మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో అర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో గర్భధారణ సమయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్త సమయంలో గర్భిణులు బీపీ, షుగర్, ఎనీమియాతో పాటు 20 రకాల వ్యాధులతో బాధపడే అవకాశం ఉందన్నారు. వైద్యసిబ్బంది గర్భిణులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సుఖప్రసవానికి కృషి చేయాలన్నారు. గర్భస్త సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రొజెక్టర్‌పై వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు చరణ్, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment