల రూపాయల స్థాయిలో ఉంటుంది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌లోనూ అలాంటిదే జరిగింది. కాకపోతే, ఒకటి రెండూ లక్షలు కాదు ఏకంగా లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో! సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ఉద్యోగి ఓ కస్టమర్ ఖాతాలోకి 280 డాలర్లు క్రెడిట్ చేయబోయి.. అక్షరాలా 81 లక్షల కోట్ల డాలర్లను క్రెడిట్ చేశారు. లావాదేవీలను పర్యవేక్షించాల్సిన మరో ఉద్యోగి కూడా దాన్ని క్లియర్ చేశారు. ఈ దెబ్బతో సిటీగ్రూప్ ఖజానా ఖాళీ అయిపోయింది. దాదాపు గంటన్నర తర్వాతెప్పుడో జరిగిన పొరపాటును ఇంకో ఉద్యోగి గుర్తించడంతో, ఇది బైటపడింది. చివరికి ఆ లావాదేవీని రివర్స్ చేసి, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని హమ్మయ్య అనుకున్నారు.నిజానికి సిటీ గ్రూప్ గత ఏడాది కాలంగా సుమారు 100 కోట్ల డాలర్ల మొత్తానికి సంబంధించి ఇలాంటి పది పొరపాటు లావాదేవీలను తృటిలో తప్పించుకుంది. వాస్తవానికి ఇలాంటి పొరపాట్ల సంఖ్య పదమూడు నుంచి పదికి తగ్గిందట. ఇలాంటి పొరపాట్లను నివారించడంలో ఆశించినంత పురోగతి సాధించనందుకు గాను సిటీగ్రూప్‌కు నియంత్రణ సంస్థ 13.6 కోట్ల డాలర్ల జరిమానా విధించగా, రిస్కులు.. డేటా వైఫల్యాలకు గాను 40 కోట్ల డాలర్ల పెనాల్టీ కూడా పడింది.

విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..
పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శివకుమార్ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. అయితే 50–60 శాతం పెట్టుబడులను మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌తో పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25 - 30 శాతానికి పరిమితం అవుతాయి.లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి 50–60 శాతం కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలకు గురవుతుంది.చైనా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని ఉంది. ఇందుకు ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయా? – యోగితా రాణాఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా వైవిధ్యం చేసుకోవాలన్న మీ ఆలోచన అభినందనీయం. అయితే ఈ వైవిధ్యం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు. కేవలం చైనాలో ఇన్వెస్ట్ చేసేవి లేదా కేవలం యూఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వాటితో కాన్సన్ట్రేషన్ రిస్క్ (పెట్టుబడి ఒకే చోట ఉండిపోవడం) ఏర్పడుతుంది. విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది చక్కటి వైవిధ్యంతో ఉండాలి. ఇన్వెస్టర్లు కేవలం ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే వాటికి దూరంగా ఉండడం మంచిది.యూఎస్ ఫండ్స్‌కు ఇందులో కొంత మినహాయింపు ఉంది. యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపనీల్లో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. యూఎస్ కంపెనీలను పరిశీలిస్తే అవి కేవలం యూఎస్‌కే పరిమితం కాకపోవడాన్ని గుర్తించొచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు (గూగుల్, మెటా, యాపిల్ తదితర) అంతర్జాతీయంగా కస్టమర్లు ఉంటారు. ఆయా కస్టమర్లు కేవలం యూఎస్‌లోనే ఉండరు. కనుక యూ ఎస్‌కు చెందిన ఫండ్ ఒకే ప్రాంతానికి చెందినది అయినప్పటికీ, అంతర్జాతీయ ఎక్స్పోజర్ను ఇస్తుంది.ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో 5 - 10% మించకుండా చైనా స్టాక్స్‌కు కేటాయించుకునేట్టు అయితే.. యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ డైరెక్ట్ ఫండ్, ఎడెల్వీజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్‌షోర్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్‌సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్‌సెంగ్ టెక్ ఈటీఎఫ్, నిపాన్ ఇండియా ఈటీఎఫ్ హ్యాంగ్‌సెంగ్ బీస్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్.

స్థానిక కంటెంట్‌తో షార్ట్ వీడియోలకు డిమాండ్
న్యూఢిల్లీ: భారత్‌లో స్వల్ప నిడివి వీడియోలకు (షార్ట్ వీడియోలు) బూమింగ్ ఇప్పుడే మొదలైందని షేర్‌చాట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మనోహర్సింగ్ చరణ్ పేర్కొన్నారు. సృజనాత్మకతతో కూడిన స్థానిక కంటెంట్‌ను చిన్న పట్టణాల్లోనూ ఆదరిస్తుండడం డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన విభిన్నమైన సేవలు స్థిరమైన డిమాండ్‌కు దోహపడుతున్నట్టు, ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు బ్రాండ్లకు కొత్త అవకాశాలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. దేశ జనాభాలో ఇంటర్నెట్ చేరువ 60%కి వచి్చనట్టు, 65 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమైన వారు సోషల్ మీడియా, షార్ట్ వీడియోలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు.లాభాలకు చేరువలో..: కన్సాలిడేటెడ్ స్థాయిలో ఎబిటా పాజిటివ్‌కు కంపెనీ చేరువలో షేర్ చాట్ ఉన్నట్టు చరణ్ తెలిపారు. లాభాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో నియామకాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గూగుల్ మద్దతుతో నడుస్తున్న షేర్‌చాట్ వచ్చే రెండేళ్లలో ఐపీవోకు వచ్చే ప్రణాళికలతో ఉంది. ఆదాయంలో 33% వృద్ధిని సాధించగా, నష్టాలు మూడింట ఒక వంతుకు తగ్గిపోయినట్టు ప్రకటించారు. స్టాండలోన్ ప్రాతిపదికన షేర్‌చాట్ ఎబిటా స్థాయిలో లాభాల్లోకి వచి్చనట్టు వెల్లడించారు.

ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ప్చ్.. జీతాలే..
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా జీతాలు మాత్రం పెరగడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మానీ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు నైపుణ్యాల కొరతే ప్రధాన కారణమని తెలిపారు. అత్యధిక జనాభాను భారత్ ప్రయోజనకరమైన అంశంగా మల్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బోధన, శిక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం వర్కర్లు–జనాభా నిష్పత్తి గత ఏడేళ్లుగా పెరుగుతోంది. అంటే జనాభా వృద్ధికి మించి ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఉద్యోగాలు పెరగడం లేదనడం తప్పు. క్యాజువల్ వర్కర్ల వాస్తవ వేతనాలూ పెరిగాయని, వారి పరిస్థితులూ మెరుగుపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రెగ్యులర్ జీతాల ఉద్యోగాలే పెద్ద సమస్యగా ఉంటోంది. ఈ కేటగిరీలో ఏడేళ్లుగా ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా వాస్తవ వేతనాలు పెరగలేదు‘ అని విర్మానీ చెప్పారు. మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఫోకస్ చేయాలి.. కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి కూడా నైపుణ్యాలు అవసరమేనని విర్మానీ చెప్పారు. ‘ఉద్యోగం, నైపుణ్యాలనేవి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. నైపుణ్యాలుంటే ఉద్యోగం దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం అన్ని అంశాల్లోనూ మెరుగుపడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని వివరించారు.
ఫ్యామిలీ

నాకు నచ్చిన పాత్ర మనోరమ: మృణాళిని
తెలుగులో సుప్రసిద్ధమైన నవలల్లో ఒకటి రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘అల్పజీవి’. ఇది చదివిన వారందరికీ సుబ్బయ్య పాత్ర, చైతన్యస్రవంతి శిల్పం మాత్రమే గుర్తుంటాయి. కానీ అందులో కథకు అతి కీలకమైన స్త్రీ పాత్ర ఉంది. ఆమే మనోరమ. నవలలో వస్తువు సుబ్బయ్యలోని ఆత్మన్యూనత. అదే ఆ పాత్రను అల్పజీవిని చేసిన అంశం. ఆ ఆత్మన్యూనత తగ్గడానికి ప్రేరణ మనోరమ సాన్నిహిత్యం. అందరిచేతా ‘నంగిరి పింగిరి గాడు’, ‘భయస్థుడు’, ‘అసమర్థుడు’ అనిపించుకున్న సుబ్బయ్య, భార్య చేత ‘మగడు మగాడు కాకపోతే భార్యల గతి ఇంతే’ అని ఈసడించుకోబడ్డ సుబ్బయ్య, నవల చివర్లో ‘ఈ ఆడది కష్టంలో ఉందని తెల్సుకుందికి అట్టే కష్టం లేదు... చేతనైతే సాయం చేయవచ్చు’ అని మనోరమ గురించి అనుకునే స్థాయికి ఎదగడానికి, తన అల్పత్వాన్ని అధిగమించడంలో తొలి అడుగు వేయడానికి కారణం ఆ మనోరమే. మనోరమను ‘నల్లచీర మనిషి’ అని పరిచయం చేస్తాడు రచయిత. స్కూలు టీచరు అని చెబుతాడు. ఆమె గతం మనకుగానీ, సుబ్బయ్యకు గానీ చెప్పడు. మాట తీరును బట్టి కలుపుగోలు మనిషి, ముప్ఫయ్యో పడిలో ఉన్న అందమైన స్త్రీ అని మాత్రమే ఆ పరిచయంలో అర్థమవుతుంది. మనోరమ తెలుగు నవలాసాహిత్యంలోనే విలక్షణమైన పాత్ర. కొంతవరకూ మార్మిక పాత్ర కూడా. నవలలో సుబ్బయ్యను మనిషిలా చూసిన ఏకైక వ్యక్తి. అతన్ని అన్ని బలహీనతలతో సహా అభిమానించిన వ్యక్తి. ఏ ఫలాపేక్ష లేకుండా అతని కష్టాలన్నీ సానుభూతితో వినడమే కాక, అతనికి శారీరకంగానూ దగ్గరైన వ్యక్తి. అతని ప్రాణానికి కంటకుడిగా మారిన గవరయ్యను తన ఊరివాడన్న చిన్న సెంటిమెంటును గుర్తుచేసి, నచ్చజెప్పి, సుబ్బయ్యకు ఆపద తప్పించిన ఉపకారి.మనశ్శాస్త్రవేత్త ఆల్ఫెడ్ర్ ఆడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఆత్మన్యూనతకు లోనై, సమాజం నుంచి పారిపోవాలనుకునే వ్యక్తికి కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి గానీ ఒక ఆధారం, ఊరట లభిస్తే ఆ బలహీనత నుంచి కోలుకుంటారు. ఆ ఊరటకు ప్రతీకే మనోరమ. మగవాడికి, ఒక అపరిచితురాలైన అందమైన స్త్రీ తన సాన్నిహిత్యాన్ని కోరుతున్నది అన్న ఒక్కటి చాలు – అహం తృప్తి పడ్డానికీ; న్యూనత తగ్గడానికీ. పురుషుల సైకాలజీకి సంబంధించిన ఈ అంశానికి ప్రతినిధిగా మనోరమను సృష్టించి, రావిశాస్త్రి తన రచనాప్రతిభను చాటుకున్నారు. రచయిత మనోరమ అంతరంగాన్ని చిత్రించకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. నవల చివర్లో మాత్రం ఆమె ఎందుకో బాధపడుతోందన్న సూచన చేస్తాడు. దాని వివరాలేవీ చెప్పడు. ఎందుకంటే ఇది సుబ్బయ్య కథ. మనోరమ కథ కాదు. కానీ, ఎప్పుడూ తన ఏడుపు మాత్రమే ఏడ్చుకునే సుబ్బయ్య ఒక మనిషిగా మారడానికి మనోరమలో కలిగిన ఈ వ్యాకులమే నాంది పలికింది. ఆ పాత్ర ప్రయోజనం ఈ నవలకు సంబంధించినంతవరకూ అంతే కావచ్చు. ఈ రకంగా రావిశాస్త్రి మనోరమకు అన్యాయం చేసి వుండవచ్చు కూడా... కానీ, రావిశాస్త్రి ఎందుకోసం సృష్టించినా, గుండె నిండా ఔదార్యం, మనసు నిండా ప్రేమ కలిగిన మనోరమ తెలుగు నవలా సాహిత్యంలో గుర్తుంచుకోదగ్గ స్త్రీ పాత్ర. (చదవండి: 'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే)

'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే
ప్రతి ఆడపిల్ల ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్పిన నెగ్గుతుంది. ఎంతటి ధనవంతుడిని పెళ్లి చేసుకున్న ధైర్యంగా ఉండలేం. ఆర్థికంగా బాగుంటేనే స్థైర్యం దాతనంతటే అదే తన్నుకుంటూ వస్తుంది. ఆ విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి అంటోంది బాలీవుడ్ నటి సొనాలీ బెంద్రే. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.ఎలాగంటే...‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఆడపిల్లలకు చదువు, ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని నమ్ముతుంది మా అమ్మ (పేరు.. రూప్సీ బెంద్రే). నేను మోడలింగ్ ట్రయల్స్‌లో ఉన్న రోజుల్లో ఒకసారి.. నన్ను, నా సిస్టర్స్‌ని కూర్చోబెట్టుకుని చెప్పి ‘మీరు ఎంత సంపన్నులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పినా నేను పర్మిషన్ ఇవ్వను. మీ కాళ్ల మీద మీరు నిలబడి.. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయ్యాకే.. పెళ్లి! ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మీకు వాయిస్ ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి’ అని చెప్పింది. ఆ మాట మంత్రంలా పనిచేసింది మాకు. కెరీర్లో ఎదగడానికి స్ఫూర్తినిచ్చింది. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే స్ఫూర్తి అమ్మే! నిజంగానే ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. దాని వల్ల ఒక భరోసా వస్తుంది. ఆ భరోసా మనల్ని స్ట్రాంగ్‌గా నిలబెడుతుంది!’.(చదవండి: ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!)

International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Heroines) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్‌టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్‌డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్‌డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్ టెస్ట్మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళినాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.పురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్‌బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది.

ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!
చిన్న చిన్న కష్టాలకే చాలామంది దిగాలుగా జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారందరూ ఒక్కసారి ఫొటోలో కనిపిస్తున్న ఈ చేపను చూస్తే, మీరు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. చివరి నిమిషం వరకు ప్రయత్నించాలి అని ఈ చేప బాగా నమ్మినట్లు ఉంది. అందుకే, సముద్రం నుంచి చేపల వలలో చిక్కినా; ఫిషింగ్ మార్కెట్‌కు తరలించినా; ఆఖరుకు తన శరీరంలోని సగభాగాన్ని కత్తిరించినా ఈ చేప తన జీవన పోరాటాన్ని సాగిస్తూనే ఉంది. తోకతో పాటు తన శరీరంలో సగభాగం కోల్పోయినా, అది కుళ్లిపోయినా ఈ చేప సుమారు ఆరు నెలల పాటు సజీవంగానే ఉంది. ఇటీవలే థాయ్‌లాండ్ చేపల బజారులో కనిపించిన ఈ చేపను వాచారా చోటె అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. చేప ఆత్మవిశ్వాసాన్ని మెచ్చి, దానికి ‘ఐ హాఫ్’ అని పేరు పెట్టి, జాగ్రత్తగా ఈ చేపను పెంచుకుంటున్నాడు. ‘ప్రస్తుతం దానికి తగిన చికిత్స అందిస్తున్నాను. ఒకవేళ చేప మరణిస్తే, దానికి పూర్తి గౌరవ మర్యాదలతోనే అంత్యక్రియలు నిర్వర్తిస్తాను’ అని చోటె చెప్పాడు.(చదవండి: శత్రువుని భయపెట్టబోయి భంగపడటం అంటే ఇదే..! ఇరాన్ అత్యుత్సాహం..)
ఫొటోలు
National View all

ప్రధాని మోదీ మెచ్చిన గిర్ అభయారణ్యం ప్రత్యేకతలివే..
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ గిర్ వన్యప్రాణుల అ

ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు.

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్ర

అయోధ్య రాముని దర్శన వేళల్లో మార్పులు
అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్య(

రూ. 1000తో రూ. 1.50 లక్షల బంగారం.. వింత టోకరా
ఆ బంగారు నగల దుకాణంలో వింత మోసం చోటుచేసుకుంది.
International View all

ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు
మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను(

అమెరికాలో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
లూసియానా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

జాబిల్లిపై ల్యాండర్ల సందడి!
చంద్రుడిపై ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ ఆదివారం సాఫీగా దిగింది.

డీల్ ఓకే.. ట్రంప్‌తో మరోసారి భేటీకి సిద్ధమే: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నేతల నుంచి మద్దతు వస

World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ
అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించే ఉద్దేశంతో ప్రతి ఏటా మార్చి 3న ప్రప
NRI View all

వలస కార్మికుల మృత్యు ఘోష
మోర్తాడ్ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శ

అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవ
క్రైమ్

అమ్మను అనాథను చేశాడు!
మన్సూరాబాద్(హైదరాబాద్): రోజు రోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు ఆమెను రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కాలనీవాసులు అక్కున చేర్చుకుని అన్న పానీయాలు అందించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ (80)కి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వీరిలో ఇద్దరు పెద్ద కుమారులు గతంలోనే చనిపోయారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ నాయక్ వద్ద ధర్మీ ఉంటోంది. లక్ష్మణ్‌నాయక్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఎల్బీనగర్లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం లక్ష్మణ్‌నాయక్ తన తల్లి ధరీ్మని మన్సూరాబాద్‌లోని చిత్రసీమ కాలనీలోని లిటిల్ చాంప్ స్కూల్ వద్ద తన ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ధర్మీ కాలనీలోని రోడ్ నంబర్–4లో ఓ మూలన కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన రిటైర్డ్ అధికారి బొప్పిడి కరుణాకర్‌రెడ్డి, సైదులు గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచారు. తన కుమారుడు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పింది. దీంతో ఆమెకు ఆశ్రయం కల్పించి ఈ సమాచారాన్ని 108తో పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో కాలనీ వాసులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఆలేటి వృద్థాశ్రమానికి ధరీ్మని తరలించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని కాలనీ వాసులు కోరారు.

మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆశ చూపించాడు. టీడీపీ నేతల మాటలు నమ్మిన నిరుద్యోగులు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసంఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం టీడీపీ నేతల బాధితులు ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి.

మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..
మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ శివపురి(Shivpuri District) జిల్లాలో జరిగిన పాశవికమైన ఘటన వివరాల్లోకి వెళ్తే..ఆ చిన్నారి ఓ యువకుడు జరిపిన లైంగికదాడి(Sexual Assault)లో తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే.. ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి, ఒంటి నిండా పంటి గుర్తులు పడ్డాయి. పెద్ద పేగు చిధ్రమైంది. ఆఖరికి ప్రైవేటు భాగం రెండుగా చీల్చేసి ఉంది. కనీసం మంచంపై పక్కకు కూడా తిరగలేని స్థితిలో.. కొన ఊపిరితో ఉందా చిన్నారి. ఫిబ్రవరి 22వ తేదీన దినార(Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి.. హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే.. పక్కింటి భయ్యా చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. కాసేపటికి ఆ కాలనీకి పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై.. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్ కమలారాజ్ ఆస్పత్రిలో చేర్పించారు.అత్యంత దారుణంగా..ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు గంటలపాటు అత్యవసర సర్జరీలు చేశారు వైద్యులు. గాయాలకు చికిత్సతో పాటు చిధ్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు వేశారు. అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మైనర్‌గా చూపించి..ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినటట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. అతని వయసు 17 ఏళ్లుగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్‌గా చూపించి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే..పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా.. జువైనల్ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. शिवपुरी के दिनारा में हमारी मासूम बेटी के साथ हुए अमानवीय कृत्य की जानकारी मिलते ही आज परिजनों से फोन पर बातचीत की एवं उन्हें हौसला दिया। बेटी अभी अस्पताल में भर्ती है और उसकी हालत स्थिर है। मैं लगातार डॉक्टरों की टीम के संपर्क में हूं। हमारे क्षेत्र और प्रदेश में इस तरह के…— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 25, 2025