కై లాస్‌నగర్: నిజామాబాద్–కరీంనగర్–ఆదిలా బాద్–మెదక్ జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్‌కు జిల్లాలో ప కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈసీ మార్గదర్శకాల ప్రకారం చ ర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. షామియానాలు, తాగునీరు, వీల్‌చైర్ వంటి వసతులతో పాటు, ప్రతి కేంద్రంలో వైద్య సి బ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సాగేలా చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా బ్యాలెట్ బాక్సులను కరీంనగర్‌లోని రిసెప్షన్ సెంటర్‌కు చేర్చేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆర్డీవో వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment