మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
కైలాస్‌నగర్: మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆశన్న, నగేష్, ఆత్మారాం, అజీమ్, భాస్కర్, జనార్దన్, రాకేష్‌రెడ్డి, స్వామి, గగన్, వెంకటి, సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment