విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఇచ్చోడ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. గుడిహత్నూర్, ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవా రం ఆయన తనిఖీ చేశారు. గుడిహత్నూర్ పీ హెచ్‌సీలో ఫార్మాసిస్టు సకాలంలో విధులకు హాజరు కానందున మెమో జారీ చేశారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలన్నారు. ఇచ్చోడ పీహెచ్‌సీలో స్టాక్ రిజిస్టర్ నమోదు సరి గా లేనందున ఫార్మాసిస్టుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌సీడీ, సికిల్‌సెల్ స్క్రీనింగ్ మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట ఎన్‌సీడీ అధికారి శ్రీధర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment