Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Means Telugu Drama Party Says YS Jagan1
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్‌ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్‌ అన్నారు... చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్లు, రేషన్‌ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్‌ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్‌, బకాయిలు పెండింగ్‌. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, రాజధాని పనులు.. లిక్కర్‌ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్‌ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్‌ అన్నారు.క్లిక్‌ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన

Jagan Gollaprollu Penukonda YSRCP Leaders Meeting Key Comments Updates2
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్‌ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్‌ ఉండి ఉంటేనా..

Power Cut: Panicked Cry Tragedy In A Bhopal Apartment3
చీకటి.. ఆ కుటుంబాన్ని చిమ్మ చీకటిలోకి నెట్టేసింది..!

చీకటి.. రిలాక్స్ డ్ గా ఉండే సమయంలో చీకటిని ఒకింత ఆస్వాదిస్తాం. కానీ అదే చీకటిలో ఎక్కువ సేపు ఉండాలంటే ‘వామ్మో’ అంటాం. చాలా మంది చీకటి అంటేనే భయపడతారు. మరి అదే చీకటి కారణంగా ఓ జీవితంలో చిమ్మ చీకటి ఏర్పడితే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓ కుటుంబాన్ని చీకటి పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిందనే చెప్పాలి. అది వారి తలరాత అనుకోవాలో.. లేక విధి ఆడిన నాటకమనుకున్నా ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో రాయల్ ఫార్మ్ విల్లా కాలనీలో చోటు చేసుకున్న విషాదానికి చీకటే కారణంగా నిలిచింది. ఒకవైపు భారీ వర్షం, ఈదురు గాలులతో కరెంట్ పోతే, అదే సమయంలో ఓ చిన్నారి లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటన తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. రాయల్ ఫార్మా అపార్ట్ మెంట్ లోని 307 ఫ్లాట్ లో ఉంటుంన్న రిషిరాజ్ కుటుంబం ఇప్పుడు చీకటి తెచ్చిన విషాదాన్ని తల్చుకుని రోదిస్తున్న తీరు వర్ణనాతీతంగా మారింది.కొడుకును రక్షించబోయి..సోమవారం(మే 26 వ తేదీ) రాత్రి గం. 10 లకు. భారీ వర్షం కారణంగా పవర్ సప్లై నిలిచిపోయింది. ఆ సమయంలో రిషిరాజ్ తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాన్ష్ గురించి ఆరా తీశాడు. అయితే ఆ పిల్లాడు కిందకు వెళ్లాడని తల్లి చెప్పడంతో తండ్రి రిషిరాజ్ హుటాహుటీనా దేవాన్ష్ గురించి వెతకడం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో ఆటోమేటిక్ గా పని చేయాల్సిన జనరేటర్ పని చేయకపోవడాన్ని గ్రహించాడు.దేవాన్ష్.. దేవాన్ష్ అంటూ ఆ ఫ్లోర్ నుంచే అరవడం ప్రారంభించాడు. అయితే పాప..పాప(నాన్న నాన్న) అంటూ చిన్నగా ఓ గొంతు వినిపించింది. అది తన కుమారుడుదేనని గ్రహించిన తండ్రి.. తన పిల్లాడికి ధైర్యం చెబుతూ కిందకు జనరేటర్ ఉన్న స్థలానికి పరుగు తీశాడు. అంతే నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ఆన్ చేయడం, ఆ తండ్రి అక్కడే కుప్పకూలడం జరిగిపోయాయి.విధి రాత అంటే ఇదేనేమో..ఆ కాలనీ ఎంతో సంతోషంగా ఉంటూ అందరి సమస్యలను పట్టించుకునే రిషిరాజ్ ఇక లేడనే వార్త స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలిచివేసింది. చీకటి.. ఆ జీవితాన్ని చిమ్మ చీకటిలో నెట్టేసిందని, విధి రాత అంటే ఇదేనేమో అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఆ కుటుంబం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రిషిరాజ్ భార్య, పిల్లల్ని ఓదార్చడం కాలనీ వాసుల వల్ల కావడం లేదు. జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్లి ఇలా కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కులేనిదిగా మిగిలింది.సీపీఆర్ చేసి ప్రయత్నించినా..రిషిరాజ్ కుప్పకూలడంతో తొలుత సీపీఆర్ చేశారు. ఆ చీకటిలో రిషిరాజ్ కుప్పకూలిపోవడాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రాణం కోల్పోయి జీవచ్ఛవంలా పడిఉన్న రిషిరాజ్ ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.లిఫ్ట్ అంటే భయం..లిఫ్ట్ ఎక్కి అందులో ఇరుక్కుపోయిన దేవాన్ష్.. ఒకప్పుడు అదే లిఫ్ట్ అంటే తీవ్రంగా భయపడిపోయేవాడట. క్రమేపీ లిఫ్ట్ భయాన్ని తండ్రి పోగొట్టినా, చివరకు అదే లిఫ్ట్ కారణంగా తన తండ్రి ఆందోళనకు లోనై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని మరింత బాధిస్తుంది. ఇదే విషయాన్ని రిషిరాజ్ భార్య పదే పదే గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.లోతుగా దర్యాప్తు ..అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న మిస్రోడ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక సమస్య కారణంగా జనరేటర్ ఆగిపోవడం, అదే సమయంలో లిఫ్ట్ ఆన్ చేయడానికి రిషిరాజ్ వెళ్లి అక్కడే పిల్లర్ కింద పడి ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినా, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సదరు పోలీస్ స్టేషన్ అధికారి మనీష్ రాజ్ భడోరియా తెలిపారు.

Hamas Gaza chief Mohammed Sinwar eliminated by Israel Army says Netanyahu4
హమాస్‌కు చావు దెబ్బ.. ఇజ్రాయెల్‌ చేతిలో గాజా చీఫ్‌ మహ్మద్‌ సిన్వర్‌ హతం

జెరూసలేం: ఇజ్రాయెల్‍-హమాస్‍ యుద్ధంలో ఇజ్రాయెల్‌ పైచేయి సాధించింది. హమాస్‌ను చావు దెబ్బ కొట్టింది. హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిందని బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో హమాస్ చీఫ్ తీవ్రంగా గాయపడ్డారని నివేదికలు వచ్చాయి. ఆ సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడిలో మహమ్మద్ సిన్వార్‌ మరణంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.ఈ క్రమంలో గాజాలో హమాస్‌కు మిగిలి ఉన్న చివరి టాప్ కమాండర్లలో ఒకరైన మహమ్మద్ సిన్వర్ మే 14న ఇజ్రాయెల్ రక్షణ దళాలు జరిపిన దాడుల్లో మరణించినట్లు ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ధ్రువీకరించారు. ముహమ్మద్ సిన్వార్ హమాస్‌ అధినేత యాహ్వా సిన్వార్‌ సోదరుడు. గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్‌ దళాల చేతిలో సిన్వార్‌ మృతి చెందాడు.🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.Terrorism isn't managed it’s erased.This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 2025హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ లక్ష్యంగా దక్షిణగాజాలోని ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. గతేడాది అక్టోబర్ లో ఐడీఎఫ్‌ జరిపిన దాడిలో యాహ్యా సిన్వర్ హతమైన తర్వాత మహమ్మద్ సిన్వర్ అనధికారికంగా హమాస్ నేతగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆరుగురు పాలస్తీనీయన్లు మృతిచెందటంతో పాటు.. 40 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖాన్ యూనిస్ నగరంలోని ఐరోపా ఆస్పత్రి కింద భూగర్భంలో కొనసాగుతున్న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో మహమ్మద్‌ సిన్వర్‌ మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రకటనతో హమాస్‌కు చావు దెబ్బ తగిలినట్లైంది.

Small Price, High Impact: Smartest Investment Of Each Franchise In IPL 20255
IPL 2025: రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ.. ఆ హీరోలు వీరే..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్‌ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్‌ సూర్యవంశీ. రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్‌ తొలి మ్యాచ్‌ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.పైసా వసూల్‌ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్‌ ఆర్య. ఇతగాడిని పంజాబ్‌ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్‌పై పంజాబ్‌ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరగదీశాడు. పంజాబ్‌ ఈ సీజన్‌లో టేబుల్‌ టాపర్‌గా నిలవడంలో ప్రియాంశ్‌ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతను 183.55 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్‌ రికెల్టన్‌. ముంబై ఇండియన్స్‌ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రికెల్టన్‌ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్‌ల్లో 150.97 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు.ఈ సీజన్‌లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్‌ వర్మ. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 166.20 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. లోయల్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అనికేత్‌ అంచనాలకు మించి భారీ హిట్టింగ్‌ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్‌, అభిషేక్‌, ఇషాన్‌ కిషన్‌, క్లాసెన్‌ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్‌లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్‌కే తరఫున ఆయుశ్‌ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్‌లే ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (2 కోట్లు), ఢిల్లీ ఆల్‌రౌండర్‌ విప్రాజ్‌ నిగమ్‌ (50 లక్షలు), బౌలర్లలో ఎల్‌ఎస్‌జీకి చెందిన దిగ్వేశ్‌ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్‌ (30 లక్షలు), కర్ణ్‌ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు.

Kannappa Movie Hard Disk Theft police Records Statement of Producer6
కన్నప్ప హార్డ్‌ డిస్క్ చోరీ.. కీలక విషయాలు వెల్లడించిన నిర్మాత!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప రిలీజ్‌కు ముందు కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ చోరీకి గురి కావడం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సైతం ఓ లేఖను విడుదల చేసింది. మూడు నెలల క్రితమే హార్డ్ డ్రైవ్ పోయినట్లు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.తమ సినిమా హార్డ్ డ్రైవ్ కోసం ముంబయి కంపెనీని నిర్మాత సంప్రదించారు. అయితే తాము మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్‌కు డ్రైవ్ పంపించామని కంపెనీ ప్రతినిధులు ఆయనతో అన్నారు. కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ పంపిస్తే రఘు డెలివరీ తీసుకున్నారని సదరు కంపెనీ తెలిపింది. అయితే తానేలాంటి డ్రైవ్ తీసుకోలేదని రఘు నిర్మాతతో అన్నారు. దీంతో వెంటనే హార్డ్‌ డిస్క్ మిస్సింగ్‌ కావడంపై నిర్మాత పోలీసులను ఆశ్రయించారు. అందులో అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ మొత్తం ఉన్నాయని తెలిపారు. ఆ డ్రైవ్ మిస్సయితే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. సినిమా విడుదల కంటే ముందు ఏదైనా బయటికి వస్తే పెద్ద నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతతో పాటు పలువురి దగ్గర నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.

Chandrababu comments on Maha Nadu occasion create a stir7
మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం

సాక్షి,వైఎస్సార్‌: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Political Analysts On Pawan Double Stand Cine Industry8
అధికారం ఉంది కదా అని అడ్డంగా నడుస్తున్నారా?

ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్‌ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

New Digital ID For Your Home Govt Plans Address Aadhaar9
అడ్రస్‌ ఆధార్‌.. ప్రభుత్వం కొత్త కసరత్తు!

దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపు రుజువు కోసం తీసుకువచ్చిన ఆధార్ మాదిరిగానే ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఉండే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. డోర్‌ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి సహాయపడుతుంది.దుర్వినియోగం కట్టడి..ప్రస్తుతం, చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎటువంటి ప్రామాణిక వ్యవస్థా లేదు. స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలనూ జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టమైన వినియోగదారు చేతుల్లో పెట్టడం ఈ కొత్త చొరవ లక్ష్యం.ఆర్థిక వ్యవస్థకూ నష్టం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన, ప్రామాణిక చిరునామాలకు డిమాండ్ పెరిగింది. అయితే దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్ లపై ఆధారపడున్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఏటా 10–14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు అరశాతం.👉ఇది చదివారా? ఆధార్‌ అప్‌డేట్‌ గడువు జూన్‌ 14 వరకే..ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందంటే..చిరునామాలను ఎలా రాయాలి.. నిల్వ చేయాలి... సురక్షితంగా యాక్సెస్ చేసుకోవాలో నిర్వచించడానికి ప్రతిపాదిత పరిష్కారం సమగ్ర 'డిజిటల్ అడ్రస్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు ప్రైవసీ ప్రోటాకాల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.డిజిపిన్.. స్మార్ట్ అడ్రస్ కోడ్ఈ వ్యవస్థలో గుండెకాయ లాంటిది డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్‌ల మాదిరిగా కాకుండా డిజిపిన్‌లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపారా సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక జనావాసాలు, సాంప్రదాయ చిరునామా వ్యవస్థలు లేని అడవులు, కొండలు వంటి భౌగోళిక సవాళ్లతో కూడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Mp Avinash Reddy Slams Chandrababu Naidu Over Ysr District Tdp Maha Nadu  Meeting10
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’

సాక్షి,వైఎస్సార్‌ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్‌ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్‌ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్‌ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్‌ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్‌. వైఎస్‌ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్‌ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement