● జీవితంలో స్థిరపడ్డాకే ప్రేమైనా.. పెళ్లయినా ● కుటుంబ స
నేటి యువత ప్రేమ ముసుగులో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోంది. టీనేజ్‌లో చదువుపై శ్రద్ధపెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాల్సిన సమయంలో ఆకర్షణకు గురై పక్కదారి పడుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడుతున్నారు.. అయితే చాలా మంది ప్రేమ పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖపడలేక పోతున్నారు.. జీవితంలో స్థిరపడ్డాక పెద్దలు నిశ్చయించిన పెళ్లయినా.. ప్రేమ వివాహమైనా మంచిదని డైట్ ఛాత్రోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో డిబెట్ నిర్వహించింది. ఇందులో డైట్ ఛాత్రోపాధ్యాయులు ‘అరేంజ్ మ్యారేజ్.. లవ్ మ్యారేజ్’ గురించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరి జీవితాల్లో ప్రేమ ఆనందాన్ని నింపుతుండగా, మరికొందరి జీవితాల్లో విషాదం నెలకొంటోంది. ప్రేమించాలని వేధిస్తూ కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే జీవితంలో స్థిరపడ్డాకే
‘ప్రేమ’కు ప్రాధాన్యం ఇస్తే
బాగుంటుందని, పెద్దలు కుదిర్చిన పెళ్లి తర్వాతే జీవితం బాగుంటుందని చెబుతున్నారు. డిబేట్‌లో ఛాత్రోపాధ్యాయుల అభిప్రాయాలు
వారి మాటల్లోనే.. – ఆదిలాబాద్‌టౌన్
Comments
Please login to add a commentAdd a comment