నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: వేసవిలో తాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో తాగునీరు, రైతుభరోసా, రేషన్ కార్డులు, పైలట్ ప్రజావాణి, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ట్యాంకర్లతో నీటిని అందించాలన్నారు. సమస్యాత్మక హ్యబిటేషన్ల వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 24లోగా అందజేయాలన్నారు. విద్యుత్ సరఫ రాకు అంతరాయం కలుగకుండా ఉండేలా డీఈలు, ఏఈలకు సూచించాలని ఎస్‌ఈని ఆదేశించారు. మొదటి విడతలో ఎంపికై న ఇందిరమ్మ మోడల్ ఇళ్లను మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
కైలాస్‌నగర్: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో టీఎన్జీవో యూనియన్ డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమష్టిగా పనిచేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందుంచాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్, నాయకులు తిరుమల్‌రెడ్డి, తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్, అరుణ్, వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సిములు, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జాదవ్ నూర్‌సింగ్, మున్సిపల్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌పీజీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయించాలి
ఎల్‌పీజీ వినియోగదారులు ఈకేవైసీనీ పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. నెట్‌వర్క్ లేని గ్రామాల్లోని వారి కోసం నెట్‌వర్క్ ఉ ండే పక్క గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ఈకేవైసీ చేయించాలన్నారు. సీఎం పైలట్ ప్రజావాణి పబ్లిక్ హియరింగ్‌లో ఏజెన్సీ డీలర్లు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. గ్యాస్ రాయితీ రానివారు సంబంధిత ఏజెన్సీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌వో వాజీద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment