ఆదిలాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 23న నిర్వహించనున్న హీరా సుక జయంతిని ఉమ్మడి జిల్లా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజ యవంతం చేయాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ జాతీయ నాయకుడు సిడాం రాంకిషన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మెస్రం శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరాసుక దేవస్థాన మందిరం ఆవరణ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పూసం ఆనంద్‌రావ్, సెడ్మకి సుభాష్, గేడం మా ధవ్, ప్రకాశ్, రామాకాంత్ తదితరులున్నారు.
ఇంద్రవెల్లి: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే హీరాసుక జయంతికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పర్ధాన్‌గూడ పటేల్ గేడం జ్ఞానేశ్వర్, పర్ధాన్ సమాజ్ మండల అధ్యక్షుడు గేడం భరత్ కోరారు. మండలకేంద్రంలోని పర్ధాన్‌గూడలో ఆయా గ్రామాల సమాజ్ పెద్దలతో మంగళవారం సమావేశమయ్యారు. ఇందులో నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment