Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ysrcp Leader Sv Satish Reddy Fires On Chandrababu And Pawan1
‘జబర్దస్త్‌ స్కిట్లు.. బాబు, పవన్‌ వెకిలి నవ్వులు’

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్‌సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL 2025 KKR vs RCB 1st Match Live Updates and Highlights2
IPL 2025: ఆర్సీబీ వర్సెస్‌ కేకేఆర్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

IPL 2025 RCB vs KKR 1st Match Live Updates: దూకుడుగా ఆడుతున్న రహానే..6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్య రహానే(39) దూకుడుగా ఆడుతున్నాడు.4 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 25/14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్‌ అజింక్య రహానే(16), వెంకటేశ్‌ అయ్యర్‌(5) పరుగులతో ఉన్నారు.కేకేఆర్‌​ తొలి వికెట్‌ డౌన్‌..టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. జోష్‌ హాజిల్‌వుడ్‌​ తొలి ఓవర్‌లోనే కేకేఆర్‌ స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌​ డికాక్‌(4)ను పెవిలియన్‌కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్‌ అజింక్య రహానే వచ్చాడు.టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ..ఐపీఎల్‌-2025 తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి పోరులో ఆర్సీబీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్‌), రజత్ పాటిదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్‌), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్‌​), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 👉ఐపీఎల్‌-18వ సీజన్‌ ట్రోఫీని ఆవిష్కరించిన ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్‌ పాటిదార్‌, కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే.👉షారుఖ్‌ ఖాన్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన విరాట్‌ కోహ్లి, రింకూ సింగ్‌👉 కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి ప్రసంగిస్తున్నాడు. వీరితో కేకేఆర్‌ ఫినిషర్‌ రింకూ సింగ్‌ జతకట్టాడు.డ్యాన్స్‌తో అదరగొడుతున్న దిశాబాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.👉తన గాత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్న శ్రేయా ఘోషల్‌ఈడెన్‌ గార్డెన్స్‌లో ఐపీఎల్-2025 ఓపెనింగ్‌ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. పుష్ఫ-2 సినిమాలోని ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను తెలుగులో పాడటం విశేషం.Shreya Ghosal is here. ❤️ pic.twitter.com/apPUNS1mG4— Kohlistic🔥 (@Kohlistic18) March 22, 2025👉ఈడెన్‌ గార్డెన్స్‌ షారుఖ్‌ ఖాన్‌ సందడిప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌ షా ప్రసంగించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా వెలుగొందిన క్రికెట్‌ లీగ్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.👉మరి కాసేపటిలో ఓపెనింగ్‌ సెర్మనీఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి. ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, కరణ్ ఔజ్లా అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్ ప్రదర్శనతో అదరగొట్టబోతోంది. ఇందుకోసం వీరు నలుగురు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్నారు.👉ఐపీఎల్‌-2025కు సర్వం సిద్దం.. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు మ‌రి కాసేప‌టిలో తెర‌లేవ‌నుంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. రాత్రి ఏడు గంటలకు టాస్‌ పడనుంది. 👉స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లుఇక తొలి మ్యాచ్ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ జట్లు ఈడెన్‌గార్డెన్స్ మైదానానికి చేరుకున్నాయి. ఫ్యాన్స్ కూడా భారీగా తరలివస్తున్నారు. ఈడెన్‌గార్డెన్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.👉అభిమానులకు గుడ్‌న్యూస్‌కోల్‌క‌తాలో గ‌త రెండు రోజులగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో తొలి మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డింకిగా మారుతాడో ఏమో అని అభిమానులు ఆందోళ‌ను చెందుతున్నారు. అయితే ఐపీఎల్ ల‌వ‌ర్స్‌కు ఓ గుడ్ న్యూస్‌. ప్ర‌స్తుతం కోల్‌క‌తాలో వ‌ర్షం ప‌డ‌డం లేదు. ఆకాశం మేఘావృతం ఉన్నప్పటికి వాతావరణం పొడిగా ఉంది.Reached Eden garden.. kya mast dikh rha hai yaar stadium#KKRvsRCB #KKRvsRCB pic.twitter.com/adGP1GcRhl— Ajay anshu (@Ajayanshu5) March 22, 2025

Pune Techie Slits Throat Of 3 Year Old Son3
నాన్నా.. నేనేం నేరం చేశాను..!

నాన్న.. పిల్లలకు కంటి రెప్ప, నాన్న.. పిల్లల భవిష్యత్ కు భరోసా, నాన్న..పిల్లలకు నడత నేర్పించే మార్గదర్శి.. అన్నింటీకి మించి నాన్న అంటే వెనుక ఉండి నడిపించే శక్తి. మరి అటువంటి నాన్న అత్యంత కర్కశంగా తన బిడ్డను చంపేసుకుంటే ఏమనాలి. రాక్షసుడు అనే పదం సరిపోదేమో. నాన్నే తన పాలిట రాక్షసుడై జీవితాన్నే ఛిదిమేస్తే.. ఆ నరక యాతన ఎంతలా ఉంటుంది. ‘నాన్నా.. నేనేం నేరం చేశాను’ అని అసువులు బాసేముందు మూగరోదన తప్ప.ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రతీ రోజూ ఏదొకటి మనకు తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో తన కన్న కొడుకునే పొట్టబెట్టుకున్నాడు తండ్రి.. అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారి బాలుడిని దారుణంగా చంపేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఆ తండ్రి.. ఆ బాలుడి పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు. అతి దారుణంగా హత్య..ఆ బాలుడి గొంతును కోసేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో పడేశాడు కర్కశ తండ్రి. మాధవ్ తికేతీ, స్వప్నాలకు హిమ్మాత్ మాధవ్ ఒకే ఒక్క కొడుకు. ఎంతో గారంగా పెరగాల్సిన ఆ చిన్నారి.. తల్లి దండ్రుల మనస్పర్థలకు బలయ్యాడు. ఒకవైపు భార్యపై అనుమానం పెంచుకున్నాడు మాధవ్ తికేతి. ఇదే విషయంలో వీరిద్దరికి తీవ్రమైన ఘర్షణ ఈ గురువారం జరిగింది. దాంతో కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు మాధవ్ తికేతి. అయితే తిరిగిరాలేదు. కొడుకును హత్య చేసి పుణేలోని చందాన్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. భర్త, కొడుకును తీసుకుని వెళ్లి ఇంకా తిరిగి రాలేదని భార్య స్వప్ప ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పసిబాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.హత్య చేసిన రోజు’(గురువారం) ఇంటి నుంచి మధ్యాహ్నం గం. 12.30 నిం.లకు కొడుకును తీసుకుని బయటకు వెళ్లిన మాధవ్ తివేతి.. ఆ తరువాత అదే రోజు గం. 2.30ని.లకు ఒక చోట పిల్లాడితో కనిపించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఆపై అదే రోజు గం. 5.30 ని.లకు ఒంటరిగా వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీల ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. అంటే ఆ బాలుడ్ని గం. 2.30ని.ల నుంచి గం. 5.30 ని.ల మధ్యలో హత్య చేసి ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు.దీనిపై గత రాత్రి(శుక్రవారం) ఆ బాలుడి తల్లి, మాధవ్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. కుమారుడిని తీసుకువెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు(శనివారం) పిల్లాడు హత్య గావించబడిన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో మాధవ్‌ను అరెస్ట్‌ చేసి కస్టడీకి తీసుకున్నారు. అయితే కొడుకును తానే చంపినట్లు మాధవ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నామని, హత్యా అభియోగాలు కింద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు.

Pooja Hegde: Iam a Victim of Targeted Trolling4
నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే

సెలబ్రిటీలకు పొగడ్తలే కాదు విమర్శలు కూడా వస్తుంటాయి. హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా ఎన్నోసార్లు ట్రోలింగ్‌ బారిన పడింది. అయితే డబ్బులిచ్చి మరీ తనను తిట్టించడం షాక్‌కు గురి చేసిందంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. పీఆర్‌(Public Relations) స్ట్రాటజీలతో నాపై ట్రోలింగ్‌ చేయించారు. అది నన్నెంతగానో షాక్‌కు గురి చేసింది. డబ్బు ఖర్చు చేసి మరీ తిట్టించారుమీమ్‌ పేజెస్‌ వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెడుతున్నాయి. అరె, ఇదేంటి? నా గురించి కంటిన్యూగా తిడుతూనే ఉన్నారేంటి.. అనుకున్నాను. కావాలనే టార్గెట్‌ చేశారని తర్వాత తెలిసింది. నన్ను కిందకు లాగడానికి కొందరు ఈ రకంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాను. అప్పుడు నేను, నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాం. ఇంత దిగజారతారా? అని షాకయ్యాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ట్రోలింగ్‌ (Trolling) చేయించారు. లక్షలు ఖర్చు చేశారునన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే వారికంటే ఒక మెట్టు పైనున్నట్లే కదా! నా పేరెంట్స్‌కు ఆందోళన పడొద్దని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాను. మరోవైపు ట్రోలింగ్‌ తారాస్థాయికి చేరింది.. నన్ను ట్రోల్‌ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టారు. అసలు వారి బాధేంటో కనుక్కోమని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు మీమ్‌ పేజెస్‌ను సంప్రదించగా.. నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు. చెప్పినంత డబ్బిస్తే ట్రోలింగ్‌ ఆపేస్తారట!ట్రోలింగ్‌ను ఆపేయాలన్నా.. అవతలివారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్‌ ఇచ్చారు. నాకది మరీ వింతగా అనిపించింది. ఇలాంటి పీఆర్‌ స్టంట్లు నాకు నచ్చవు. కొన్నిసార్లు భయంకరమైన కామెంట్లు పెడుతుంటారు. చెడుగా కామెంట్‌ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కనీసం ఒక ఫోటో, పోస్ట్‌లాంటివేవీ ఉండదు. కేవలం ఎవరో ఆశ చూపించిన డబ్బుకోసం కక్కుర్తి పడి ఇలా తిడుతున్నారని ఇట్టే అర్థమైపోతుంది అని చెప్పుకొచ్చింది.టాలీవుడ్‌కు దూరమైన బుట్టబొమ్మఒకప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే.. తెలుగు వెండితెరపై కనిపించి చాలాకాలమే అవుతోంది. 2022లో రాధేశ్యామ్‌, ఆచార్య సినిమాలతో మెరిసింది. ఎఫ్‌ 3లో లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇట్టా ఉండాలా పాటలో తళుక్కుమని మెరిసింది. మళ్లీ ఇంతవరకు తెలుగులో కనిపించనేలేదు. ప్రస్తుతం హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. సూర్యతో రెట్రో, రాఘవ లారెన్స్‌తో కాంచన 4, విజయ్‌తో జన నాయగన్‌లో నటిస్తోంది. బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌తో హై జవానీ తో ఇష్క్‌ హోనా హై మూవీ చేస్తోంది.చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి

Posani Krishna Murali Released From Jail5
ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి విడుదల

గుంటూరు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్‌ దక్కడంతో.. గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో.. వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు.. కోర్టులకు.. జైళ్లకు.. తిప్పుతూ ఇబ్బంది పెట్టారు.వివిధ జిల్లాల్లో కేసుల నుంచి ఊరట లభించిందని అనుకునేలోపు.. అనూహ్యంగా సీఐడీ కేసు తెర మీదకు వచ్చింది. అయితే ఈ కేసులోనూ ఆయన నిన్న(శుక్రవారం మార్చి 21) ఊరట దక్కింది. సీఐడీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే..జిల్లా జైలుకు చేరిన రిలిజింగ్ ఆర్డర్స్ చేరడం ఆలస్యమైంది. ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడం.. ప్రక్రియలన్నీ ఈ ఉదయాన్నే పూర్తవటంతో.. రిలీజ్‌ ఆర్డర్స్‌ ఆలస్యమైంది. మరోవైపు కోర్టుకు చేరుకున్న పోసాని న్యాయవాదులు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్‌ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్‌ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్‌ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్‌సీఐడీ పెట్టిన కేసు.. బెయిల్‌ మంజూరు

Telangana Ex CM KCR BRS Comeback Comments at Farmhouse6
సింగిల్‌గానే అధికారంలోకి వస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrasekar Rao) ఉద్ఘాటించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు.బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్‌ చేశారు.ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసం చేశారు. మోదీ నా మెడపై కత్తి పెట్టినా.. నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్‌(KCR)లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు(Chandrababu) గెలిచేవారు కాదు. కానీ, బీఆర్‌ఎస్‌ మాత్రం సింగిల్‌గానే అధికారంలోకి వస్తుంది.. ఇది ఖాయం అని కేసీఆర్‌ అన్నారు.కాంగ్రెస్‌ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమే అని కేసీఆర్‌ అన్నారు.

Delimitation row AP Ex CM YS Jagan Letter To PM Modi7
డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ

అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ‍ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్‌ జగన్‌ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్‌ జగన్‌ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిమరోవైపు డీలిమిటేషన్‌ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు.

Told They Were Husband And Wife Stayed In Room All Day Meerut Case8
భర్తను వదిలేస్తే పోయేది కదా!

ఆ భర్త భార్య, బిడ్డనే ప్రాణం అనుకున్నాడు. కానీ, ప్రియుడి మోజులో పడి ఆమె ఆ భర్తనే వద్దునుకుంది. అలాంటప్పుడు వదిలేసి వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ సోషల్‌మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్‌ రాక్షసత్వంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్‌.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయి.సౌరభ్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. డ్రమ్ములో సిమెంట్‌తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. నిద్రమాత్రల కారణంగా సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ముస్కాన్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది.సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ప్రియుడితో కలిసి మనాలికిభర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి మనాలికి వచ్చిన ముస్కాన్.. ఆపై ట్యాక్సీలో కాసోల్ లోని తమ హెటల్ కు వచ్చినట్లు స్టాఫ్ ఒకరు తెలిపారు. హెటల్ లో రూమ్ తీసుకున్న తర్వాత రోజులో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి చాలా స్వల్ప సమయం మాత్రమే ఉన్నారని హోటల్ స్టాఫ్ లో మరొకరు తెలిపారు.నా వైఫ్ అంటూ సిబ్బందితో గొడవహోటల్ చెక్ ఇన్ లో భాగంగా ఇద్దరి ఐడీ కార్డులను పరిశీలించే క్రమంలో ముస్కాన్ ప్రియుడు ఐడీ కార్డు చూపించాడు. ఆపై ఆమె ఐడీ కార్డును చూసేటప్పుడు హోటల్ సిబ్బంది చేతుల్లోంచి ఆ కార్డును లాక్కొని తన భార్య అంటూ వారితో వాదనకు దిగాడు. ఆపై కొంత ఒత్తిడి తర్వాత ముస్కాన్ ఐడీ కార్డు కార్డును కు ఇచ్చినట్లు సిబ్బంది పేర్కొన్నారు.ఆరు రోజులు రూమ్ లోనే..వారు వచ్చిన తర్వాత ఆరు రోజులు రూమ్ తీసుకున్నారని, ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. సాధారణంగా ఎవరైనా మనాలికి వస్తే కొన్ని ప్లేస్ లకు వెళతారని కానీ వీరు అలా వెళ్లకుండా రూమ్ లోనే గడిపేవారన్నారు. ఫుడ్ ను ఒక్కసారే ఆర్డర్ చేసేవారని, క్లీనింగ్ కి కూడా ఒక్కసారే అనుమతి ఇచ్చేవారని సిబ్బంది తెలిపారు. అసలు బయటకు వచ్చేవారు కాదని, అనుమానం రాకుండా ఉండటానికి కేవలం ఏదొకసారి వచ్చి లోపలికి వెళ్లిపోయేవారట. మార్చి 16వ తేదీన వారు హోటల్ ను వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోతున్నట్లు తమకు తెలిపారని స్టాఫ్ లో ఒకరు తెలిపారు.

Do You Who is IPL 2025 KKR Team Jhanvi Mehta and Net Worth9
24 ఏళ్లకే ఐపీఎల్‌ వేలంలో.. ఈ బ్యూటీ ముందు కావ్య కూడా దిగదుడుపే!

క్రికెట్ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్న.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ అభిమానులను మాత్రమే కాకుండా.. అన్ని రంగలవారిని ఆకర్షిస్తోంది. ఆటకు అందం తోడైతే.. ఆ కిక్కే వేరు. ఐపీఎల్ అంటే ప్రీతి జింటా, కావ్య మారన్ పేర్లు మాత్రమే కాదు.. ఇప్పుడు 'జాహ్నవి మెహతా' (Jahnavi Mehta) పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె నెట్‍వర్త్ ఎంత? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఎవరీ జాహ్నవి మెహతా?జాహ్నవి మెహతా తల్లి ప్రముఖ నటి 'జూహి చావ్లా', తండ్రి ఫేమస్ బిజినెస్ మ్యాన్ 'జయ్ మెహతా'. అయితే 24 ఏళ్ల వయసులోనే జాహ్నవి ఐపీఎల్ వేలంపాటలతో సహా ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటూ సుపరిచితురాలుగా మారింది. ముఖ్యంగా ఈమె తన తండ్రి సహ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఎక్కువగా పాల్గొంటోంది. 2025 వేలానికి హాజరై, జట్టుతో తన సంబంధాన్ని.. కేకేఆర్ కార్యకలాపాల నిర్వహణలో ఆమె పాత్రను మరింత పటిష్టం చేసుకుంది.క్రికెట్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు, జాహ్నవికి ఇష్టం కూడా. ఈ కారణంగానే ఈమె కేకేఆర్ జట్టును ఫాలో అవుతూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా ఉన్న షారుఖ్ ఖాన్ పిల్లలు సుహాన్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇప్పటికి కూడా కేకేఆర్ జట్టు బాధ్యతలలోకి నేరుగా ప్రవేశించలేదు. కానీ జాహ్నవి మాత్రం తన తెలివితేటలతో.. కేకేఆర్ జట్టుకు సంబంధించిన కీలక వ్యవహారాలను చూసుకుంటోంది.నెట్‍వర్త్ ఎంతంటే?జాహ్నవి స్కూల్‌ చదువు ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్‌ హౌస్‌ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదివింది. కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి జాహ్నవి మెహతా.. వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు. ఈమె ఆస్తి ఏకంగా రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె తండ్రి జయ్ మెహతా.. తన మామ నాంజీ కాళిదాస్ మెహతా స్థాపించిన బహుళజాతి సమ్మేళన సంస్థ అయిన మెహతా గ్రూప్ చైర్మన్. ఈ సంస్థ ప్యాకేజింగ్, హార్టికల్చర్, సిమెంట్, నిర్మాణ సామగ్రి వంటి విభిన్న రంగాల కలయిక.మెహతా గ్రూప్ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. కెనడా, ఉగాండా, కెన్యా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా విస్తరించి ఉంది. ఈ కంపెనీ గత కొంత కాలంగా గణనీయమైన అభివృద్ధి చెందుతూనే ఉంది. జూహి చావ్లా ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన హీరోయిన్.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి

UK Man Opts For Euthanasia Rather Than Living With Mental Illness Goes Viral10
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..

కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్‌ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్‌తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్‌ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్‌ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్‌ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్‌ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్‌లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్‌కి ప్లాన్‌ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్‌ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్‌. చివరగా తన బైపోలార్‌ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్‌. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్‌..తమతో విందు షేర్‌ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement