
అక్షయ తృతీయ సందర్భంగా భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మే 14) కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 430 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 72820 వద్ద నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66750 (22 క్యారెట్స్), రూ.72820 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 400, రూ. 430 తగ్గింది.
చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 66900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 72980 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66900 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72970 రూపాయలకు చేరింది. నిన్న రూ. 100 నుంచి రూ. 130 వరకు తగ్గిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 400 , రూ. 410 వరకు తగ్గింది.
వెండి ధరలు
బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మే 14) వెండి ధర రూ. 700 పెరిగి రూ. 87200 (కేజీ) వద్ద నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు పెరిగాయి.