కై లాస్‌నగర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించా రు. మార్చి 2నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈమేరకు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాల వద్ద నీటి వసతి, వీధి దీపాలు, నిరంతర విద్యుత్ సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రంజాన్ మాసంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగ సమయాల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31వరకు సాయంత్రం 4గంటలకే విధులు ముగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్‌కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment